17, జనవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1296 (కాశి యతిపవిత్రము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాశి యతిపవిత్రము గద క్రైస్తవులకు.

20 కామెంట్‌లు:

  1. వైదిక మతస్థులై యొప్పు వారి కెల్ల
    విశ్వనాథుని క్షేత్రమై వెలయుచుండు
    కాశి యతిపవిత్రము కద, క్రైస్తవులకు
    పావనములు బెతెల్హేం వంటి వగును

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    వారి ఉద్దేశ్యం ప్రపంచాన్నంతా క్రైస్తవం చేసెయ్యడం !
    అందుచేత వారి దృష్టి ముఖ్యంగా హిందూ పుణ్య క్షేత్రాల పైనే !
    అందుకే కాశి వారికి పవిత్రం (అంటే very very important అన్నమాట !

    01)
    ____________________________

    క్రైస్తవంబును పెంచుటే - కారణముగ
    కలుష పరుపగ నెంచుట - కాశి నకట
    కట్టలను జూపి జనులను - క్రైస్తవమున
    కలుప నెంచుట వలనదె - ఖచ్చితముగ
    కాశి యతిపవిత్రము గద - క్రైస్తవులకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  3. శ్రీ వసంత కిశోర్ గారి అభిప్రాయాన్నే అందుకొని పూరిస్తున్నాను.
    కాశీపుణ్యక్షేత్రంలో మత,నామపరివర్తనలు చేయాలనే ఆకాంక్ష క్రైస్తవ సోదరులకు కలుగకుండునట్లు ఆ విశ్వనాథుడు అనుగ్రహించుగాక.

    అవని నన్నింటి కంటెను హైందవులకు
    కాశి యతిపవిత్రము గద, క్రైస్తవులకు
    ధర్మపరివర్తనాకాంక్ష తగ్గుగాక,
    వారు కన్యాకుమారిని మేరియనిరి.
    (క్రైస్తవులు 'కన్యాకుమారిని''కన్యకామేరి'గా వాదిస్తుంటారు.)

    రిప్లయితొలగించండి
  4. ముస్లిములకు వారమునను ముఖ్యమగును
    శుక్రవారము, మరియాది చూడగాను
    వినుడు సావిత్రి, సంగీత, విస్సు, కృష్ణ,
    కాశి, యతిపవిత్రము గద క్రైస్తవులకు.

    రిప్లయితొలగించండి
  5. క్షేత్రరాజంబు లన్నింట క్షితిని జూడ
    కాశి యతిపవిత్రముగద, క్రైస్తవులకు,
    హిందు, ముస్లిము, సిక్ఖ్వాదు లందరకును
    స్థానమై యొప్పునది యనుమాన మేల.

    రిప్లయితొలగించండి
  6. ముస్లిములకు మక్కాకద పుణ్య భూమి
    హైందవుల కెల్ల విశ్వనా థాల యేల
    కాశి యతిపవిత్రము కద , క్రైస్తవులకు
    శుద్ధ వసుధ ' బెత్లేహం' సుజుష్యమాయె .

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా!
    నా పద్యము ఆఖరి పాదములో టైపు పొరపాటు దొరలినది. బెథెల్హేము అని చదువుకొందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకి వచ్చిన కొద్దిపాటి పూరణలను చూద్దాము:
    అందరికి అభినందనలు.

    శ్రీ వసంత కిషోర్ గారు క్రైస్తవుల మతప్రచారము గురించి ప్రస్తావించేరు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ హరి....మూర్తి గారు 2 పద్యములు చెప్పేరు.
    1. క్రైస్తవుల మత పరివర్తనాకాంక్ష.
    2. కాశి అన్ని మతముల వారికి స్థానమే కదా అన్నారు.
    పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు కొన్ని క్రొత్త విషయములను ప్రస్తావించేరు. వినూత్నముగ నున్నది. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు మంచి విరుపుతో పద్యమును చెప్పి సమస్యను పరిష్కరించేరు. పద్యము బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  9. క్షేత్రముల లోన నెన్నగ క్షితిని నుండు
    కాశి యతి పవిత్రము గద, క్రైస్త వులకు
    బెథలె హేము ప విత్రము భీ మసేన !
    ధాత్రి దైవప్ర ధానము క్షేత్రము లగు

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి సమస్యకు మంచి మంచి పూరణలు చెప్పిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    వసంత కిశోర్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారికి,
    నా అనుపస్థితిలో మిత్రుల పద్యాలను సమీక్షిస్తూ తగిన సలహాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు శతసహస్ర వందనాలు. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    జన్మ తరియింప హిందువుల్ జనగ దగును
    కాశి యతిపవిత్రము గద; క్రైస్తవులకు
    నటులె యగు బెత్లహొమును, హజ్ యు ముస్లి
    ములుకు భక్తిని జూపి దేముని నుతింప

    రిప్లయితొలగించండి
  12. శైవ భక్తులకు నతి పూజ్యమగు నట్టి
    పావనక్షేత్ర ముత్తర భారతమున
    కాశి; యతి పవిత్రము గద క్రైస్తవులకు
    ప్రార్థనామందిరములన్ని వసుధలోన.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులకు శుభాశీస్సులు.
    మరికొన్ని పూరణలను చూద్దాము.
    అందరికి అభినందనలు.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. ప్రధాన సుక్షేత్రములగు అని సవరించుదాము

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    మంచి పద్యము చెప్పేరు. కాళహస్తి మరియు వాటికన్ సిటీలను కూడా ప్రస్తావించేరు.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీ పద్యములో టైపు పొరపాటులు దొరలినవి
    ముస్లిములకు అని -- మరియు -- దేవుని అని సవరించెదము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మంచి విరుపుతో మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    నిర్గుణుoడునిరాకార నిశ్చలుండు
    ఆయహోవాయె ఈశ్వరుడై వెలసెను
    లింగరూపముగా జ్యోతి లింగముగను
    కాశి యతి పవిత్రము గద క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    అన్ని రూపములలో, అన్ని నామములతో అంతటా ఉండే దేవుడు ఒక్కడే. ఈ విషయమును అందరు అంగీకరించితే చాలా మంచిది. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  17. గోలి హనుమచ్చాస్త్రీ గారి పద్యము వివరించ మని విన్నపం

    అర్థం కాలేదు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. జిలేబీ గారూ,
    ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లల్ని సంబోధించి ఇలా చెప్తున్నాడనుకుందాం. "సావిత్రీ! సంగీతా! విస్సూ! కృష్ణా! కాశీ! ముస్లిములకు శుక్రవారం పవిత్రమైనది. మరి ఆది(వారం) క్రైస్తవులకు ప్రవిత్రం" (సమస్యలోని కాశిని సంబోధనగా మార్చారు)
    ఇక్కడ శాస్త్రి గారు కేవలం ‘ఆది’ అనడం యోచించదగినదే!

    రిప్లయితొలగించండి