4, ఏప్రిల్ 2024, గురువారం

సమస్య - 4726

5-4-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్”
(లేదా...)
“ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

23 కామెంట్‌లు:

 1. స్వీకృతమృణ్మయకలశము
  ప్రకృతిన్కాపాడునండ్రు, ప్లాస్టిక్కుబుధుల్
  వికృతిన్జేయుననంగా
  ధీకృతినిలువంప్రజలునుతేజముకలుగున్

  రిప్లయితొలగించండి
 2. కందం
  ఒకటేమిటి యన్నింటికు
  పకరణముగ చేతిసంచి బదులుగ వాడన్
  వికటించుననఁగ, 'మానిన'
  ప్రకృతిం గాపాడునంద్రు 'ప్లాస్టిక్కు' బుధుల్!

  మత్తేభవిక్రీడితము
  ఒకటిన్ గాదది మ్రోయునన్నిటిననంచొప్పార లోకమ్మునన్
  సకలమ్మందున చేతిసంచి బదులై సాగన్ వినాశమ్ముగన్
  వికటించున్ ముగియింపు బల్కుమనగన్ విజ్ఞుల్ నిషేధించినన్
  ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్!

  రిప్లయితొలగించండి
 3. కం:
  వికృతమగు ప్రయోజనముల
  కకృత్యములు జేయకుండ ననుకూలముగన్
  సకృతమగు రోడ్లు వేసిన
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్.

  రిప్లయితొలగించండి

 4. నికరమ్ములై వసుధలో
  సకలార్థమ్ముల నొసంగు సాలములవి కా
  క కవివర! తెలుపు మెవ్విధి
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్.  సకలార్థమ్ముల నిచ్చి కాచు నవియే సంక్షేమమున్ గూర్చుచున్
  నికరమ్మైనవి ధాత్రిలో గనగ క్షోణీజమ్ములేకాక, హా
  నికరమ్మంచు వచించుచుండుటదియే నిక్కంబె యౌ నెవ్విధిన్
  ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్.

  రిప్లయితొలగించండి
 5. రకరక ముల రూపాలు గ
  సకల జనులకుప క రించు సామాన్య ము నౌ వికృత పు పదా ర్థ మెటుల
  ప్రకృతిం గాపాడు నంద్రు ప్లాష్టిక్కు బుధుల్?

  రిప్లయితొలగించండి
 6. అకృతియగు వానిని బిలచి
  సుకృతమొకటి చేయుటకయి సులభము నడుగన్
  వికృతమగు చేష్టలు సలుప
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్

  రిప్లయితొలగించండి
 7. కం॥ ప్రకృతిఁ గనఁగఁ బ్లాస్టిక్కటు
  సుకృతము నొసఁగు మనుజులకు శోభగ భువిలో
  వికృతముగ వాడ కున్ననె
  పకృతిం గాపాడు నంద్రు ప్లాస్టిక్కు బుధుల్

  మ॥ ప్రకృతిం గాంచఁగ నెన్నియో విధములన్ బ్లాస్టిక్కు వాడందగున్
  సుకృతం బెంచఁగ భాగ్యమే జనులకున్ శోభస్కరంబయ్యెడిన్
  వికృతం బయ్యెడి రీతిగాఁ బకృతి వైవిధ్యంబుగా వాడకన్
  బ్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ సంపన్నిధుల్

  Please permit me to add a couple of sentences as a science graduate. Plastic is considered 20th century wonder discovery. If prudently used benefits the human race immensely. Plastic finds use in heart valves to various implements. But it could be an environmental disaster if not properly used. Since, the human greed follows the latter path, impending environmental disaster is not too far.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరొక పూరణండి

   మ॥ సకలమ్మర్థము గాఁగ విజ్ఞతను సంస్కారమ్ముతో వాడఁగన్
   బకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ సంపన్నిధుల్
   వికృతం బయ్యెడి రీతిగాఁ బ్రకృతి వైవిధ్యంబు గావాడఁగన్
   బ్రకృతిం జేయును నాశనంబు నటులన్ బ్లాస్టిక్కు సంపూర్తిగన్

   తొలగించండి
 8. పకృతి సహజగుణ సంపద
  సుకృతము, దానిఁ జెఱచంగఁ జూచును నరుఁ డీ
  వికృతమనుజనిజదుష్ట
  *“ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్”*

  సకలంబున్ ధర సృష్టి సేసె నజుఁడే సత్కృత్యసంసేవకున్
  వికలమ్మీ మనుజప్రవర్తనమె! యుర్వీజంబులం గూల్చుచున్
  గుకలామార్గచలన్నిబద్ధనిజసంక్షోభాప్తసంకాశ మీ
  *“ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్”*

  రిప్లయితొలగించండి
 9. వికృతమని పలుకుచుందురు
  ప్రకృతినాశన మగుటయె వాస్తవమనుచున్
  సుకృతమిడు నియంత్రించిన
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్

  వికృతంబైనది ప్లాస్టికేననుచు పల్ విద్వన్మణుల్ తెల్పగా
  సుకృతంబేనని పల్కు వారుఁ గలరే శోభాయమానంబుగా
  నికృతంబౌ జనులొప్పుచుంద్రు సరిగా నేరీతి వాక్రుచ్చినన్
  బ్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్

  రిప్లయితొలగించండి
 10. కం:ప్రకృతి కి ప్లాస్టిక్ శాపము
  వికృతిన్ జేయు నన స్వర్ణవిభుధులు ప్లాస్టిక్
  సకలసుఖమ్ముల నిడు నది
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్”
  (ప్లాస్టిక్ వల్ల నష్టం ఉందనే వాళ్లు బంగారం లాంటి విబుధులు.ప్లాస్టిక్ మంచి దనే వాళ్లు ప్లాస్టిక్ విబుధులు. )

  రిప్లయితొలగించండి
 11. మ:"ప్రకృతిన్ గాల్చును ప్లాస్టికం చనగ ధీప్రాగల్భ్యహీనుల్" "సదా
  ప్రకృతిం గాచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్”
  ప్రకృతిన్ గాచునటన్న వేపుటయొ,సంరక్షించుటో నేరమిన్
  వికృతమ్మౌ గద యిట్టి భాష యని నిర్వేదమ్ము నే జెందితిన్.
  (మేధావి కాని వాళ్లు ప్లాస్టిక్ ప్రకృతిని కాలుస్తుంది అన్నారు.మేధావులు ప్రకృతిని గాచును అన్నారు.ఇక్కడ కాచటం అంటే కాపాడటం అని అర్థమో, వేడెక్కించటం అనే అర్థమో తెలియక పండితుల భాషే అయోమయం తయారు చేసింది.)

  రిప్లయితొలగించండి
 12. సకల ధరా జను లింపుగ
  వికార మందక యెదలను వీసమ్మును వా
  డక యున్న నిశ్చయమ్ముగఁ
  బ్రకృతిం గాపాడు నంద్రు ద్రావ్యాలి బుధుల్

  సమస్యా పాదములోని కాఁచు శబ్ద మరసున్నతోఁ గూడి యున్నది కనుక నది కాచు (కాపాడు) పదమున కన్య మగును.

  సుకరంబైన మృదుత్వ మందు టవియే శోభిల్లు ద్రావ్యమ్ములై
  వికలంబందఁగ నేర వెన్నఁడును వేవేలేండ్లకున్ సుంత కు
  ళ్లక చచ్చున్ మృగ సంచయమ్ము తిన నిర్దాక్షిణ్య మా వస్తువే
  ప్రకృతిం గాఁచును ద్రావ్యమం చనిరి ధీ ప్రాగల్భ్య సంపన్నిధుల్

  [కాఁచును = కాఁగఁ జేయును; ద్రావ్యము = plastic]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునండి. కాని ఇది గ్రహింప బడ్డ సమస్య కదండి. ప్లాస్టిక్ 20వ శతాబ్దములో కనుగొన్నది కదండి. ద్రావ్యము అంటే కరగగల ఘనపదార్థమనుకుంటానండి.

   తొలగించండి
  2. అవునండి. కరగింపఁదగునది.
   Plastic also has the same meaning.
   Plastics are those which can obtain plasticity many times by the application of heat and pressure.

   తొలగించండి
  3. నేను తెనుఁగు కవిత్వమున నన్యభాషా పదములను వాడనండి.
   అన్యోక్తములుగ ననుకరణమునఁ బ్రయోగింప వచ్చును.

   తొలగించండి
 13. ఒకనాడున్ తలపోసిరప్పెళుసు తోనుర్వుల్ సృజించంగ వా
  డుకనాయాసమగున్ ప్రియంబనిరి కాలుష్యంబు లెక్కించలే
  ప్రకృతిం గాచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్య సంపన్నిధుల్
  వికలమ్మాయెను పంచభూతములవే పెక్కేండ్లు బాధించగన్

  అప్పెళుసు= ప్లాస్టిక్

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సకలము ప్లాస్టిక్ మయమై
  వికృతముగా మారె ప్రకృతి విస్మయమందన్
  సుకమగునా పుడమి, కెటుల
  ప్రకృతి గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్?

  రిప్లయితొలగించండి
 15. వికలమగును మనిషి బ్రతుకు
  ప్రకృతివిఘాతమ్మొనరఁగ ప్లాస్టికు వాడన్
  సకల సుభదయై వరలఁగ
  ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు బుధుల్

  రిప్లయితొలగించండి
 16. సకలంబీ జగమందు వాడెదరు విస్సాటంబుగా ప్లాస్టికున్
  వికలంబై మనుజాళి జీవనము నిర్వీర్యంబగున్ గావునన్
  సుకరంబౌవిధి యోగ్యమౌ పనుల కస్తోకంబుగా వాడినన్
  ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్

  రిప్లయితొలగించండి
 17. వికృతమతితోడకొందరు
  *“ప్రకృతిం గాపాడునంద్రు ప్లాస్టిక్కు ,బుధుల్”*
  సకృతుగను వాడమంచును
  ప్రకటించెడుమాటవినుమురయముగపుత్రా

  రిప్లయితొలగించండి