7, ఏప్రిల్ 2024, ఆదివారం

సమస్య - 4729

8-4-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు”

(లేదా...)

“పౌరుల్ సూడ వివేకశూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా”

(న.చ. చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

36 కామెంట్‌లు:

  1. తే.గీ:
    నీతిని మరచి పలువురు నేతలు తమ
    స్వార్థము కొరకై ప్రజలను పలువిధముల
    మభ్య పెట్ట గలరు, వారి మాట వినెడి
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు.

    రిప్లయితొలగించండి

  2. ఎనికలందున విజయము నెంచుకొనుచు
    తాను గెలువ, నన్నియును దప్పకుండ
    నుచితమనుచు దెలుప నమ్మి యోటు వేయు
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు

    రిప్లయితొలగించండి
  3. నోటుకొఱకునైయోటునునోటగఱచి
    పర్వులిడుచుండ్రుప్రజలునుపాటుబడుచు
    తెలియరారుగవిలువలచేతనలును
    పౌరులవివేకులీప్రజాస్వామ్యమందు

    రిప్లయితొలగించండి
  4. నవమౌపోకడమంత్రిజూపుగద దానంబిచ్చిభోగంబులన్
    జవనాశ్వంబునువోలెపర్వులిడుచున్జాడన్గనన్రాడుగా
    సవనంబౌనుగవానిదర్శనమునాస్వామిన్తలంపించుగా
    అవివేకుల్గదపౌరులెల్లరుప్రజాస్వామ్యంబునన్జూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యతిదోషం కారణంగా వృత్తపాదాన్ని మార్చాను. మీరు గమనించలేదు.

      తొలగించండి
  5. మీట నొక్కిన చాలును మీకు చేరు
    పలు పథకముల రూపున పన్ను డబ్బు
    నన్ను గెలిపించు మనిచెప్ప నమ్ముచుంద్రు
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు

    వివరంబేల సదా నికృష్టము కదా విస్పస్టతన్ గాంచగా
    జవసత్వంబులు లేని పాలనమిడన్ సామర్థ్యమే మృగ్యమౌ
    చవటల్నే గెలిపించు చుందురు కదా సామాన్యులే గ్రుడ్డిగా
    నవివేకుల్ గద పౌరులెల్లరు ప్రజాస్వామ్యమ్మునం జూడఁగన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      యతిదోషం వల్ల వృత్తపాదాన్ని మార్చాను. గమనించి మరో పూరణ వ్రాయండి.

      తొలగించండి
  6. అమలు గానట్టి హామీల నధిక మొసగ
    గ్రుడ్డి గా నమ్ముచు జనులు కోరు కొంద్రు
    నేతల నైజమ్ము దెలియక నిక్క మరయ
    పౌరు లవి వేకు లీ ప్రజా స్వామ్య మందు

    రిప్లయితొలగించండి
  7. ఎవరేమన్నను డబ్బు కాశపడి తా
    మెల్లప్పుడున్ మర్వకన్
    యవినీ త్యజ్ఞుల దురాత్ములకు
    సదా యాలోచనన్ జేయ కీ
    భువిలో వోటురు మహాశయు
    లరరే! వోటేసి గెల్పింతురే
    యవివేకుల్గద పౌరులెల్లరు ప్రజా
    స్వామ్యమ్మునంజూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యతిదోషం వల్ల వృత్తపాదాన్ని మార్చాను. గమనించి మరో పూరణ వ్రాయండి

      తొలగించండి

  8. అనుచితమ్మైన యుచితము లందుకొనుటె
    యుచితమంచు దలంచుచు నోటు వేసి
    విసవరుల నేతలుగ గెలిపించు కొనెడి
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు.


    భవితన్ దిద్దెదనంచు చెప్పినను విశ్వాసమ్ము నే చూపకన్
    ద్రవిణమ్మెవ్వడు పంచునో యతడె పెత్తందారిగా వెల్గెడిన్
    భువిలో వాడిని మెచ్చి యోటునిడెడిన్ మూర్ఖత్వమున్ గాంచగా
    నవివేకుల్ గద పౌరులెల్లరు ప్రజాస్వామ్యమ్మునం జూడఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      యతిదోషం వల్ల వృత్తపాదాన్ని మార్చాను. గమనించి మరో పూరణ వ్రాయండి

      తొలగించండి
  9. తేటగీతి
    భరతదేశమ్ము స్వాతంత్ర్య భాగ్యమొంద
    నెగడు రాజ్యాంగ మందించి 'నేతలెల్ల'
    తీర్చి దిద్దిన పథమున దీక్షనిల్ప
    పారుల! 'వివేకులీ ప్రజాస్వామ్యమందు'

    మత్తేభవిక్రీడితము
    స్తవనీయంపు పథమ్మునన్ జెలగుచున్ స్వాతంత్ర్య పోరాటమున్
    శివమున్ బొందెడు రీతినిన్ నడిపియున్ స్వేచ్ఛన్ దగన్ బొందియున్
    వివరమ్మెంచిన పాలనంబు సలుపన్ విద్వేషమౌ దృష్టిలో
    నవివేకుల్ గద పౌరులెల్లరు ప్రజాస్వామ్యమ్మునం జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      యతిదోషం వల్ల వృత్తపాదాన్ని మార్చాను. గమనించి మరో పూరణ వ్రాయండి

      తొలగించండి

    2. ధన్యోస్మి గురుదేవా!

      మార్చిన శార్దూలవిక్రీడిత సమస్యకు పూరణ:

      శార్దూలవిక్రీడితము
      పోరాటమ్మున స్వేచ్ఛనొంది ప్రజకున్ మోదంబునందింపఁ దీ
      రౌ రాజ్యాంగము దేశభక్తులగచున్ రంజిల్ల నందింపగన్
      వీరాగ్రేసరులెల్ల, సాగ నియతిన్, విద్వేష దృష్ట్యాళికిన్
      పౌరుల్ సూడ వివేకశూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా!

      తొలగించండి
  10. ఓటు వేయగ జనులెల్ల నోటు పొంద
    పాపులే యిట గెలుచుచు పదవి పొంది
    కోట్లు సాధించు కొనెడి యా కూళుల గన
    పౌరులవివేకు లీ ప్రజా స్వామ్యమందు.


    ఔరా! నేడిల స్వార్థమే పెరిగి ధర్మాధర్మముల్ వీడుచున్
    ఘోరాలెన్నియొ చేయువారలనె సంకోచింపకన్ మెచ్చుచున్
    భూరిన్ ద్రవ్యము మద్యమిచ్చు నతనిన్ భూపాలునిన్ జేసెడిన్
    పౌరుల్ సూడ వివేక శూన్యులు ప్రజా స్వామ్యమ్మునన్ మిత్రమా!

    రిప్లయితొలగించండి
  11. స్వారాజ్యంబిడె నోటు హక్కు వరమా వైనంబు లక్షింపకన్
    సారాయంబు పణంబు కాశ వడి నిస్సారంబు గావించుచున్
    ధారాదత్తమొనర్తురేలుబడి నిర్ధారింపకే యోగ్యతన్
    పౌరుల్ సూడ వివేక శూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా

    రిప్లయితొలగించండి
  12. సారా పోసిన చాలు కొందరికిటన్ సాధింపగా వోట్లనే
    వీరావేశముతోడ వోటు నిడుచున్ ప్రేమింతురే నేతలన్
    ఘోరంబౌ పరిపాలకుండు గెలుచున్ కొంగ్రొత్తదౌ బాసతో
    పౌరుల్ సూడ వివేకశూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా

    రిప్లయితొలగించండి
  13. దారాపుత్రుల క్షేమముం దలపకన్ ద్రవ్యంబుపై నాసతో
    పోరామిన్ బడవేసి జీవితములన్ మూర్ఖంబుగా నెన్నికన్
    క్రూరాత్ముండగువాని నందలముపై గూర్చుండగా జేయునీ
    పౌరుల్ సూడ వివేకశూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా

    రిప్లయితొలగించండి
  14. ధనము మద్యములంగొని క్షణికమైన
    సుఖములకు లొంగి భవితను దుఃఖమయము
    సేయు నేతలకోటులఁ వేయునట్టి
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్యమందు

    రిప్లయితొలగించండి
  15. తే॥రాజకీయ ధురంధరులకుఁ బ్రజలను
    నమ్మఁ బలికి మోసముఁజేయ నయము గాను
    వెన్నతోటి పెట్టిన విద్య విహితమరయ
    పౌరు లవివేకు లీ ప్రజా స్వామ్యమందు

    శా॥ సామాన్యంబుగ రాజకీయమున నాశావాహినిన్ మంచుచున్
    ధారాళంబుగ బాసలెన్నిటినొ సంధానించి శస్త్రమ్ములన్
    సారించంగ జనాళి మోదమలరన్ సాధించరే కుత్సితుల్
    పౌరుల్ సూడ వివేక శూన్యులు ప్రజాస్వామ్యమ్మునన్ మిత్రమా

    రిప్లయితొలగించండి
  16. వేల కోట్లు దోఁచిరి మీఱి పాలకు లని
    పలుకఁగ విపక్ష నేతలు చెలఁగి వీరు
    మున్ను లక్ష కోట్లు తినిరి యన్న వినిన
    పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్య మందు


    భువిలో భారత దేశ పాలకుల వ్యామోహమ్ము విత్తమ్ముపై
    న వచింపంగఁ దరమ్మె యింత యని యన్నా యేరి కెన్నండుఁ గా
    క విశేషంబుగ వర్తమాన మగు నిక్కాలమ్మునన్ భూత భా
    వ్యవివేకుల్ గద పౌరు లెల్లరు ప్రజాస్వామ్యమ్మునం జూడఁగన్

    [యతి భంగ మున్న సమస్యా పాదమున కఖండ యతినిఁ గూర్చి చేసిన పూరణము గమనార్హము.]

    రిప్లయితొలగించండి
  17. స్వార్థపరులచేతబడుచువారితీపి
    మాటలకులొంగికొందరుమంచిమరచు
    పౌరులవివేకులీ ప్రజాస్వామ్య మందు
    కానిపించెదరెల్లడఘనులుగాను

    రిప్లయితొలగించండి