1, నవంబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 23

ఇది ఏమిటి?
సీ.
ఎలుకలు నివసించు కలుగు నేమందురు?
కలిగినవాఁ డేమి కలిగియుండు?
గడచిపోయినదానికై యే పదం బున్న
దన్నార్థు లగుదు మే మున్న వేళ?
గంగాళమున కున్న ఘనమైన పేరేది?
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె?
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది?
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది?
తే.గీ.
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁ
డన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లగు; ద్వితీయాక్షరముల నరసి చూడఁ
దెలుఁగుతో నొక ప్రాంగణం బలరె; నేడు
పేరు మార్పుతో జరిగెను పెద్ద గొడవ.
అదేమిటో చెప్పండి.

12 కామెంట్‌లు:

  1. ఎలుకలు నివసించు కలుగు నేమందురు? - బిలము
    కలిగినవాఁ డేమి కలిగియుండు? - కలిమి
    గడచిపోయినదానికై యే పదం బున్నది? - గతము
    అన్నార్థు లగుదు మే మున్న వేళ? - ఆకలి
    గంగాళమున కున్న ఘనమైన పేరేది? - కళాయి
    మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె? - హితోక్తి
    పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది? - క్షీరము
    వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది? - బాణము
    కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁడు? - భీముడు

    లలితకళాతోరణము

    రిప్లయితొలగించండి
  2. -----, కలిమి, గతము, ఆకలి, -----, హితోక్తి, -----, బాణము, బీముడు
    లలితకళాతోరణము

    రిప్లయితొలగించండి
  3. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, నవంబర్ 01, 2010 8:01:00 AM

    లలితకళాతోరణము
    (బిలము, కలిమి, గతము, ? , కళాయి, హితోక్తి , క్షీరము, బాణము, భీముడు)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  4. బిలము; కలిమి; గతము; ఆకలి; కళాయి; హితోక్తి; క్షీరము; బాణము; భీముడు;
    సమాధానము:ల-లి-త-క-ళా-తో-ర-ణ-ము.

    రిప్లయితొలగించండి
  5. బిలము,కలిమి,గతము,ఆకలి,కళాయి,హితోక్తి,క్షీరము,బాణము,భీముడు

    (తెలుగు) లలిత కళాతోరణము

    రిప్లయితొలగించండి
  6. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మందాకిని గారూ,
    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ అందరి సమాధానాలు సరిపోయాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బిలము,కలిమి,గతము,ఆకలి, కళాయి,మీతోడు,క్షీరము,బాణము,భీముడు=ల లి త క ళా తో ర ణ ము .

    రిప్లయితొలగించండి
  8. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    మీ సమాధానాలు సరియైనవే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. 1.బిలము2.కలిమి.3.గతము.4.ఆకలి.5.కళాయి .6.సంతోషం.7.....8.బాణము.9.భీముడు = అన్నీ కలిపి జవాబు " లలితకళాతోరణము."

    రిప్లయితొలగించండి