ఉ:కోరక హెచ్చు దక్షిణలు,కోపము జూపక పేద వారి పై చేరిన భక్త కోటికి విశిష్టపురాణకథల్ వచించి,సం సారుల బాధలన్ వినుచు,చక్కని జ్ఞానము నిచ్చు నట్టి పూ జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో
(3)ఉ:వేరు మతమ్ము లయ్యు,ఋషివిద్యయె శ్రేష్ఠ మటంచు,ముక్తికిన్ యోగమె మార్గమం చెరుగు యూసఫు,లక్ష్మణశాస్త్రి,శారదా, జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో వారలొనర్చు యత్నములు వారికి సత్ఫల మీయ గోరుచున్ (యూసఫ్ అనే ముస్లిం ,లక్ష్మణశాస్త్రి,శారద అనే హిందువులు,జార్ అనే క్రైస్తవుడు కూడా ఋషివిద్య గొప్పదని ముక్తి మార్గాన్ని ఎంచుకొన్నారు.వారి ముక్తి ప్రయత్నం సఫలం కావాలని భక్తులు వందనము చేశారు.పూజారిని పెట్టకుండా మరొక ప్రయత్నం.)
వేరగుభావములేకను
రిప్లయితొలగించండితోరపుబంధంబుతోడదోసిలలినిండన్
విరులనునిచ్చియునటపూ
జారులగనిముక్తిగోరిసల్పిరినతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదోసిలి
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండినీరజ నేత్రుఁడన నలం
కార ప్రియుఁడని, సభక్తి మాలల గొనుచున్
దీరుచ నాగమ విధిఁ బూ
జారులఁ గని, ముక్తిఁ గోరి సల్పిరి నతులన్!
ఉత్పలమాల
నీరజ నేత్రునిన్ మిగులు నిర్మల భక్తిని కోవెలందలం
కార ప్రియుండుగన్ దలఁచి మాలల గైకొని పెక్కురీతులన్
దీరుచ, నాగమంపు విధి దివ్యమనోహరు, మందిరానఁ బూ
జారులఁ గాంచి, వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివారలె నిజమైన నిరా
రిప్లయితొలగించండికారునకున్ భక్తులకును కల్పము నందున్
వారధులని నమ్ముచు పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్.
సూరుడు తూర్పుదిక్కు పొడచూపక ముందునె నిద్ర లేచుచున్
జేరెదరైరి కోవెలకు చిన్మయరూపుని కొల్వనెంచి ని
స్తారము గోరువారికట ధర్మపథమ్మును చూపునట్టి పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిజేరిరి నీగుడి ముంగిట
గోరిరి భక్తిగ వరములు గుట్టుగ మదిలో
తీరుగ పూవులు నిడి బూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీరును గోర్కె ల టంచును
రిప్లయితొలగించండినేరుగ కోవెలకు వెడలి ని శ్చ ల భక్తిన్
హారము ల నొసo గిరి పూ
జారుల గని : ముక్తి గోరి సల్పిరి నతుల న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికారాటవి జని భరతుడు
రిప్లయితొలగించండిశ్రీ రాముని పాదుకలను చేకొని రాగా
బారులుగ పురజనులు పై
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్
పైజారులు : పాదరక్షలు
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివారందరు దేవళమును
రిప్లయితొలగించండిజేరి, తెలియక నఘములను జేసితి మనుచున్
భైరవునకు దెల్పుడని పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారుణిపై పూజారులు
రిప్లయితొలగించండివారధులై నిల్తురనెడి భక్తుల తలపే
వారికి మన్ననలిడ పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్
కోరిన వెల్లపొందుటకు కొల్తురు దేవుని భక్తులిచ్చటన్
నేరుగ పూజలన్ జరుపు నేరుపు కల్గిన వారు పూజకుల్
వారధి కట్టుచుంద్రు గద భక్తులు వేల్పుల మధ్యనిల్చి పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరిన వాంఛితమ్ములనుకూలముగా నెరవేరు నిచ్చతో
రిప్లయితొలగించండిజేరిరి దేవళమ్మునకు శ్రీహరి భక్తులు పూజ సల్పగన్
ద్వారము వద్ద నిల్చి సుమ దామములన్గొనితెచ్చి భక్తిఁ పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచేరిరి భక్తవరేణ్యులు
రిప్లయితొలగించండికోరి హరిని పూజ సేయ కోవెల కడకున్
ద్వారముకడ నిలబడి పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికం॥ చేరుచు దేవాలయమును
తొలగించండినేరుగఁ బండుగ యటంచు నేమము తోడన్
దీరుగ భగవంతుని పై
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నుతులన్
ఉ॥ ఘోరముఁ జేసెఁ దల్లియనిఁ గోరఁగ మన్ననఁ దమ్ముఁడట్టులన్
మీరను తండ్రి యానతిని మీరకు నీవు నటంచుఁ దెల్పఁగన్
గోరెను బాదరక్షలను గుర్తుగ భక్త జానాళి మ్రొక్కఁ బై
జారులఁ గాంచి వందనములు సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
పైజారులు లేక పైజాఱులు చెప్పులు నిఘంటువు సహాయమండి
(శ్రీ రాముని వనవాస సమయంలో అతని పాదరక్షలను అయోధ్యవాసులు కొల్చినారని అండి)
చిన్న చిన్న తప్పులండి
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభారము వేసి వేల్పుపయి భ్రార్ధన
రిప్లయితొలగించండిజేయుచు చిత్తశుద్ధితో
జేరిరి యేడుకొండలకు శ్రీహరి
దర్శన ప్రాప్తికోసమై
ద్వారము లోపలన్ హరిని ప్రస్తుతి
జేయుచున్న పూ
జారుల గాంచివందనము సల్పిరి
భక్తులు ముక్తి కాంక్షతో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:ఊరి శివాలయమును వ్యా
రిప్లయితొలగించండిపారము నాశనము జేయ, భక్తులు గుడిలో
తీరని వేదన బడు పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్”
(ఇక్కడ ముక్తి అంటే వారి వేదన నుంచి విముక్తి.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు !
తొలగించండిసారము దెల్సి జీవనపు సారము మోక్షమనెంచి కృష్ణునిన్
రిప్లయితొలగించండిజేర శమించు తాపములు జింతలు మాయు తలంపుతో సదా
చారులు గోకులమ్ము జనె సర్వుని సందిట భామలుండె నా
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:కోరక హెచ్చు దక్షిణలు,కోపము జూపక పేద వారి పై
రిప్లయితొలగించండిచేరిన భక్త కోటికి విశిష్టపురాణకథల్ వచించి,సం
సారుల బాధలన్ వినుచు,చక్కని జ్ఞానము నిచ్చు నట్టి పూ
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు !
తొలగించండి(3)ఉ:వేరు మతమ్ము లయ్యు,ఋషివిద్యయె శ్రేష్ఠ మటంచు,ముక్తికిన్
రిప్లయితొలగించండియోగమె మార్గమం చెరుగు యూసఫు,లక్ష్మణశాస్త్రి,శారదా,
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో
వారలొనర్చు యత్నములు వారికి సత్ఫల మీయ గోరుచున్
(యూసఫ్ అనే ముస్లిం ,లక్ష్మణశాస్త్రి,శారద అనే హిందువులు,జార్ అనే క్రైస్తవుడు కూడా ఋషివిద్య గొప్పదని ముక్తి మార్గాన్ని ఎంచుకొన్నారు.వారి ముక్తి ప్రయత్నం సఫలం కావాలని భక్తులు వందనము చేశారు.పూజారిని పెట్టకుండా మరొక ప్రయత్నం.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు !
తొలగించండివారని రక్తిని భక్తులు
రిప్లయితొలగించండిదూర నివాసు లరుదెంచి తూర్ణం బంతన్
నారాయణునకు మును పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్
దారలఁ గూడి యున్న వర దాతల మువ్వుర స్వీయ మందిర
ద్వార వరాంగణమ్ములను దాఁటి రయమ్మున సంభ్రమమ్ములం
బార విహీన హర్షమునఁ బద్మభ వాచ్యుత రాజ భృన్మనో
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
[రాజ భృన్మనోజారి = చంద్రుని ధరించిన శివుఁడు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిహారతు. లొసగుచు స్వామికి
రిప్లయితొలగించండికోరకమడిమాన్యములనుకూరిమితోడన్
తీరుగపూజసలుఫుపూ
జారులగనిముక్తిగోరిసలిపిరిపూజల్
ఊరికి మేలుగూర్చగను నూరక మాటలనాడకన్వడిన్
కూరిమితోడచేయుచునుకోవెలకార్యములెల్లవేళలన్
జేరుగవచ్చుభక్తులకు శీఘ్రమె పూజలనాచరించుపూ
జారులగాంచివందనముసల్పిరిభక్తులుముక్థికాంక్షతో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కోరుచు కోర్కెల నెన్నో
యారాధన చేయు భక్తు లాలయమందున్
బారులు తీరిచి యా పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్.