18, ఏప్రిల్ 2024, గురువారం

సమస్య - 4740

19-4-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంసారము హితకరమ్ము సన్యాసులకున్”
(లేదా...)
“సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్”
(చెన్నమాధవుని భాస్కరరాజు గారికి ధన్యవాదాలతో...)

38 కామెంట్‌లు:

  1. హంసగముక్తినిబొందగ
    సంసర్గముతోడిగృహిణిచాలునుగాదే
    మాంసముమిగులదువానికి
    సంసారమ్ముహితకరముసన్యాసులకున్

    రిప్లయితొలగించండి
  2. కంసారైననుకాంతకోర్కెగనితాకన్లేదెనాకంబునే
    పుంసాకారుడుపార్వతీపతితాభూతిన్వడిన్బొందెమీ
    మాంసంబేలనుమిత్రమాగనుమునీమాటల్యదార్థంబులే
    సంసారమ్ముహితమ్ముగూర్చునుగదాసన్యాసులౌవారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కంసారి + ఐనను' అన్నపుడు సంధి లేదు. రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  3. సంసారులకెల్లనుగన
    *“సంసారము హితకరమ్ము సన్యాసులకున్”*
    కంసారి ధ్యానమే ము
    ఖ్యాంశముగాతోచుచుండుకడవరకుభువిన్

    రిప్లయితొలగించండి
  4. సంసారంబిల మానవాళికి
    సంసారంబె చేయందగున్
    హంసారూఢుడు చేసె సృష్టి నరు
    నయ్యా! యందుకే నయ్యదే
    సంసారంబు హితమ్ము గూర్చును
    గదా, సన్యాసులౌ వారికిన్
    సంనారంబునువీడి యా ధరమ
    మున్ సాగించుటే యుక్తమౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  5. కందం
    కంసారి తపమునన్ స
    ర్వం సాఫల్యమొనరంగ భక్షణమొసగన్
    సంసారి భిక్ష, యన్యుల
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్

    శార్దూలవిక్రీడితము
    కంసారిన్ మదిఁ దల్చి యోగమున సంస్కారమ్ము లాభించి స
    ర్వం సాఫల్యము సెందనెంచు తపసుల్ భక్షింపఁ బొర్గూరినిన్
    సంసారిన్ దగు భిక్షఁ గోరుటలవశ్యంబౌచు నన్యుండిదౌ
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్

    రిప్లయితొలగించండి

  6. మాంసాహారము మానుచు
    సంసారసుఖమ్ము లేని సన్యానియె తా
    హింసగ దలచుచు పలికెను
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్.


    హంసల్ గారు పడంతులంచు తను సన్యాసమ్ము నే పొందినన్
    మాంసాహారము స్త్రీ సుఖమ్ములను తామానంగ లేనంచు వి
    ధ్వంసమ్మయ్యెను జీవితమ్మనుచు నంతస్తాప మందిట్లనెన్
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్.

    రిప్లయితొలగించండి
  7. సంసారముపై నెంతయు
    శంసను చూపించక నలసత్వము దాల్చన్
    పుంసత్వము లేకుండిన
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్

    సంసారము = పుట్టుక

    రిప్లయితొలగించండి
  8. హంసను చేరుట కొరకై
    కంసారి వచించు గీత కర్తవ్యమునన్
    హింసను వీడి త్యజించినఁ
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్

    కంసారాతి వచించు గీత తమదౌ కర్తవ్యమున్ తెల్పగా
    హింసామార్గము రోసి కూడదని సాహిత్యమ్ము సాంగత్యమున్
    సంసారమ్ము పయిన్ విరక్తి గొని యాసాంతంబు వర్జించినన్
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్

    రిప్లయితొలగించండి
  9. హింసా కృత్యము మానియు
    సంసారు ల బిక్ష గొనుచు సర్వే శ్వ రు ని
    త్యం సం శో ధ న భక్తి ర
    సం సారము. హిత కర మ్ము సన్యా సుల కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిత్యం' అనడం వ్యావహారికం కదా?

      తొలగించండి
    2. సర్వేశ్వరు స త్యం సంశో ధన భక్తి ర సం అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  10. హింసను విడనాడి పరమ
    హంసలుగా నుద్యమించి యాశల గెలువన్
    ధ్వంసమొనర్చగ మాయా
    సంసారము, హితకరమ్ము సన్యాసులకున్

    రిప్లయితొలగించండి
  11. హింసాపూరితమైన కర్మచయమున్ హీనంబుగానెంచి యా
    శంసాదూరులుగా విరాగులుగ సత్సాంగత్యమున్ గూడి వి
    ధ్వంసంబొందగజేసి యైహికములన్, త్యాజ్యమ్ముగా నెంచనీ
    సంసారమ్ము, హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్

    రిప్లయితొలగించండి
  12. కాసారమ్ము కుటుంబమైననది స్వర్గంబైన నెల్లారికిన్
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చునుగదా, సన్యాసులౌ వారికిన్
    సంసారమ్మది కూపమౌను పెనుజంజాటమ్ముగా దల్చరే
    యే సారమ్ములు లేని జీవనము పేరిక్కట్ల నిస్సారమౌ

    రిప్లయితొలగించండి
  13. కం:సంసారము విడచియు, మధు
    మాంసాదుల గ్రోలు నరుల, మహిళల తోడన్
    సంసర్గము కంటె, మనువు,
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్”

    రిప్లయితొలగించండి
  14. శా:ధ్వంసమ్మయ్యె కుటుంబ జీవనము చే ధ్యాన మ్మటంచున్ సదా
    సంసారమ్మును దూర, కీ జగతి లో స్వార్థమ్ము దగ్గించుకన్
    హంసన్ బోలె చరించి దాన మిడ సన్యాసుల్ నినున్ మెచ్చరే
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్”
    (తాను సన్యాసి కాకున్నా సన్యాసులని ఆదుకుంటే చాలు.సన్యాసుల హితమును చూసుకునేది కూడా సంసారులే.)

    రిప్లయితొలగించండి
  15. శా.

    ధ్వంసంకుండని నిందజేయగ జరత్కారుండు నొప్పారగన్
    హంసారూఢ సమాన పాణిముఖులే హార్దమ్ముతో నంపగా
    శంసించంగ వివాహితుండగుచు వాసాగారమున్ సాగెనే
    *సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్.*

    రిప్లయితొలగించండి
  16. ధ్వంసిత నిజాంతరంగ సు
    సంసక్త సుఘోర వైరిచయ పరమ మహా
    హంసలకుఁ జరింప విగత
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్


    కంసారిన్ సతతమ్ము నిల్పి మదులం గాషాయ వస్త్రమ్ములన్
    మాంసాహారము మాని మోక్షమును సంపాదింప నుత్సాహులై
    హింసా ద్వేష విహీన మానసులునై యింపార నిద్ధాత్రి నా
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్
    [సంసారము = పుట్టుక]

    రిప్లయితొలగించండి
  17. కం॥ సంసారము తొలి మెట్టను
    సంసారమన వెగటుఁ గని సఖ్యత కరవై
    సంసారి యతియగు కతన
    సంసారము హితకరమ్ము సన్యాసులకున్

    శా॥ సంసారమ్మున హెచ్చు బాధలఁ గనన్ సర్వేశ్వరుండైననున్
    సంసారమ్మును వీడ నెంచును గదా సాధ్యంబుఁ గాలేదనిన్
    ధ్వంసంమ్మొందఁగఁ గోర్కె లన్నియు నటుల్ వైరాగ్యమే మోదమౌ
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యసులౌ వారికిన్

    సన్యసులౌ వారికి అంటే సన్యాసులయ్యే వారికి అనే భావన తీసుకున్నానండి. సంసార భారంతో విరక్తి చెందిన వారే సన్యాసులుగా సర్దుకోగలరని అండి

    రిప్లయితొలగించండి
  18. ధ్వంసంబైచన విఘ్నసంచయము వేదండాస్యుడున్ బ్రోచు, దం
    డాంసుల్ పొందెద రన్నభిక్షఁ దగ శ్రీయార్యాంబ కారుణ్యమున్
    శంసాభగ్నముఁగోరి కొల్తురు శివున్ సత్యంబు! కైలాసరాట్
    సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్

    రిప్లయితొలగించండి