13, ఏప్రిల్ 2024, శనివారం

సమస్య - 4735

14-4-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంటకములు సజ్జనులు లోకమ్మునందు”
(లేదా...)
“సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

 1. తే.గీ:
  ధూర్తులకును, సుజనులను దూరు చుండు
  పొగరు బోతులకును, మోసపు పనులందు
  నారి తేరిన వారికి, నధములకును
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు

  రిప్లయితొలగించండి
 2. నీతి నియమముతోడను నిక్కముగను
  నడచుకొనువారి నెల్లప్పు డడచుచుంద్రు
  స్వార్థ పరులకు ఖలులకు వాస్తవముగ
  కంటకములు సజ్జనుల లోకమ్మునందు.

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  పుండరీకుడు వేమన్న పుడమి పైన
  వారకాంతలలోగిళ్ల దూరికాదె
  మునిగ యోగిగ మారుటఁగన, గతమున
  కంటకములు, సజ్జనులు లోకమ్మునందు

  మత్తేభవిక్రీడితము
  సకలానందము వారకాంతలిడెడున్ సంఘాన వారందియున్
  నికరంబైనది పుండరీకుడెరిగెన్ నిర్జించిమోహమ్ములన్
  వికసిల్లెన్ గద నీతి పద్య సుధలన్ వేమన్న, పూర్వమ్మునన్
  సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్

  రిప్లయితొలగించండి

 4. పరుల హింసించి భాగ్యమున్ బడయ నెంచె
  డక్రమార్జన పరులైన హరితుల నిల
  ప్రతిఘటించెడి వారలే పాపులకట
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు.


  సకలార్థమ్ములనిచ్చు వృక్షములనే స్వార్థమ్ముతో ద్రుంచుచున్
  సకులన్ నమ్మిన వారి సంపదల నాసాంతమ్ము చూఱాడుచున్
  వికటమ్మైన పథమ్ములో చెలగు పాపిష్ఠుండ్ర భావమ్ములో
  సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 5. దుష్టు లగుచును హింసించు ధూ ర్తు లిలకు
  కంట కములు :: సజ్జనులు లోకమ్ము నందు
  సకల జనుల సేమ మరసి సమత బెంచ
  కృషి యొ నర్తు రు సతతమ్ము కీలక ముగ

  రిప్లయితొలగించండి
 6. తే॥ సావధానులై సతతము జనుల హితముఁ
  గనఁగఁ బరితపించు కతన మనకఁ జేసి
  దుష్ట కృత్యములఁ జనఁగ ధూర్త జనుల
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు

  మ॥ అకళంకంబగు పద్ధతిన్ జనుచు కోపావేశ హీనంబునన్
  వికటింపన్ గని దుష్ట కార్యములు సంవేదంబుతో ధాత్రిలోఁ
  బ్రకటంబౌ నిజ సజ్జనాళిని సదా పాపాత్ము లిట్లందురే
  సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 7. ఆలుబిడ్డల క్షేమంబు గాలికొదిలి
  సత్యమున్ వరించెను హరిశ్చంద్రు డకట
  వారి బ్రతుకులు వికలమై బాధ పఱుప
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు

  సకలంబౌ ధనమున్ త్యజించెను హరిశ్చంద్రుండు సన్మార్గియై
  సుకమేదూరము చేసినాడు సతియున్ సూనుండు కష్టాలతో
  వికలంబౌ బ్రతుకున్ భరించు నటులన్ వేనోళ్ళ ఖండింపరే
  సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 8. నేటి కాలమందున నిది నియమమయ్యె,
  కల్ల బొల్లి మాటలతోడ కాలమంత
  జనుల మోసము జేయు దుర్జనుల కెల్ల
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు

  రిప్లయితొలగించండి
 9. అకలంకంబుగ నెల్లవారలకు వారాదర్శమై నిచ్చలున్
  వికచాంభోరుహ నేత్రుఁడౌహరినిసేవింపంగ నాసక్తులై
  సకలం బ్రహ్మమయం బటంచు మదిఁ విశ్వాసించి దౌష్ట్యంబుకున్
  సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 10. కల్లలాడుచుసతతముకానిపనుల
  నాచరించుచుతిరిగెడునధములనిల
  బాగుపరచగ నెంచెడి బంధుజనులె
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు

  రిప్లయితొలగించండి
 11. తే.గీ:ధర్మ మార్గమ్ము గోరు సాధకుల కెల్ల
  కటకములన సజ్జనులు లోకమ్ము నందు
  ధర్మదూరులౌ దుష్టు లందరకు గొప్ప
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు”
  (మంచి వారికి కటకములు అనగా ఆదర్శప్రాయులు.దుష్టులకి కంటకములు . )

  రిప్లయితొలగించండి
 12. మ:ఒక వారమ్ముగ నాశ్రమమ్ముననె నే నుండంగ నర్థాంగి కో
  రికపై, నచ్చట మద్య ముండ,దట వర్జింపంగ ధూమమ్ము,త
  ప్పక యోగమ్ములు బాధ యయ్యె నెదిరింపన్ జాల నా యోగులన్
  సుకుమారమ్మగు కంటకమ్ములు కదా సుశ్లోకు లౌ సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 13. దుష్ట జనములు పరికింప దుహితులకును
  గంటకములు ,సజ్జనులు లోకమ్మునందు
  కొద్ది మందిగ మాత్రమే కూడి యుండి
  తమకు తాముగా సేవలఁ దరియు చుండ్రు

  రిప్లయితొలగించండి
 14. కష్టములను మాన ప్రాణ నష్టములను
  లెక్క సేయరు సుంతయు నక్కజముగ
  దుష్ట జనుల కెల్లరకు విశిష్టము లగు
  కంటకములు సజ్జనులు లోకమ్ము నందు


  ఇఁక సందేహము నంద డెందముల మీ కెట్లొప్పుఁ గౌంతేయుఁ డై
  హిక కార్యమ్ముల మెత్త నైన పులియే యీ ధర్మ రాజెన్నఁగన్
  సకలార్యుల్ వచియింప నివ్విధముగా సత్యంబు లీ వాక్యముల్
  సుకుమారం బగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్

  రిప్లయితొలగించండి

 15. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  అన్యులను మోసగించెడు నక్రమార్జ
  నపరులకు, ధర్మదూరులై నడచు దుష్టు
  లకును, మాట తప్పెడు వారలకును సతము
  కంటకములు సజ్జనులు లోకమ్మునందు.

  రిప్లయితొలగించండి
 16. మ.

  నికరమ్మే పరివర్జనమ్మని సతిన్ నిందించె నాయత్తమున్
  *సుకుమారంబగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్*
  పికమై కూసెను రోషమున్ రజకుడే బింకంబు సీతాపతిన్
  వికటంబౌ పని జేసె, దెచ్చె గృహిణిన్ వీరాధివీరుండిలన్.

  రిప్లయితొలగించండి