31, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1221 (కలి గలిగిన వానియింట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కలి గలిగిన వానియింట కలవే సుఖముల్.
ఈ సమస్యను పంపిన ప్రభల రామలక్ష్మి గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. కలిపురుషుని కారణ మున
    నలు డప్పుడు విడిచి యే గ నల దమ యంతిన్
    గల గల యే డ్చెను నాస తి
    కలి కలిగిన వాని యింట కలవే సు ఖ ముల్

    రిప్లయితొలగించండి
  2. కలి మహిమ నెరుగని జనులు
    కలికాలమునందు తాము కలతలు పడుచున్,
    కలియుగ దేవుని తలచరు !
    కలి కలిగిన వానియింట కలవే సుఖముల్!?

    రిప్లయితొలగించండి
  3. కలహము లుండెడి యింటను,
    కలతల సంసారమందు, కలదే సౌఖ్యం?!
    బలసత్వమున్న యింటను,
    కలి కలిగిన యింటను, కలవే సుఖముల్?!

    రిప్లయితొలగించండి
  4. పులిసినపోయిన కాసిని
    కలినీరైనను దొరకక కంజరమున యిం
    గలమునుఁబోలెడు అఱ్ఱాఁ
    కలి గలిగినవాని యింట కలవే సుఖముల్ ||

    రిప్లయితొలగించండి
  5. కలికలిగిన కలతగలుగు
    కలవరమేమిగులుజనుల కాపురమందున్
    కలకల నవ్వులు విరియని
    కలి కలిగిన వాని యింట కలవే సుఖముల్

    రిప్లయితొలగించండి
  6. కలహము లాడెడు యింటిన
    కలియంబలయినదొరకదు కలదే కలిమిన్
    చెలిమే కరువై పోయిన
    కలి గలగిన వాని యింట కలవే సుఖముల్

    రిప్లయితొలగించండి
  7. కలకాలమాలు మగలును
    విలసిత ప్రేమానురాగ విమలాత్మలతో
    గలసిమెలసి యుండక గడు
    కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్.

    రిప్లయితొలగించండి
  8. తెలియుచు తీర్చగ పరులా
    కలి, గలిగిన వాని యింట కలవే సుఖముల్
    తెలిసియు తీర్చక పరులా
    కలి, గలిగిన వాని యింట కలవే సుఖముల్ ?

    రిప్లయితొలగించండి
  9. లలిత గుణమ్ములు విద్యలు
    నలరారెడు నింట కలుగు నఖిల సుఖంబుల్
    పలు దుర్గుణములు కల టె
    క్కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్

    (టెక్కలి : గజదొంగ)

    రిప్లయితొలగించండి


  10. విలువగు నగలను దాల్చుచు
    వెలగల దుస్తులను గట్టి ప్రేమరహితమై
    మెలగుచు తృప్తిని పొందక
    కలి కలిగిన వాని యింట కలవే సుఖముల్?

    రిప్లయితొలగించండి
  11. కలుములు లేకయు, లేమిని
    నిలుగడువక దినదినమ్ము నీల్గుచు, మదిలో
    పల పలు బాధ లనెడు నాఁ
    కలి కలిగినవాని యింటఁ గలవే సుఖముల్?

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా అబ్బాయిని రేపు డిస్చార్జ్ చేస్తారు. ఇప్పుడే ఇంటికి వచ్చాను. భోంచేసి వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి.
    నా అనుపస్థితిలోనూ నిరుత్సాహపడక చక్కని పూరణలు చేస్తున్న మిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. కలిమిని లక్ష్యము జేయక
    నిలు వెల్ల విషము నింపి నీమము లేకన్
    పలుగాకుల జత జేరిన
    కలి గలిగిన వాని యింట కలవే సుఖముల్ ?
    -------------------------------------
    నెలరాజు వెన్నె లందున
    చెలి చేరువ నున్నగాని చెలిమియె లేకన్
    కలహపు కలతల ముంచిన
    కలి గలిగిన వానియింట కలవే సుఖముల్ ?

    రిప్లయితొలగించండి
  14. అలిగిన పతి కర మెత్తిన!
    పలు నిందల జేయ తరుణి! పట్టి సతిని లెం
    పల వేయ! చేత సతి రో -
    కలి కలిగిన! వాని యింట కలవే సుఖముల్?

    రిప్లయితొలగించండి
  15. పండిత, సాహితీ మితృలందరికి,
    దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  16. తలతిరిగెడు నొక రోగము
    కొలువైయున్నట్టి మేను కొరతల మదిలో
    కలత పడెడు వేళలలో
    కలి గలిగిన వానియింట కలవే సుఖముల్.

    రిప్లయితొలగించండి
  17. "జొన్న కలి జొన్న యంబలి..."
    ...శ్రీనాథుడు ఉవాచ


    పలు విధముల పాయసములు
    విలువగు బిరియాని పూరి వేపుడు కూరల్
    ఫలములు లేకయె జొన్నల
    కలి గలిగిన వానియింట కలవే సుఖముల్

    రిప్లయితొలగించండి


  18. చెలియలి కట్టన్ ద్రెంచుచు
    బలమైనటి వాగ్ఫటిమన పదుగురి మెప్పుల్,
    వలమురితాలుపు సతి కను
    కలి గలిగిన వానియింట కలవే సుఖముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి