11, ఏప్రిల్ 2024, గురువారం

సమస్య - 4733

12-4-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ”
(లేదా...)
“లోకంబందుఁ బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. అదనుగముఖమునలెక్కను
    విదితంబగుపండ్లనంతపేర్చినచోటన్
    వదనంబదినిండునుగా
    పదునారుపదారునుగలుపగపూర్ణంబౌ

    రిప్లయితొలగించండి

  2. మొదలిడి యుదయమె మానవ
    రదనికల గణించు పనిని ప్రతిఘుడు సేయన్
    వదలక పైనను క్రిందను
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ.

    రిప్లయితొలగించండి
  3. కం:
    ఎదుగుటకు వత్సరమ్ములు
    పదునారు గడచును, మరల పరిణతి బొందన్
    తదుపరి పదునారు గడచు
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ”

    రిప్లయితొలగించండి

  4. ఏ కాలంబున నుంటివో చదుడవా? యెవ్వండు బోధించెరా?
    నీకున్ నాకును మాంసభక్షకుడు నీనేస్తానికైనన్ గనన్
    సాకల్యమ్ముగ నుండుదంతములవే సారించి లెక్కింపగా
    లోకంబందుఁ , బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ.

    రిప్లయితొలగించండి
  5. పదునారు కళలు శశికిన్
    పదఁపడి నిరుపక్షములుగ బరఁగుచు నుండున్
    బుధజన విశ్లేషణమున
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ

    రిప్లయితొలగించండి
  6. చదువిన విద్యార్థి తెలిపె
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ,
    చదివెడి వాడిది తప్పా !
    చదివించిన వాడిదా ! విశయము కలిగెన్

    రిప్లయితొలగించండి
  7. పదునుగ రుచికర భక్ష్యము
    లెదురుగ నుంచిన తినుటకు లెక్కించితివా
    రదనము లెన్ని వలయునో
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ

    లోకంబందు పదారు గాదె సరిగా రూపించ సంస్కారముల్
    నాకంబందు పదారు మంది కనగా నాట్యాలకై యప్సరల్
    శోకంబుల్ మరిపించు హర్షము గదా చోద్యంబులన్ గాంచినన్
    లోకంబందుఁ బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ

    రిప్లయితొలగించండి
  8. కదలక మెదలక నొకచో
    పదిలము గా లెక్క జేయ వలసిన జోటన్
    గుదురు నరువది యెని మిదికి
    పదునారు పదారు ను గలుప గ పూర్ణ o బౌ

    రిప్లయితొలగించండి
  9. నీకున్ నాకును నెల్లమానవులకున్ నిర్దిష్టమౌ రీతిగా
    తాకించెంగద వక్త్రమందు విభుఁడే దంతంబులన్ సౌరుగా
    సాకల్యమ్ముగ నెంచిచూడ నవి విస్తారంబుగా దౌడలన్
    లోకంబందుఁ బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ

    రిప్లయితొలగించండి
  10. అదనున షోడశ కర్మలు
    విధి షోడశ దానములను విధ్యుక్తముగన్
    కుదురుగ సల్పిన జీవుడు
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ

    రిప్లయితొలగించండి
  11. కం॥ పదునారు కళలు ముదము
    పదారణాలనఁగఁ బూర్ణ పరిమాణమనిన్
    గుదురుగఁ దెలిపిరి విబుధులు
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ

    శా॥ ఏకాంతంబున నంకెలన్ వరుసగా నెంచంగ దృష్టంబిటుల్
    లోకంబందుఁ బదారులెన్నొ గద యాలోచించ నీసంఖ్యకున్
    లోకంబందు విశిష్ఠమౌ యునికినే లోకుల్ గనన్ బూన్చిరే
    లోకంబందుఁ బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణంబౌ

    షోడశ కళలు కర్మలు బుుత్విజులు ఇలా ఎన్నోకదండి

    రిప్లయితొలగించండి
  12. శా:లోక మ్మందున వింత గొల్పగ పదారున్ గల్గిరే బిడ్డ !లె
    ట్లో కల్యాణము లంచు భీతియగు నాలో ,నేను జీవించగా
    లోకంబందుఁ, బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ
    నా కర్తవ్యము,నాకు సాయ మిడుమా!నారాయణా!మాధవా!

    రిప్లయితొలగించండి
  13. 1)కం: పదునారు పండ్లు రాలును
    పదిలముగా బలుకు మనుచు బలుకుదు రే?ము
    ప్పదిరెండు కాదె పన్నులు?
    పదునారు పదారును గలుపగ పూర్ణంబౌ
    (చాలా మంది కోపం వస్తే పదహారు పళ్లూ రాలతాయి అంటారు.కానీ పళ్లు ముప్ఫై రెండు కాబట్టి ముప్ఫై రెండు అనాలి కదా!)

    రిప్లయితొలగించండి
  14. లలితాపరమేశ్వరి మణిద్వీపమునన్వయించి...

    కందం
    పదహారు శక్తి సేనలు
    పదారు సేనాపతులును పరదేవతకున్నీ
    సదనమున మహాశక్తులు
    పదునారు పదారును గలుపఁగఁ బూర్ణంబౌ!

    శార్దూలవిక్రీడితము
    వీకన్జూడఁగ లేదు సృష్టిని మణిద్వీపమ్ముతో తూగగన్
    శ్రీకారుణ్యకు శక్తిసేనలవియున్ సేనాపతుల్ మొత్తమున్
    శ్రీకారంపు మహాదిశక్తులనగన్జెల్లన్ మణిద్వీపమౌ
    లోకంబందుఁ బదారు నాపయిఁ బదారుం గూడి సంపూర్ణమౌ!

    రిప్లయితొలగించండి
  15. సుదతీ! యాకర్ణింపుమ
    సద యామల హృదయ! సారస నయన! యిఁక ము
    ప్పది రెండయి లెక్కెల్లం
    బదునాఱు పదాఱును గలుపఁగఁ బూర్ణంబౌ


    వీకం దీర్తును నీ ఋణమ్ములను నుద్వేగంబు నీకేలనో
    నాకం బేఁగక మున్న నీ వకట సంతాపమ్మునన్ మిత్రమా
    నాకీయంగ సహస్ర నిష్కములు తూర్ణంబిప్పు డప్పెల్లయున్
    లోకంబందుఁ బదాఱు నాపయిఁ బదాఱుం గూడి సంపూర్ణమౌ

    రిప్లయితొలగించండి
  16. పదునారుకళలతోడను
    విదుడెపుడువెలుగుచునుండువిశ్వము నందున్
    పదునారు ప్రాయ మందున
    పదునారుపదారునుగలుపగబూర్ణంబౌ


    రిప్లయితొలగించండి