5, ఏప్రిల్ 2024, శుక్రవారం

సమస్య - 4727

6-4-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల్లలం బల్కువానికే గౌరవమ్ము”
(లేదా...)
“కల్లలఁ బల్కువాఁడె యిల గౌరవమందును సత్యవంతుఁడై”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

21 కామెంట్‌లు:

  1. తే.గీ:
    నిజము బల్కువా డెపుడును నిష్ఠురమగు,
    కోపగించి పలకరించ కుందు రతని
    నెల్ల కాలము మోసము జెల్లదైన
    “కల్లలం బల్కువానికే గౌరవమ్ము”

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    గోపికల వల్వలందిన పాపిఁ దెచ్చి
    యగ్రపూజకునెంచిన నాప్తుఁడౌచు
    ధర్మజ! కొనియాడఁ దగునె? దక్షుఁడనుచు!
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము!!

    ఉత్పలమాల
    పిల్లన గ్రోవి నూది మును బిత్తల గోపికలుండఁ జేయ నీ
    యల్లరి కృష్ణునిన్ బొగిడి యాదరణంబిడ నగ్రపూజకున్
    జెల్లునె ధర్మరాజ! నిరసించదె లోకము? కాని కాలమై
    కల్లలఁ బల్కువాఁడె యిల గౌరవమందును సత్యవంతుఁడై!

    రిప్లయితొలగించండి
  3. మాట నేర్పరి తనముతో మనుజ తతుల
    మోసగించుచు దన దైన బుద్ధి తోడ
    సమయ సందర్భ మెరిగి యు చతురు డ గుచు
    కల్ల లం బ ల్కు వానికే గౌర వమ్ము

    రిప్లయితొలగించండి
  4. ముల్లెల మూట లుండియును
    భూములు మేడలు గల్గియున్నచో
    నెల్లరు గొప్పవానివలె నెంతురు,
    వాడవినీతికి చేతులెత్తుచున్
    కల్లలు బల్కువాడె యిల గౌరవ
    మందును సత్యవంతుడై
    చెల్లడు డబ్బులేని ఘన శ్రేష్ఠ
    బుధుండు వివేకవంతుడున్.

    రిప్లయితొలగించండి

  5. పదవినందుకొనగ నెంచి పలురకముల
    పాపములనొనరించెడు వారలిపుడు
    స్వర్గమునరచేతిన చూపి సచివు లగుచు
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము.


    ఎల్లజనంపు క్షేమమదె యింపని యెంచెడి వారికాలమే
    చెల్లుచు రాజకీయమున జేరుచు నల్లధనమ్ము నింక కో
    కొల్లలు గాను దోచుకొను కుట్రలు పన్నెడి నేతయే భువిన్
    కల్లలఁ బల్కువాఁడె , యిల గౌరవమందును సత్యవంతుఁడై.

    రిప్లయితొలగించండి
  6. కల్ల బొల్లి పలుకులతో కనులఁ గప్పి
    గెలుచు నాయకులకు ఘనకీర్తి దక్కు
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము
    కల్గుచుండిన కాలము కలియుగమ్ము

    [కల్లలు = అసత్యములు]

    కల్లరులై సదా జనుల కన్నులఁ గప్పెడు నిత్యకర్ములై
    చిల్లర నాయకత్వమున చిందులు వేతురు నేతలిచ్చటన్
    మెల్లని మాటలన్ విడిచి మేలొనరించగ నిర్భయంబుగా
    కల్లలఁ బల్కువాఁడె యిల గౌరవమందును సత్యవంతుఁడై

    [కల్లలు = పరుషపదములు]

    రిప్లయితొలగించండి
  7. నేటి యెనికలందు నిలచు నేతలందు
    లేనిపోని యాశలగొల్పి రెచ్చగొట్టు
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము
    పొసగ దేశము క్షీణించ మొదలు పెట్టు

    రిప్లయితొలగించండి
  8. మెల్లన మాటలాడినవి మెచ్చు జనమ్ము నిజమ్ముఁ బల్కినన్
    ఝల్లను గుండె లక్కరను సందడి వేళల నిచ్చకాలవే
    చెల్లును సత్యదూరములె చేరువయౌను మనంబుకెప్డు నా
    గల్లలఁ బల్కువాడె యిల గౌరవమందును సత్యవంతుడై

    రిప్లయితొలగించండి
  9. తే॥ రాజకీయమందు నిపుడు రాజిలుటకు
    కల్లలే యందముగఁ బల్కుఁ జల్ల గాను
    బ్రజల నమ్మకముఁ బడసి విజయ మొంద
    కల్లలం బల్కు వానికే గౌరవమ్ము

    ఉ॥ ఎల్లలు లేక కల్లలనె యెప్పుడు నాడుచు మెప్పు నొందరే
    చెల్లగ రాజకీయమునఁ జెప్పిన కల్లలు సత్యవాక్కులై
    యెల్లరు మోదమంద విని యేమనిఁ దెల్పఁగ నౌను మిత్రమా
    కల్లలఁ బల్కు వాఁడె యిల గౌరవమందును సత్యవంతుఁడై

    రిప్లయితొలగించండి
  10. మంచితనమున కెన్నఁడుదంచితముగ
    గౌరవము దక్కదీభువిఁ గల్కముఁడగు
    మనుజుఁడేగద కడు మహిమాన్వుతుండు
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:భీష్ము డిట్లనె "ధృతరాష్ట్ర!వినుము నీదు
    కొమరునకు సత్యవాది తో కుదుర దెపుడు
    కర్ణు బీరమ్ములన్ నమ్ము,కౌరవసభ
    కల్లలం బల్కువానికే గౌరవమ్ము”

    రిప్లయితొలగించండి
  12. ఉ:ఎల్లరు మూర్ఖులై వినగ,హేతువు నెంచక ,"సొమ్ము బొందగా
    బెల్లము, నువ్వులన్ గలిపి బిందెడు గంగన బోయ" జెప్పు నా
    కల్లలఁ బల్కువాఁడె యిల గౌరవమందును, సత్యవంతుఁడై”
    కల్లలె యిట్టి వంచనెడు జ్ఞానిని నాస్తికు డంచు దిట్టరే!

    రిప్లయితొలగించండి
  13. కలి యుగమ్మున ధర్మము గాన రాదు
    ప్రియములు వచించు వానినే విభుఁడు మెచ్చు
    పొగడు నట్టి వానినె పదవులు వరించుఁ
    గల్లలం బల్కువానికే గౌరవమ్ము


    కల్లలు నిల్పఁ బ్రాణములు గ్రన్ననఁ బల్కిన మెత్తు రింపుగా
    నెల్లరు దోషముం దలఁప కింతయు నైనను హర్ష చిత్తులై
    కొల్లలుగా నిజమ్ములను గోరి త్యజించి నిరంతరమ్మునుం
    గల్లలఁ బల్కువాఁడె యిల గౌరవ మందును సత్యవంతుఁడై

    రిప్లయితొలగించండి
  14. డా బల్లూరి ఉమాదేవి

    శిక్షలవెపుడు తప్పవు జీవితమున
    *"కల్లలం బల్కువానికే, గౌరవమ్ము”*
    కలుగుధర్మబద్ధమ్ముగకార్యములను
    విడకచేయుచునున్నచో విశ్వమందు

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    బయట పడినప్పు డవమాన భారమగును
    కల్లలం బల్కు వానికే; గౌరవమ్ము
    కలుగు నిచ్చిన మాటకు కట్టుబడుచు
    న్యాయ మార్గమున చరించు నాయకులకు.

    రిప్లయితొలగించండి