3, ఏప్రిల్ 2024, బుధవారం

సమస్య - 4725

4-4-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బొట్టుఁ దాల్చుట భారము బోటులకును”
(లేదా...)
“బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

36 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పుట్టినప్పుడు బట్టల కట్టులేదు
    నడుమ వచ్చిన వాటిని విడుచు కతన
    పీలికలఁ గట్ట నేర్చిన వాలకమున
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును

    ఉత్పలమాల
    పుట్టిన నాడు లేవుగద మూసెడు బట్టలు నొంటిపైన నా
    పట్టున దాల్చగన్ నడుమ వచ్చిన వాటిని వీడు యావతో
    గుట్టును జూపు పీలికల కోమలులెంచుచునుండ జాడ్యమై
    బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంచెడిన్

    రిప్లయితొలగించండి
  2. కాలవైపరీత్యముననుకలికితనము
    మాయమాయెనుచూడగామానినులకు
    కలియుగడిచినకొలదినికానివెన్నొ
    బొట్టుదాల్చుటెభారముబోటులకును

    రిప్లయితొలగించండి
  3. తే.గీ:
    కట్టు బాట్లు పాటించుట కష్టమయ్యె
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును
    నీతి తరిగి పోవుచునుండె నీటివలెనె
    మరమనిషి చేత యీనాడు మనిషిజిక్కె.

    రిప్లయితొలగించండి
  4. డా బల్లూరి ఉమాదేవి

    జడలనల్లుకొనెడిరీతిజారిపోయె
    సంప్రదాయములకు చెల్లె సమయ మిపుడు
    చిరిగినవలువలేమేను చేరె నేడు
    *“బొట్టుఁ దాల్చుట భారము బోటులకును”*


    రిప్లయితొలగించండి
  5. చిట్టినిబొట్టునోములవిచేయనసహ్యమునేటినారికిన్
    పట్టముకట్టలేరుగదభర్తకునేవిధిసామ్యమెంచుచున్
    మెట్టెలుతాళిబొట్టులవిమేనికలంకృతిగాదునంచునున్
    బొట్టుధరించుటేనుదుటబోటులుభారముగాదలంతురే

    రిప్లయితొలగించండి
  6. మెట్టెను భారతీయులును మెచ్చని
    పశ్చిమ దేశ సంస్కృతుల్
    కట్టుట చీరెలన్ వదలి కాంతలు
    ప్యాంటుల నేయసాగిరే!
    మట్టిని గల్పినారుకద మానవతుల్
    మన దేశ సంస్కృతిన్
    బొట్టు ధరించుటే నుదుట బోటులు
    భారముగా దలంతురే.

    రిప్లయితొలగించండి
  7. బుట్టెడుబట్టలున్నసరెబొంతనుదాల్చుటెనేడుహెచ్చెనే
    పట్టునజూడపద్ధతుల ప్రక్కనబెట్టుచు మర్చిసంస్కృతిన్
    జుట్టునుదువ్వకుండగనుజోరుగతోయుచుసాగుచుండిరే
    *“బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే”


    రిప్లయితొలగించండి
  8. పాత వలదo దు రీ నాటి పడుతు లెల్ల
    నాగ రికత పేరున దాము నవత యనుచు
    బొట్టు దాల్చుట భారము బోటు లకును
    స్వేచ్ఛ గా నుందు మని పల్కి విడుత రకట!

    రిప్లయితొలగించండి
  9. ఆధునికులమనుచు నేటి యాడవారు
    పాత పద్ధతులవి యెల్ల రోత యనుచు
    కురులు ముడుచుచు నందున విరులు, నుదుట
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును.


    పట్టదు హిందు ధర్మమది పాతవిధానమటంచు రోయుచున్
    గిట్టదటంచు స్నేహితులు గేలియొనర్తురటంచు మూఢులై
    కట్టగ పట్టుచీరలు, సుగంధపు పూలను దాల్చ కొప్పునన్
    బొట్టు ధరించుటే నుదుట, బోటులు భారముగాఁ దలంచెడిన్

    రిప్లయితొలగించండి
  10. వారి యందలి నిపుణత పరిగణించి
    తిన్పగ నుదుట తిలకము దిద్ద బోవ
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును
    గొప్ప జుపించ నొప్పరు కొంతమంది

    రిప్లయితొలగించండి
  11. పుట్టి పెరిగిన దేశపు ముచ్చటేల
    కట్టు బట్టలు పొసగిన కట్టుబాట్లు
    వట్టివేయని తలచిరి వనితలెల్ల
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును

    పుట్టిన గడ్డనే మరచి పోయిన దేశపు పౌరులైతిరే
    బట్టల రూపమున్ మడచి పశ్చిమదేశపు శైలితోడుతన్
    మట్టెలు సైతమున్ విడిచి మానినులే ఘనకీర్తి నొందగా
    బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే

    రిప్లయితొలగించండి
  12. కాలిమట్టెలు దాల్చుటకాంతకిపుడు
    కష్టమాయెను గాజులయిష్టమయ్యె
    పిదపకాలఁపు బుద్ధులు కదురుకొనఁగ
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును

    రిప్లయితొలగించండి
  13. బట్టలు కట్టుటన్ననది బట్టబయల్ బొనరింప నంగముల్
    మెట్టెలు నల్లపూసలన మిక్కిలి రోతయె మించు బోడికిన్
    గిట్టదు కోమలాంగులకు కేలున గాజుల భూషలన్నచో
    బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    పట్టుచు వ్రేళ్ళ మధ్య గురి బాయక కుంకుమ దాల్చ నెండలో
    పెట్టిన బొట్టు స్వేదమున బేలల ఫాలము నుండి రాలెడిన్
    *బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంచెడిన్*
    చట్టున గుచ్చగా దృఢము చక్కని రీతిన నిల్చు బిళ్ళలే.

    రిప్లయితొలగించండి
  15. పెట్టగ బొట్టుఁ దాల్చగను పేరులు చెండ్లను తుర్మగన్ జడన్
    పెట్టియు పుట్టినారు అలివేణులు నీభువిఁ గాని పశ్చిమం
    తట్టున మోజు క్రొత్తను మతమ్ము లలఆమలఉ నేడునయ్యయో
    బొట్టు ధరించుటే నుదట బోటులు భారముగా దలంతురే

    రిప్లయితొలగించండి
  16. తే॥ నేఁడు నాగరిక మనుచు నాఁడువారి
    కట్టుబాట్లు మారెగద యెబ్బెట్టు గాను
    సంప్రదాయపు రీతులుఁ జవకబారె
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును

    ఉ॥ పట్టణ ప్రాతమందునను బాటల గంధుల తీరు వేరయా
    పట్టక సంప్రదాయములు వారలు మెచ్చిరి నవ్య సంస్కృతిన్
    గట్టరు చీరలన్ దొడుగ గాజుల నిష్టముఁ గాంచఁ బోరయా
    బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే

    ఉద్యోగినులకు ప్రాత పద్ధతులు పట్టణాలలో అసౌకర్యము కలిగించుట వాస్తమేనండి. బెంగుళూరులో 40సం॥ లోపు వారి కట్టు బొట్టు మారింది. మా పెనుకొండ లాంటి చిన్న ఊర్లలో నడుస్తోందండి

    రిప్లయితొలగించండి
  17. ఊని నట్టి బట్టల రంగు నూన వలయు
    చేతి సంచి వర్ణమ్మును జేరవలయు
    కాలి చెప్పుల రంగును గలియ వలయు
    బొట్టుఁ దాల్చుట భారము బోటులకును


    జుట్టును గత్తిరించెదరు చొప్పడఁ గ్రొత్త దనమ్ము మోములన్
    ముట్టరు కోక ఱైకలను ముగ్ధలు గూర్తురు పొట్టి గుడ్డలన్
    గిట్టక మచ్చ యేర్పడుట కిన్నెర కంఠులు మానసమ్ములన్
    బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఆధునిక మనుచు వనితలంత నేడు
    జుట్టు ముడివేయక విరబోసు కొనుచుంద్రు
    చీర బరువని ధరియించ నేరమనుచు
    కుఱుచ దుస్తులు ధరియించి కులుకుచుంద్రు బొట్టుఁ దాల్చుట భారము బోటులకును.

    రిప్లయితొలగించండి