19, ఏప్రిల్ 2024, శుక్రవారం

సమస్య - 4741

20-4-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి”
(లేదా...)
“పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

30 కామెంట్‌లు:


  1. రాజ్యలక్ష్మిని విడనాడి రమణి తోడ
    వనములందున తిరిగిన పాండవులను
    పేడియౌ బృహన్నలనీవు వీరుడంచు
    పొగుడు చుంటివి భావ్యమే మురుభిదుండ
    స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి.


    వ్యర్థపు మాటలేల, ప్రియబాంధవు లంచును పక్షపాతివై
    స్వార్థము తో వచించితివి, పాండవు లేవురు మేటి శూరులం
    చర్థము లేని మాటలు బృహన్నల యౌచు విరాటు గొల్ఛెనా
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే.

    రిప్లయితొలగించండి
  2. వ్యర్థులు పెక్కు బీరములనాడి ప్రయోజనమొంద జూజు వా
    నర్థమెఱుంగకే మిడియు నర్భకులున్ గడు శాపగ్రస్తుడా
    పార్థ విరోధి కర్ణుడు నపాయము దాయ సుయోధనున్ మదిన్
    పార్థుడు నిష్ప్రయోజకు డపార యశస్కులు ధార్తరాష్ట్రులున్

    రిప్లయితొలగించండి
  3. కురుక్షేత్రం యుద్ధము మొదలైనా కాకుండానే విల్లు త్యజించినాడని పార్ధుని గురించి విదురుడు చెప్పగా పుత్రపక్షపాతియైన ధృతరాష్ట్రుని మనసులో...

    తేటగీతి
    భండనము సేయ వచ్చిన పార్థుడిటుల
    కృష్ణమూర్తిని గల్గియు కృంగెనేల?
    ద్రోణ భీష్ముల పొందియు రాణకెక్కి
    స్థిరయశస్కులు గౌరవుల్! నరుఁడు లేకి!!

    ఉత్పలమాల
    వార్ధి సమాన సేనల విపక్షము సూచిన సవ్యసాచియే
    వ్యర్థునిఁ బోలి జారగిలె పంకజలోచనుడండనుండి, య
    త్యర్థపు పోకడన్ జెలఁగఁ దాతల యొజ్జల ముందు తూగకే
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే!


    రిప్లయితొలగించండి
  4. పాండవుల నాశనమునకై పన్నుటందు
    స్థిరయశస్కులు గౌరవుల్ ; నరుఁడు లేకి
    యనుట దప్పు , భారతమున నతని ఘనత
    నెరిగు వాడెవ్వడారీతి నెంచబోడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఏమి పన్నుటందు? ఘనత నెరుగు.. టైపాటు.

      తొలగించండి
  5. పంత మూని యు దాయల పతన ములను
    గోరు కున్మట్టి వారలు కుటిల మందు
    స్థిర యశ స్కులు గౌరవుల్ ::నరుడు లేకి
    కాడు కాడెన్న డా తడు ఘన య శ స్వి

    రిప్లయితొలగించండి
  6. కుంభజన్ముని గాంగేయుఁ గూల్చె నరుఁడు
    మోసమొనరించి ద్రిప్పెను మీసమనుచు
    భ్రాతతో దుస్ససేనుఁడు బలికె నిట్లు
    "స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి"

    రిప్లయితొలగించండి

  7. తిండిపోతులు మూర్ఖులు పాండు సుతులు
    స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి
    నిశ్చయమ్ముగ విజయము నీకు దక్కు
    నమ్మమనెనార్కి రారాజు సమ్మతింప

    వ్యర్ఠపు మాటలన్ బలికి వాస్తవ మంతయు దాచిపెట్టగా
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే
    తీర్థము భీష్ముడేననుచు తియ్యటి వాక్కుల రాశితోడుతన్
    స్వార్థము మిక్కుటంబయిన వారలు పల్కిరి కౌరవేంద్రుతో

    రిప్లయితొలగించండి
  8. స్వార్థమెరుంగనట్టి కురువంశ పితామహుడైన భీష్ముకున్
    పార్థుడు సాటియౌనె? నిలుపంగలడే గురుదేవు నాజిలో?
    వ్యర్థుఁడు కాతరుండతడు భావన చేయగ భూతలమ్మునన్
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే

    రిప్లయితొలగించండి
  9. భీష్ముడు నేలగూలగ బాధగ సంజయునితో ధృతరాష్ట్రుడు

    తే॥ భీష్ముఁ డొరగఁగ ధృతరాష్ట్ర భీతిఁ దెలుప
    శక్యమే! కృష్ణ మాయలె సంజయా ఘ
    నుఁడగు భీష్ము గూల్చె నకటా కడు కపటము
    స్థిర యశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి

    ఉ॥ అర్థము లేని పల్కులటు లారడి సైఁచఁగ లేకయే యగున్
    వ్యర్థపు శుష్క ప్రేలనలు పాండవ యోధులఁ గాంచి చేసెనో
    పార్థుఁడు గెల్చె కృష్ణుఁడటు పన్నిన మాయల తోడ సంజయా
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే

    మరొక పూరణ కర్ణుడు కృష్ణ రాయబార సమయమున సుయోధనునితో

    ఉ॥ అర్థము లేని పల్కులిటు లాడఁగఁ గృష్ణుడు భీతిఁ గాంతుమో
    వ్యర్థము శుష్క ప్రేలనలు పాండవ యోధుల శక్తియుక్తులన్
    వ్యర్థము చేసి యుద్ధమున వాసిగఁ గెల్తుము కౌరవాగ్రజా
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రలే

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:అర్జునుని మించు కుశలుడ నైన నన్ను
    కులపు మిష బాండు సూను లావలకు నెట్ట
    కౌరవులు రాజ్య మిడిరి నాన్ గౌరవించి
    స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి”
    (అని కర్ణుని భావం)

    రిప్లయితొలగించండి
  11. ఉ:స్వార్థము గోరి ధర్మమును బాసినవారల గూల్చివేయుటే
    పార్థ!స్వధర్మమౌ ,ననిని వచ్చిన వచ్చును గెల్పు ,లేక ధ
    ర్మార్థము జచ్చినన్ యశము నందెద విత్తరి నాజి వీడినన్
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే”
    (జిత్వావా లభసే రాజ్యం హత్వావా భోజ్యసే యశం అని శ్రీకృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి ప్రోత్సహించాడు.)

    రిప్లయితొలగించండి
  12. అరయ ముల్లోకముల యందు నంచితముగ
    యక్ష కిన్నర గంధర్వ పక్షి పన్న
    గాప్సరస్త్రీజన సమేత మమరు లెల్ల
    స్థిర యశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి

    [గౌరవుల్ = గురువునకు సంబంధించిన వారు]


    వ్యర్థము లయ్యెఁ బాండవుల నంత మొనర్ప రచింపఁ జేష్ట ల
    త్యర్థము వాసుదేవ కరుణాంచిత దృష్టి నిరంతరమ్ము రా
    జ్యార్థి సుయోధనుండు కుటిలాత్ముఁడు దుర్భర పాప కర్ముఁడౌ
    పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే

    [ధార్త రాష్ట్రులు = ధృతరాష్ట్రునకు సంబంధించిన పౌరులు]

    రిప్లయితొలగించండి
  13. శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు
    తే.గీ:
    మత్తుమందును గ్రోలుచు మంచిచెడుల
    నరయక మతిహీనతతోడ నజ్ఞుడగుచు
    *“స్థిరయశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి”*
    యనుట భావ్యమేయోశుంఠ యనవరతము
    ఉ.మా:
    *“పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపార యశస్కులు ధార్తరాష్ట్రులే”*
    స్వార్థమొకింతలేకయె నొసంగిరి భాగమ నంగ బోకుమా
    వ్యర్థులు గారటంచు విను పాండవు లెల్లరు పౌరుషమ్ముతో
    స్పర్థను పూని వత్తురిక పార్థునిచే హతులౌట తథ్యమౌ



    “పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులుధార్తరాష్ట్రులే”*
    స్వార్థమొకింతలేకయెనొపంగరిభాగమనంగ బోకుమా
    వ్యర్థులు గారటంచువిను పాండవులెల్లరుపౌరుషమ్ముతో
    స్పర్థనుపూనివత్తురికపార్థునిచేహతులౌటతథ్యమౌ


    రిప్లయితొలగించండి