10, నవంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 30

ఈ వేడుక ఏది?
సీ.
తూరుపు కొండపై తొంగిచూచు నెవం
డావు కన్ను కిటికీ యయ్యె నేది?
సహియించు గుణ విశేష్యం బేది? విష్ణు రెం
డవ యవతార రూప విధ మేది?
తోబుట్టు వైనట్టి తొయ్యలి నేమందు
రమరు లసురుల మధ్య గల దేది?
పరగ నాయుర్వేద వైద్య గురు వెవండు?
విన నిమేషమునకు వికృతి యేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరముల నరసి చూడ
నిరువుర నొకటిఁ జేసెడి హితకరమగు
వేడుకై యొప్పు చెప్పుఁ డా వేడు కేదొ?
ఆ వేడుక ఏమిటో చెప్పండి.

9 కామెంట్‌లు:

  1. సవితృడు,గవాక్షము,సహనము,కమఠము,సహోదరి,మత్సరము,ధన్ వంతరి, నిముసము

    వివాహమహోత్సవము

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, నవంబర్ 10, 2010 9:02:00 AM

    వివాహమహోత్సవము
    (?, గవాక్షము, సహనము, వామనుడు?, సహోదరి, ?, ?, నిముసము)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. అవిరుడు, గవాక్షము, సహనము, కమఠము, సహోదరి, మత్సరము,చ్యవనుడు, నిముసము...... వివాహమహోత్సవము.

    రిప్లయితొలగించండి
  4. సవితృడు, గవాక్షము,సహనము,గమనము /వామనుడు, సహోదరి ,మత్సరము,- వ - -,నిముసము,=
    వి వా హ మ హో త్స వ ము . (4 ,7 వ పదమేమిటో తెలియడం లేదు.)

    రిప్లయితొలగించండి
  5. తూరుపు కొండపై తొంగిచూచు నెవండు? - సవితృడు
    ఆవు కన్ను కిటికీ యయ్యె నేది? - గవాక్షము
    సహియించు గుణ విశేష్యం బేది? - సహనము
    విష్ణు రెండవ యవతార రూప విధ మేది? - కమఠము
    తోబుట్టు వైనట్టి తొయ్యలి నేమందురు? - సహోదరి
    అమరు లసురుల మధ్య గల దేది? - మాత్సర్యము
    పరగ నాయుర్వేద వైద్య గురు వెవండు? - చ్యవనుడు
    విన నిమేషమునకు వికృతి యేది? - నిముసము

    వివాహమహోత్సవము

    రిప్లయితొలగించండి
  6. 1.రవిబింబం.2.గవాక్షము.3.సహనము.4.వామనుడు.5.సహోదరి.6.మత్సరము.[ 7.వైద్యగురువు మరి " ధన్వంతరి ?] 8.నిముసము. = " జవాబు = వివాహ మహోత్సవము."

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ! మీరు ఇస్తున్న ప్రహేళికలను చూసి పొందిన ప్రేరణతో ఒక ప్రహేళికను తయారుచేసి నా బ్లాగు తురుపుముక్కలో పెట్టాను. శంకరాభరణం పాఠకులకు ఒకసారి దానిని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.
    http://turupumukka.blogspot.com/2010/11/blog-post_11.html

    రిప్లయితొలగించండి
  8. మురళీ మోహన్ గారు ఇప్పుడే అనుకోకుండా చూసాను. మీ తురుఫు ముక్కలొ

    రిప్లయితొలగించండి
  9. కోడీహళ్ళి మురళీ మోహన్ గారొక్కరే 100% సరియైన సమాధానా లిచ్చారు. వారికి ధన్యవాదాలు.
    ప్రయత్నించిన గన్నవరపు నరసింహ మూర్తి గారికి, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారికి, భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి, మంద పీతాంబర్ గారికి, రాజేశ్వరి నేదునూరి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి