29, జనవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1308 (కటికిచీఁకటి నొసఁగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కటికిచీఁకటి నొసఁగె భాస్కరుఁడు వచ్చి.

24 కామెంట్‌లు:

  1. ముచ్చటకు మంత్ర మొక్కమా రుచ్చరింప
    కన్నె కుంతికి పుత్రుని కర్ణు నిచ్చి
    యమిత సంభ్రమమును విషాదమును గూర్చి
    కటికి చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    సూర్యుడు వచ్చినా గ్రహణ సమయంలో చీకటే గదా :

    01)
    ______________________________

    అమృత పానమ్ము నాటి యా - యనుశయమున
    గ్రహణ సమయము నందిది - కలుగు నెపుడు !
    అగువు సూర్యుని పూర్తిగా - నాక్రమించ
    కటికిచీఁకటి నొసఁగె భా-స్కరుఁడు వచ్చి !
    ______________________________
    అనుశయము = కక్ష
    అగువు = రాహువు

    రిప్లయితొలగించండి
  3. నేమాని వారి ప్రేరణతో :
    భాస్కరుడు వచ్చి బ్రతుకు చీకటి చేసాడన్నది -కుంతి తలపు :

    02)
    ______________________________

    క్షణము తలచిన మాత్రము - కరుణతోడ
    కలికి కుంతికి బిడ్డగా- కర్ణు నిడిన ;
    తనకు యపవాదమని కుంతి - తలచె నిట్లు
    "కటికిచీఁకటి నొసఁగె భా-స్కరుఁడు వచ్చి" !
    ______________________________

    రిప్లయితొలగించండి
  4. తల లేని సైంధవుని మొండెం యిసుకలో పడింది
    చూచిన దుర్యోధనుడు
    సూర్యుడొచ్చినా,దుశ్శల బ్రతుకు చీకటయ్యిందే
    యని బాధ పడ్డాడు :

    03)
    ______________________________

    సైంధవుడు తల తెగి , పడ - సైకతమున,
    చూచి నిట్టూర్చి రారాజు - సురిగి; తలచె
    "దూరమౌటను తన పతి - దుశ్శలకును
    కటికిచీఁకటి నొసఁగె భా-స్కరుఁడు వచ్చి" !
    ______________________________
    సురుగు = బాధపడు

    రిప్లయితొలగించండి
  5. అస్త మించని రవిబింబ మలుక చెంది
    దిశను మార్చగ తేరుపై వెసను మరచి
    మబ్బు కన్నెలు ముసురుచు మంత్ర మేయ
    కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

    రిప్లయితొలగించండి
  6. కనగ నొకనాటి యుదయాన పెనుతుఫాను
    సాగి యచ్చోట సర్వనాశన మొనర్చె,
    ఈప్రమాదము నిట్లు భావించవచ్చు
    కటికి చీకటినొసగె భాస్కరుడు వచ్చి.

    రిప్లయితొలగించండి
  7. గుండా సహదేవుడు గారి పూరణ....

    నందమూరి రామారావు నందలంబు
    కపట రీతిని సాధించి కాలు బెట్టి
    గెలుపు నిచ్చిన యభిమాన గృహము లందు
    కటికిచీఁకటి నొసఁగె 'భాస్కరుఁ'డు వచ్చి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    శీతలముచేత నిశిని కాశ్మీరునందు
    తారలిడుకాంతి వనమున తనరలేక
    కటికిచీఁకటి నొసఁగె ; భాస్కరుఁడు వచ్చి
    ధవళ కాంతులు ప్రసరింప తళుకుమనదె

    రిప్లయితొలగించండి
  9. మరొక పూరణ

    తరుణ వయసున ముగ్ధయౌతరుణి కుంతి
    కోర దినకరు డొసగెను కొడుకు నొకని
    ఆటగా వరమడిగిన యతివ కకట!
    కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి.

    రిప్లయితొలగించండి
  10. మా బంధువులలో ఇప్పటికీ ఇక్కడ పగలూ అక్కడ చీకటి, అక్కడ పగలూ ఇక్కడ చీకటీ అంటే చోద్యం అనే పాత తరం వారున్నరు.
    ఔనట పడమర విడచి అమెరికాకు
    కటికిచీఁకటి నొసఁగె భాస్కరుఁడు; వచ్చి
    చేరెను విజయవాడకు శీఘ్రముగను
    వెలుగులొచ్చెనిక మనకు వింత గాగ !

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    గురువుగారు మా కొరకు మీరు మీ ఆరోగ్యము పై శ్రద్ధ వహించగలరు.
    ఈ ఉదయము బెంగళూరు లో (express high way లో)ట్రాఫిక్ జామ్ తో వాహనచోదకుడు బలుకు పలుకులు. (రాత్రి పూట ప్రయాణము ఒకింత మంచిదను భావము తో)
    =============*================

    అడుగు దూరమునకు బట్టె నర్థ గంట,
    హైద రాబాదు బోవలె నైదు ఘడియ
    లకు,ఘనమగు మార్గము నందు రయము గాను
    కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి!

    రిప్లయితొలగించండి
  12. చంద్ర గ్రహణము రోజున చందు రుండు
    కటికి చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
    భాస మానపు కాంతుల బ్రభల నింపి
    యుల్ల సిలగంగ జేసెను నుల్ల ములను

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    రాహుదంష్ట్రల జిక్కిన గ్రహణ వేళ
    కటిక చీకటి నొసగె భాస్కరుడు. వచ్చి
    పోవునీరీతి నిడుములు భూరి సత్వు
    లకును ,తలవాల్చ వలయు కాలానుగతికి

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.

    అందరి పూరణలు అలరించు చున్నవి. అందరీ అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. కళలు తరిగిఅమవసన కలువ ఱేడు
    కటికి చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
    వెలుగు వెదజల్లి జగమంత వేడి నింపు
    వనజహితునకు వేవేల వందనములు

    రిప్లయితొలగించండి
  16. తూర్పు కొండల మాటున తొంగి చూచి
    మధ్య దినమున మార్తాండ మహిమ జూపి
    కటికిచీఁకటి నొసఁగె భాస్కరుఁడు వచ్చి
    పడమటింటికి, లోకాల పండ బెట్ట.

    రిప్లయితొలగించండి
  17. సృష్టి క్రమమిది వరుసగ చిక్కువడక
    సాగునట్టుల చూచు నా స్వామియెపుడు
    పగటి యలసటఁ దీర్చగా ప్రాణులకయి
    కటికిచీఁకటి నొసఁగె భాస్కరుఁడు వచ్చి
    పోయి నెవ్వేళల నలసిపోక తరుల
    విరుల నరులకు పుర్వుల ప్రేమతోడ
    పలుకరించెడు చెలికాడు భానుడన్న
    నేమి సందియమున్నది యిందులోన.

    రిప్లయితొలగించండి
  18. పగలు రేయిగ మారగ భయము తోడ
    పక్షు లన్నియు గూళ్ళకు బరుగు దీయు
    గ్రహణ సమయము నందిది కలుగు భువిని
    కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    సూర్యుడు కుంతి జీవితాన్ని అంధకార బంధురం చేసిన విషయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    గ్రహణం, కుంతి, సైంధవ మరణం విషయాలుగా మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    తుఫాను విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండా సహదేవుడు గారూ,
    నాందెండ్ల భాస్కర రావు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒచ్చె’ అన్నారు! అక్కడ ‘వెలుగు లిచ్చె/ వెలుగు వచ్చె’ అందాం.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వరప్రసాద్ గారి పూరణ....

    రాక్షస, యమ కింకరు లెల్ల రాజ్య మేలి
    కటిక చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
    పొంక మలర వెలుగు నిచ్చి పుడమిపైన
    తరిమిగొట్టె తిమిరమును త్రాత వలెను.

    రిప్లయితొలగించండి
  21. కుంతి స్వగతం...

    వెలుగు రేనిని పిలచితే తెలివి లేక
    మంత్ర మహిమను చూడగా మందమతిని
    పట్టినొసగెను నాబాగు పట్టకుండ
    కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కుంతి స్వగతంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
    దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..


    కాంతులీనుచు జగమును కావుచున్న
    కలువగొంగుని కాంతుడు కప్పి వైచి
    కటిక చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
    వెలుగు వెదజల్లె పుడమిని వెల్లువోలె.

    రిప్లయితొలగించండి