14, ఏప్రిల్ 2024, ఆదివారం

సమస్య - 4736

15-4-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్”
(లేదా...)
“కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

20 కామెంట్‌లు:

 1. మేలములాడుచుమన్మథు
  డాలముసేయకచలిమలకల్లునిపైనన్
  చాలగబాణమువిడువగ
  కాలముచెల్లివడలెనటకామునిశరముల్

  రిప్లయితొలగించండి
 2. కం:
  వేలము సరుకైనట్లుగ
  స్త్రీల గణించుటను జబ్బు తీవ్రమ్మయ్యెన్
  లాలిత్యమె మరచిరి ప్రజ
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్”

  రిప్లయితొలగించండి
 3. కందం
  శైలవిహారివి ప్రవరా!
  లాలింప వరూధినిఁ గన రంజిలలేవా!
  తాళక నేనుండఁ దమకుఁ
  గాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్!

  ఉత్పలమాల
  ఆ మరు వింటి తూపులవి యల్లరిఁ జేయగ తాకినంతటన్
  భామినిగన్ వరూధినిట వన్నెలఁ జిందఁగ నీదుపొందుకై
  యేమనుకొందు నే ప్రవర! యింతిని గాంచని నీదు పాలిటన్
  గాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే!

  రిప్లయితొలగించండి

 4. ఆ లలన వరూధిని విరి
  పీలువులన్ విసురనేమి విప్రుని మనసా
  స్ఫాలించదయ్యెకదరా
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్.


  ఆ ముఖ సంభవుండు ప్రవరాఖ్యుడు స్వస్థల మార్గ గామియై
  భామవరూధినిన్ గనిన పాళము నందున మోహ
  మందు నా
  కామిని చూపుతోడ విరికాండము లెన్నియొ రువ్వ నేమి యా
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే.

  రిప్లయితొలగించండి
 5. ఆలియొకచోటున సమా
  ప్తాలుడు మరియొక్క చోటు తమకొల్వులలో
  వీలే కుదరని సమయము
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్

  గోమున జంట్లకెల్ల తమ కోరిక తీరుట సాధ్యమెట్లగున్
  భామినులొక్కచోట మరి భర్తలు వేరొక చోట కొల్వులో
  నేమని చెప్పమందురిక నేపునఁ డెందము సమ్మతింపగా
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే

  రిప్లయితొలగించండి

 6. పోలవరపు నాటకమున
  చాలా యెక్కువగ యెండ సందుకొనంగన్
  తాళుకొనలేఠ వేగమె
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్

  రిప్లయితొలగించండి
 7. మేలము లాడుచు నిట్లనె
  కాలము చెల్లి వడలె నట కాముని శరముల్
  మేలుగ పని చేయక నా
  పాలిట వృథ య య్యె ను గ ద వాంఛ మిగిల్చె న్

  రిప్లయితొలగించండి
 8. ఆలములో వీరునిగ ని
  మీలన మొందగ తనపతి మించిన వెతతో
  నాలికి మఱుకువ పెనఁగొన
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్

  రిప్లయితొలగించండి
 9. ప్రేముడినొక్కటైరి చిగురించఁగ నాశలు ప్రాయమందునన్
  కాముడు బూని వారలను గల్పెను పెండిలి మంటపమ్మునన్
  పామయి కాటువేసితన భర్తను కోవిడు మ్రింగెనక్కటా
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే

  రిప్లయితొలగించండి
 10. కం॥ ఏలనొ సుకుమారంబగు
  హేలఁ గనకఁ గామమిటుల హేయము కాఁగన్
  గలతఁ బడి తొలుగ మారుఁడు
  కాలము చెల్లి వడెలెనఁట కాముని శరముల్

  ఉ॥ ఏమనిఁ దెల్పఁగా వలయు నిప్పుడు కామము వెర్రి రీతులన్
  నేమము కట్టుబాటు విడి నీచము హేయము నై పెనంగఁగన్
  గాముడె బాధనొంది కలి కాలపు క్రూరతఁ గాంచి చెంగఁగన్
  గాముని పూల బాణములు కాలము చెల్లఁగ వాడిపోయెనే!

  రోజూ మనము చూస్తున్న విషయమండి

  రిప్లయితొలగించండి
 11. కం:శీలరహితనీచుడు నీ
  పాలన్ కీచకుని వోలె బాధించెను గా!
  జైలున వేసె నతని దు
  ష్కాలము చెల్లి ! వడలెనఁట కాముని శరముల్”

  రిప్లయితొలగించండి
 12. ఉ:ఏమిది?నాదు కోరికల నెప్పుడు దీర్చెడు భర్త సంతత
  మ్మేమియొ చింత జేయు?నత డిప్పుడు సొమ్మునె కోరు చుండెనే?
  యేమి సమస్యవచ్చినదొ? యింతనె యౌవన మింకి పోగ నా
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే”
  (భర్త శృంగారం పట్ల అనాసక్తి గా ఉంటే భార్యకు వచ్చిన ఆలోచనలు. )

  రిప్లయితొలగించండి
 13. ఉ:ఏమి వసంత మియ్యది?కవీంద్రుల పద్యము లందె యుండె, గా
  నామృత మీదు కోకిల, మహాతప మిట్టుల రెచ్చె గా!మదిన్
  గామము గూడ జచ్చె వడ గాడ్పుల,నేమి విచిత్రకాలమో!
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే!

  రిప్లయితొలగించండి
 14. విశ్వామిత్రుడు:
  నేమముతో మహాతపము నేఁగొన బ్రహ్మదయార్థినై వెసన్
  క్షేమము దప్పునేలకొ శచీపతి కిట్టులఁ బంపుమిమ్ములన్
  నామది మేనకాఖ్య మును నైపుణిఁ దోచెను గాని, రంభరో!
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే.

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. బేల యయి వామలోచన
   తాళఁగ లేనట్టి పగిది తన తను వందున్
   వ్రాలఁగ, రాఁ బతి యేఁగెడు
   కాలము చెల్లి వడలె నఁట, కాముని శరముల్


   ఆ మరు దుత్కరమ్ములకు నాశ లడంగ మహేంద్రు తోడుతన్
   భామకు నద్రి నందనకు వాడ భృశమ్ము మనస్సరోజమే
   భీముని నేత్ర వహ్ని మరు విగ్రహ మింక విచిత్ర రీతినిం
   గాముని పూల బాణములు కాలము చెల్లఁగ వాడిపోయెనే

   తొలగించండి
 16. కాలపు మహిమను దెలుపుచు
  గాలముదావేసెనపుడు కాముని దరికిన్
  గాలము వ్యతిరేకించగ
  కాలము చెల్లి వడలెనఁట కాముని శరముల్

  రిప్లయితొలగించండి
 17. ప్రేమగ వేయగా నపుడు భీముని పైనను వాడి బాణముల్
  కాముని పూల బాణములు కాలము చెల్లగ వాడిపోయెనే
  గామము నేజయించగల కాలుని ముందర కుప్పిగంతులన్
  గోముగ వేయగాఁదగదు కుయ్యన చేటును వచ్చు నమ్ముడీ

  రిప్లయితొలగించండి
 18. బల్లూరి ఉమాదేవి

  ఆలిగ గొనమని వేడిన
  యాలలనామణిపలుకుల నాలించకనే
  కాలము గడిపెడు ద్విజుపై
  కాలము చెల్లి వడలెనట కాముని శరముల్

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  ఆ లలనల తల పూవులు
  కాలము చెల్లి వడలెనట;కాముని శరముల్
  లీలగ దంపతుల తనువు
  నేలగ విరహాగ్ని పుట్టె నిరువురి యందున్.

  రిప్లయితొలగించండి