2, ఏప్రిల్ 2024, మంగళవారం

సమస్య - 4724

3-4-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్”
(లేదా...)
“పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

38 కామెంట్‌లు:

  1. అతులితశక్తినిఁజూపుచు
    సతతముకరుణార్ద్రదృష్టికాంచుచుప్రజలన్
    మతితోక్రూరతరాక్షస
    పతిశిరమునుద్రంచివైచెపార్వతికినుకన్

    రిప్లయితొలగించండి
  2. కం:
    అతౕఁడు ప్రజా కంటకుఁడై
    మితిమీరిన శ క్తితోఁడ మిడుకుచు నుండన్
    శృతి మించినదని దానవ
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్”

    రిప్లయితొలగించండి
  3. అతిగనుమద్యముద్రావుచుయాగినిజేయగనాథుడంతటన్
    పతిశిరమున్మహోగ్రతనుపార్వతిద్రంచెనులోకరక్షకై
    మతిగనిసంఘకర్తగనుమర్మముతోడుతభద్రకాళియై
    సుతులనుగాచుతల్లిగనుశోకముఁదీర్చెడిలోకమాతయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  4. కందం
    మితిమీరుచు నాయింటనె
    యతిగా వర్తించి యాపు యర్భకునివె? నీ
    గతిఁ జూడని శూలిగ పశు
    పతి, శిరమును ద్రుంచివైచెఁ ,బార్వతి గినుకన్

    చంపకమాల
    అతులిత బాహు దర్పమున నా మహిషాసురుడెంచి వేల్పులన్
    వెతలను ముంచ పాహియని వేదనఁ దీర్పఁగఁ గోరి వారి ధీ
    ధితులను భద్రకాళిగ ప్రతిష్ఠితమౌచును, గాంచ త్ర్యక్షుఁడై
    పతి, శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
  5. అతిగనుమద్యసేవనముయాగినిజేయగనాథుడంతటన్
    గణభంగమునుసవరించడమైనది

    రిప్లయితొలగించండి
  6. అతి ఖలుడైన రాక్షసుడు హత్యలు
    జేయుచునుండ నిత్యమున్
    వెతలను బాపుమాయనుచు
    వేడిరిమానవులెల్ల గూడియున్
    సతి విని వారి సంస్తుతిని చయ్యన
    యాజ్ఞనుబొంది శైలజా
    పతి, శిరమున్మహోగ్రతను బార్వతి
    ద్రుంచెను లోకరక్షకై.

    రిప్లయితొలగించండి
  7. మితి మీరిన గర్వంబున
    వెత లను గల్పించు దుష్టు పీచ మడంచ న్
    ధృతి తో పోరాడి యసుర
    పతి శిరమును ద్రుంచి వైచె పార్వతి కినుక న్

    రిప్లయితొలగించండి
  8. క్రతువును జరిపించెడు యా
    క్షితిసురులను బాధపెట్టు కేడల నుగనన్
    నతివేగమె యారాక్షస
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్

    రిప్లయితొలగించండి

  9. అతిబలవంతుడ ననుచును
    వెతలకు గురిచేయ సురలు వేడిరనుచు దు
    ర్మతియగు యా తొలి దేవర
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్.


    క్రతువుగ నెంచి ధర్మమును కాచెడి దానవటంచు దేవతల్
    హితమును గూర్చమంచు పరమేశుని పత్నిని వేడినంతనే
    వెతలను బెట్టుదుర్మతిని భీకర పోరున పూర్వ దేవతా
    పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై.

    రిప్లయితొలగించండి
  10. శతధృతి వరాలవలన ర
    మతినే తల్లడపరచెను మహిషాసురుడే
    కుతిలముఁ దొలఁగించ మహీ
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్

    ధృతిమతుడై తపించెనట తీవ్రముగా మహిషుండు బ్రహ్మకై
    శతధృతిచే వరాలఁ గొని స్వర్గమునే కెరలించె నాతడే
    కుతిలము నోర్వలేని సుర కోటినిఁ బ్రోచుటకే కదా మహీ
    పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
  11. నతులిడు శ్రితులను గావఁగ
    రతిపతి సూదుని కులసతి రౌద్రాకృతినన్
    అతి కుపితమ్మున దానవ
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ మతివీడి సురల నట్టుల
    నతి దుష్టుఁడు హింస వెట్ట నమరులు వేడన్
    స్తుతిఁ జేసి పాప జగతికి
    పతి శిరమును ద్రుంచి వైచెఁ బార్వతి కినుకన్

    చం॥ సతమత మౌచు దేవతలు సాధ్యము కాదని సైఁచ నట్టులన్
    బ్రతినను బూని యారడులఁ బాపజగమ్ముకు రాజు వెట్టఁగన్
    గతిఁ గన మంచుఁ బార్వతిని కాయు మటంచును వేడగాను భూ
    పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోక రక్షకై

    పాపజగము పాతాళము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  13. మితమిసుమంత లేక ననిమేషులఁ దిప్పలు పెట్ట చాలరై
    రి తలపడంగ నెవ్వరును రేగెడి దైత్యుని మార్ప భద్రయై
    అతి బలరూపి చేతగొని నస్త్రముఁ జీల్చుచు మానుషాదిభూ
    పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
  14. పతి యానతి తాఁ గైకొని
    యతివ నిరాటంకము మహిషాసురు నిత్యా
    తతఘోర కర్ము రాక్షస
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్


    వితత దయా రసార్ద్ర హృది భీషణ శైల నిభాంతరంగ సం
    తత పతి వామభాగ నిజ ధామ నగాత్మజ దుర్గ నామ్నియే
    యతులిత వీర్యవంతు మహిషాసురు ఘోర నిశీథినీ చర
    త్పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
  15. కందం:
    శృతిమించిన క్రౌర్యముతో
    వితతముగా దివిజవరుల వేసట వెట్టన్
    పతి చూచుచునుండ దనుజ
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్

    చంపకమాల:
    అతిబలవంతుడై సురల నారడి బెట్టెడు రాక్షసాధమున్
    వెతలను బాపి వేల్పులకు వేసటఁ దీర్చగ నుద్యమించి యా
    తతమగు దీప్తితో వెలుఁగు తామసి, గాంచుచు నుండగా నహ
    ర్పతి, శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై
    (అహర్పతి=శివుడు)

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అతిగా మద్యము త్రాగిన
    పతియే కోడలిని చెఱచ పట్టుకొనంగన్
    సతి గాంచి యాయుధముతో
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్.
    (ఒక సినిమాలోని సంఘటన ఆధారంగా)

    రిప్లయితొలగించండి
  17. మతిహీనుండగుచునుదే
    వతలకుబాధలనిడుచునుబలగర్వముతో
    సతతముతిరిగెడుదానవ
    పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్”*


    చతురతచూపుచున్ సతము చక్కని మాటలనాడుచప్పులన్
    ఇతరులకెప్పుడిచ్చుచునుహెచ్చుగలెక్కలు వ్రాయుదుష్టుదు
    ర్మతియయినట్టి వాడయిన గ్రామపు నేతయునైనయాఉమా
    *“ పతిశిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి