4, నవంబర్ 2010, గురువారం

ప్రహేళిక - 26

ఈ కలహభోజనుడిని ఏమంటారు?
సీ.
కరములతో ముష్టిఘాత యుద్ధం బేది?
రంగస్థలముపై విరాజిలు నెది?
కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె?
భాగ్యనగర మయె నే భామ పేర?
భరియించరానట్టి పద్ధతి నే మందు
రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు?
మంచి దైనట్టి సమాచార మేమంద్రు?
ముక్కన్ను లుండు నే పూజ్యునకును?
తే.గీ.
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన?
నన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరమ్ముల ననుసరింపఁ
గలహభోజనుం డగుఁ దెలుపఁ గలరె మీరు?
ఆ కలహభోజనుణ్ణి ఏమంటారో చెప్పండి.

12 కామెంట్‌లు:

  1. బాహాబాహి
    నాటకము
    మకరము
    భాగమతి
    దుర్భరము
    వసంతము
    శుభవార్త
    శివుడికి
    పాండురాజు

    హాటాకగర్భసంభవుడు

    రిప్లయితొలగించండి
  2. బాహాటము, నాటకము, మకరము, భాగమతి, దౌర్బగ్యము, వసంతము, శుభవార్త, త్రివురారి, పాండురాజు. ---- హాటకగర్బసంభవుడు.

    రిప్లయితొలగించండి
  3. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, నవంబర్ 04, 2010 1:26:00 PM

    కరములతో ముష్టిఘాత యుద్ధం బేది? - కుస్తీపట్టు?
    రంగస్థలముపై విరాజిలు నెది? - నాటకము
    కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె? - మకరము
    భాగ్యనగర మయె నే భామ పేర? - భాగమతి
    భరియించరానట్టి పద్ధతి నే మందు - అసహ్యము
    రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు? - వసంతము
    మంచి దైనట్టి సమాచార మేమంద్రు? - శుభవార్త
    ముక్కన్ను లుండు నే పూజ్యునకును? - శంకరుడు (త్రినేత్రుడు ?)
    పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన? - పాండురాజు

    ఈ రోజు కూడా సరైయిన సమాధానం తెలియ లేదు, గురువు గారూ
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    1, 5, 8వ పదాలు తప్పు.

    రిప్లయితొలగించండి
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    స్థూలంగా సమాధానం సరిపోయింది. అభినందనలు.
    కాని 1, 5, 8వ పదాలు తప్పు.

    రిప్లయితొలగించండి
  6. రవీందర్ గారూ,
    మీ సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బా-హా-బా-హి; నా-ట-క-ము; మ-క-ర-ము; భా-గ-మ-తి;దు-ర్భ-ర-ము; వ-సం-త-ము; శు-భ-వా-ర్త; శి-వు-న-కు; పాం-డు-రాజు; సమాధానము: హాటకగర్భసంభవుడు.

    రిప్లయితొలగించండి
  8. 1....?.2.నటనము.3.మకరము .భాగమతి.5.దుర్భరము.6.వసంతము .7.శుభ వార్త .8.శివుడును.9.పాండు రాజు = హాటక గర్భ సంభవుడు అనగా నారదుడు -

    రిప్లయితొలగించండి
  9. బాహాబాహీ -నాటకము -మకరము- భాగమతి-దుర్భరము-వసంతము-శుభవార్త-శివునకు-పాండురాజు
    హాటక గర్భ సంభవుడు

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ,
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ యిద్దరి సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి గారూ,
    2వది ఒకవిధంగా సరిపోయినా, 1వది తప్పు.

    రిప్లయితొలగించండి