9, మార్చి 2017, గురువారం

సమస్య - 2303 (పడమటం బొంచె రవి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పడమటం బొంచె రవి సుప్రభాతమందు"
లేదా...
"పడమటఁ బొంచి చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

43 కామెంట్‌లు:

  1. పుష్య పూర్ణిమ వేకువ పుణ్య తిథిన
    ప్రియ సఖిని గూడి పొర్లగ ప్రేమ తోడ
    పూర్ణ చంద్రుడు పొర్లి యుప్పొంగి క్రుంగె
    పడమటం; బొంచె రవి సుప్రభాతమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీమాన్ శంకరయ్య గారు ఉవాచ:

      "సాంబమూర్తి గారూ, సుప్రభాతం! 'పొర్లు' శబ్దం సాధువే. శబ్దరత్నాకరంలో ఉంది."

      తొలగించండి


    2. పొర్లుదండము గుజ్జువేలుపు బొజ్జదేవ వినాయకా !
      యర్లమర్లన చేరినానిట యయ్యవార్ల సమూహమున్
      సర్లిగానగ గావుమమ్ముల చక్కగానగ పద్యముల్
      యిర్లగొంగడి కంటెముందర యిచ్చగానగ వత్తు నే :)

      జిలేబి

      తొలగించండి
    3. మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల ముద్దుగా

      తొలగించండి
  2. దశమి వెన్నెల విరిసిన తరుణ మనగ
    పడమ టంబొంచె రవిసుప్ర భాత మందు
    చెలియ కౌగిలి వీడని చలువ ఱేడు
    అలిగి విరహాన సడలెను చిలిపి వలపు

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
    పక్షపూర్ణతగని విష్ణు ప్రజల జూడ
    రెండు కన్నులు విప్పెనా నిండు కృపను?!
    పౌర్ణమిని శశి భాసించె భానుపగిది;
    పండు ఖరకర స్వర్ణపు ప్రభల నిచ్చి
    పడమటంబొంచె రవి సుప్రభాతమందు!

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    "గడనను బూర్ణుడాయె శశి గాంచగ ముచ్చట యాయె, నా ప్రభన్
    యెడనెడ నిచ్చితిన్ గనను యిప్పుడె పూర్ణిమనాడె సాధ్యమం"
    చడుగిడె పశ్చిమాద్రిని నసాధరణంబగు హేమ మిచ్చుచున్
    పడిపడి చూచిరా కవులు భానునిగా శశినెంచి యూహలన్
    బడమట బొంచి చూచెనట భానుడుషోదయ కాంతులీనుచున్!!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టానుండి వివరణ
    ,1.ఇన శశి నయనుడు విష్ణువు.పౌర్ణమితో శుక్ల పక్షం పూర్తి ఔతుంది.చంద్రుని ఆధారంగా గణన చాంద్ర మానము.విష్ణువు ప్రజలనొకపరి చూద్దామనుకున్నాడు.చంద్రుడు ‌సూర్యునియంత బింబంగా తూర్పున ఉదయించినాడు.ఆనాటి మలి సంధ్యకుబంగారు రంగు వచ్చింది.ఇది సహజం.ఇది సూర్యుని నుండి వచ్చినదే.అది సుప్రభాత వేళ యని అనుకున్నారు, భావుకులు. సూర్యుడు పడమరనే దాగినాడు.అది మలి సంధ్యయే.

    రిప్లయితొలగించండి
  6. నా పూరణలు....

    1)
    రవి సుజాతలు ప్రేమికుల్, రమ్యమైన
    జంట, పెద్దలు కాదన్న నింటినుండి
    లేచిపోవఁగ నెంచి పల్లియ వెలుపల
    పడమటం బొంచె రవి సుప్రభాతమందు.

    2)
    విడువఁగ రాని బంధమునఁ బ్రేమికు లెల్లరు మోదమందఁగా
    నుడుపతి చంద్రికల్ గురిసియున్ మెలమెల్లన నస్తమించఁగాఁ
    బడమటఁ; బొంచి చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్
    బొడుపుమలన్, బ్రభాతమయెఁ బోనడుపంగ వలెన్ జడత్వమున్.

    రిప్లయితొలగించండి
  7. అద్భుతమైన పూరణలను చేసిన గురువర్యులకు అభినందనపూర్వక వందనములు.

    రిప్లయితొలగించండి
  8. నమస్కారములు
    గురువుల పద్యములు అద్భుతములు ఆశీర్వదించి అక్క

    రిప్లయితొలగించండి
  9. తూర్పు దేశపు రవివర్మ తోడ భామ
    ప్రేమ నందెను తనదేమొ పశ్చిమమ్ము
    కనగ "నాన్ లైను వీడియో కాలు " లోన
    పడమటం బొంచె రవి సుప్రభాతమందు.

    రిప్లయితొలగించండి


  10. కేరళ పడమటే గదండి :)


    వెడలగ శంకరుండతని వెంటన దక్షిణభారతమ్మునన్
    బడబడ లాడి పద్యములు పారుచు నాడుచు బోవగన్ , భళీ
    చెడుగుడు పూరణమ్ములను చెంగని చూడన, వేకువన్ గనన్
    పడమటఁ బొంచి చూచెనఁట భానుఁడుషోదయకాంతు లీనుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Oh, East is East and West is West,
      and never the twain shall meet,
      Till Earth and Sky stand presently at God's great Judgment Seat;

      But there is neither East nor West, Border, nor Breed, nor Birth,
      When two strong men stand face to face,
      though they come from the ends of the earth!

      ...Rudyard Kipling

      తొలగించండి
  11. గురువుగారికి ప్రణామాలు! మీ దక్షిణదేశ యాత్ర సంపూర్ణ సాఫల్యత నొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తూ , శుభాకాంక్షలతో
    సీతాదేవి

    రిప్లయితొలగించండి
  12. తడవు సేయక రమ్ము,సేదను వహింప
    పడమటంబొందె రవి, సుప్రభాతమందు
    మొదలుఁబెట్టిన 'నోము' నాపుటయు వలదు
    రాత్రి రాకుండ రావలె రమణులార!

    రిప్లయితొలగించండి
  13. కడలిసుతుడు వేగమ్ముగ కనుమరుగయె
    పడమటం, బొంచె రవి సుప్రభాతమందు
    నుదయమొందగ తాను ప్రత్యూష ప్రభల
    తోడ ప్రజ కనుగొని కడు వేడుకపడ

    రిప్లయితొలగించండి
  14. దొంగ తన మది యాతని దొడ్డ వృత్తి
    యన్య మెఱుఁగఁడు చిఱుత ప్రాయమ్ము నుండి
    దూఱి కలవారి యింటను దొంగిలించఁ
    బడమటం బొంచె రవి సుప్రభాతమందు

    [పడము+అటన్ = పడమటన్; పడము = రత్న కంబళము; సుప్రభాతము = తెల్లవారు ఝాము]


    అడరిన విష్ణు లీలలు గ్రహాంతర సంచలనాత్మకమ్ములం
    బడయగ శక్య మేరికిని బ్రహ్మమహాండపు టద్భుతమ్ములున్
    బడలిక లేక యింపుగను బశ్చిమ దేశము, భారతమ్మునం
    బడమటఁ బొంచి, చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్

    రిప్లయితొలగించండి
  15. దినము పూర్తిగ బయనించి తీక్ష్ణముగను
    పడమ టంబొంచె రవిసుప్ర భాత మందు
    రక్త వర్ణపు వెలుగున రక్తి క
    లుగ
    నుదయమొందునుసూర్యుడు ముదము కలుగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కడలి తనయుడు తాచనె కాంత తోడ
      పడమటం రవి సుప్రభాతమందు
      వికసనము నొందజనులెల్ల విశ్వమందు
      సంతసమున పనులు చేయసాగుచుండ్రి.

      అలసి సొలసిన రవి తాను నబ్ధి యందు
      క్రుంగ శీతాంశుడల్లదె కువలయాన
      పడమటం బొంచె రవి సుప్రభాతమందు
      వెలుగులు విరజిమ్మ శశియు వెన్నలొసగు.

      తొలగించండి
  16. అలసి సొలసిన భాస్కరుం డస్తమింప
    నమృత కిరణముల గొనుచు యడుగిడు శశి
    పడమటం బొంచె! రవి సుప్రభాతమందు
    వెలుగు లీనగ చంద్రయ్య వెన్ను జూపె!

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఉడుగగ నంధకారమిల నుత్పలబాంధవుడాకసమ్ముపై
    బడమటఁ బొంచి చూచెనఁట, భానుఁ డుషోదయకాంతు లీనుచున్
    దడదడ నేగుదెంచె కన తద్దయు ప్రీతి సహస్రపత్రముల్
    బడలిక వీడి సాగిరిక పైరులఁ గాంచగ రైతుసోదరుల్

    రిప్లయితొలగించండి
  19. అలసిపోయి, సాయంకాలమస్తమించ
    పడమటంబొంచె రవి, సుప్రభాతమందు
    ప్రాగ్దిశన యుదయించును రమ్య వర్ణ
    మిశ్రుతుండయి శోభిల్లు మిక్కుటముగ

    విడువక యగ్నిధారలను వృష్టిగ రాల్చుచు నీరసించి తా
    సడలిన శక్తితో కదలసాగెను వృద్ధుడె యస్తమించగన్
    పడమట బొంచి చూచెనట భానుడు,షోదయ కాంతులీనుచున్
    వడివడి జేరవచ్చుగద ప్రాగ్దిశ యందున వింతకాంతితో

    రిప్లయితొలగించండి
  20. వడలె నంబుజములు నిట వన్నె తగ్గ
    పూచె కల్హారములు దాము పూర్ణ శోభ
    తిమిర ముదయింప తూరుపు దేశ మందు
    పడమటం బొంచె రవి సుప్రభాతమందు!

    రిప్లయితొలగించండి
  21. వెళ్ళగ విమానమందు నాకళ్ళముందు
    దేశమున్ వీడి పడమటి దేశ మేగ?
    పడమటం బొంచెరవి|సుప్ర భాతమందు
    చేరుకొంటిమి యమరికా చీక టొదల|
    2.తడబడ కెప్పుడున్ దిరుగు ధారుణి ధర్మము|”వెల్గు చీకటుల్
    నిడుటయె నిత్యసత్యముగ నేర్పున కాంతిని సూర్యు డుంచినా?
    పడమటి,తూర్పు దేశముల పట్టిక భాగములందు జూడగా
    పడమట బొంచి చూచెనట భానుడుషోదయ కాంతులీనుచున్|” {మనకుసూర్యుడుహస్తమించగాపడమటి దేశములకుసూర్యోదయము}



    రిప్లయితొలగించండి
  22. నిన్నటి పూరణ:

    వరము లీయగ వాడెపో వాసిగాను
    శిరసు దాకగ భస్మంబు సేయగాను
    తనదు పైననె జూపగ తపఃఫలము
    వెక్కిరించిన విధివ్రాత వెంట యజ్ఞ
    హరుని జూచి వేగమ్మున హరుడు బారె!

    రిప్లయితొలగించండి
  23. సూర్య కాంతిని నెలరాజు చూడనెంచి
    పడమటం బొంచె;రవి సుప్రభాతమందు
    దివ్య కిరణములు సకల దిశల బంప
    కాన తళతళలాడెను కనకమువలె

    రిప్లయితొలగించండి


  24. కడలి తనయుడు తాచనె కాంత తోడ
    పడమటం రవి సుప్రభాతమందు
    వికసనము నొందజనులెల్ల విశ్వమందు
    సంతసమున పనులు చేయసాగుచుండ్రి.

    అలసి సొలసిన రవి తాను నబ్ధి యందు
    క్రుంగ శీతాంశుడల్లదె కువలయాన
    పడమటం బొంచె రవి సుప్రభాతమందు
    వెలుగులు విరజిమ్మ శశియు వెన్నలొసగు.


    రిప్లయితొలగించండి
  25. ఎరుపు కుంకుమ పెద్దమ్మ ఎండబోసె
    పడమటం,బొంచె రవి సుప్రభాత మందు
    పసుపు మజ్జనమాడిన ప్రకృతికాంత
    పరవశించుచు పాడిన స్వాగతమ్ము

    రిప్లయితొలగించండి
  26. తడయక పాడె నా కనక దాసుడు కృష్ణుని భక్తి కీర్తనల్
    విడువగబోరు దర్శనము వేడగ ఛా౦దసు లైన యర్చకుల్
    యుడిపిని,కృష్ణ విగ్రహము యొద్దిక పశ్చిమదిక్కు మోమిడన్
    బడమటఁ బొంచి, చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్

    రిప్లయితొలగించండి
  27. పడుచుదనంపు జంటలును వార్నిది తీరపు సైకతంబులో
    బుడిబుడి యడ్గులేయుచును బోవుచునుండగ చంద్రవంకయున్
    పడమటఁ బొంచి చూచెనఁట, భానుఁ డుషోదయకాంతు లీనుచున్
    పొడవగ ధాత్రి తోషమున పొంగెను గాంచియు జీవజాతులున్

    రిప్లయితొలగించండి

  28. పిన్నక నాగేశ్వరరావు.

    చిమ్ముచున్ హిమకాంతి నిశీధి వేళ

    నలసి సొలసిన చందురుడంత, క్రుంగె

    పడమటం; బొంచె రవి సుప్రభాతమందు

    జగతి వెల్గును బంచ నిస్వార్ధముగను.

    **********************************

    రిప్లయితొలగించండి

  29. పిన్నక నాగేశ్వరరావు.

    చిమ్ముచున్ హిమకాంతి నిశీధి వేళ

    నలసి సొలసిన చందురుడంత, క్రుంగె

    పడమటం; బొంచె రవి సుప్రభాతమందు

    జగతి వెల్గును బంచ నిస్వార్ధముగను.

    **********************************

    రిప్లయితొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    చిమ్ముచున్ హిమకాంతి నిశీధి వేళ

    నలసి సొలసిన చందురుడంత, క్రుంగె

    పడమటం; బొంచె రవి సుప్రభాతమందు

    జగతి వెల్గును బంచ నిస్వార్ధముగను.

    **********************************

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టానుండి వివరణ
    ,1.ఇన శశి నయనుడు విష్ణువు.పౌర్ణమితో శుక్ల పక్షం పూర్తి ఔతుంది.చంద్రుని ఆధారంగా గణన చాంద్ర మానము.విష్ణువు ప్రజలనొకపరి చూద్దామనుకున్నాడు.చంద్రుడు ‌సూర్యునియంత బింబంగా తూర్పున ఉదయించినాడు.ఆనాటి మలి సంధ్యకుబంగారు రంగు వచ్చింది.ఇది సహజం.ఇది సూర్యుని నుండి వచ్చినదే.అది సుప్రభాత వేళ యని అనుకున్నారు, భావుకులు. సూర్యుడు పడమరనే దాగినాడు.అది మలి సంధ్యయే.

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులు గుండు మధుసూదన్ గారు..కామేశ్వరరావుగారూ...దయచేసి అందరుకవుల పద్యాలను మీరిబ్బందిగా భావించక మీకు వీలైనన్ని పరిశీలింప మనవి....గురువుగారు వచ్చేవరకు .......అన్యధా భావించరని విశ్వసిస్తూ.....,
    🙏🙏🙏🙏🙏🙏..విరించి

    రిప్లయితొలగించండి
  33. తరణి తనలోని వెలుగౌచుఁ దాక కలువ
    పులకరింపులన్ గన్నట్టి పూర్ణమసుడు
    పడమటఁ బొంచె, రవి సుప్రభాతమందు
    కమల నే రీతి వలచునో గాంచనెంచి

    రిప్లయితొలగించండి
  34. పడమటఁ బొంచి చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్
    గడబడ జేసి జేసియును గ్రక్కున క్రుంగెడి పూర్ణచంద్రునిన్
    తడబడుచుండి తప్పులను దంపతులందరు మూతబెట్టగా
    విడువగ లేక కౌగిలిని వెచ్చగ నుండిన హైద్రబాదునన్ :)

    రిప్లయితొలగించండి