25, మార్చి 2017, శనివారం

సమస్య - 2318 (అమృతపానమ్ముచే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"అమృతపానమ్ముచే సుర లసురులైరి"
లేదా...
"అమృతముఁ గ్రోలినంత సుర లక్కట రాక్షసులై చరించిరే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. అదితి,దితులకు సంతాన మగుట వలన
    వారి గుణములు పొందుగ వీరిఁజేరె
    తోటివారల సహవాస దోషమేమొ
    అమృత పానమ్ముచే సురలసురులైరి

    రిప్లయితొలగించండి
  2. మాయమున నాతి రాతిగ మార్చె నతడె
    మోసమున కవచమును కాజేసె నతడె
    పిడుగులను గిరిపై కురి పించె నతడె
    అమృత పానమ్ముచే సుర లసురులైరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమృత పానము చేసి మరణమిక లేదనిన ధీమాతో ఇంద్రుని వంటి దేవతలు రాక్షసులవలె పాపకార్యములు చేసిరని నా భావము.

      తొలగించండి
    2. డా.పిట్టా
      అమృధపు విశ్వ మెన్నటికినైనను గానమణూద్వహంబునన్
      అమృషల బాట శ్రేయమని యార్భటముల్ విడనాడలేము యీ
      సమృతపు జీవనంబె గతి శాస్త్రపు జ్ఞాన శుభప్రయోగపున్
      అమృతము గ్రోలినంత;సురలక్కట రాక్షసులై చరించిరే!?

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      డా. పిట్టా వారూ,
      మీరు శాస్త్రి గారి సామ్యాజ్యంలోకి ప్రవేశించి దురాక్రమణ చేశారు సుమా!
      మీ పూరణ బాగున్నది.
      అమృతమును అమృధము అన్నారు. 'గానమణూద్వహంబు'...? 'లేము+ఈ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "విడనాడనేర మీ..." అనవచ్చు.

      తొలగించండి


  3. అమృతపానమ్ముచే సుర లసురులైరి,
    మరణ మన్నది లేదని మత్తు లోన!
    చిన్ని బాలుడు కన్నయ్య చిటికె లోన
    కొండ నెత్తి, జిలేబి, గోకులము గాచె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పూరణ భావం కొంత అసంపూర్ణంగా ఉన్నట్టుంది. పద్యం బాగున్నది.

      తొలగించండి
  4. డా.పిట్టా
    బహుమతంబను యమృతంబు బాముకొనిన
    భాజపా యొడల్మరచిన భాతి నొకట
    అతిరహస్య శాసనముల నావహించె
    అమృత పానమ్ముచే సురలసురులైరి!

    రిప్లయితొలగించండి
  5. తమజయంబును గోరెడి కమలనాభు
    కరుణ నమరత్వమును గాంచి రరుస మొదవ
    నమృత పానమ్ముచే సుర, లసురు లైరి
    మంద భాగ్యులు తత్సుఖ మంద లేక.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  6. అమృతపానమ్ముచే సుర లసురులైరి,
    కుంభ వృష్టిని కురిపించి కుటిలురవగ
    చిన్ని బాలుడు కన్నయ్య చిటికె లోన
    కొండ నెత్తి, జిలేబి, గోకులము గాచె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ....

    అమృతము పంచిపెట్టునపుడా నవమోహిని దాచియుంచె నం
    దముగను కొన్ని చుక్కలను నమ్ముము నాతి పయోధరాధరో..
    ష్ఠములను, దీని గోరి యకటా! సురనాథుడె భ్రష్టుడయ్యె ! నీ
    యమృతము గ్రోలినంత సురలక్కట రాక్షసులై చరింపరే!!

    రిప్లయితొలగించండి
  8. పూర్వ మింద్రు డహల్యను ముట్టె సతిని
    ఋషి సతులఁ గోరె ననలుండు ధృతి చెడి మది
    ధర్మ రక్షణ కెయ్యది తావు ధరణి
    నమృత పానమ్ముచే సుర లసురు లైరి


    సుమతులు మద్య పానమునఁ జోద్యము కాదిల దుష్టులౌట నాఁ
    గుమతుల స్నేహబంధ మది కూడిన వేరుగఁ జెప్పనేల మో
    హము మది నుప్పతిల్లఁగ నహంకృత దుష్టులుమార శక్యమే
    యమృతముఁ గ్రోలినంత, సుర లక్కట రాక్షసులై చరించిరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలోని 'సతిని'కి అన్వయం? 'సతి నహల్యను' అని అన్వయం చేసుకోవాలా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునండి. అహల్యాదేవికి విశేషణముగానే ప్రయోగించితిని.

      తొలగించండి
  9. చెట్లను నరికి పుడమికి చింత బెంచు,
    కొండలను పిండి పొడిజేసి కోట గట్టు,
    మనుజులనెదరు తప్పులు మరచి తమవి
    ''అమృత పానమ్ముచే సుర లసురులైరి!''

    రిప్లయితొలగించండి
  10. చేసినారలు కష్టము చెరి సగమ్ము
    అమృతమొలకంగ పంచెడు సమతమరచి
    చేర స్వార్థమ్ము మితిమీరి, చేయఁ బోవు
    యమృత పానమ్ముచే సురలసురులైరి

    రిప్లయితొలగించండి
  11. అనుజు లగుచును దనుజుల యంశచేత
    మోసగించె నింద్రుడహల్య మోహమునను
    మరులుగొనె ననలుడు ముని భార్యలందు
    యమృతపానమ్ముచే సురలసురులైరి!

    రిప్లయితొలగించండి
  12. చీకు చింతలు లేకుండ నాక మందు
    సర్వ సుఖముల నొందుచు సంత సమున
    హాయి గలిగెడు బ్రదుకును ననుభ వింత్రు
    నమృత పానమ్ముచేసుర,లసురులైరి
    దితికి పుట్టిన గతనాన పతితు లగుచు

    రిప్లయితొలగించండి
  13. ఎన్ని తప్పులున్నయో తెలియదండీ.

    కామితామృత సంలబ్ధ ఘన ముహూర్త
    కాల భవనీయ గోచర కైరవ దృఢ
    సఫల దైత్యవీరానీక సార్హ కించి
    దమృతపానమ్ముచే సురలసురులైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      ఇది ఊకను దంచడం కాదు. అమృతఫలాలను దంచి కవితారసాన్ని పిండి వడగట్టిన మధురపానీయం. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  14. తే: తపసి స్త్రీలను మోహించె దహనుడు, ఋషి
    సతిని కూడెను ఇంద్రుడు సంత సముగ,
    అవని ధర్మమ్ము వారికి ఆవహించ
    అమృత పానముచే సురలసురులైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పూరణను వ్రాసింది పూసపాటి నాగమణి గారైతే వారికి శంకరాభరణం స్వాగతం పలుకుతున్నది.
      నేమాని సోమయాజులు గారైతే పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూడెను+ఇంద్రుడు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'కూడినా డింద్రుడు' అనండి.

      తొలగించండి
    2. ఆర్యా నమస్కారములు
      నా భార్య పేరులోనున్న మెయిల్ లో పంపాను. ఆవిడ వ్రాసింది కాదు.
      కూడినాడింద్రుడు గా మార్చినాను ధన్యవాదములతో పూసపాటి కృష్ణ సూర్య కుమార్

      తొలగించండి
  15. ఆజితు మాయచే చిరజీవులై పొలసిరి
    అమృత పానమ్ముచే సుర, లసురులైరి
    దితి తనూజులు కాపాడు దిక్కులేక
    కనలి దురముఁ జలిపిరి శ్రీ కాంతుపైన

    రిప్లయితొలగించండి
  16. అమృతము గ్రోలి నంత సురలక్కట రాక్షసులై చరించిరే
    యమృతము గ్రోలినంత సురలయ్యిరి రక్కసులా? భళాగురో!
    యమృతము ద్రాగినంతన విహాయస వీధి జరించ వచ్చుగా
    నమృతముద్రాగి మేమును నమాంతము గాంతుముదేవలోకమున్

    రిప్లయితొలగించండి
  17. బాలుడు పలక పైవ్రాసె వాక్య మిదియె
    అమృత పానమ్ముచే సురలమరు లైరి,
    స్వేదబిందువు రాలుచున్ చెరిపె చివరి
    మయను అక్షరమె సుగను మార్చ నపుడు
    అమృత పానమ్ముచే సురలసురు లైరి


    తమకిక చావులేదని మదమ్మున ప్రేలుచు నృత్యమాడిరా
    యమరులమంచు దేవతలు, యర్భకురాలు పడంతి గౌతమిన్
    తమకముచేత జేరెగద తానమరేంద్రుడనన్న గర్వము
    న్నమృతము గ్రోలినంత సురలక్కట రాక్షసులై చరించిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరనలోని చమత్కారం అలరింపజేసింది.

      తొలగించండి
  18. మత్తు కలుగంగ జేసెడి మదిర యనెడి
    యమృత పానమ్ముచే సుర లసురు లైరి
    కామ మోహ లోభమ్ములు కావరముల
    పాల బడుచును వేడబ లోలు లైరి
    అమృతము=విషము

    రిప్లయితొలగించండి
  19. శ్రమబడి సాంద్రమున్ జిలుక?సర్వులకబ్బిన సత్ ఫలంబునే
    సమముగబంచు నంచుహరిచర్యగ మోహిని రూపు దాల్చగా?
    క్రమమును దప్పియే నసురరాహువు,కేతువుదేవతల్ జతన్
    అమృతము గ్రోలినంత సురులక్కటరాక్షసులైచరించిరే|
    ౨మధ్యపానమటన్న యీమధ్యపలుకు
    లమృత పానమ్ముచే సురు లసురులైరి|
    ననెడి సత్యమ్ము నిత్యమైయాంధ్రవరుల
    నీటికంటెను మధ్యమేనిలువలాయె|

    రిప్లయితొలగించండి
  20. అమృతము గ్రోలి యింద్రుడు నహల్యను రాతిగ మార్చలేదొకో?
    కమలిన దుష్ట బుద్ధిగొని కర్ణుని చావుకు మూలమాయెనే!
    కుములుచు గాధి పట్టి గని కూర్మికి మేనక నంపలేదొకో?
    అమృతముఁ గ్రోలినంత సుర లక్కట రాక్షసులై చరించిరే!

    రిప్లయితొలగించండి