26, ఏప్రిల్ 2024, శుక్రవారం

సమస్య - 4747

27-4-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అనలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్”
(లేదా...)
“అనలమునందు నేయి గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్”

16 కామెంట్‌లు:

  1. కనగాయాగమునందున
    అనలమ్ముననేయివడిఘనాకృతినందెన్
    తనువునపులకలువొడమెను
    అనువుగమేఘమ్ముకురియహాయనిపించెన్

    రిప్లయితొలగించండి
  2. అనయముసాధకుండునటహంసగమారెవిరక్తుడాయెడన్
    కనలుచుమాయగ్రమ్మగనిఖండనజేసెతదేకదృష్టితో
    చెనకెనుచంచలంబునగుచిత్రములీశ్వరులీలయంచునున్
    అనలమునందునేయిగననయ్యెఘనాకృతిజెందివింతగన్

    రిప్లయితొలగించండి
  3. సత్పురుషుల యజము జార్చు వాన!


    కందం
    ఘనమగు సత్పురుష యజము
    చినుకులనిడ మేలు గలుఁగు జీవులకనగా
    నొనరింప నేత తీరుచు
    ననలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్!

    చంపకమాల
    ఘనముగ యజ్ఞమున్ సలుప క్ష్మాతలమందున పుణ్యమూర్తులున్
    జినుకులు నేలరాలి భువి జీవులకెల్లను భుక్తి కల్గెడున్
    వినతిని జేయ నేత కనువిందుగ ముఖ్యులు గొల్వుతీరఁగా
    ననలమునందు నేయి గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్!

    రిప్లయితొలగించండి

  4. అనుజుని చెంతకు పిల్చుచు
    ఘనసారము నందు వేసి కనుమిది చిత్రం
    బని ముందుగ కరి గించిన
    యనలమ్మున నేయి, వడి ఘనాకృతి జెందెన్.


    తనయుడు మంత్రతంత్రములు ధాటిగ నేర్చితి నంచు కుండలో
    వనమును వోసి చిత్రమగు పల్కులు పల్కుచు వేసి యందులో
    గనుమిది వింత యంచు గత కాలమునన్ గరిగించినట్టి యా
    అనలమునందు నేయి, గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్.

    రిప్లయితొలగించండి
  5. ఘనమైనఘృతమదికరుగు
    *ననలమ్మున,నెయ్యివడిఘనాకృతిజెందెన్*
    చినుకులుపడువేళలలో
    ననుపగు స్థలముననునిచిననతిశీఘ్రముగా

    రిప్లయితొలగించండి
  6. కం॥ విను గలితీ కాలమునను
    గన ద్రవ్యపు నిజ ప్రకృతినిఁ గఠినము గాదా
    మనుజులు వేయఁగఁ గ్రతువున
    ననలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్

    చం॥ కనఁదగు వింతలెన్నిటినొ కాల మహత్మ్యము తోడ ధాత్రిలో
    ననుచును దెల్పె బ్రహ్మ మటులందరు మెచ్చఁగఁ బూర్వ మెప్పుడో
    మనుజులు నేఁడు యజ్ఞమున మంత్రము నధ్యయనించి వేయఁగా
    ననలము నందు నేయి గన నయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్

    రిప్లయితొలగించండి
  7. జనులకొక దొంగబాబయె
    యనృతము లనుతా వచించె నద్భుత రీతిన్
    తను వేయగనే వింతగ
    ననలమ్మున నేయి , వడి ఘనాకృతిఁ జెందెన్.


    అనృతములాడు నీవరుడయాచిత మందు ధనమ్ము నొందగన్
    జనులను చేరి చెప్పె కరి జాగిల మయ్యెను నాదు చేతిలో
    శునకమె సింహమయ్యె నవి సూకరమయ్యె నేను వేయగా
    ననలమునందు నేయి , గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్.

    రిప్లయితొలగించండి
  8. జనులకు మేలగు యజ్ఞము
    ననలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్
    ఘనులగు భక్తులు కనగా
    చినుకులు మొదలై కురిసెను చిత్తడి వానల్

    జనులకు మేలుకూర్చునని సల్పిరి యజ్ఞము సోమయాజులై
    ననలమునందు నేయి గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్
    ఘనమగు భక్తితోడ నట కన్గొన వచ్చిరి భక్తులెల్లరున్
    జినుకులతోడుతన్ గురిసె చిత్తడి వానలు రాజ్యమంతటన్

    రిప్లయితొలగించండి
  9. జనతతి మే లొన గూ ర్ప గ
    ఘనముగ నొనరించు మఖ ము. కామిత ఫలమై
    వానలు గురి యంగ నని రి
    యన లమ్మున నేయి వడి ఘనా కృతి చెందె న్

    రిప్లయితొలగించండి

  10. ఘనఘృతము వేడి జేసిరి
    యనలమ్మున : నేయి వడి ఘనాకృతిఁ జెందెన్
    తినుటకు వడ్డించిన భో
    జనంబు తయారయి పెచ్చు సమయం బయ్యెన్

    రిప్లయితొలగించండి
  11. కనివినియెరుఁగని రీతిగ
    కనరాదొక మబ్బుతునక, కర్షకులెల్లన్
    ఘనముగ జన్నము సలుపఁగ
    ననలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్

    రిప్లయితొలగించండి
  12. కనివిని యుండనట్టి పెను కాటకమేర్పడి పంటచేలకున్
    కనఁబడదొక్క చుక్కయినఁ గంటికి తోయము కర్షకాళికిన్
    ఘనముగ జన్నమున్ జరుప కర్షకులెల్లరు వాన రాకకై
    యనలమునందు నేయి గననయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్

    రిప్లయితొలగించండి
  13. అనలము నూలుకొల్పి తగునాజ్యము జేర్చగ దేవయజ్ఞమం
    దునెగసె కీలలక్కసము తోడ నపార ఘృతంబుఁ బోసినా
    ననలమునందు నేయి గననయ్యె, ఘనాకృతిఁ జెంది వింతగన్
    మనకడ పేరియుండునది మాయపు రూపున జేరు వేల్పులన్

    రిప్లయితొలగించండి
  14. వనితామణి! వీక్షింపుమ
    మనుజ గణము రాక మున్న మఱవకుమీ వ
    డ్డన కయి నింపుగ నుంచుమ
    యనలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్


    వనరిన లాభ మేమి నిజ బాహులు కాలినఁ బట్ట నాకులన్
    మనుజల కుండ నట్టి క్రియ మానుగ మున్నర యంగ నొప్పునే
    తనరఁగఁ దత్క్షణం బచటఁ దద్దయు శీతల మంత నాఱఁగా
    ననలము నందు నేయి గన నయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్

    రిప్లయితొలగించండి