24, నవంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 155

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.

9 కామెంట్‌లు:

  1. గురువుగారూ! కవిమిత్రు లందరినీ, వారి పూరణల గుణ గణాలనీ మీ పద్యాలలో శ్లాఘించిన తీరు కడు రమ్యం. మాకది మీరిచ్చే ఆశీర్బలం.

    రిప్లయితొలగించండి
  2. సరగున మ్రొక్కులు దీర్చగ
    తిరుమల రాయనికి, లేవు తిండియు సుఖమున్,
    అరుదెంచు భక్త కోటికి
    చిరు తిళ్ళను మరగినట్టి సిబ్బంది కతన్.

    రిప్లయితొలగించండి
  3. గిరి వాసిగ నుతి కెక్కిన
    హరి వెంకట పతిని జూడ "హా"యని(అని)పించెన్!
    కరిగిరి వెలగల నగలను,
    తిరుమల రాయనికి లేవు తిండియు,సుఖముల్!

    రిప్లయితొలగించండి
  4. గురిగూర్చుకొనినుతింపుము
    కరుగునుపాపతతియెల్ల కర్పూరంబై
    మరిగితివేనుపవాసము(!)
    తిరుమల రాయనికి, లేవు తిండియు,సుఖముల్!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్యగారికి, నమస్కారం.
    నిన్నటి పూరణలపై మీరు పద్య రూపకంగా కవిమిత్రులను ప్రశంసించిన తీరు,మమ్మల్ని పరమానంద భరితుల్ని చేసింది. మీకు ధన్య వాదములు.
    చిక్కినసమయము నంతను,
    చక్కగవినియోగపరుప శంకరు గురువై
    నిక్కపుదిక్కును జూపెను,
    దక్కిరిసత్కవిమిత్రులు,ధైర్యము చిక్కెన్!

    రిప్లయితొలగించండి
  6. సిరి గూడిన శ్రీమంతుడు
    తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్
    పరమేశ్వరుడది గాంచెనొ
    యురగమ్మును మెడను వైచి యూరులు తిరిగెన్ !

    రిప్లయితొలగించండి
  7. సరిపడు వరముల నిచ్చుచు,
    నరు లొసగెడు ముడుపు తోడ నప్పులు దీర్చన్
    చిర కాలపు చింతనతో
    తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.

    రిప్లయితొలగించండి
  8. పరుగులు బెట్టెడి బాపలు
    కరచుచు మంత్రములు చదివి కాళ్ళను కడగన్
    స్థిరముగ నిలబెట్ట నెపుడు
    తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్

    రిప్లయితొలగించండి