6, ఏప్రిల్ 2024, శనివారం

సమస్య - 4728

7-4-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లి యెలుకను గని బెదరి పాఱె”
(లేదా...)
“కాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా”

16 కామెంట్‌లు:

  1. జంతు ప్రేమ యంచు చంకనెత్తి తిరిగి
    ముద్దు చేసి కొసరి ముద్ద లిడగ
    సహజ గుణము మరచి సన్నిపాతమునొంది
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  2. తనను మించు ఘనుడు ధరణిలో లేరంచు
    మిడిసి పాటు పడె డు మేటి ఘనుడు
    తెలివి తేటలు గల దీమంతు కు వెర చె
    పిల్లి యెలుకను గని బెదరి పారె

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    పేకలాడుచుండ రూకల నష్టమ్ము
    సతికిఁ జెప్పు మరిది వెతికి వచ్చె
    నప్పడాలకర్ర నందుననుచు పత్ని
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె!

    ఉత్పలమాల
    కూలికిపోయివచ్చి తనె కూటికి దక్కిన డబ్బుఁ బేకలన్
    గాలగఁ జేయగన్ మరిది గాంచెనటంచును నాలసింపకే
    యాలికి వార్తఁజేర్చఁగనె యందును చీపురటన్న భీతితోన్
    గాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా!

    రిప్లయితొలగించండి
  4. నల్లని యూరకుక్క గని యక్కడ
    దిర్గెడు పిల్లియొక్కటిన్
    కాలికి బుద్ధిసెప్పె , నెలుకంగని
    నంత బిడాలము మక్కటా
    మెల్లగ సాగె పట్టుకొన, మేదిన
    పైనిది జర్గు చిత్రమే
    కాలమె సాక్షి నిర్బలుల క్రన్నన
    వంచిరి బల్లిదుల్ సుమీ.

    రిప్లయితొలగించండి

  5. బేలయంచు నెంచి విగ్రహమందున
    నతివ రుద్రమనిక యడుచ వచ్చి
    చోళ రాజు వీగె చోద్యంబదియె చూడ
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె.


    బేలయటంచు నెంచి యరివీరులు రుద్రమ దేవి తోడ తా
    మాలము జేసి యామెనట నంతము జేయదలంచి వచ్చి యా
    చోళలు శూరులెల్లయని స్రుక్కుచు వెన్నును జూపి రంతటన్
    కాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా.

    రిప్లయితొలగించండి
  6. ఆ॥పామరులెచట ఘన ప్రాజ్ఞులై మనుదురో
    పండితులకు నచట భవిత లేక
    దూర దేశమేఁగఁ దోఁచె నిటుల నాకు
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె

    ఉ॥ కాలము మార్పుఁ జెందఁగను గాంచమ వింతల నెన్నియో భువిన్
    మేలగు విజ్ఞులంచు నటు మెచ్చఁగఁ బామరులన్ విశారదుల్
    జాలిగ వీడఁగన్ దమకు స్థానముఁ గాంచకఁ దోఁచె నిట్టులన్
    కాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా

    రిప్లయితొలగించండి
  7. అబ్బరముగ త్రాగి యావా‌సమును జేరి
    తూలు చున్న పితను దుహిత గాంచి
    తల్లికి వివరించ తరలి పోబోవగ
    బిల్లి యెలుకను గని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  8. కలుగువీడి యెలుక కన్పడ చెచ్చెర
    పిల్లి దానిఁ దినఁగ వెంటబడెను
    కుక్క చాటు జేరి వెక్కిరింతగ నవ్వఁ
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  9. కాలము మారిపోయినది గానఁగనంతయుఁ దారుమారు మా
    ర్జాలముఁ జూచినన్ బెదరు శ్వానము, వోట్లను కొల్లగొట్టగన్
    జాలము వేయు నాయకుల జాజర రట్టడి సేయ బోవఁగన్
    కాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:అద్దె యిల్లు వెదకు నానంద రావ్ పిల్లి
    యెలుక లున్న యింటి నిష్ట పడడు
    దొరకినట్టి యింట చరియించె నొక యెల్క
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె”
    (అతని యింటి పేరు పిల్లి.ఆధునికులు యింటి పేరు చొవర పెట్టుకోవటం,ఆ చివరి పేరుతో వాళ్లని పిలవటం సహజమే.అతను ఆనందరావ్ పిల్లి,లేక పిల్లి.)

    రిప్లయితొలగించండి
  11. కన్నెలెదుటమనకు కనిపించు దృశ్యముల్
    కాల మహిమ యనుచు గాంచవలయు
    గోలపెట్టెనెలుక కోవిడు సోకగా
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె

    కాలము తెచ్చుచుండుగద కష్టము లెన్నియొ నెంచి చూడగా
    కూలబడెన్ బిడాల ధృతి కోవిడు సోకిన మూషికంబు పో
    గాలము దాపురించి తన కల్గును వీడి మలంగుచుండగా
    కాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా

    రిప్లయితొలగించండి
  12. ఉ:తూలుచు బల్కు నట్టి యొక తుచ్ఛుడు ఛత్రపతిన్ వధింతు నం
    చేలిక తృప్తికై పలికె, నెల్కయె గాదె శివాజి యంచు డం
    బాలను బల్కె గాని తన వద్దకె వచ్చె శివాజి, చెచ్చెరన్
    గాలికి బుద్ధి సెప్పె నెలుకం గనినంత బిడాల మక్కటా”
    (ఛత్రపతి శివాజీ మహారాజు కి కొండ ఎలుక అనే బిరుదు ఉంది.మహమ్మదీయ చక్రవర్తి సంతృప్తి కోసం శివాజీ ని చంపుతానని డంబాలు పలికాడు.కానీ శివాజీ అనే ఎలుకను చూసి ఆ పిల్లి పారిపోయింది. )

    రిప్లయితొలగించండి
  13. పెద్ద ప్రాణి కెంచఁ దద్దయుఁ జిన్న ప్రా
    ణి పగవాఁ డగు నిల నిశ్చయముగఁ
    గుంజ రాభ ముండఁగాఁ జుంచెలుకయె కం
    పిల్లి యెలుకను గని బెదరి పాఱె


    ఆలము నందు సైంధవుని నడ్డు కొనంగ నశక్యుఁ డయ్యె నా
    భీల పరాక్రముండు నగు భీముఁడు సోదర సంయుతుండునై
    కాలము దుస్సహం బగును గాలున కైన నతిక్రమింపఁగాఁ
    గాలికి బుద్ధి సెప్పె నెలుకం గని నంత బిడాల మక్కటా

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దూకె తక్షణమ్ము దూలము పైనుంచి
    పిల్లి యెలుకను గని; బెదరి పాఱె
    నెలుక ప్రాణభయము కలిగి కలుగులోకి
    పిల్లి యాశ వీడి వెడలిపోయె.

    రిప్లయితొలగించండి