10, ఏప్రిల్ 2024, బుధవారం

సమస్య - 4732

11-4-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్”
(లేదా...)
“ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. కం:
    అనునిత్యము బోధించుట
    మనసున కెపుడు గలిగించు మహదా నంద
    మ్మనివార్యము వారికి బో
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్”

    రిప్లయితొలగించండి
  2. కందం
    కనబోక గురుని, బంధువు
    నొనగూర్చియు రాజరాజు నొప్పను రీతిన్
    మునిగెను కడకున్, వీడగ
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్

    మత్తేభవిక్రీడితము
    కనబోడెప్పుడు బంధువున్ గురుని నాకాక్షించుచున్ విత్తమున్
    మును రారాజు వినాశమున్బులిమి గోల్పోయెన్ గదా వంశమున్
    ధనదాహమ్మున విజ్ఞతల్ సడలి నిందార్హుండగన్, వీడుచో
    ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి

  3. ధనమున్ భవబంధమ్ములు
    వినాశకారకములని నివృత్తియె మేలం
    చును నమ్ముచు చేసెడి సా
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్.


    ధనమే ముఖ్యము శాశ్వతమ్ములవి బంధాలంచు భావింపకన్
    ఘనమౌ ముక్తి పథమ్ముకై సతతమాకాంక్షిం చుచున్ హంసునిన్
    మనమున్ నిల్పుచు కొల్చువారలిల సన్మార్గమ్ము కై చేయు సా
    ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్.

    రిప్లయితొలగించండి
  4. జనతకు మేలోన గూర్చగ
    ననవ రతము కృషి యొ నర్చు నా చార్యు లు గా
    మునుకొని శాసన ముల శో
    ధన జాడ్యమె సౌఖ్య మిచ్చు దగ విబు ధు ల కున్

    రిప్లయితొలగించండి
  5. అనవద్యచరితులకు స
    ద్గుణశోభితులకును కోవిదులకు వర శిరో
    మణియై భాసిలు విద్యా
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్

    రిప్లయితొలగించండి
  6. కం॥ధన మూలము సర్వమిలను
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్
    ఘనముగఁ దెలిపిరి సత్యముఁ
    గని పోతన రీతి బ్రదుకఁ గఠినత విజ్ఞుల్

    మ॥ కనవో పోతన రీతి జీవితము సాకారంబుఁ గానేరదే
    ధన హీనుండను ప్రాజ్ఞుడైన మనుజుల్ దథ్యంబుగా గారవిం
    చను నేఁడెవ్వరు రారు ముందుకు సఖా సత్యంబు నావాక్కులున్
    ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలో

    విజ్ఞులు Wise persons
    ఇది వంద శాతము నిజమండి. ప్రజలకు సుందర్ పిచాయి గారు తెలిసినంతగా ఇసిజి సుదర్శన్ (వీరికి 2005లో నోబెల్ బహుమతి రావాల్సింది, పక్షపాత వైఖరి వలన రాలేదు) గారు తెలియరు. విద్య రావాలి ధనము సంపాదించుకోవాలి.

    రిప్లయితొలగించండి
  7. ధనమే మూలంబనుచున్
    మనసే లగ్నమొనరింత్రు మానవమాత్రుల్
    ధనము పయిన నెల్లప్పుడు
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్

    ధనమే మూలము లోకమందు ననుచున్ ధన్యాత్ములే తెల్పగా
    మనసే లగ్నము చేయుచుందురకటా మర్మంబు సుస్పష్టమై
    ధనజాడ్యంబు లనంత మానవులకున్ దారిద్ర్య నిర్మూలనై
    ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  8. వినుము ‌స ఖుడా ! యరసి నే
    గనుగొం టి నిపుడసలైన కతనము నంతన్
    అనిశము సాహిత్యపు సా
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్

    రిప్లయితొలగించండి
  9. ధనమే జగతికి మూలము
    ధనహీనుని జూతురెల్లిదముగ ధరణిలో
    ధనముపొదుపు జేసి, విడువ
    ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్

    రిప్లయితొలగించండి
  10. ధనరాశింకగ వచ్చు పోవు మణులున్ ధాన్యంబులున్ జీవికిం
    ధన మీనేలను జ్ఞానసంపదది యన్నాక్రాంతమున్ గాదు గా
    వున మేధావుల వృద్ధి బాట ప్రతిభా వ్యుత్పత్తిలౌనట్లు సా
    ధన జాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛేణికిన్ ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  11. ధనమే మూలము మానవాళికిలలో తథ్యంబుగా, నిర్ధనుల్
    కనలేరెట్టి సుఖంబులన్ బ్రతుకు లిక్కట్లన్బడంద్రోయునీ
    ధనమే శాంతి విఘాతకారియగుఁ నిర్ద్వందంబుగా, వీడగన్
    ధనజాడ్యంబె నితాంత సౌఖ్యమిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్

    రిప్లయితొలగించండి
  12. కం:ఘనుడగు గురువున్ గొల్చుచు,
    గుణయుతులై, తత్త్వమెరిగి, క్రోధ, తమములం
    దున జిక్కు వడక,గురుబో
    ధ నజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్”
    (గురుబోధన్+అజాడ్యమె)

    రిప్లయితొలగించండి
  13. డా బల్లూరి ఉమాదేవి

    ధనమేసర్వమటంచును
    జనములుమదిలోతలవక సతతము హరినే
    ఘనముగసేవించెడిసా
    *“ధనజాడ్యమె సౌఖ్యమిచ్చుఁ దగ విబుధులకున్”*

    రిప్లయితొలగించండి
  14. ధనమే కాంచఁగ మూల మ
    గును బాపమ్ములకు నెల్లఁ గువలయ మందున్
    మనముల నింపుగఁ దొలఁగన్
    ధన జాడ్యమె సౌఖ్య మిచ్చుఁ దగ విబుధులకున్


    మును భూనాథులు యజ్ఞ యాగముల గో భూ దాన సత్కర్మముల్
    వినమే చేయఁగ శాస్త్ర సమ్మతముగం బ్రీతిన్ విశేషమ్ముగా
    మనుజాధీశుఁడు దాన మీయఁ గ్రతులన్ మన్నించి విప్రాలికిన్
    ధన జాడ్యంబె నితాంత సౌఖ్య మిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్

    [ధనజ+ఆఢ్యంబె = ధన జాఢ్యంబె; ఆలమందచేఁ బుట్టిన సంపద]

    రిప్లయితొలగించండి
  15. మ:ఘనమే కర్మల రోసి నిష్క్రియిత యోగంబంచు భావించుచున్
    జనదూరమ్మగు జీవితమ్ము గడుపన్? సచ్ఛీలుడై కర్మమం
    దున దా నుండియు కర్మబంధమునకున్ దూరమ్ముగా నుండు మే
    ధ నజాడ్యంబె నితాంతసౌఖ్య మిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్
    (మేధన్+అజాడ్యంబె)

    రిప్లయితొలగించండి