23, ఏప్రిల్ 2024, మంగళవారం

సమస్య - 4744

24-4-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె”
(లేదా...)
“రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే”

16 కామెంట్‌లు:

  1. భీష్ముడంతటతాతగపెంచెవారి
    కౌరవులుగనపాండవుగలసియుంట
    మెండుప్రేమనుసమమెంచిమెచ్చెవారి
    రెండుదంతముల్గలిగికరేణువొప్పె

    రిప్లయితొలగించండి
  2. అండగానటనుండెభీష్ముడునాశనొందుచుతాతగా
    పండెమేథనువృద్ధుడాతఁడుపంచెప్రేమనుతండ్రియై
    తొండెమాడగకౌరవాదులుదోషమెంచడువారినిన్
    రెండుదంతములుండియొక్కకరేణువొప్పెనుకంటిరే

    రిప్లయితొలగించండి
  3. విశ్వామిత్ర మునీంద్రులు రామలక్ష్మణులతో...

    తేటగీతి
    ఏనుగంతటి రూపాన నిడుములొనర
    యజ్ఞవేదికి తాటక హానిసలుపు
    రామలక్ష్మణులార! యా రక్కసికిని
    రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె

    మత్తకోకిల
    రండు! రండయ! రామలక్ష్మణులార! యజ్ఞపువేదికిన్
    గండు దేహము రోమభీకర కాలవర్ణములేహ్యమై
    గండముల్ సలుపంగ తాటక క్రాలుచున్నది పోల్చగన్
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను! కంటిరే!

    రిప్లయితొలగించండి
  4. భరత దేశమునన్మగ వారణ ముల
    కుండు నొప్పుగ దంతముల్ రెండునిజము
    బాలలచలనచిత్రాన వాసిగాను
    *"రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె

    రిప్లయితొలగించండి
  5. తే॥ కాలమహిమను వింతలు కలిగి మెరిసె
    తరుణలఁ గనఁగ మీసము విరియు చుండె
    పురుషులకు వక్షము లిపుడు పొరలు చుండె
    రెండు దంతముల్ గల్గికరేణువొప్పె

    మత్త॥ ఎండ వేళను కుంజరమ్ములు నేఁగు దెంచఁగ దాహమై
    మెండు నీటను నీడఁ గాంచఁగ మీదు మిక్కిలి నెమ్మితో
    దొండ మాడఁగ నీరు నాడఁగ దూసి నీడలు నేకమై
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే

    రిప్లయితొలగించండి
  6. సృష్టికర్త కప్పుడపుడు జిత్రమైన
    యోచన కలుగ జెన్నుకు యుగళి రీతి
    శౌర్యమును కూడ చూపుట సాగు చుండ
    రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె

    రిప్లయితొలగించండి
  7. ఆఫ్రికాయను ఖండమే యబ్బురమ్ము
    చిక్కనైనట్టియడవుల మిక్కుటముగ
    కానవచ్చెను మెండుగా గర్జరములు
    రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె

    దండిగాగన జంతు జాలము దక్షిణంబున నాఫ్రికా
    మెండు గాగన వచ్చు నేన్గులు మేరు పర్వత తుల్యమై
    పండు వెన్నెల రాత్రు లందున వచ్చి చేసిన యాత్రలో
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే

    [ఆఫ్రికాలో ఆడ యేనుగులకు దంతములుండును]

    రిప్లయితొలగించండి

  8. స్తన్యమిచ్చుచు బాలకున్ జంపవచ్చి
    దనుజ కాంతయె చావగా కనుచు జనులు
    భయము తోడను వణుకుచు పలికిరిట్లు
    రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె.


    దండి ప్రేమ నటించి కాంతయె స్తన్యమిచ్చుచు బాలునిన్
    చెండనెంచుచు జేరి కృష్ణుని చేతిలో నది చావగన్
    కొండవంటి శవమ్ముగాంచుచు కొంటెవాడొక డిట్లనెన్
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే.

    రిప్లయితొలగించండి
  9. జంతువుల ప్రదర్శనగల శాల యందు
    గాంచి రొక చోట వింతగా కౌతు కమున
    రెండు దంత ముల్ గల్గి కరే ణు వొ ప్పె
    ననుచు జను లెల్ల పల్క రే యబ్బు రముగ

    రిప్లయితొలగించండి
  10. చికిలి చూపుల చిన్నది చేట చెవులు
    వధువు నడచిన వసుమతి వణకిపోవు
    నెత్తు పలువరుసను గన నిట్లు దోచె
    రెండు దంతముల్ గల్గి కరేణువొప్పె

    రిప్లయితొలగించండి
  11. దండిగా భుజియించు, నెన్నడుఁ దాను నిద్దుర బోవుచున్
    మెండుగా తన మేను బెంచెను మించి ప్రాయము శ్రద్ధగా
    కొండవంటి శరీరమందున కోర దంతములన్ గనన్
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:మదగజేంద్రుడు కరిణుల ముదము నందె
    దేహ దార్ఢ్యమ్ము,రసికత,దృఢము లైన
    రెండు దంతముల్ గల్గి, కరేణువొప్పె
    నచట నొక్కటి చిన్న భార్యా?యనంగ
    (గజేంద్రమోక్షణం లో గజేంద్రుడు ఆడ ఏనుగులతో సరసా లాడటం వర్ణించ బడింది. అతని ప్రక్కన అనేక ఏనుగు లున్నా ఒక కరిణి మరింత ఆకర్షిస్తూ అతని చిన్న భార్యా?అన్నట్టు ఉంది.క్రొత్త భార్య పట్ల మోజు కాస్త ఎక్కువ ఉంటుంది కదా!)

    రిప్లయితొలగించండి
  13. మ.కో:రండు నా దెస వింత జూపెద రామలక్షణు లార!మీ
    దండనా ప్రతిభన్ వెలార్చుడు,దండి యౌ భుజశక్తి తో
    రెండు దంతములుండి యొక్క కరేణువొప్పెను కంటిరే”
    కొండ దాని శరీర మయ్యది క్రుద్ధ తాటకి చూడుడీ!
    (ఆడ ఏనుగు కి దంతా లుండవు. ఐతే రెండు బలమైన దంతాలు, లేక కోరలు కలిగిన ఆడ ఏనుగు లాగా ఆ తాటక ఉన్నది ,కొండ లాగా ఉన్నది అని విశ్వామిత్రుడు చూపించినట్టు.)

    రిప్లయితొలగించండి
  14. సృష్టి వైచిత్ర్య మేమని చెప్ప వచ్చు
    నరు దయిన భారతమ్మున నడవు లందు
    వింత దేశాంతరమ్మున ద్విప మొకండు
    రెండు దంతముల్ గల్గి కరేణు వొప్పె


    దండఁ జాగుచు నూఱడించుచుఁ దద్ద సంతత మింపుగా
    నండ నీయఁగఁ గోరుచుండి నిజాత్మఁ బేర్మినిఁ జక్కఁగాఁ
    దొండముం దగఁ జాచి కైకొని దొడ్డ కుంజర నాథు నా
    రెండు దంతము లుండి యొక్క కరేణు వొప్పెను గంటిరే

    రిప్లయితొలగించండి