22-4-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”(లేదా...)“అంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో”
బిల్హణుండునుగురువునైపిలువబడగయామినీపూర్ణతిలకంబుహద్దునుండెశిష్యురాలికివినిపించెచిత్రకవితపూర్ణచంద్రుసౌందర్యమున్పొగడెగ్రుడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంధానంబునతండ్రియాజ్ఞగొనిసంభావసచ్ఛాత్రియైఅంధండైననుగౌరవించెనతనిన్యామంబువిద్యార్హతన్విందున్జేసెనుబిల్హణుండునచటన్పేర్కొంచుపూర్ణేందునిన్అంధుండాకసమందుశోభిలెడుపూర్ణేణాంకువర్ణంచెబో
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
తేటగీతిమత్తుగొల్పెడు సైగల మదిరఁగొనుచునాట్యశాలకు రమ్మను నటనకయ్యెమత్స్య రాజు మోహాంధుండు, మాలిని ముఖపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి!శార్దూలవిక్రీడితముఅందంబొల్కెడు జాణగన్ మదిర మోయంగన్ మహారాణికిన్ముందున్ నిల్వఁగ మాలినీ లలనయే మున్ముందుకేతెంచుచున్బొందున్గోరుచుఁ జేరి సింహబలుడున్, మోమందునన్ గాంచి మోహాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సహదేవుడు గారు, పూరణలు అద్భుతంగా వున్నవి.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
🙏కవివరులు శ్రీ ప్రసాద్ గారికి, గురుదేవులకు ధన్యవాదములు🙏
తే.గీ:వెన్నెల యననెట్లుండునొ వినదలిచెనుపుట్టు గ్రుడ్డి పాపము, కవి పుంగ వుండుపాడె పున్నమి సొబగుల పాటను, వినిపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.
చంద్రు సొబగులు దెలియగా చతురు డైన కవిని గోరగా వర్ణించె కమ్ర ముగను పూర్ణ చంద్రుని సౌందర్యమున్ : పొగడె గ్రుడ్డి కవి వత o శుని ప్రజ్ఞ ను ఘనము గాను
అంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్స్పందించున్ హృదయాంతరాళము సతంబా భావనల్ ప్రోదిగాఁనందంబౌ పదగుంఫనమ్ములు యెడందన్ రూపు దిద్దంగనాయంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'గుంఫనమ్ములు + ఎడంద' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
ధన్యవాదములు గురువుగారూ 🙏 సవరిస్తాను.
అంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్స్పందించున్ హృదయాంతరాళము సతంబాభావనల్ ప్రోదిగాఁనందంబౌ పదగుంఫనమ్ములను డెందంబందు నూహించి యాయంధుండాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
పుట్టు గ్రుడ్డిగ పుడమిన పుట్టి , యతడుచెలిమరి కనులు గాంచెడు చెన్నులన్ని తెలుసుకొనుచు నానందించు తెలివికలుగబూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పుడమిని' అనండి.
🙏
కాంచ లేకున్న నేమిరా కథలనెన్నొశ్రద్ధతో నాల కించిన బుద్ధిజీవి వీడు భావతరంగాలు పెల్లుబుకగపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.పొందున్ గోరుచు నింతిచెంతజని యా మూర్ఖుండు శంపాణి నీసౌందర్యమ్మది రంభకేది? కుచముల్ క్ష్మాభృత్తులే కాంచగామందారమ్ములు బూసె చెక్కిలిని భామా నీదు మోమంచు కామాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
గ్రుడ్డి వాడయినను పుట్టు గ్రుడ్డి కాదుపండు వెన్నెల నెఱుగును మెండుగానుచిత్తమందు స్థిరముగ నిక్షిప్తమైనపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డివిందుల్జేసెడి నీదు చక్కదనమే విశ్వప్సు కౌ సాటి నీసౌందర్యానికి ముగ్దుడన్ తొలుత నీ సంకోచమున్ ద్రుంచి నీపొందున్గోరెడు నావ్యథన్ రయమునన్ పోకార్చుమా యంచు కామాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
ధన్యవాదాలు గురూజీ 🙏
-పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డికాలు లేని వాడు నడచె కష్టపడకకరము లసలు లేని మనిషి గాంచె శక్తిఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. (మూకం కరోతి వాచాలం!)
ఒంటిగానున్న జవ్వని కంటఁబడఁగకామమాతని కన్నులఁ గప్పివైచెవ్యర్థమౌ మాటలాడుచు వగలు జూపిపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
తే.గీ:క్రొత్త రచయిత యొక్కడు చెత్త నవలవ్రాయ,పాత్రచిత్రణ బొరపాటు వచ్చె, అంథపాత్రను సృష్టించె,నట్టి కథనపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”
తే॥ తాను జూడక పోయినఁ దలచి తలచిమదిని పూర్ణచంద్రు సొబగు మక్కువ నిడితన కవితలందున లిఖించె తగిన పగదిపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డిశా॥ అంధుడైనను దాను శ్రద్ధఁ గని శాస్త్రాదుల్ పఠించంగనేసంధానించెను జ్ఞాన సంపద లవిశ్రాంతంబునౌ సాముతోసంధానించిన జ్ఞాన సంపదలతో సారించి మోదమ్ముతోనంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైనాంకు వర్ణించెఁ బోపూర్ణ చంద్రుని కాంతుల శోభలు సముద్రము మధ్యనైతే వర్ణనాతీతమండి. సూర్య రస్మితో జరిగే మాయలు కూడ
పగిది (తేగీ 3వ పాదంచివరండి) పొరపాటున పగది అని వ్రాసాను
కనగలిగినట్టిమదియున్నకాంచగలడునంధుడవనిలోనన్నియు నరయకున్నరవియు గాంచనివెల్లయు కవిదెలుపగ*“పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”*
శా:అంథుండౌ ధృతరాష్ట్రు పై కరుణ తో నా వాసుదేవుండు మోహాంధత్వమ్మును విశ్వరూపమున సంహారమ్ము జేయంగ నాకున్ ధన్యత్వము గల్గె నంచు ,వదలన్ గోర్కెల్ రవిన్ మ్రొక్కి యాఅంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో”(శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపగా ధృతరాష్ట్రుడు సూర్యునికి నమస్కరించాడు.చంద్రుని వర్ణించాడు. )
అక్షులకు నున్న యంధత్వ మవని నరయమానసమ్ముల కుండునె మనుజులార! యందముగను వర్ణింప భార్య నిజ పతికిఁబూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి గంధంబింపుగ నద్ది గాత్రమున శంకా హీన చిత్తుండునై గంధేభప్రతిమాన గామి నలినీ కాంతోపయంతృప్రభాబాంధవ్యుండు నిరంతరోగ్ర మదనవ్యాపార వారాశి మగ్నాంధుం డాకస మందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. కనులు లేకున్నను కవుల కావ్యములనువినుచు ప్రకృతి వర్ణనలను వీనులారకనుల గాంచిన యట్టులే కచ్చితముగపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.
బిల్హణుండునుగురువునైపిలువబడగ
రిప్లయితొలగించండియామినీపూర్ణతిలకంబుహద్దునుండె
శిష్యురాలికివినిపించెచిత్రకవిత
పూర్ణచంద్రుసౌందర్యమున్పొగడెగ్రుడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంధానంబునతండ్రియాజ్ఞగొనిసంభావసచ్ఛాత్రియై
రిప్లయితొలగించండిఅంధండైననుగౌరవించెనతనిన్యామంబువిద్యార్హతన్
విందున్జేసెనుబిల్హణుండునచటన్పేర్కొంచుపూర్ణేందునిన్
అంధుండాకసమందుశోభిలెడుపూర్ణేణాంకువర్ణంచెబో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
తేటగీతి
రిప్లయితొలగించండిమత్తుగొల్పెడు సైగల మదిరఁగొనుచు
నాట్యశాలకు రమ్మను నటనకయ్యె
మత్స్య రాజు మోహాంధుండు, మాలిని ముఖ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి!
శార్దూలవిక్రీడితము
అందంబొల్కెడు జాణగన్ మదిర మోయంగన్ మహారాణికిన్
ముందున్ నిల్వఁగ మాలినీ లలనయే మున్ముందుకేతెంచుచున్
బొందున్గోరుచుఁ జేరి సింహబలుడున్, మోమందునన్ గాంచి మో
హాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసహదేవుడు గారు, పూరణలు అద్భుతంగా వున్నవి.
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏కవివరులు శ్రీ ప్రసాద్ గారికి, గురుదేవులకు ధన్యవాదములు🙏
తొలగించండితే.గీ:
రిప్లయితొలగించండివెన్నెల యననెట్లుండునొ వినదలిచెను
పుట్టు గ్రుడ్డి పాపము, కవి పుంగ వుండు
పాడె పున్నమి సొబగుల పాటను, విని
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంద్రు సొబగులు దెలియగా చతురు డైన
రిప్లయితొలగించండికవిని గోరగా వర్ణించె కమ్ర ముగను
పూర్ణ చంద్రుని సౌందర్యమున్ : పొగడె గ్రుడ్డి
కవి వత o శుని ప్రజ్ఞ ను ఘనము గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్
రిప్లయితొలగించండిస్పందించున్ హృదయాంతరాళము సతంబా భావనల్ ప్రోదిగాఁ
నందంబౌ పదగుంఫనమ్ములు యెడందన్ రూపు దిద్దంగనా
యంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'గుంఫనమ్ములు + ఎడంద' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
ధన్యవాదములు గురువుగారూ 🙏 సవరిస్తాను.
తొలగించండిఅంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్
తొలగించండిస్పందించున్ హృదయాంతరాళము సతంబాభావనల్ ప్రోదిగాఁ
నందంబౌ పదగుంఫనమ్ములను డెందంబందు నూహించి యా
యంధుండాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
పుట్టు గ్రుడ్డిగ పుడమిన పుట్టి , యతడు
రిప్లయితొలగించండిచెలిమరి కనులు గాంచెడు చెన్నులన్ని
తెలుసుకొనుచు నానందించు తెలివికలుగ
బూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పుడమిని' అనండి.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండికాంచ లేకున్న నేమిరా కథలనెన్నొ
శ్రద్ధతో నాల కించిన బుద్ధిజీవి
వీడు భావతరంగాలు పెల్లుబుకగ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.
పొందున్ గోరుచు నింతిచెంతజని యా మూర్ఖుండు శంపాణి నీ
సౌందర్యమ్మది రంభకేది? కుచముల్ క్ష్మాభృత్తులే కాంచగా
మందారమ్ములు బూసె చెక్కిలిని భామా నీదు మోమంచు కా
మాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిగ్రుడ్డి వాడయినను పుట్టు గ్రుడ్డి కాదు
రిప్లయితొలగించండిపండు వెన్నెల నెఱుగును మెండుగాను
చిత్తమందు స్థిరముగ నిక్షిప్తమైన
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
విందుల్జేసెడి నీదు చక్కదనమే విశ్వప్సు కౌ సాటి నీ
సౌందర్యానికి ముగ్దుడన్ తొలుత నీ సంకోచమున్ ద్రుంచి నీ
పొందున్గోరెడు నావ్యథన్ రయమునన్ పోకార్చుమా యంచు కా
మాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి-
రిప్లయితొలగించండిపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
కాలు లేని వాడు నడచె కష్టపడక
కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. (మూకం కరోతి వాచాలం!)
తొలగించండిఒంటిగానున్న జవ్వని కంటఁబడఁగ
రిప్లయితొలగించండికామమాతని కన్నులఁ గప్పివైచె
వ్యర్థమౌ మాటలాడుచు వగలు జూపి
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:క్రొత్త రచయిత యొక్కడు చెత్త నవల
రిప్లయితొలగించండివ్రాయ,పాత్రచిత్రణ బొరపాటు వచ్చె,
అంథపాత్రను సృష్టించె,నట్టి కథన
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”
తే॥ తాను జూడక పోయినఁ దలచి తలచి
రిప్లయితొలగించండిమదిని పూర్ణచంద్రు సొబగు మక్కువ నిడి
తన కవితలందున లిఖించె తగిన పగది
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
శా॥ అంధుడైనను దాను శ్రద్ధఁ గని శాస్త్రాదుల్ పఠించంగనే
సంధానించెను జ్ఞాన సంపద లవిశ్రాంతంబునౌ సాముతో
సంధానించిన జ్ఞాన సంపదలతో సారించి మోదమ్ముతో
నంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైనాంకు వర్ణించెఁ బో
పూర్ణ చంద్రుని కాంతుల శోభలు సముద్రము మధ్యనైతే వర్ణనాతీతమండి. సూర్య రస్మితో జరిగే మాయలు కూడ
పగిది (తేగీ 3వ పాదంచివరండి) పొరపాటున పగది అని వ్రాసాను
తొలగించండికనగలిగినట్టిమదియున్నకాంచగలడు
రిప్లయితొలగించండినంధుడవనిలోనన్నియు నరయకున్న
రవియు గాంచనివెల్లయు కవిదెలుపగ
*“పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”*
శా:అంథుండౌ ధృతరాష్ట్రు పై కరుణ తో నా వాసుదేవుండు మో
రిప్లయితొలగించండిహాంధత్వమ్మును విశ్వరూపమున సంహారమ్ము జేయంగ నా
కున్ ధన్యత్వము గల్గె నంచు ,వదలన్ గోర్కెల్ రవిన్ మ్రొక్కి యా
అంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో”
(శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపగా ధృతరాష్ట్రుడు సూర్యునికి నమస్కరించాడు.చంద్రుని వర్ణించాడు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్షులకు నున్న యంధత్వ మవని నరయ
తొలగించండిమానసమ్ముల కుండునె మనుజులార!
యందముగను వర్ణింప భార్య నిజ పతికిఁ
బూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
గంధంబింపుగ నద్ది గాత్రమున శంకా హీన చిత్తుండునై
గంధేభప్రతిమాన గామి నలినీ కాంతోపయంతృప్రభా
బాంధవ్యుండు నిరంతరోగ్ర మదనవ్యాపార వారాశి మ
గ్నాంధుం డాకస మందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కనులు లేకున్నను కవుల కావ్యములను
వినుచు ప్రకృతి వర్ణనలను వీనులార
కనుల గాంచిన యట్టులే కచ్చితముగ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.