25, ఏప్రిల్ 2024, గురువారం

సమస్య - 4746

26-4-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్”
(లేదా...)
“శునకమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్”

15 కామెంట్‌లు:

  1. కనగాసభలోద్రౌపది
    మానముకౌరవుడవమతిమంటన్గలుపన్
    ఆనకనవ్విరితులువలు
    శునకమ్ములుపువ్వులాయెసోద్యముగగనన్

    రిప్లయితొలగించండి
  2. కనగామాయలనింద్రజాలికుడుతోకన్బట్టియాడించుచున్
    పనఁటిన్ద్రోసెనుకుక్కనొక్కటినినాభాసంబుజూపన్బలే
    తనువున్మారెనుజంతువెక్కడిదిచిత్రంబయ్యెచూడంగనా
    శునకమ్మలుపలుపువ్వులయ్యెనుగదాచోద్యమ్ముగాజూడగన్

    రిప్లయితొలగించండి
  3. వనమున కుక్కలు జేరగ
    తనరుట జూడగ జుగుప్స తనుకుచు నుండన్
    యనువుగ మాంత్రికుని బిలువ
    శునకమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్

    రిప్లయితొలగించండి

  4. కందం
    మును క్రీడిఁ బరీక్షింపన్
    గనుమల లో గిరిజఁ గూడి కయ్యమునఁ గిరా
    తునిగన్, నరుఁడేయఁగ నీ
    శునకమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్!

    మత్తేభవిక్రీడితము
    మును కాంతారమునన్ గిరాతునిగ నాముక్కంటి కయ్యాన న
    ర్జున శౌర్యంపు పరీక్షకై గిరిజతోఁజూపించ నైపుణ్యమున్
    వెనువెంటన్ బ్రతి చర్యగన్ నరుఁడు సంధింపంగవిల్లెత్తి యీ
    శునకమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్!

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కం॥ వినిన కడు హాస్యము విరిసి
      మనము మురియు కల్లలెంచి మాటాడు స్పర్ధన్
      వినగ జనులు పలికె నొకఁడు
      శునకమ్ములు పూవులాయె చోద్యముగాఁ జూడఁగన్

      మ॥ కనఁగన్ సర్వులు నింద్ర జాల మచటన్ గర్రల్ భుజంగమ్ములై
      మనుజుల్ శిల్పములై సుమంబులటులన్ మంత్రించఁగా మాయమై
      శునకమ్ముల్ గను మారి కాంచఁగను సంశోభిల్లెడిన్ రీతి నా
      శునకమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్

      అలాగే కర్రలు మనుజులుతమ రూపు పొందుతారనుట అంతర్లీనమండి

      తొలగించండి

  6. ధనుజారి పుత్రుడాతడు
    వనజభవుని సోదరుండు భావభవుండా
    మనసశయుండైన రతీ
    శున కమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్.


    ఘనుడా క్రీడి బరీక్ష సేయు నెపమున్ గంగాధరుం డంత తా
    వనమున్ జేరి కిరాతవేషమున నా పార్థుండ గవ్వింప క్రో
    ధనమున్ బూని కిరీటి, కృష్ణసఖుడుత్థానమ్ము జేయన్ మహే
    శున కమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  7. అనిరుద్ధుడు లుబ్దకుడై
    ధనుంజయునితోడ పోరెఁ దర్పముతో న
    ర్జునుడు విడువంగ నా యీ
    శున కమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్

    మును వివ్వచ్చుడు పొందగోరెనుకదా ముక్కంటి యస్త్రంబునే
    పెనుయుద్దంబనఁ మాయ లుబ్దకునితో బీభత్సుడే పోరగా
    ననిదంపూర్వమనంగ నర్జునుడు తా నమ్ముల్ ప్రయోగింప నీ
    శున కమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  8. మునుకొని గారడి విద్యను
    జనులకు జూ పింప దలచి చతురత మీరన్
    కనికట్టు జేయ గానే
    శున కమ్ములు పూవు లాయె చోద్య ము గ గనన్

    రిప్లయితొలగించండి
  9. మనమందున్ సతి నవ్వుమోము మెదలన్ మారుండు ప్రాణేశుపై
    తన పూబాణములైదు చేతఁగొని సంధానించి కేరించుచున్
    తనువున్ సొక్కఁగ జేయబూనుకొనునంతన్ మానినీ జీవితే
    శునకమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. కం:కనగా కవితలు ముళ్లై
    విను వారికి దోచ, నేదొ వివరించి యవే
    ఘనము లనన్ కువిమర్శక
    శునకమ్ములు పూవు లాయె చోద్యముగ గనన్.
    (ఆ కవితలు ముళ్లే కానీ కువిమర్శక శునకాలు వాటిని మెచ్చే సరికి అవ్వి పువ్వు లై పోయాయి. )

    రిప్లయితొలగించండి
  11. మ:ఘనుడౌ విప్లవకారుడై సతతమున్ గాండ్రించు నా గాయకున్
    జనవిధ్వంసకు డంచు బల్కి యతనిన్ జపించ గా జూచియున్
    చనిపోవంగనె యాత్మశాంతి యన నీ స్వార్థప్రపూర్ణాత్ములౌ
    శునకమ్ముల్ , పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్
    (విప్లవకారుడంటూ సంఘవిద్రోహశక్తి అంటూ పేరు పెట్టటం, చనిపోగానే అతని పై పూలు చల్లటం ఒక విచిత్రం.)

    రిప్లయితొలగించండి
  12. వనమున తపమును సలుపుచు
    మనమునఁ నీశ్వరుని ధ్యాస మాత నిలుపఁదా
    ననవిలుతుఁడు వేయఁగ నీ
    శున కమ్ములు పూవులాయెఁ జోద్యముగఁ గనన్

    రిప్లయితొలగించండి
  13. కని యా విగత జనమ్మును
    జని చోరుల పగిది నంతఁ జయ్యన సదన
    మ్మునఁ గల పళ్లెముఁ దన్నఁగ
    శునకమ్ములు పూవు లాయెఁ జోద్యముగఁ గనన్


    అనఁగాఁ గొందఱు ద్వేష మానసులు దుష్టాత్ముల్ సహింపంగ నే
    రని వారెల్లరు శాప మీయఁగను సంత్రాసమ్ము వాటిల్లఁగా
    వినుఁడీ వృక్షము లెల్లఁ బూయ వని నిర్భీతిన్ సుఘోరమ్ముగా
    శునకమ్ముల్ పలు పువ్వు లయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  14. మ.

    ధనువున్ బట్టిన మన్మథుండు శివునిన్ దట్టించి ముంచెత్తెడిన్
    గొనగన్ ముచ్చట బంచబాణములతో గొట్టంగ విప్పారి, *యీ*
    *శునకమ్ముల్ పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్*
    తనువే మూడవ కంటి మంటను బడెన్ దగ్ధమ్ము ప్రద్యుమ్నుడౌ.

    రిప్లయితొలగించండి