17, ఏప్రిల్ 2024, బుధవారం

సమస్య - 4739

18-4-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆమని శోభిల్లెఁ గాక మాలాపింపన్”
(లేదా...)
“గీతములన్ వసంతఋతు కీర్తినిఁ బెంచెను గాకఘూకముల్”

38 కామెంట్‌లు:

  1. కందం
    ఏమని దైవము కోకిల
    కీమాధుర్యమిడె చిన్నదింతగ గూయున్
    మామిడి వగరుల చిగురుల
    నామని శోభిల్లెఁ గాక మాలాపింపన్

    (కాకము = అల్పము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      చేతన మొందు సృష్టి కడు చిన్నవి నల్లవి శాఖలందునన్
      గూతను నింపి మాధురిని గూయగ మావిచిగుర్లు మేయుచున్
      రాతను వ్రాయు దేవుడి విలాసమునద్భుతమౌచు కోకిలల్
      గీతముతో వసంతఋతు కీర్తినిఁ బెంచును, గాక ఘూకముల్


      (ఘూకములు కాకుండా కోకిల గీతముతో వసంత ఋతువు కీర్తిఁ బెంచునను భావము)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. లేమనుసైరంథ్రీసతి
    భీమాకృతికీచకుండుబేలన్పిలచెన్
    కామాతురకంఠంబున
    ఆమనిశోభిల్లెకాకమాలాపింపన్

    రిప్లయితొలగించండి
  3. ఏమీ సంబర మిలలో,
    ఏమాయ జేసె కంతుడిచ్చట నౌరా!
    సామాన్యులైన మురిసిరి
    ఆమని శోభిల్లెఁ గాక మాలాపింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఏమాయను జేసె.." అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  4. చూత కిసాలమున్ దినియు
    సొంపుగ కోయిల పాడినట్టి యా
    గీతములన్వసంత ఋతు కీర్తిని
    బెంచెను, గాక ఘూకముల్
    చేతలు మాని కోకిలము స్వేచ్ఛగ
    పాటను పాడుచుండగన్
    చేతనముడ్గి యవ్వియును
    జిత్రముగా విన సాగెనయ్యెడన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ ఆమని న్యాయము పికముల
    కోమల గానము విరియుట కోయిల లేవీ
    యేమనఁ దగును నగరముల
    నామని శోభిల్లెఁ గాక మాలపింపగన్

    ఉ॥ చేతన నొంది కోయిలలు చిక్కగ చక్కఁగ పాడి తీయగన్
    గీతములన్ వసంతబుుతు కీర్తినిఁ బెంచెను, గాకఘూకముల్
    ప్రీతిగ సద్దు సేయకను బేరిమి మీరఁగ నాలకింపఁగన్
    నీతిగఁ బక్షులిట్లు మను నిత్యము మానవు లిట్లు కాదయా!

    రిప్లయితొలగించండి
  6. మామిడిచివుళ్ళతోడను
    నామని శోభిల్లె ,గాక మాలాపింపన్
    సామముతోడనటపికము
    కాముడరుగుదెంచుచుండ గంభీరముగా

    రిప్లయితొలగించండి
  7. కామాంధపు కూతలతో
    నామని శోభిల్లెఁ గాక మాలాపింపన్
    శ్యామపు గళమే వినబడు
    ధీమసమున కుహుకుహువుల తీవ్రత మెండై

    శ్రోతల కింపు గూర్చుగద రూఢిగ కోకిల కంఠరావమే
    కూతలు కోకిలమ్మవని గొప్పలు చెప్పగ కామజానమే
    గీతముతో వసంతఋతు కీర్తినిఁ బెంచును; గాకఘూకముల్
    మేతయె పుష్కలంబనుచు మ్రింగుచు నుండును కీటకంబులన్

    రిప్లయితొలగించండి
  8. ఆ మూగ వోయిన పికము
    కామాంధము చిలుప పక్షి గళమది పెకలన్
    మామిడి పూతల కాలం
    ఆమని శోభిల్లెఁ గాక మాలాపింపన్.


    జాతిని జూడ పర్వి, షహసానువు, కీర కపోతముల్ దివా
    భీతము లెన్నియున్ననిల సువిత్తుక వీంద్రుల కావ్య వస్తువౌ
    భూతలమందు కోకిలల మోదము గూర్చెడు కూజితమ్ములే
    గీతములన్ వసంతఋతు కీర్తినిఁ బెంచును, గాక ఘూకముల్ ?

    రిప్లయితొలగించండి
  9. మామిడి చిగురును దినుచునె
    సోమును బొందుచు బరితము సొబబుగ కూయన్
    ధామము నంతయు తృప్తీగ
    నామని శోభిల్లెఁ గాక మాలాపింపన్

    కాకము = అల్పము

    రిప్లయితొలగించండి
  10. నీమము దప్పగ నొకచో
    నామని శోభి ల్లె గాక మాలా పింపన్
    సామాన్యు లు న చ్చె రువు గ
    నేమిది వింత యని పల్కి రెంతయు మిగులన్

    రిప్లయితొలగించండి
  11. కందం:
    శ్యామము కలరవములతో
    నామని శోభిల్లెఁ, గాక మాలాపింపన్
    సామూహికముగ పక్షులు
    వ్యోమముపైకెగురుకొనుచు పోయినవెటకో

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల:
    చూతమహీజ పల్లవపు జొంపములందున డాఁగి శ్రావ్యమౌ
    రీతిగ నామనిన్ పికము రెచ్చిలి శ్రావ్యపు సుస్వరమ్మునన్
    గీతములన్ వసంతఋతు కీర్తినిఁ బెంచెను, గాకఘూకముల్
    చేతములందసూయఁగొని సిగ్గిలి పాఱె సుదూర తీరముల్

    రిప్లయితొలగించండి
  13. కం:భూమిన కాకులు కలవే?
    ఆమనిలో పికపు రాగ మగుపించదు గా!
    నామది మెచ్చగ నిత్తరి
    నామని శోభిల్లెఁ గాక మాలాపింపన్
    (భూమి మీద కాకులు,కోకిలలు రెండూ లేకండా పోతున్నాయి.ఈ సారి కాకి కూత లైనా ఉన్నాయి.అవైనా ఉన్నందుకు సంతోషం.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:నూతనవత్సరమ్మును వినూతన రీతిగ సాగె చక్కగా
    మా తర మందు సత్కవులు మంజుల కోకిలగాన మీయ గా
    నీ తర మిట్లు చెల్లదని యేదియొ విప్లవ మంచు క్రూరమౌ
    గీతములన్ వసంతఋతు కీర్తినిఁ బెంచెను గాకఘూకముల్”

    రిప్లయితొలగించండి
  15. (3)ఉ:చేతము నందు నున్న పగ చిత్రపు రీతిని దీరు మార్గ మీ
    రాతిరి కాక ఘూకములు రమ్యత జూపెను,ధ్వంస కార్యమున్
    జేతును, ద్రోణసూనుడ విచిత్రముగా తమ దైన్య,రౌద్ర సం
    గీతములన్ వసంతఋతు కీర్తినిఁ బెంచెను గాకఘూకముల్”
    (అశ్వత్థామ కాకులు,గుడ్లగూబలను చూసి తన పగ తీరే మార్గం గ్రహించాడు.దైన్య,రౌద్ర గీతాలతో కాకులు, గ్రుడ్ల గూబలు ఈ వసంతాన్ని గొప్పగా చేశాయి అని సంబరపడినట్లు.ఆ సంఘటన వసంతరుతువు లోనే జరిగిందా?అంటే జరిగి ఉండవచ్చు.అది ఊహ. పగతో ఉన్న అశ్వత్థామకి ఆ వసంతం అలా కీర్తి పొందా లనిపించింది. )

    రిప్లయితొలగించండి
  16. ఏమని వచింప నొప్పును
    సోమరియై పికము మెక్కి సోలి పరుండన్
    గోముగఁ జెలరేఁగి కరం
    బామని శోభిల్లెఁ గాక మాలాపింపన్


    ఆతత రీతిఁ బాదపము లంతఁ జిగుర్చుచుఁ బూలు వూయఁగాఁ
    బ్రీతి నొసంగుఁ బిల్లలకుఁ బెద్దల కెల్లర కా వసంతమే
    కూఁతలు గూయ ఘోరముగఁ, గోయిల లత్తఱిఁ తేనె లొల్కెడిన్
    గీతములన్ వసంత ఋతు కీర్తినిఁ బెంచెను, గాకఘూకముల్

    రిప్లయితొలగించండి
  17. నూతనవత్సరమ్ముననునొప్పుగకోయిల పాటపాడనా
    గీతములన్ వసంత ఋతు కీర్తిని పెంచెను, గాక ఘూకముల్
    రోతయుకల్గురీతిగను రొప్పుచు రాగము తీసినంతనే
    చేతమదెల్లపాడగునుశీఘ్రముగానని దాగెకంతుడే

    రిప్లయితొలగించండి