15, ఏప్రిల్ 2024, సోమవారం

సమస్య - 4737

16-4-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్”
(లేదా...)
“అత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

38 కామెంట్‌లు:

 1. నిత్యము కాదా దినమున
  సత్య చ రణములను పట్ట‌ సత్యమయినచో
  కృత్యమగు దంపతుల కది
  అత్యల్పమె ; యద్భుతముగ వ్యాపించె దెసల్

  రిప్లయితొలగించండి
 2. సత్యంబిదియేచూపును
  నిత్యము ధూపము నలుగడ నేర్పునపారన్
  స్తుత్యమపారము నౌనని
  అత్యల్పమెయద్భుతముగ వ్యాపించెదెసల్

  రిప్లయితొలగించండి
 3. సత్య మది నమ్మ రు జనులు
  ప్రత్య క్ష ము గా జూడ గోరి ప ల్కు దు రు గదా
  స్తుత్య ముగా బొంకు లన
  న్న త్య ల్ప మె యద్భు తముగవ్యాపించె దె సల్

  రిప్లయితొలగించండి
 4. కందం
  నిత్యుండు బలినిఁ బొట్టియె
  సత్యమ్ముగ మూడడుగులె చాలనె నేలన్
  కృత్యము హరిపాదమ్మున
  కత్యల్పమె? యద్భుతముగ వ్యాపించె దెసల్!


  శార్దూలవిక్రీడితము
  నిత్యుండా హరి కోరె మూడడగులే! నేలన్ బలిన్ వామనుం
  డత్యంతమ్ముగకాదు! యిత్తుననె వ్యత్యాసమ్మునన్ ధాతగన్
  గృత్యంబెంచి త్రివిక్రముండు పదమున్ గిట్టించగా జూడదే
  యత్యల్పంబె? యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్!

  రిప్లయితొలగించండి

 5. అత్యంతాప్తుడ నేనని
  యత్యల్పుడ కానటంచు హనుమంతుడు తా
  సత్యపు రూపము దాల్చగ
  నత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్.


  అత్యంతాప్తుల సంహరించు సమరంబాపంగ మేలంచనన్
  కృత్యంబంచును బోధసేయుతరి యా కృష్ణుండు పార్థుండకే
  యత్యంతాద్భుత విశ్వరూపమును నిద్యానింపు నవ్వేళలో
  యత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్.

  రిప్లయితొలగించండి
 6. నిత్యంబౌ పరిశోధన
  కృత్యముల ఫలితమనంగ పృథ్వీతలమున్
  సత్యంబనన్ విషక్రిమి
  యత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్

  ప్రత్యర్థుల్ సరిగా గ్రహింపరు కదా ప్రత్యక్షమౌ కీడనన్
  గృత్యంబుల్ విపరీతమైన దిశగా బృందాలు శోధింపగా
  నిత్యంబున్ విధిగా ప్రయోగములతో నిండారు రోగాణువే
  యత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్

  [విషక్రిమి - కోవిడు వైరస్]

  రిప్లయితొలగించండి
 7. సత్యము వదంతి యందున
  నత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
  సత్యముకన్న నసత్యము
  నిత్యము సత్వరమడరును నిఖిల జగములన్

  రిప్లయితొలగించండి
 8. సత్యం బించుక లేని గాలికబురుల్ సంరంభమౌ రీతిగా
  నిత్యంబీ జగమందు నివ్వటిలుచున్ నిర్జించు యాథార్థ్యమున్
  వ్యత్యస్తమ్మగువార్త మేషమునకున్ వ్యాఘ్రమ్ము జన్మించుటే
  యత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్

  రిప్లయితొలగించండి
 9. -

  సత్యమ్మె శివమె సుందర
  మత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
  కాత్యాయనియే జోడై
  ముత్యాలసరములుగా సముచిత ప్రకృతియై


  రిప్లయితొలగించండి
 10. వాట్సాప్ అన్యదేశ్యమైనా సరిపడు తెలుగు పదము నాకు తెలియదండి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కం॥ సత్యముఁ దెల్పఁగ మనుజులు
   నిత్యము నమ్ముదురు వార్త నీలిది యైనన్
   నిత్యము వాట్సాప్ నెరవున
   నత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్

   శా॥ సత్యంబియ్యది వామనుండనఘుఁడే సందేహ మేలేదయా
   యత్యల్పంబని నీవొసంగఁ దగదయ్యా కీడు మూడున్ బలీ
   సత్యంబన్నను శుక్రఁడట్లు వినకన్ సంధించగా దానమే
   యత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతమున్

   గణదోషము సవరించానండి కందమలో.

   తొలగించండి
  2. నాకు తెలిసినంతవరకు ఇంకా నిర్ధరించలేదండి నిజానికిది what is up application; what is up అంటే ఏమి అచట, ఏమి జరుగుచున్నది, ఏమిటి విషయము అనుకోవచ్చండి. అన్యదేశంబులు గ్రాహ్యంబులు కనుక వాడినానండి. ధన్యవాదములు

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. కం:అత్యల్పకాయు డీ వటు,
  వత్యల్ప మ్మితని పాద మని శంకారా
  హిత్యమున దాన మిడె బలి
  అత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్”

  రిప్లయితొలగించండి
 12. శా:అత్యుగ్రమ్ము ప్రపంచయుద్ధ మకటా అణ్వస్త్ర సామర్థ్యమం
  దత్యల్పమ్మని,చిన్న బాలుడను నాఖ్యన్ బెట్టి యా బాలునే
  యత్యాశన్ బడు నా జపానున ప్రయోగార్థమ్ము సంధించగా
  అత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్
  (చిన్న బాలుడు=అమెరికా జపాన్ పై వేసిన మొదటి అణుబాంబు పేరు లిటిల్ బాయ్.మొదట ప్రయోగం గా దాన్ని వేసి ఆ తరవాత ఫ్యాట్ మ్యాన్ అనే పేరుతో వేశారు.ఆ లిటిల్ బాయ్ కూడా ఎంతో అద్భుతం గా వ్యాపించింది.)

  రిప్లయితొలగించండి
 13. నిత్యాంబర సంచారి ని
  రత్యయుఁడు ప్రభాకరుండు రంజిత తరుణా
  దిత్యప్రభా పటుత్వం
  బత్యల్పమె? యద్భుతముగ వ్యాపించె దెసల్


  నిత్యుం డాద్యుఁ డజుండు నవ్యయుఁడు సందీప్తాభ్ర దేహుండు దా
  దైత్యశ్రేష్ఠునిఁ గోరి మూడడుగులన్ దైన్యంబు వాటిల్లఁగాఁ
  గృత్యంబెంచి మురారి వామనుఁడు వే జృంభించి వర్ధిల్లఁగా
  నత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. చాలా రోజుల తరువాత మీయొక్క పూరణములు చూచే భాగ్యము కలిగినది పండితవరేణ్యా. నమస్కార శతము. 🙏

   తొలగించండి
 14. ముత్యపు కాంతులఁ జూడగఁ
  నత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
  నిత్యము కళకళ లాడుచు
  నృత్యమునేజేయునటులు నెగడును దివిపైన్

  రిప్లయితొలగించండి
 15. ముత్యంబెప్పుడు కాంతి తోడను మనో మోహంబుఁ జేకూర్చగాఁ
  నత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్
  నిత్యంబాకస మందు వెల్గుచు మనోనేత్రంబు నొప్పారుచున్
  నృత్యంబాడువిధంబునొప్పుచుసదా నేస్తంబుఁజేకూర్చునే

  రిప్లయితొలగించండి