16, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 152

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ఈటెలే మేలు బాధించు మాటకంటె.

21 కామెంట్‌లు:

  1. అత్తగారికి ఎక్కువ అణగి యుండ
    బూతు మాటల దిట్టాయె బుద్ధి మరచి
    సర్వ విధముల బాధించె సకల రీతి!
    ఈటెలేమేలు బాధించు మాటకంటె!

    రిప్లయితొలగించండి
  2. అన్న మాటను జవదాట నన్న నన్ను
    అన్న మాటలు తాళ లేనమ్మ వదిన
    ఈటెలే మేలు బాధించు మాట కన్న
    నన్ను మన్నించు వెడలెద నిన్ను విడచి.

    రిప్లయితొలగించండి
  3. బ్రహ్మచర్యమదియె మేలు భార్య కంటె
    తల్లి లేక మేలు సవతి తల్లి కంటె
    పొలము జేయ మేలుపరుల కొలువు కంటె
    ఈటెలే మేలు బాధించు మాటకంటె.

    రిప్లయితొలగించండి
  4. ఈటె పోటులు యిట్టె మాన్పించ గలము
    సూటి పోటి మాటలు చుచ్చిచుచ్చి చంపు
    మాట పోటుకి మందులే లేవు, కనగ
    ఈటెలే మేలు బాధించు మాటకంటె.

    రిప్లయితొలగించండి
  5. చిన్నచిన్న సవరణలతో, ముఖ్యంగా మూడో పాదంలో. 'చుచ్చి' అనే మాట ప్రభావం కోసం రెండు సార్లు కావాలనే వేశాను. తప్పు అయితే తెలియజేయగలరు.

    ఈటె పోటులు యిట్టె మాన్పించ గలము
    సూటి పోటి మాటలు చుచ్చి చుచ్చి చంపు
    మాట పోటుకి లేదురా మందు, కనగ
    ఈటెలే మేలు బాధించు మాటకంటె.

    రిప్లయితొలగించండి
  6. ఈటెలే మేలు బాధించు మాటకంటె
    మాట చేసెడి గాయము మ్రాన్ప గలమొ ?
    స్నేహ భావము చిగురింప నెయ్యమాడి
    మందహాసము మొలకెత్త మందు పూతు .

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ
    నమస్కారములు. పెళ్ళి హడావిడిలో మీరుండము మాకు సంతోషదాయకమైన విషయము. మిస్సన్నగారితో నేను ఏకీభవిస్తాను. మీరు మాపై మన్నించమని,క్షమించమని వంటి మాటలు దయచేసి ఎప్పుడూ ప్రయోగించకండి. మాపై మీరు శిష్య వాత్సల్యము చూపిస్తున్నారు. మేమందులకు కృతజ్ఞులము. మీ కార్యక్రమాలన్నీ జయప్రదమవాలని కోరుకొంటున్నాము.

    రిప్లయితొలగించండి
  8. mastarla andariki namaskaramulu.
    ooka dampudu garu cheppina kavitha chala bagundi. i like it:)

    రిప్లయితొలగించండి
  9. nenu chese vyakhyalu telugu lipi lo ravalante em cheyalo teliya cheyandi. plz

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారూ
    నేను లేఖిని వాడుతా తెలుగు లిపి కోసము.http://lekhini.org/

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారూ,
    నేను ఎక్కువగా "లేఖిని" వాడుతున్నాను. అప్పుడప్పుడు "బరహా".
    మీరు లేఖినిని ఉపయోగిస్తే మంచిదని నా సలహా.
    lekhini.org ట్రై చేయండి.

    రిప్లయితొలగించండి
  12. మాస్టారుగారూ,
    మీఇంట్లో వివాహ మహోత్సవ వేడుకలు బాగా జరిగినవని తలుస్తూ,
    బ్రాహ్మణాశీస్సు శుభములుఁ బలుక నాత్మ
    జునకును వివాహముం జీయు శోభ గాంచి
    షడ్ర సోపేత భోజన సరణి సలిపి
    అలరుమయ్య శాంతుల కవి శంక రార్య!
    మీ,
    చంద్రశేఖర్
    మనవి: ఎక్కువగా సమస్యా పూరణం సెక్షన్ చూస్తారని ఇక్కడకూడా పోస్ట్ చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. ఇక కవి మిత్రులకు మనవి: నాల్గవ పాదం లో అఖండ యతి వేశాను. మరి పద్యం కూడా అఖండ వివాహ మహోత్సవ౦ మీద కదా (నవ్వుతూ)!

    రిప్లయితొలగించండి
  14. సూటి పోటైన మాటల ధాటి ఘాటు,
    చేటు చేయును, స్నేహము బీటవారు,
    కాటి కట్టెలా కడదాక కాల్చుచుండు,
    ఈటెలే మేలు బాధించు మాటకంటె!

    రిప్లయితొలగించండి
  15. నమస్కారములు.
    సోదరులకు మనవి నేను " బహామాస్ " కి వెడుతున్నాను. మళ్ళి 30 కి రాగలను. వెడుతున్నానన్న సరదా కంటె మీ అందరి మధ్యన మధురమైన పురణలను మిస్సవు తున్నానన్న బాధ ఎక్కువ గా ఉంది.

    రిప్లయితొలగించండి
  16. బహామాస్ నంతటిని, మీ చక్కటి పదాలలోనూ, పద్యాలలోనూ బంధించి తీసుకురండి *నవ్వుతూ*

    రిప్లయితొలగించండి
  17. మనవి:పద్యం నాల్గో పాదం లో అఖండ యతి నియమాలల్లో ఒకటి పాటించలేదని తెలుసుకొన్నాను. దాని గురించి మాస్టారి ఛందస్సు పాఠాలలో నేర్చుకొందాం. ఇప్పటికిక్రింది సవరణ సరి అనుకొంటున్నాను.

    బ్రాహ్మణాశీస్సు శుభములుఁ బలుక నాత్మ
    జునకును వివాహముం జీయు శోభ గాంచి
    షడ్ర సోపేత భోజన సరణి సలిపి
    అలరుమయ్య శాంతుల శంకరార్య సూరి!

    రిప్లయితొలగించండి
  18. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాని మూడవ పాదంలో "సర్వ విధముల" "సకల రీతి" అన్నప్పుడు పునరుక్తి దోషం వస్తున్నది. గమనించండి.

    మిస్సన్న గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    మీ పద్యాన్ని చదివినప్పుడు రెండేళ్ళ క్రితం వదిన సూటి పోటి మాటలకు ఇల్లు వదిలి పోయి ఇప్పటికీ ఆచూకీ తెలియని మా మిత్రుని తమ్ముడు గుర్తుకు వచ్చాడు.
    అలాగే సీతను పర్ణశాలలో ఒంటరిగా వదిలి రాముని కోసం బయలుదేరిన లక్ష్మణుడూ గుర్తుకు వచ్చాడు.

    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి పద్యం చెప్పారు. భారతంలోని "తనువున విరిగిన యలుగుల......" పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. అభినందనలు.
    మీ అందరి శుభకామనల వల్ల మా అబ్బాయి వివాహం ఆనందదాయకంగా జరిగింది. ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చాలా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. ఎంతైనా డాక్టర్ బుద్ధి పోనిచ్చుకోలేదు. "మందు పూతు" నన్నారు. బాగుంది.

    అజ్ఞాత గారూ,
    నేను మీతో ఏకీభవిస్తున్నాను.

    మంద పీతాంబర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మా అబ్బాయి పెళ్ళికి వచ్చినందౌకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెళ్ళి కార్యక్రమాల్లో ఉండి మీతో సరిగా మట్లాడలేక పోయాను. మన్నించండి.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ బహామా ప్రయాణం సఫలం కావాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గారు ,నమస్కారం .
    మీ కుమారుని వివాహానికి వచ్చి ,మిమ్మల్ని
    దర్శించి , మీతో మాట్లాడడము నాకు చాలా
    సంతోషాన్ని కలుగజేసింది. మీరు బిజీ గా ఉండడం
    సహజమే కదా! మళ్లీ కలుద్దాం, మనసారా మాట్లాడుకొందాం!

    రిప్లయితొలగించండి
  20. నేదునూరి రాజేశ్వరిగారు నమస్కారం .మీ "బహమాస్" ప్రయాణం
    శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను!

    రిప్లయితొలగించండి
  21. పొలము జేయ మేలుపరుల కొలువు కంటె
    ఈటెలే మేలు బాధించు మాటకంటె.
    Baagundi Sir.

    రిప్లయితొలగించండి