27, ఏప్రిల్ 2024, శనివారం

సమస్య - 4748

28-4-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్”
(లేదా...)
“ఆకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్రబింబముల్”

15 కామెంట్‌లు:

  1. అతనికట తొమ్మిదేండ్లని
    చతురతతో జెప్పనెంచి సన్నిహితులతో
    నతిశయముగ జెప్పెనిటుల
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్.

    ( 8 సంవైత్సరాలకు 96 పౌర్ణమిలు అధికమాసాలు కలిపితే యెనిమిదేండ్లు వెళ్ళి తొమ్మిదొచ్చాయని)

    రిప్లయితొలగించండి

  2. నాకొక కన్యనచ్చినది నామతమామెది కాదు కావునన్
    చేకొను టెట్టులంచు కడు చింతను పొందుచు నున్న వేళలో
    నేకళనుండెనో జనకుడిష్టమటంచన తోషమందు నా
    కాకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్రబింబముల్.

    రిప్లయితొలగించండి
  3. కురుక్షేత్ర సంగ్రామంలో విశ్వరూపము దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మతో నర్జునుఁడు:

    కందం
    గతినీవేనని నమ్మగ
    హితమొదవగ విశ్వరూప! మెగసితె కృష్ణా!
    ద్యుతిమయమౌ నీమోమున
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్!

    ఉత్పలమాల
    వీకను జిక్కియున్ రణము వీడఁగఁ జూడఁగ మోహచిత్తునై
    శ్రీకర! విశ్వరూపమున శ్రేయము గూర్చితె గీత బోధతో
    నా కనుదోయి చాలదన నర్మిలిఁ జూడఁగ నీదు మోమున
    య్యాకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్రబింబముల్!

    రిప్లయితొలగించండి
  4. కం॥ అతిగాఁ గష్టించంగన్
    బ్రతిగాఁ బొందగ నిదురను బహు గాఢముగా
    నతులిత మధురమగు కలను
    శత చంద్రులఁ గంటి నాకశమ్మునఁ బ్రీతిన్

    ఉ॥ లోకము లోని వింతలను లోకులుఁ గాంచ ఖగోళ శాస్త్రమున్
    వాకొని తెల్పుచున్ నభపు భవ్యత విశ్వపు రూపురేఖలన్
    జేకొని చూపుచుండఁగను జిత్రము లన్నియుఁ జూచు వారికిన్
    యాకశ మందుఁ గానబడె నందముగా శతచంద్రబింబముల్

    మన సౌరమండలము లోనే వందల కొలది చంద్రులు ఉన్నారండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల నిలా మార్చినానండి

      ఉ॥ లోకము లోని వింతలను లోకులుఁ గాంచ ఖగోళ శాస్త్రమున్
      వాకొని తెల్పుచున్ నభపు భవ్యత విశ్వపు రూపురేఖలన్
      జేకొని చూపుచుండఁగను జిత్రము లన్నియుఁ జూడ ముగ్ధులై
      యాకశ మందుఁ గానబడె నందముగా శతచంద్రబింబముల్

      తొలగించండి
  5. గతదినపు రాత్రి యిష్టుని
    సుత పెండ్లి కురాళమందు సొబగును జూడన్
    ఇతవున తలపైకెత్తగ
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  6. అతిలోకసుందరాంగులు
    జితముగ నిల్చిరిట చలన చిత్ర నభసమున్
    గృతనిశ్చయులై వెలిగిన
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్

    ప్రాకటమైన చిత్రముల భాసిలు కోమలులెందరోకదా
    కాకలుతీరియున్న పలు కాంతలఁ గాంచితి చిత్రసీమలో
    నాకసమన్నఁ జెల్లు నిక నాశల ధృత్వము చిత్రరంగమే
    యాకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్రబింబముల్

    రిప్లయితొలగించండి
  7. వితతమ్ముగ వలచితినా
    యతులిత సౌందర్యరాశినాయమ నాకున్
    సతిగా దరిచేరగనే
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  8. ఆ కనకాంగికై హృదయమందునఁ గట్టితి ప్రేమ హర్మ్యమున్
    వీఁకఁ మనోహరిన్గనఁగ వెంపరలాడు మనంబు నిచ్చలున్
    నాకలలే ఫలించి నను నాథునిగా మయికొన్న వేళలో
    నాకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్ర బింబముల్

    రిప్లయితొలగించండి
  9. వెతలను దీర్చెడు నేతలు
    జత కట్టిన కూటమిని వి జ యము వరింప న్
    కుతుకము తో పలి కె నిటు ల
    శత చంద్రుల గంటి నాక సమ్మున బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  10. కం:ఇత డా కన్నడె?సంఖ్యా
    మితమౌ నాదిత్య కోటి మెరసె గగనమే
    యితని ముఖమ్మున నుండగ
    శతచంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్”
    (యశోద ఆశ్చర్యం)

    రిప్లయితొలగించండి
  11. ఉ:లేక దపమ్ము,నేను కన లేదొకొ యీ ఘనవిశ్వరూపమే!
    ఆ కృప శాస్త్రవేత్తలదె యందును ,వారల సృష్టియౌ టెలి
    స్కోపున జూచుచుంటి నినకోటిని,నే గ్రహపంక్తి గాంచనే!
    ఆకసమందుఁ గానఁబడె నందముగా శతచంద్రబింబముల్”
    (శాస్త్ర వేత్తల దయవల్ల తాను విశ్వరూపాన్ని చూస్తున్నా నని ఒక శాస్త్రవేత్త తన కృతజ్ఞతని చూపించాడు.)

    రిప్లయితొలగించండి
  12. శంకలు లేక నొప్పుకొను జాడ్యమిటీవలి పెండ్లి వేడ్క లే
    వంకను జూడ మిన్నొరయు వైభవమాయె నలంకృతాదులా
    ఆకసవీధిఁ దెచ్చు నిలకట్లయె నొక్క ముహూర్త రేయిలో
    నాకసమందుఁ గానపడె నందముగా శత చంద్రబింబముల్

    రిప్లయితొలగించండి
  13. డా బల్లూరి ఉమాదేవి

    సతితో వెన్నెల వేళల
    నతి సంబరమున తిరుగుచు నానందముతో
    హితవచనము లాడుచు నే
    శతచంద్రుల గంటి నాకసమ్మున ప్రీతిన్



    రిప్లయితొలగించండి
  14. విత తానందమ్ము విరియ
    నతీతముగ మనము నందు నక్కజముగ నా
    మతి వెల్గ నంత నింగిగ
    శత చంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్


    ఏ కడఁ జూచినం గలికు లే కడఁ జూచిన సుందరాంగులే
    యే కడఁ జూచినం బ్రవిమ లేందు ముఖుల్ సుదతుల్ తలోదరుల్
    నాక నిభైక మంటపమునం గన నత్తఱి రాత్రి వేళ యం
    దాకస మందుఁ గానఁబడె నందముగా శతచంద్ర బింబముల్

    రిప్లయితొలగించండి