24, ఏప్రిల్ 2024, బుధవారం

సమస్య - 4745

25-4-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్జునునకు మిత్రుఁ డంగరాజు”
(లేదా...)
“నమ్మెద రంగరాజును ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్”

18 కామెంట్‌లు:

  1. తండ్రికోరినపుడుతనువునుకోసెను
    అర్జునకుమిత్రుడంగరాజు
    తల్లికుంతికోర్కెదాల్చినవాడునై
    పార్థుకిచ్చెతనదుప్రాణమంత

    రిప్లయితొలగించండి
  2. రారాజు దుర్యోదనుని భావనలో...


    ఆటవెలది
    పాశుపతమునొంది పరమేశునర్చించి
    వీరుఁడంచునెంచి విర్రవీగ,
    ఖండపరశు కృపను, గర్వమడగఁజేయు
    నర్జునునకు, మిత్రుఁ డంగరాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఇమ్ముగ శల్యుడున్ విజయమేర్పడ సాదిగఁ దేరుకొప్పునన్
      సమ్మతి కర్ణుడున్ భ్రమసె! 'సత్యము గాదని దల్చి' ,యుద్ధమం
      దమ్ములవేయువేళఁ విన నైతిక ధర్మము వీడి వాగగన్
      నమ్మెద రంగరాజును, 'ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్'

      తొలగించండి
  3. అడిగిననింద్రుకిచ్చెగదనర్మిలిమ్రొక్కుచుకుండలంబులన్
    వడిగనితల్లిబాధనటప్రాణమునిచ్చెగయుద్ధభూమిలో
    కడిగినముత్యమీభువినికర్ణుడుభారతమందుజూడగా
    నుడివెదరంగరాజునుధనుంజయమిత్రుడటంచుపండితుల్

    రిప్లయితొలగించండి
  4. అమ్మ మాట వినిన యార్కి యొప్పుకొనిన
    "అర్జునునకు మిత్రుఁ డంగరాజు"
    యనెడి పదము సత్యమగును కాని యటుల
    ప్రాప్తి కలుగలేదు భారతమున

    రిప్లయితొలగించండి
  5. సఖుడుగురువుబావసర్వముకృష్ణుడే
    అర్జునునకు,మిత్రుడంగరాజు
    తాకురుపతికయ్యెధరణిలో కర్ణుడు
    ప్రాణముండువరకువపువునందు

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఇమ్మహిలోనసర్వులునునిమ్ముగనాకురుసార్వభౌముకున్
    నెమ్మినిచూపుమిత్రుడననిక్కముగానితడేయటంచిలన్
    “నమ్మెద రంగరాజును,, ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్
    నమ్మరుగాకనమ్మరిదినాకమునుండిసురాళిచెప్పినన్

    రిప్లయితొలగించండి
  8. అడిగిన దానధర్మముల నందరికన్నను ముందునుండనిన్
    నుడివెద రంగరాజును; ధనుంజయమిత్రుడటంచుఁ బండితుల్,
    అడిగిన ధర్మసంశయము లన్నిటి దీర్చెను, యుద్ధమందునన్
    విడువఁగ నేల? చంపుమనె వీరుల నెల్లర కృష్ణుఁ డాతనిన్.

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ అంగ రాజెరుఁగక నర్జునకు హితముఁ
    గూర్చె రిపుఁడతఁడని గుర్తు చేసి
    పార్థుఁ డస్త్ర శస్త్ర పరిధిఁ బెంచు కొనఁగ
    నర్జునునకు మిత్రుఁ డంగరాజు

    ఉ॥ నెమ్మది లేని కర్ణుఁడటు నేమముఁ గాంచక దూర నర్జునన్
    గమ్మున నుండకన్ గరిమఁ గాంచుచు పార్థుడు నస్త్రశస్త్రముల్
    ముమ్మర సాధనన్ బడయ బోధను జేసె హితైషి రీతిగన్
    నమ్మెద రంగరాజును ధనంజయ మిత్రుఁ డటంచుఁ బల్కినన్

    చాలా సమయాలలో మనమన్న గిట్టని వారు వారికి తెలియకనే మిత్రులకన్న ఎక్కువ సహాయము చేస్తారండి.

    రిప్లయితొలగించండి
  10. క్రమాలాంకారంలో ---
    రుద్రు డె వరి కొస గె రూఢి పాశు పత మ్ము?
    ఘన మగు విలు కాడు తనను మెచ్చ
    రాజ రాజె వరిని రాజు గా చేసెను?
    అర్జునునకు ::మిత్రు డంగరాజు

    రిప్లయితొలగించండి
  11. వీరు లెవరు గలరు భీష్మునికెదురొడ్డ
    ద్రోణుని నెదిరించఁ దొడగునెవరు
    సంపరాయ మందు సరిసాటి గానిల్చు
    నర్జునునకు మిత్రుఁ డంగరాజు

    కమ్మని కోర్కెలే తమకు కష్టము లౌనని నమ్మకుందురే
    తమ్ముని పుత్రులే మసలు తథ్యము గెల్పని నమ్ముచుందురే
    నమ్మకమే కదా హృదిని నాటినఁ శక్తినిచ్చును కౌరవుల్
    నమ్మెద రంగరాజును ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్

    రిప్లయితొలగించండి
  12. అస్త్రవిద్యయందు నారితేరినవారు
    సద్గుణమ్ముల సరి సాటివారు
    ధైర్య సాహసములఁ తగనెంచి చూడఁగ
    నర్జునునకు మిత్రుఁ డంగరాజు

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:పార్థు డనగ మీకు బ్రాణమే ఆచార్య
    మెచ్చు కొందురతని మీర లెపుడు
    కాని యెవ్విథమున హీనుడౌ దెల్పరే
    అర్జునునకు ,మిత్రు డంగ రాజు?
    (మిత్రు డైన కర్ణుడు అర్జునునికంటే దేనిలో తక్కువ?అని దుర్యోధనుడు ద్రోణాచార్యుని ప్రశ్నించినట్టు.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:నమ్ముచు రంగ రాజును ఘనమ్మగు బాధ్యత నిచ్చి తీవు,స్వా
    ర్థమ్మున వచ్చె నాతడు వరమ్మని యెంచకు,రాజకీయమున్
    నమ్మకు "ముఖ్య మౌ పదవి నా"కని యాతడు కోరకున్నచో
    నమ్మెద రంగరాజును ధనంజయ!మిత్రుఁ డటంచుఁ బల్కినన్”
    (రంగరాజు,ధనంజయ ఇద్దరూ రాజకీయ నాయకులే. మిత్రుడు ధనంజయకి సలహా ఇచ్చాడు. )

    రిప్లయితొలగించండి
  15. ఫల్గుణునకు దక్క పాండవులు తనకు
    జిక్కనేమి కీడు సేయననుచు
    మగువకుంతి కొసగె మాట, నెవ్విధి గన
    నర్జునునకు మిత్రుఁ డంగరాజు?


    తమ్ములు నీకు పాండవులు తల్లిని నేననటంచు జెప్పుచున్
    దొమ్మిని మాని పాండవులతోడను కూడు మనంగ పల్కెనే
    యిమ్మహి ధార్తరాష్ట్రునకు నిష్టసఖుం డను గాదె నెవ్విధిన్
    నమ్మెద రంగరాజును ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్?

    రిప్లయితొలగించండి
  16. స్నేహ మెంచి కరము సెంద కెడఁద లోన
    సుంత సంశయమ్ము చెంత నుంచె
    ధార్తరాష్ట్రుఁ డిట్లు దలఁచి సాటి యగు వాఁ
    డర్జునునకు మిత్రుఁ డంగరాజు

    సవరించని సమస్యాపాదమునకుఁ బూరణము:

    కడు ధృతి మంతుఁ డంకమునఁ గౌరవ రాడ్వర మిత్ర వర్యుఁడుం
    బుడమిని భారతప్రధన మూల నరుండు నరద్విషుండునున్
    వడిని ధనంజ యాభుఁడు నపారుఁడు దివ్య తరాస్త్ర నైపుణిన్
    నుడివెద రంగరాజును ధనుంజయ మిత్రుఁ డటంచుఁ బండితుల్

    [ధనుంజయ మిత్రుఁడు = విలుకాండ్ర జయించు వారికి సూర్య నిభుఁడు]

    రిప్లయితొలగించండి
  17. ఇమ్మహిలోన భానుడుదయించును తూరుపునన్న నమ్మెదన్
    క్రమ్మరి నిర్ఝరుల్ కడలి గమ్యముగా జనునన్న నమ్మెదన్
    కమ్మని గానమాధురులు గ్రావములన్ కరిగించు నన్న, నేఁ
    నమ్మెద రంగరాజును ధనంజయమిత్రుఁ డటంచుఁ బల్కినన్

    రిప్లయితొలగించండి