7, మార్చి 2017, మంగళవారం

దత్తపది - 108 (కట్టె-నిప్పు-బూది-మసి)

కట్టె - నిప్పు - బూది - మసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

79 కామెంట్‌లు:

  1. కట్టె మా మాలి పందిరి కంచె పైన
    జారె నిప్పుడె బంతులు జాజి పూల
    పక్క నంబూదిరి పసిపాప కిత కితల
    సమసి పోయెను హృది లోన తమస మంత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      దత్తపదాలను అద్భుతంగా ఇమిడ్చారు. 100/100 + 10 (కొబ్బరిచెట్టు మీద కాకుండా దానికి కట్టబడ్డ ఆవుని గురించి వ్రాసానని నిజాయితీగా ఒప్పుకొన్నందుకు appreciatoin marks)

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. రాజేశ్వరి గారు: చిన్నప్పుడు స్కూల్లో కొబ్బరి చెట్టు మీద వ్యాసం వ్రాయమంటే విద్యార్ధి ఆవు మీద వ్యాసం మాత్రం ప్రిపేరుగా ఉండేవాడట. అందుకని ఒక కొబ్బరి చెట్టుకు కట్టబడిన ఆవు మీద వ్యాసం వ్రాసి వచ్చాడట. అలా అయినది నా పరిస్థితి. చూద్దాం సారు ఎన్ని మార్కులిస్తారో! వందనములు!

      తొలగించండి
    2. చిన్న నాటినుండి ఛందస్సు మీద ఉన్నకోరిక ఇప్పుడు గురువులు శ్రీ శంకరయ్య గారి పుణ్యమా అని అణుమాత్రం నెరవేరింది.

      తొలగించండి


  3. తామసి తొలగగ కిరణము
    లా మంచును, నిప్పురంబు లావణ్యముల
    న్నీ మహి పసిగట్టె జిలే
    బీ, మజ! బాబూ, దినంబు బింకెము గాంచెన్ !

    జిలేబి
    (మరీ నిప్పులవంట గా ఉంది దత్తపది సమస్యా పూరణమే మేలు :) ముప్పావు వంతు కష్టపడితే చాలు :) )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందమ్ముకు కట్టె గొలుసు
      పందెము నిప్పుడెను దీర్చి పండుగ సేయ
      న్నందము శంఖం బూదిరి
      కంది గురువుల సమసిలను కాసిరి జిలెబీ!

      తొలగించండి
    2. దత్తపదియె కష్టమనుచు
      నిత్తీరునఁ బలికి నేరు పేర్పడఁ బద్యం
      బెత్తుకొని పూర్తిచేసితె
      సత్తన్వీ! కొనుము నతుల శతము, జిలేబీ!

      తొలగించండి


    3. జీపీయెస్సు వారికి, కంది వారికి

      నమో నమః ! నెనరస్య నెనరః జిలేబీ నామ్యా దురద గొంటాకహ !


      జీపీయెస్సుల పద్యము
      రాపిడి గాంచె! మజ ! శంక రార్యుల వరుస
      న్మీపద్య జోతలు ! జిలే
      బీ పద్య నెనర్లను సరి బేర్చగ రమ్మా !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  4. వరుస కట్టెను భ్రమరాళి యరుస మొదవ
    విరుల నిప్పుడు మధుపాన తరుణ మనుచు
    వేణుకం బూది గొల్లండు పిలువ బసుల
    సాగె పికగీతి తాపంబు సమసి పోయె.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    శిశిరము (గట్టె) జేయ తన చిన్నిప్రయాణము"(నిప్పు)డా సఖా!"
    శశియను,"నెండ తీవ్రతను సాగిన సూర్యుని చల్లబర్చ నే
    నశనవిహీన, తెల్లదియునైన వి(బూది)ని,రా! వసంతమా!
    శిశువుగ బంచ నీ కసి(మసిన్ )విడి పచ్చను బంచు వేళయెన్!"(కసిమసి॥తొట్రుపాటు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా,ఆర్యా, కృతజ్ఞతలు.కనగంటి నీనాడు బ్రశస్తిని!Hard luck may lead to further efforts . TanQ,

      తొలగించండి


  6. బాబూ ! దినాధీశుడా తామసిన్ ద్రోలి భాసింప వృక్షంబులున్నిప్పురంబున్ భళా
    శోభాయమానంబుగా దోచె తాదాత్మ్య శోర్వంబు లొప్పంగ నౌ గట్టె వీధుల్ భళా
    ప్రాభాత వేళన్ మహా యజ్ఞ మయ్యెన్నిభాయింపనీ రాజహంసన్నిటన్వృత్తమై
    సోపాన మార్గంబు గావింపగన్ మేని సొంపెల్ల నీరాయెనౌ, శంకరా, కందితిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఇదేదో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశీలించవలసిన పద్యంలా తోస్తున్నది. కాస్త సమయం ఇవ్వండి.

      తొలగించండి

    2. జీపీయెస్సు వారు

      ఎనిమిది త గణాలు ఒక గ :)


      మాబెంగుళూర్నందు హైటెక్కు బస్సాయె మాపద్య మై రాజహంసాయె శాస్త్రుల్ గనన్ :)

      రాజహంస వృత్తము
      జిలేబి

      తొలగించండి
    3. వందనమ్ములు! ఇప్పుడే గూగులమ్మ నడిగితిని. మొత్తం వృత్తాలు వందకు పైగా ఉన్నట్లున్నాయి !!!

      I quit....

      తొలగించండి






    4. జీపీయెస్సు వారు


      No need to quit !

      Experiment with the below

      http://chandam.apphb.com

      Cheers
      జిలేబి

      తొలగించండి
    5. కరెక్టుగ 60 ఏళ్ళ క్రితం మా ముత్తుకూరు స్కూలు తెలుగు పండితులు శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ గారు మా చెవులు పిండి నేర్పిన ఛందస్సు:



      రెండు మాలలు సీసమ్ము మెండు గాను
      రెండు మృగములు కందమ్ము నిండు గాను
      ఆట వెలదియు కొసరుగ తేట గీతి
      భట్టి గొట్టండ్ర, లేకున్న మొట్టి కాయ!

      తొలగించండి


    6. కందంబాటవెలది సీ
      సం దరిమిల తేటగీతి చంపక మాలన్
      మందారదామ యుత్పల
      ఛందస్సులరయ భళిభళి ఛందమ్ సాఫ్ట్వేర్ :)

      జిలేబి

      తొలగించండి
    7. దత్తపదిలో మూడు పదములు మొదటి పాదం లో వచ్చాయి -బూది-మసి - నిప్పు. కట్టె రెండవపాదంలో వచ్చింది.వృత్తంపేరు మూడవ పాదంలోవచ్చింది. దత్తపది యిచ్చినవారి పేరు నాలుగవ పాదంలో వచ్చింది.వ్రాసిన కవయిత్రికి నమస్సులు.

      తొలగించండి
  7. కట్టె చీరలు గోపికల్ కనుల విందు.
    శంఖ మంబూది పిలచిరి సన్ని హితుల
    సరస కోయిల గీతమ్ము సమసి పోయె
    నిప్పుడే పోయి రాధను మెప్పు కోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      కొన్ని చిన్న దోషాలున్నా (ఛందోదోషాలు కావు) మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  8. కట్టెదుటఁ గాంచితిని గదా కమ్రమైన
    భూజ గిరి లతా శోభ నిప్పుడమిపైన
    పికము లెల్ల వాద్యం బూది సుకముఁ గూర్చ
    వేదనలు సమసి ముదంబు వెల్లివిరిసె.

    రిప్లయితొలగించండి
  9. కట్టెదుటన్ గనన్ ప్రకృతి కమ్ర మనోజ్ఞపు శోభఁ గొంచు ని
    ప్పుట్టువు ధన్యమైన విధి భూరి నగాగ లతా విలాస మి
    ప్పట్టునఁ దోచెఁ బూదివియ భాతి సుమమ్ములు పూచెఁ జూడ ని
    క్కట్టులు వేదనల్ సమసి కాంతులు నిండె హృదాంగణమ్ములన్.
    (పూదివియ = బంగారుపూస)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హృదంగణమ్ములన్... అని చదువుకొన మనవి.

      తొలగించండి
    2. మాస్టరు గారూ! నమస్సులు.
      అద్భుతమైన పూరణలు...

      తొలగించండి
    3. ఆర్యా!
      మీ పూరణలు మనోజ్ఞములు.
      నగాగ - వివరించ ప్రార్థన.

      తొలగించండి
    4. ఆర్యా నగ+అగ+లతా విలాస : కొండలు, చెట్లు లతల విలాసములని గురువు గారి భావమనుకుంటాను.

      తొలగించండి
  10. శెభాష్
    నెనిప్పుడే " కట్టెదుట " అని మొదలు పెట్టి ఎవరైనా రాసారేమొ అని చూసాను. భళా

    రిప్లయితొలగించండి
  11. వరుస కట్టెను మేఘాలు వర్షమీయ
    నిప్పుడిక కురియునువాన నేలపైన
    బూది చఱచిన నేల బోసినవుల
    సమసిపోవును కరువుల ఛాయలన్ని

    రిప్లయితొలగించండి
  12. * బూది చఱచిన నేలన బోసినవుల

    బూదిచఱచు= బూజుపట్టు

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్యగారూ
    మీ పద్యం అత్యద్భుతం

    రిప్లయితొలగించండి
  14. వృక్షములఁ ద్రుంచు టరికట్టె ప్రభుత నియతి
    పల్లెలందున నిప్పుడు పచ్చనైన
    ప్రకృతి, కతన సమసిపోయె పాటులన్ని
    చెలగె జంబూ దిరిసెనపు చెట్లతోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయన రెడ్డి గారూ,
      మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదంలో యతి తప్పింది. నడవటా నికి వెళ్ళే తొందరలో పొరపాటు జరిగింది. మారుస్తాను.

      తొలగించండి
    3. గురువర్యులకు నమస్సులు. మ్రానులను ద్రుంచు టరికట్టె ప్రభుత నియతి - అంటే సరిపోతుందా తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
  15. 'బూది' నన్నే కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నట్టుంది!

    రిప్లయితొలగించండి
  16. ………………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



    కనులను హరిత ప్రకృతి యాకట్టెను గద |


    విమల వాయువు చే గ్లాని సమసి పోయె |


    స్వా౦త మను కేకి హర్ష పి౦ఛమును విప్పి ,


    యాడె నిప్పుడు పరవశ మ౦దు చాహ !


    యవని యన్న పవిత్ర శివాలయమున


    ప౦డు వెన్నెలయె విబూది ప౦డు గాదె ?


    { గ్లాని = అలసట ; కేకి = నెమలి }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి
      ............................


      నేను ప౦పిన పద్యములో

      " విమల వాయువు " అనే సమాసమును


      స్వఛ్ఛ వాయువు " అని స్వీకరి౦చ

      వలెనని ప్రార్థన

      తొలగించండి
  17. మనసు నాకట్టె తరులతల్, వనజ శోభ,
    దాని నేనిప్పుడే చూచినాను,సఖియ
    సొబగు లొప్పారఁ బూ దినుసులు చలంగె
    కనుము! సిరిసిరి పచ్చని కాంతులమరె.

    రిప్లయితొలగించండి
  18. చుట్టూర సమసి పోయెను
    కొట్టగ రజనిని యరుణుడు, బాబూ దినమై
    కట్టెదుట నిండె కాంతులు
    ఇట్టే జీవమ్ము బుట్టె నిప్పుడె గనుమా.

    రిప్లయితొలగించండి
  19. చివరి పాదాన్ని కనుమ సిరిసిరి........అని చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి

  20. కట్టెను దేవుని పల్లకి
    జుట్టెం దా నిప్పురంబు చుట్టును ముదమున్
    బట్టుచు శంఖం బూదిన
    గట్టిగ నిక సమసిపోవు గష్టము లనుచున్!

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. కట్టె పచ్చని చేలను కారికముగ
    పెట్టెను విబూది పై హరిప్రియతిలకము
    రామ సిగలోన మల్లెల దామ మలర
    ప్రకృతికాంత నిప్పుడమికి రాణి జేసె

    రిప్లయితొలగించండి
  23. పచ్చచీరను గట్టె కాశ్యపి బ్రాహ్మవేళను జూడగన్
    విచ్చెపూలువిబూది వోలెను వేడ్కనీయుచు కాంతిగన్
    పచ్చవార్వపు జోదుమెల్లగ వచ్చెనిప్పుడె తూర్పునన్
    వెచ్చవెచ్చగ నర్చి తాకగ వెళ్లె తామసి బూర్తిగన్!!!

    రిప్లయితొలగించండి
  24. తామసి తొలగగ వెలిగెధగధగ మన
    కట్టెదుటన నా బైరుల కంకులవియ
    తనరగ విబూది రంగును బోలి.చూడ
    నిప్పురమగు చోడవరము నొప్పెసామి!

    రిప్లయితొలగించండి
  25. కట్టెదుటఁ గంటి నిప్పుడు
    చుట్టును బచ్చటి పొలములు శోభ లొసంగన్
    గట్టగఁ బూదిని నింపుగఁ
    దట్టపు టెడ్లను నసమ సిత సువర్ణములన్

    [పూది = కాడి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ఊఁదు పదమును వాడుకుందామను కున్నాను. కాని యరసున్న వీలుపడనీయ లేదు.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. గతంలో మూడు వారాలు శ్రీమాన్ శంకరయ్య గారు సెలవులో నున్నపుడు మీరు నా పూరణలపై చేసిన వ్యాఖ్యలు నాకు అమితంగా ఉపయోగించినవి. ప్రస్తుతం మీరు సుందర కాండ రచనలో వ్యస్తులై యున్నారని తెలుసును. ఐనా మీరు వీలు చూసుకొని మరలా శ్రీమాన్ శంకరయ్య గారు వచ్చే వరకూ నా పూరణలపై దయా దాక్షిణ్యం లేకుండా స్పందించ వలెనని నా ప్రార్ధన. నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  26. ………………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



    కనులను హరిత ప్రకృతి యాకట్టెను గద |


    స్వచ్చ వాయువు చే గ్లాని సమసి పోయె |


    స్వా౦త మను కేకి హర్ష పి౦ఛమును విప్పి ,


    యాడె నిప్పుడు పరవశ మ౦దు చాహ !


    యవని యన్న పవిత్ర శివాలయమున


    ప౦డు వెన్నెలయె విబూది ప౦డు గాదె ?


    { గ్లాని = అలసట ; కేకి = నెమలి }

    రిప్లయితొలగించండి
  27. . హేవళంబను నాకట్టె భావ కవిత
    సమసిపోనిది ప్రాకృతి సహజమేగ|
    నిప్పుడే విరియుకుసుమాల్ గుప్పుమనగ|
    గాలి సుమగంధ మున్ బూది తేలిపోయె|
    2.ఎండగట్టెను వేడిమి మెండుగాను|
    నిప్పుడే గ్రీష్మమేతెంచె|చెప్పమార్చె
    బూదిచఱచున?ప్రాకృతుపాదిమనకు
    సమసిపోనిది|సహజాన సాకగలది| {బూదిచఱచున=బూజుబట్టున}



    రిప్లయితొలగించండి
  28. పచ్చనైన పచ్చిక పాన్పుగాగ
    పూలనేస్తాలు సుస్వరంబూది చెలగ
    పవనుడు పరవశమునను పలుకరింప
    కట్టెదురవని కమ్మని కావ్యమవగ
    నిష్ఠురంబులు, నిందలు నిప్పుడేల?
    సమసిపోవగ వెతలన్ని శాంతి నొంద
    బాల విహరింతు మేలీల బంధ మొదవ!


    గురువుగారికి ప్రణామాలు! పద్యపాదాలు కొంచెం యెక్కువ యైనట్లున్నాయి! ప్రకృతి వర్ణనయనగానే కాస్త శ్రుతి మించింది! క్షమించాలి!
    రాయప్రోలువారి గాలి సోకింది!

    రిప్లయితొలగించండి
  29. మొదటి పాదంలో సవరణ! టైపులో దోషం!

    పచ్చనైన పచ్చికనేల పాన్పుగాగ గా స్వీకరింపగలరు!

    ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  30. సమసి పోవఁగ శిశిరము సమయ మరసి
    కట్టె పచ్చని పందిరి కానలోన ,
    నిప్పుడేతెంచు నామని నిక్కమనగ
    ప్రకృతి పలికె శంఖంబూది పట్టణమును

    నిన్నటి సమస్యకు నా పూరణ

    చెఱబట్టిరి యశ్వంబు
    న్నరయఁగ రాముని కుమారు; లల్లా క్రీస్తుల్
    నర రూపమును వహించిన
    పురుషోత్తము డనగవచ్చు భువి తరియించన్

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఎల్లుండి నుండి ప్రారంభం కానున్న మా దక్షిణ దేశ తీర్థయాత్ర గురించి ఏర్పాట్లలో వ్యస్తుణ్ణై మీ పూరణలపై స్పందించలేకపోతున్నాను. 19వ తేదీ వరకు సమస్యలను షెడ్యూల్ చేస్తున్నాను. దారిలో అవకాశం, నెట్‍వర్క్ ఉంటే మీ పూరణలను చూసి వ్యాఖ్యానిస్తూ ఉంటాను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  32. నమస్కారములు
    చాలా సంతోషంగా ఉంది. చక్కగా పదిరోజులపాటు ఇవన్నీ పక్కకిపెట్టి హాయిగా సంతోషంగా మా మరదలు మీరు అన్నీ చూసి రండి. అశీర్వదించి అక్క

    రిప్లయితొలగించండి
  33. ఆమనియె చేరె నిప్పుడు కామిని ధర
    లేమ సిచయము నేకట్టె నేమొ పల్ల
    వించిన నవ పల్లవముల వింత శోభ
    నల్లనయ్యశంఖంబూదినట్లు కొదమ
    తేటులు రవళించి భ్రమించె తేనె గోరి.

    రిప్లయితొలగించండి
  34. రవియె సమరశంఖంబూది రణము జేయ
    బిలువ దామసియే పారె, పులుగు రాశి
    కూయ జతకట్టె నిప్పుడు కుక్కుటమ్ము
    లంకురించెమరో రోజె యవని యందు

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    కట్టెను గూడు నేఁడు గిజిగాఁడు! మనోహరమైన రీతిఁ దా
    నెట్టులఁ గట్టెనో, యదియు నిప్పుడుఁ గాంచఁగఁ గోరుచుంటి! సం
    ఘట్టన మద్భుతాప్తిఁ బలుకం, గొన బూఁదిన పిల్లఁగ్రోవియే;
    తట్టియు లేపునయ్య ఫలితమ్మిడు వారిమసి న్మయూరియై!

    [గొనబు + ఊఁదిన = మనోహరముగ నూఁదిన; వారిమసిన్ = మేఘమును]

    స్వస్తి
    మధురకవి గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  36. కడు రమ్యముగను కట్టె ప్రకృతి కాంత
    తొలగె తామసినిల తూరుపు దిశ
    నుదుటతావిబూదినుంచుకొనుచు వచ్చె
    నిప్పుడెకనరండు నెనరు తోడ.

    కట్టెను సుతుడు పందిరి ఘనముగాను
    నిప్పుడేచూచి వచ్చెద నేనటంచు
    నువిద తావిబూది నుదుట నుంచుకొనుచు
    తామసియని వెరువకయే తరలి వచ్చె.

    రిప్లయితొలగించండి
  37. గువ్వ గోరింక జతకట్టె కొమ్మపైన
    నామనిప్పుడె యేతెంచెనా మహికన
    సుస్వరంబూదినట్టుల శుకములలరి
    కూయఁగన్ లేమ సిగ్గునన్ గులుకులొలికె

    రిప్లయితొలగించండి
  38. 👉కవి పేరు:-
    _*గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ సాహిత్య పురస్కార విదిత*_
    _*సహస్రకవిభూషణ*_
    _*శ్రీమతి జి సందిత బెంగుళూర్*
    👉తేదిః- *07-03-2017*
    👉పద్య సంఖ్య:-
    👉SVD సంఖ్య:- *23*
    👉అంశము:- *శంకరాభరణం దత్తపది కి పద్యము*

    తేది - 07-03-2017 (మంగళవారము)

    *దత్తపది*


    *కట్టె - నిప్పు - బూది - మసి*

    *పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ*
    *పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ*

    *కట్టె *గువ *నిప్పు *వులచె*
    *ట్లట్టులకన్పట్టెను కదలన్ భువిలో*
    *పుట్టినకల్పతరువనన్*

    *బుట్టనఁ* *బూది*వ్వెలమెరపుల భ్ర *మసి**లగ కనుల్*





    *గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ సాహిత్య పురస్కార విదిత*_
    _*సహస్రకవిభూషణ*_
    _*శ్రీమతి జి సందిత బెంగుళూర్*

    రిప్లయితొలగించండి
  39. కాంచ సుందరోద్యానమ్ము కట్టెదుటను
    ఏమి యానందమగును కన్నిప్పువేళ
    యొప్పెనే మలయమారుతంబూది నట్లు
    సమసి పోయెనుగా ప్రదూషణ జడమ్ము

    రిప్లయితొలగించండి
  40. కందము:
    చుట్టిన నిశి పోయె సమసి
    పట్టుచు సూర్యుండు గొట్ట బాబూ దినమై
    కట్టెదుట నిండె కాంతులు
    ఇట్టే జీవమ్ము బుట్టె నిప్పుడె గనుమా.

    రిప్లయితొలగించండి
  41. గోలి వారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  42. నరుడు నేలకూలినను కట్టెబేర్చి నిప్పు
    పెట్టెదురు కట్టెకాలి బూడిదగును
    ఆ మసిపూసికొనెను విబూదిలాగ
    శివఅగోరాలు శవము శివమయెగనుక

    రిప్లయితొలగించండి