తే.గీ:ఆ గణాచారి భక్తుల యర్చనమున నమిత పరవశమునుబొందె,నద్భుతముగ బూనకము వచ్చె దలచుచున్ భూతనాథు శివుని, తలపైనఁ బార్వతి చేరి నిలిచె (గణాచారులు, పూనకాలు అందరికీ అనుభవమే కదా!ఆ గణాచారికి పార్వతీ దేవి శిరస్సు పై నిలచింది.వచ్చింది పార్వతీ దేవి ,లేక దుర్గ కనుక భర్త ఐన శివుణ్ని తలుచుకొన్నది.)
మ:స్తవనీయమ్ముగ నింద్రకీలగిరిపై దాక్షిణ్య మొప్పార శా త్రవ విధ్వంసక రూపి యై,స్వయముగా, దర్పమ్ము నిండారగా శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో భవుతో సంగము లేని శక్తి వలె దా భాసించగా నెంచె నో ! (కనకదుర్గ ఇంద్రకీలాద్రి యొక్క శీర్షం పై తానే ప్రథాన దేవత గా నిలచింది. శివుని భార్య అనే గుర్తింపు తో కాక.)
తేటగీతి
రిప్లయితొలగించండిసగమునేనౌట హరుడయ్యె సాంబుడనఁగఁ,
గలగి గంగాధరుడటంచు గంగ రెచ్చె
సవతి పోరును తాళక సాగనంప
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె
మత్తేభవిక్రీడితము
"భవునిన్ మేని సగమ్ముగన్ బడయనొప్పన్ సాంబుఁడాతండనన్"
గవికన్ వేయఁగ గంగరెచ్చి, "సిగనై గంగాధరుండం"చనన్
సవతిన్ శీఘ్రమె సాగనంపు తలపై సాధించు సంకల్పమై
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసురనది తన నెలవుగ జేసుకొని యుండె
రిప్లయితొలగించండిశివుని తలపైనఁ : బార్వతి చేరి నిలిచె
నతని యందున సగభాగ మాక్రమించి
తలపయి నొకరు , మరొకరు తనువు లోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితనను భరియించు వాడంచు దలచి గంగ
నింగి నుండితా దిగివచ్చి నిలిచె కాదె
శివుని తలపైనఁ, బార్వతి చేరి నిలిచె
ఫాలలోచనునకు వామ భాగమందు.
లవణాంభస్సు మదింప బుట్టినది హాలాహాలమున్ గాంచుచున్
భవ! నీవే శరణంబటంచు సురలే ప్రార్థింప భీతిల్ఞుచున్
ధవునిన్ గ్రోలి జగమ్ము కాచుమనుచున్ దాక్షాయణీ కోరుచున్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే॥ వాన కొరకు తపించెడి ప్రజల బాధఁ
రిప్లయితొలగించండిదెలిపి గంగకు నడుగఁగఁ దీర్చ ప్రజల
సంకటము త్వరితము గాను సహృదినిఁ గని
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలచె
మ॥ భువిలో వానలు మృగ్యమై జనులు సంపూర్ణంబునౌ వేదనన్
భవ బాధార్తిని లోకమాత దయకై ప్రార్థించఁగన్ శ్రద్ధతో
సవతిన్ గాంచుచుఁ దెల్ప వర్షమునకై సందేశమున్ జక్కఁగన్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో
ఇక్కడ బెంగుళూరులో నీటి కొరత భయంకరంగా ఉన్నదండి. ఇంత గ్రీష్మ తాపము కూడ నేను ఎప్పుడు చూడలేదండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅలకనందయు నిల్పెమహాద్భుతముగ
రిప్లయితొలగించండిశివుని తలపైనఁ ,బార్వతి చేరి నిలచె
శంకరుని వామభాగాన ,జనులు భవుని
యర్ధ నారీశ్వరుండని యంద్రు కూడ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతిలో 'నడుమను' అనండి.
వృత్తంలో 'సతమున్ + ఉత్సాహ' అన్నపుడు యడాగమం రాదు.
సవరణలతో..
తొలగించండితరుణు లొకచోట చేరిన దొరలుచుందు
వారి నడుమను విషయాలు వందలాది
సత్వరము గంగ తోడ ముచ్చట్ల కొరకు
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె
ఉవిదల్ పల్కుచు నుందురోయి సతతంబుత్సాహముప్పొంగగా
భవబంధాదుల పై కబుర్ల రహితో ప్రాపంచి కాంశాలనే
వివరంబుల్ పొడచూపు రీతి నెనగా వింతైన ముచ్చట్లకై
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో
ఎవరో మౌనివరుండు కోరుకొనగా నేతెంచి వేళమ్ముగా
రిప్లయితొలగించండిశివునిన్ శీర్షమునందు కేశములలో జేరంగ నా గంగనున్
భవనాశంకరు శంకరున్ విడచిపోవంగోరఁగా చెచ్చెరన్
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమౌని కోరిక మన్నించి మరలి భువికి
రిప్లయితొలగించండివచ్చు గంగను జటలలోఁ బట్ట శివుఁడు
వీడి వైళమ బొమ్మని వేడుకొనఁగ
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:ఆ గణాచారి భక్తుల యర్చనమున
రిప్లయితొలగించండినమిత పరవశమునుబొందె,నద్భుతముగ
బూనకము వచ్చె దలచుచున్ భూతనాథు
శివుని, తలపైనఁ బార్వతి చేరి నిలిచె
(గణాచారులు, పూనకాలు అందరికీ అనుభవమే కదా!ఆ గణాచారికి పార్వతీ దేవి శిరస్సు పై నిలచింది.వచ్చింది పార్వతీ దేవి ,లేక దుర్గ కనుక భర్త ఐన శివుణ్ని తలుచుకొన్నది.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:స్తవనీయమ్ముగ నింద్రకీలగిరిపై దాక్షిణ్య మొప్పార శా
రిప్లయితొలగించండిత్రవ విధ్వంసక రూపి యై,స్వయముగా, దర్పమ్ము నిండారగా
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో
భవుతో సంగము లేని శక్తి వలె దా భాసించగా నెంచె నో !
(కనకదుర్గ ఇంద్రకీలాద్రి యొక్క శీర్షం పై తానే ప్రథాన దేవత గా నిలచింది. శివుని భార్య అనే గుర్తింపు తో కాక.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవనీఖండమునందుభారతమునందత్యంత శిష్టాత్ముడై
రిప్లయితొలగించండిభవబంధమ్ముల ప్రక్కనెట్టి మదిలో ప్రజ్ఞావిశేశుండునై
శివగంగన్ పరిశుద్ధిఁ చేన్ ప్రగడయే, శీఘ్రాతి శీగ్రమ్ముగా
*శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో.*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రక్కనెట్టి' అనడం సాధువు కాదు. "ప్రక్కనుంచి" అనండి.
గగనము న నుండి దూకిన గంగ దాల్చి
రిప్లయితొలగించండిసహనమున నున్న పతికి దా సాయ పడుచు
మంద లించగ గంగను మరులు తోడ
శివుని తల పైన పార్వతి చేరి నిలిచె
ప్రాపు సేరఁ జూడక యున్నఁ గోప మూని
రిప్లయితొలగించండినెలఁత లుందు రన మగల నెత్తి పైన
నిజము సేయంగ నానుడి నీరజాక్షి
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె
సవతుల్ జేరిరి యొక్క చోటునకు నాశ్చర్యంబు వాటిల్లగన్
శివ మూర్ధమ్మును వీడి గంగయు వెసం జేరంగఁ బుట్టింటికే
భువి శీతాద్రికి నేఁగి సంబరమునం బుట్టింటి కెన్నాళ్లకో
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో