23, మార్చి 2017, గురువారం

పద్యరచన - 1232

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

34 కామెంట్‌లు:

  1. కాకర స్వాస్థ్యంబున కెపు
    డాకరమై వెలుగుచుండు నతి హర్షదమై
    శాకంబుల నుత్తమమై
    చేకొను వారలకు గూల్చు చీకాకు లీలన్.

    చేకుర జేయు హర్షమును శ్రేష్ఠము శాకము లందు జూడగా
    సాకుచు నుండు లోకులను సన్మతి దానిని స్వీకరించినన్
    దాకవు రోగసంతతులు తద్యుతమై వెలుగొందు స్ధానమున్
    కాకర సేవనంబు కలకాల మవశ్యము మానవాళికిన్.

    చేదుగ నున్న నేమి పరిశీలన చేయగ నెల్లరీతులన్
    మోదము గూర్చు సత్యమిది ముక్కలపాకము చేసి తిన్నచో
    స్వాదుతరంబుగా భువిని సత్త్వము గూర్చుచు రక్తశుద్ధి తా
    నాదర మొప్ప జేయునది యన్నివిధాల బరోపకారియై.

    చక్కని రూపమున్ మరియు సర్వ శుభంకరభావ మందుచున్
    మిక్కిలి లాభదాయి వయి మేదినిపై వెలుగొందు చుందు వీ
    వక్కట నన్నిప్రాంతముల నౌషధతుల్యగ కీర్తినందు నీ
    వెక్కడనున్న నక్కడ నదెంతయు హర్షము చేరు కాకరా!.

    భూజనులారా కాకర
    నోజం గొనుచుండ గలుగు చుండును ముదముల్
    మీ జయము గోరు దీనిని
    భోజనమున స్వీకరించి పొందుడు సుఖముల్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా!
      మొదటి కందంలో చివర - చీకాకు లీలన్ - కు బదులుగా - చీకాకు లిలన్ - అని చదువ ప్రార్థన.

      తొలగించండి
    2. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      అద్భుతంగా ఉంది మీ 'కాకర' ఖండకృతి. అభినందనలు.
      దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటించాను.

      తొలగించండి
  2. దోర కాకర జూడుము తోయ జాక్షి !
    యెంత బాగుగ నున్నదో నంత చేదు
    కలిగి రక్తప్ర సరణము గట్ట డించు
    వరుస దప్పక వాడుము ప్రతిది నమ్ము

    రిప్లయితొలగించండి
  3. ఆకలి చించిన కడుపుకు
    కాకర రసమైన రుచికి కమ్మగ నుండున్
    కోకిలలు లేని వనమున
    కాకుల గోలైన కవుల కవితకు చాలున్

    రిప్లయితొలగించండి


  4. భీకర రక్త పోటునకు బిత్తరు బోవగనేల నెచ్చెలీ
    గైకొనుమమ్మ వైద్యముగ ఘాటుగ చారు, మరింత చిక్కగా
    కాకరకాయ చేదు గొను కమ్మగ మేలు శరీర మేల్మికి
    న్నీకడుపారు నమ్మ, మజ ! నిమ్మళ మౌను జిలేబి సర్వదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగుంది.
      'రక్తపోటు, శరీర మేల్మి' దుష్టసమాసాలు.

      తొలగించండి


    2. బ్లడ్ ప్రెషర్ ని తెలుగు లో యేమందురు :)

      జిలేబి

      తొలగించండి
    3. "రక్త పీడనం"..."పాద పీడనం" వలె ;)


      http://m.gotelugu.com/issue195/5057/telugu-columns/bad-habits-part-in-heart-attack/

      తొలగించండి
  5. కాకర కాయలు పండిన
    భీకర మైనట్టి చేదు వీడిన రీతిన్
    రోకలి దెబ్బలు తినగనె
    రూకలు తేనట్టి మగని రోగము కుదురున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      కాకర కూరకు, రోకలి దెబ్బకు ముడి పెట్టారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.

      తొలగించండి
  6. శుక పిక కాకమ్ము లెకా
    యెకి కొఱుకుట కనము కలనయినఁ దిక్తమునన్
    సుకరముగ వంటకమ్ములు
    సకలమ్ముల రుచికరమ్ము సారకరమ్మున్

    రిప్లయితొలగించండి
  7. కాకరకాయల కూరయె
    చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్
    ప్రాకటమగునౌషధిగను
    శాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!!

    కలరా నరికట్టునిదియె
    వలమును తగ్గించు, కంటి వ్యాధులనెల్లన్
    పొలుపుగ దూరము జేయుచు
    చెలువమునిడు కాకరదిన చెలియల్లారా!!!

    అదనమగు చేదు యున్నను
    మధుమేహమ్మునకు మంచి మందిది యిలలో
    అధికబరువు దగ్గించగ
    వదలక సేవించ రసము వర కాకరనే!!!


    మక్కువతో చేదు దినిన
    చక్కెరవలెనుండుననుచు జనులకు పదమున్
    చక్కగ దెల్పెను వేమన
    నిక్కము, సందేహమేల? నెరుగరె మీరున్!!!


    బాగగు హరితపు వన్నెను
    దాగుచు పత్రములనడుమ తనరెడునిన్నున్
    తీగల తూగుచు జూడగ
    సోగగ మరియుండునీకు జోహార్లివియే!!!

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    చాలా బాగున్నది మీ ఖండిక. అభినందనలు.
    'చేదు+ఉన్నను' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "అదనముగా చేదున్నను" అనండి.

    రిప్లయితొలగించండి
  9. కాకర యారోగ్యమిడును
    కాకర మాకరము రుచికి కమ్మగ వండన్
    కాకర కీకర యనుచును
    కాకర దూషింప దగదు కలలో నిలలో!

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. కాకరవంటల కరకర
    సాకును షడ్రుచులు గూడి సామాన్యుడినే|
    లోకుల కౌషధగుణమౌ
    కాకర నిన్నెంచతరమ?కవికిన్ భువిలో?
    2.చేదు,నిజంబు లే ప్రతిభ చెప్పుటకెవ్వరి కౌనుకాకరా
    మోదము నింపు నీరుచులు ముఖ్యముగా మధుమేహరోగులున్
    కాదనలేరు యెప్పుడును కమ్మదనంబును లేని దైన సం
    భోదనజేయలేనిదగు,పూర్వులనుండియునేటికాలమున్|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      'లేరు+ఎప్పుడును' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
  12. చక్కని కాకర పండును
    చిక్కగ నున్నట్టి పెరుగు చెక్కుల బుక్కున్
    ఫక్కున నవ్వెడి పడతిని
    గ్రక్కున విడువంగ వలయు గదరా శాస్త్రీ


    ...మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి....

    (పూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణతో)

    రిప్లయితొలగించండి
  13. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    కుశలానుయోగ నమస్కారములతో,

    పై చిత్రాన్ని చూచినప్పటి గృహచిత్రం:

    "పైకొనెఁ గోర్కి స్వీటుకయి పైదలి, నాకయి చేయవే!" యనన్,
    "గాఁకర స్వీటుఁ జేతు" ననెఁ గాంత పతిం గని నవ్వుమోముతోఁ;
    "గాఁకర వేయకుండఁగనె కాఁకర చేఁదును వంట లన్నిటం
    దేఁకువఁ దేకయుండవు గదే, మఱి స్వీటున కేల?" యంచుఁ జీ
    కాకగు రూపుఁ జూపు పతిఁ గాంతయుఁ జేరిచెఁ దీపికౌఁగిటన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఏ వయసు కా ముచ్చట అంటే యిదేనేమో ;)

      అదురహో ఏల్చూరి వారు

      జిలేబి

      తొలగించండి
    2. ఏల్చూరి మురళీధర రావు గారూ,
      మహాకావ్య ప్రారంభంలో ఇష్టదేవతా స్తుతి పద్యం చదివిన అనుభూతిని కలిగించారు. అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
    3. జిలేబి గారి సహృదయ-హృదయ-దయకు ☺,
      శ్రీ శంకరయ్య గారి నిరంతరాయిత ప్రోత్సాహానికి 👍

      కృతజ్ఞుణ్ణి!

      తొలగించండి
  14. దరిజేరదు మధుమేహము
    విరిసేనిక చర్మ కాంతి వెలయును కురులే
    పరిశుద్ధిగ కార్జము కా
    కర చేసిన మేలునెన్న కష్టము గాదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'విరిసేను' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'విరిసెడు నిక..' అనండి.

      తొలగించండి
  15. తేః కాంచికాకర గాయల్ దుకాణమందు
    కోరికొనితెచ్చితిన్ నేడు కూరకొరకు
    ఉల్లికారముతోఁ గూర్చి చెల్లివండ
    పయనమయ్యెనుతిని మది స్వర్గమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      బాగుంది మీ పద్యం. అభినందనలు.
      'స్వర్గపయన'మంటే అర్థ వైపరీత్యం ఉంది. రెండర్థాలూ స్వీకరించవచ్చు!

      తొలగించండి