16, ఏప్రిల్ 2024, మంగళవారం

సమస్య - 4738

17-4-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రామ రామ యనుట రంకు బొంకు”
(లేదా...)
“రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్”
(చెన్నమాధవుని భాస్కరరాజు గారికి ధన్యవాదాలతో...)

39 కామెంట్‌లు:

  1. ఆ.వె:
    చేయు తప్పులెల్ల జేసి యెరుగనట్టు
    చాల మంచి తనము, స్వచ్ఛతయును
    సొంత మైన రీతి సుంత సిగ్గెరుగక
    రామ రామ యనుట రంకు బొంకు”

    రిప్లయితొలగించండి
  2. ఆడ రాని మాట లాడుచు బొంకుచు
    దుష్ట కృత్య ములను దురి త ములను సల్పు మనుజు డొకడు సచ్ఛీ లుని వలె తా
    రామ రామ యనుట రంకు బొంకు

    రిప్లయితొలగించండి
  3. పరమ మిచ్చునట్టి పరమాత్ముడారాము
    పేరుబలుకఁదీరు పేదరికము
    కాదుకాదుననుచుఖండనసేసిన
    రామరామయనుటరంకుబొంకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పరము నిచ్చునట్టి... కాదటంచు.." అనండి.

      తొలగించండి
  4. ఆటవెలది
    వారకాంతలింట పరవశమందంగఁ
    జూచినట్టి వార్కి చోద్యమనఁగఁ
    గళ్లుమూసి పాలు పిల్లి త్రాగినరీతి
    రామ! రామ! యనిన రంకు! బొంకు

    ఉత్పలమాల
    కామము మీరి గ్రాలఁగను గాంతల బొందుకు వేశ్యవాటికన్
    నీమము దప్పినావనుచు నిందల నెంచెడు పెద్దవారితో
    నేమరి కాదు కూడదని యేహ్యములొల్కుచు రామ! రామ! గన్
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్


    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు

    రిప్లయితొలగించండి
  5. వ్రాసి రామ కోటి ప్రజలనునమ్మించు
    నదును దక్కగానె యమ్మతోడు
    పాడు పనులు సేయు పాపిష్టి మనుజుడు
    రామ రామ యనుట రంకు బొంకు

    రిప్లయితొలగించండి
  6. తప్పు జేసితివని దల్లి యనంగనే
    నొప్పుకొనని తనయుడుండి , తాను
    నిజము చెప్పు చుంటి నేనేల జేసెద
    రామ రామ , యనుట రంకు బొంకు

    రిప్లయితొలగించండి

  7. అవని జనులకెల్ల నారాధ్య పురుషుండు
    ముక్తి నోసగు నట్టి పూజ్యుడతడు
    వాని నామమదియె పరమ పావన మెట్లు
    రామ రామ యనుట రంకు బొంకు?


    పామరు నైననేమి యపవర్గము చేర్చెడు మార్గమొక్కటే
    నేమము వీడకుండ ననునిత్యము మానసమందు భక్తితో
    రాముని నామముం బలుక , రంకగు బొంకగు నంద్రు పండితుల్
    రాముని పేరు జెప్పుచు స్వలాభము పొందుటె లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  8. నీమము దప్పకుండ గణనీయముగా రఘురామ కీర్తనం
    బే మహితార్థమంచుఁ జరియించెడి వారలె పుణ్యులౌ; సదా
    కామవికారచేష్టల సుఖంబె హితంబనునట్టి యింద్రియా
    రాముని నామముం బలుక రంకగు బొంకగునంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  9. రంకు నేర్చి నెలత బొంకుట నేర్వదా
    బొంకు చుండునుగద జంకు లేక
    కారణమ్ము దాఁచు జారిణి తననోట
    రామ రామ యనుట రంకు బొంకు

    గ్రామణి పల్కుచుండునట కల్లల నెప్పుడు కొల్లలే యనన్
    భూమముపై మనోరథము బొంకుట నేర్వని వేశ్యలుందురా
    కామము గుప్పళించి తన కార్యమొనర్చెడు రంకులాడియే
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  10. ఆ॥ రామ నామ మొదవి రంకుఁ జేయుచు బొంకు
    జనులు రామ నామ జపముఁ జేయ
    రాముఁడొసఁగు శిక్ష రాక్షసాధములటు
    రామ రామ యనుట రంకు బొంకు

    ఉ॥ నేమము లేని వారలిల నీతినిఁ గానక దైత్య కృత్యముల్
    కామ కలాపముల్ నెరపు కర్కశ రూపులు రాక్షసాధముల్
    రాముని నామమెంచఁగ దురాత్ములు కర్ణ కఠోరమే యహో
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. ఆటవెలది:
    మంచితనము మదినిమచ్చుకైనను గనము
    యెడ్డె మనిన కాదు తెడ్డె మనును
    దుస్సహంబు వెడఁగుతో మాటలాడుట
    రామ రామ యనుట రంకు బొంకు

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల:
    కామిత కార్యసాధనము కష్టనివారణ మంత్రమైన శ్రీ
    రాముని నామమే మనకు రక్షణ గూరుచు నెల్ల వేళలన్
    కామవికార బద్ధులయి కన్నెలమానము దోచు నర్మఠుల్
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  13. -
    కంది శంకరయ్య కవివర! మేలగు
    రామ రామ యనుట; రంకు బొంకు
    లెల్ల పనికి రావు! లేవండి ! లేకున్న
    శంకరాభరణము చవటబాఱు!


    రిప్లయితొలగించండి
  14. ఈ మహి వేమహర్షులకు నెడ్డెము జేసెఁ దపంబు నూనగా
    నో మునిభార్యనున్ గవయ నుర్వినిఁ జేరెను కుక్కుటంబుగా
    కామవిమోహి, జారు, డధికార విలోలుడు, బ్రహ్మహంత, సు
    త్రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె:లంక లోన నుండి యింకను నీవు శ్రీ
    రామ రామ యనుట రంకు బొంకు
    గా దలంచు నమ్మ మాదొర రావణుం
    డనుచు నొకతె పలికె ననునయముగ
    (సీత వద్ద కాపలా గా ఉన్న ఒక రాక్షస స్త్రీ మొరటుగా కాక కాస్త అనునయం గా చెప్పింది. వాళ్లు అన్ని రకాల ఉపాయాలూ ప్రయోగించారు.)

    రిప్లయితొలగించండి
  16. ఉ:ప్రేమయె లేక యెల్లపుడు విప్రుల దిట్టెడు వారి నెల్లరన్
    సామము తోడ మార్చవలె, సంఘబలమ్మును జూడకుండ,నీ
    ర్ష్యామయ సంఘమధ్యమున నా భృగువంశ డైన విప్రుడౌ
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్”
    (ఈ మధ్యన బ్రాహ్మణద్వేషానికి బాధ పడిన కొందరు బ్రాహ్మణులు జై పరశురాం అనటం మొదలెట్టారు.వారిని మంచి మాటలు తో మార్చాలి కానీ అసలే ద్వేషించే వాళ్ల దగ్గరికి పోయి జై పరశురాం అంటే వాళ్లకి రంకు, బొంకు తో సమానం గా కనిపిస్తుంది. )

    రిప్లయితొలగించండి
  17. వావి వరుస సుంత పరికింప నేరక
    కాల మెంచ కుండఁ దూలి యూఁగఁ
    బ్రేమ డోల లందు భామ! రావా రావ
    రామ! రామ! యనుట రంకు బొంకు
    [రామ= రమించు నట్టి స్త్ర

    ఈ మహి నీతులం బలికి యెన్నిక వేళ ప్రజాలిఁ గావఁగా
    నే మెదలం దలంచి యరుదెంచితి మంచు వచించి నెగ్గినన్
    భూముల నాక్రమించుచును బూర్ణము దుడ్డుల సంగ్రహించుచున్
    రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  18. కామ మోహితుడొక భామతోఁగనిపించ
    నీమెయెవ్వరనుచు మామ యడుగ
    "నీమె చెల్లివరుస! నామీద శంకయా!
    రామరామ! యనుట రంకుబొంకు

    రిప్లయితొలగించండి
  19. రామ రామ యన్న రహినిండు మనసుకు
    రామ రామ యనుట రంకు బొంకు
    ననుచు పలుకు జనము లధములే యనుమాట
    కల్ల కాదు వినుము కటిక నిజము

    రిప్లయితొలగించండి