26, జులై 2017, బుధవారం

దత్తపది - 120 (రయము-భయము-జయము-నయము)

రయము - భయము - జయము - నయము
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు:

  1. రయమున లంకకేగి రఘురాముని గూర్చిన వార్త సీతకున్
    నయమున జెప్పి యామెకును నమ్మిక గూర్చుచు లంకనందునన్
    భయము రగిల్చి యంతటను పాథము నందున గాల్చివైచి తా
    జయమును గూర్చె రామునకు సంతస మందగ జానకీసతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమర్ గారూ,
      మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      'జానకీసతిన్' అక్కడ అన్వయించడం లేదు. "సంతస మందగ లోకు లెల్లరున్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. మీ సూచనకు ధన్యవాదములు. సంతస మందగ లోకులెల్లరున్ బాగుంది.

      తొలగించండి
  2. రయ మునివర యాగము సరయుఁ గడిచె
    నినకులవర బలతర మత్తేభయములు
    విజయము వెనువెంట నిలిచె విల్లు ద్రుంచ
    భూతనయ ముదమున వేసె పూల మాల!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్న నియమం లేకున్నా మీరు దాన్ని పాటించి మంచి పూరణ చెప్పారు. అభినందనలు. 'మత్తేభయములు'...?

      తొలగించండి
    2. మత్తేభయములు >> మత్తేభములకు యముని వంటి వారు >> సింహాలు

      తొలగించండి
  3. రయమున నేగుదెంచినది లాలితరీతిన నశ్వమంతటన్;
    భయమున కాయముల్ వణక వందురసాగిరి మౌనిబాలకుల్;
    జయమును పొందనెంచిన కుశాగ్రమతుల్ లవుడున్ గుశుండునున్
    నయముగ బట్టితెచ్చి జవనాశ్వము నుంచిరి బంధనంబునన్,

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    రయము దలిర్చు1 బాణముల రాక్షస వీరుల మట్టువెట్టగా
    భయము గడంగెలంకనట భాస్కరలీల జెలంగి పోరగాన్;
    జయమునుగాంచ కర్మములు దప్పవు యేరికినైన సత్కృతుల్
    నయమున బోధ జేయుట కనాదిగ రాముని గాధ వేదమౌ!2
    1అతిశయించు, శ.ర.2"కర్మణైవహి సంసిద్ధి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తప్పవు+ఏరికి" అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  5. రయమున రక్త మాంసములు రక్కసులధ్వరమందు వోయనిర్
    భయముగ వారలన్ దునిమె బాలుడు రాముడు యజ్ఞరక్షకై
    జయము జయంబటంచు ముని సత్తము లెల్లరు జేలు బల్క దా
    నయముగ సాగె పంక్తి రథ నందనుడా మిథిలా పురంబుకై

    రిప్లయితొలగించండి
  6. రయమున సుగ్రీవునకు న
    భయముగ వాలిన్ వధించ, పావని సీతన్
    నయముగ కనుఁగొన, రఘుపతి
    జయముగ దశకంఠుఁ దునిమి జానకిఁ దెచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. (రయము) మీర నేడు రామచంద్రుని జేరి
    (భయము) వీడి (జయము) బడయు టెల్ల
    (నయము) భ్రాతయైన నాకిట నుండుట
    వీలుకా దనెను విభీషణుండు.

    (నయము)లు గలుగును నిను గన
    (భయ ము)డుగును దలచినపుడె పవనజ వినుతా!
    (జయము)లు కలుగును నిరతము
    (రయము)న నిను గొలుతు నెపుడు రఘుకులతిలకా!

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. రయమున వానర సేనలు
    జయము ను బొంద oగజూపె శక్తులు మిగుల న్
    భయము న రక్కసత తు లు వి
    న య ము న మొక్కు లి డియె త మ నై జ పుచేష్టన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాక్షస తతులు" అనండి.

      తొలగించండి
  9. రవి సుతుడనుమతి నిడగ రయమున కపి
    దళము జయములు పలుకుచు దనుజు పురము
    నకొక నడవను అనువుగ నయమున భయ
    మును బడయక జలధిశిర మున సులువుగ
    నియతి నిడగ రఘపతి జనియె ముదముగ

    సుగ్రీవుడు ఆజ్ఞ ఈయ కోతులు వారధి భయము లేక కట్టగా రాముడు సంతసముగా లంక జేరెను ( నడవ = వారధి నియతి = ఏర్పరుచు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ సర్వలఘు పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
      'నడవను అనువుల' అని విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  10. అనుజుడు రణమున మూర్ఛిల
    ననునయమున వాతజాతు డతిరయముననే
    జనిసంజీవని గొని రా
    ముని భయమును దీర్చెజయము , ముదమును గూర్చన్!

    రిప్లయితొలగించండి
  11. రయమున సేతువున్ నిలిపి రంజిలు వానరసేన వెంటరా
    నయముగ రాముడంత భువనాత్మజ జేకొన లంక కేగి ని
    ర్భయముగ రావణాసురుని భండనమందున సంహరించి తా
    జయమును గాంచి సీతగొని సాగెనయోధ్యకు పుష్పకమ్మునన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  12. నయముగు దేహము , దయగల చిత్తము, అభయంబు నిచ్చెడు హస్తము, రిపు
    సంహార మునుచేయు శర స్వోవశీయము, రయముగ మసలు హయపు రధము,
    జయము నిచ్చెడు చదలము, శరణము కోరిన కరుణించు గుణ గణమ్ము
    యాడిన మాటను అనవర తమ్మును పాలన చేసెడి పట్టు దలను
    కల్గి నట్టినా దేముడు, ఘనుడు, రామ
    చంద్రుడు , దశ ముఖా, నీవు శరణు కోర
    కరుణ చూపి తప్పులుం గాచు, కదన మేల,
    యనుచు హితవున్బలికెనుగా యనిల సుతుడు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శర స్వోవశీయము' అన్నపుడు 'ర' గురువై గణదోషం. "శర సంపదయు గడు రయముగ... జయము నొసంగెడు(గణదోషం).. గుణగణమ్ము నాడిన మాటల ననవరమ్మును... కల్గినట్టి యా దేవుడు" అనండి.

      తొలగించండి
  13. రయము నెక్కెదో నా నావ రామచంద్ర!
    నీ వభయము నీయఁగఁ గాళ్లు నే కడిగెద
    జయము నీ కాలు సోకి నాతియగు రాయి
    నయముగన్ జేర్తు నా గట్టు నళిన నయన

    రిప్లయితొలగించండి
  14. నయమునచెప్పు నుడివినక రయమున నెదురించతంపి రావణుడు ధృతిన్ భయమనునదిలేని కపులు
    జయమొందిరిలంకలోన జగడమునందున్ Asnreddy

    రిప్లయితొలగించండి
  15. శరణార్థుల కాశ్రయము రు
    చిర మనయ ముదేజయము నిశీథ చరుల కె
    ల్ల రఘు వరోభయము సు దిన
    కరాన్వయ దినేశ రాత్రికర నిభ వీరుల్

    [అనయము = సతతము; ఉదేజయము = వడకించునది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  16. ర య ము న రావ ణాసు రు ని రాజ్యము జోచ్చి యు జంపె లంఖిణిన్
    భయము ను వీ డి యం తి పురి పారగ జూచె ను సీ త జాడ కై
    నయము న సూక్ష్మ రూ పుడ యినక్కి యు నుండే కొ మ్మల న్
    జయము గ సీ త గాంచి యు ను సంత స మంద డే వా యు సూను డు న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి. మూడవ పాదంలో గణదోషం. "నక్కియు నుండెను చెట్టు కొమ్మలన్" అనండి.

      తొలగించండి
  17. సవరించిన పద్యము
    రవి సుతుడనుమతి నిడగ రయమున కపి
    దళము జయములు పలుకుచు దనుజు పురము
    నకొక నడవను చదురుగ నయమున, భయ
    మును బడయక జలధిశిర మున సులువుగ
    నియతి నిడగ రఘపతి జనియె ముదముగ
    సుగ్రీవుడు ఆజ్ఞ ఈయ కోతులు వారధి భయము లేక కట్టగా రాముడు సంతసముగా లంక జేరెను ( నడవ = వారధి నియతి = ఏర్పరుచు చదురుగ = నేర్పుగా)

    రిప్లయితొలగించండి
  18. నయమున రాము డాదనుజనాథుని మిక్కిలి హెచ్చరించియున్
    రయమున గట్టి వారధిని రావణు జంపగ రామదండు ని
    ర్భయమున లంక జేరుకొని రావణునాదిగ సంహరించియున్
    జయమును బొంది రాఘవుడు జానకితోడ నయోద్య జేరెడిన్ .

    రిప్లయితొలగించండి
  19. ఖచరులను(రయము)గనడచి, మునిగణముల క(భయము)నిడి, ముదము నొసగి,
    వి(నయము)గ తపసి వెనుకల సుపధము ననడచి జనకుని నగరమునకు
    వెడలి, సదనమున వెరయక శివుని ధనువును దునిమి ,బహు నుతులు నిడుచు
    (జయము)లు పలుకగ, జనక సుతను రఘుపతి యుపయమనము బడసె నవమి
    దినమున, నభమున సురలు యవని జనులు
    శుభములు నిడగ, యనములు సులువుగ నిగ
    మములు పలుక , దశరధ కొమరులు మనువు
    బడసె మిధిల నగరమున పదుగు రెదుట

    అనములు = విప్రులు
    వుపయమనము =వివాహము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సర్వలఘు సీసం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      "సురలు నవనిజనులు" అనండి.

      తొలగించండి
  20. ఆశ్రయము నడిగె వాల్మీ
    కిన్ శ్రేయము గోరి సీత ఖిన్నవదనయై
    మా శ్రేణుల జయము, నయము,
    ప్రశ్రయము గలుగని ముని యభయము నొసంగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది సార్!

      ...కిన్శ్రేయ...

      ప్రాస?

      తొలగించండి
    2. శాస్ట్రీ గారూ, కిం శ్రేయ అని రావాలేమో మరి. అనుమానం తోనే రాసాను. పెద్దలు చూసి సవరిస్తే బావుణ్ణు

      తొలగించండి
    3. రఘురామ్ గారు,
      మీ పూరణ బాగున్నది. "ఆశ్రయ మడిగె మునిని తన।కే శ్రేయను గోరి..." అనండి. ప్రాసదోషం తొలగిపోతుంది.

      తొలగించండి
  21. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    హనుమద్విజయం :

    01)
    _________________________________

    రయమున లంకజేరి యట - లంకిణి శాపము బాపి, సీతకున్
    భయమును దీర్చి, రామ బటు - వామెకు శ్రీరఘురామ సంగతుల్
    నయముగ నందజేసి, పురి - నాశ మొనర్చి, మహా విదారమున్
    జయమును బొంది, రామ హము, - జానకి జాడల గల్గ జేసెగా !
    _________________________________
    హము - సంతోషము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. వసంత కిశోర్ గారు “రామ బటువు” ; “రామ హము” సమాసముల నొక సారి పరిశీలించండి.

      తొలగించండి
  22. జయమునుబలుకగసురలట
    రయమునబాణంబువేయరాముడుమిగులన్
    భయమునబంగరుమృగమది
    నయముగవేగంతుతోడ నర్తిలి పారెన్

    రిప్లయితొలగించండి
  23. వినయమునందున హనుమే
    తన రాముండభయమున నధర్మము లేకన్
    జనియున్ రాముని రయము
    న నిలుపగ?యయాతి జయము| నలుగకగలిగెన్|

    రిప్లయితొలగించండి
  24. ”.”రయముభయము-నయముజయము
    యయాతి,హనుమ విజయములె”| యాదృచ్చకమౌ|
    నియమభయమున దయనుజూ
    ప?యముడు నయమున యయాతిబట్ట?వణికెలే|

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    భయమింతయు లేక హనుమ

    రయమున గగనమున నేగి లంకకు
    జేరన్
    నయమున గాంచియు వ్రాలెను

    జయమో శ్రీరామ యనుచు జానకి
    మ్రోలన్.
    ****************************

    రిప్లయితొలగించండి
  26. మారీచుడు రావణునితో...

    అరయము రాముని మించిన
    పరదైవము నరికి నిడు నభయ మతడే నా
    పరులని చూడక యనయ మ
    సురవర యపజయము కాదు శుభమగు నీకున్.

    రిప్లయితొలగించండి
  27. రామునితో సుగ్రీవుని పలుకులు
    =============*==≠==≠====
    జయము జయము రామ జానకీ పతిరామ
    భయము వలదు రామ వానర తత్ి
    పరమ సాద్వి జాడ పట్టు రయముగాను,
    వినయమున దెలిపెద వేదవేద్య!

    రిప్లయితొలగించండి



  28. 1.నయమున విశ్వామిత్రుడు

    రయమున పంపమని కోరె రాముని తనతో

    భయమును వీడుము నీతడు

    జయమును పొందును సతతము జగతికి నెల్లన్ .


    2.రయమున మారుతి యేగెను

    భయమన్నది లేకతాను వారిధి దాటెన్

    నయమున మాతను గాంచుచు

    జయమది రామున కగుననె  జానకి తోడన్.


    3.నయమున పలికెను తారయు

     రయమున కోరుము శరణము రాఘవు నిపుడే

     జయమది కలుగదు నిజము,న

     భయమునొసంగును రఘుపతి వాసిగ నీకున్


    4.నయము గాను పలికె నాతితోడ త్రిజట

      భయము వలదు తల్లి వచ్చు స్వామి

     రయము ననుజు గూడి రావణు వధియించి

     జయము గొనుచు మరలు సత్యమిదియు.


    5.నయము గాను పలికె నాథుని తో సతి

     రయమున విడు మయ్య రమణిమణిని

     రాము తోడపోరు లగ్గవదు భయమౌ

    జయము కలుగ బోదు జగతి యందు.

    6.రయమున నేగి మారుతి సరాగము తోడను దాటె సంద్రమున్

    భయము నదేమి లేకయు సభాస్థలి జొచ్చుచు రావణా పరా

    జయమది నిశ్చయంబగును జచ్చెదవీవసురేంద్ర యంచనన్

    నయమున వీని బంధన మొనర్చు మటంచనె నుగ్ర రూపుడై.


    7.రయమున మరలెను మారుతి

    భయమును విడుమని తెలుపుచు వసుధిజ  తోడన్

    జయము జయంబని పల్కుచు

    నయముగ ముద్రిక నొసగెను

    జయము జయమటంచుతాను జానకి పతికిన్.


    8.’నయము’న ముద్రిక నందుకు నేతెంచి

          మారుతి లంకలో మాతను గని

     ‘భయము’ను జూపక వాలము తోడను

         లంకాపురము గాల్చి రమణి యొసగి

    నట్టి చూడామణి నారామున కొసగన్

       మురిపెము తోగని మోదమంది

    రక్కసు జంపగ ‘రయమున వచ్చె తాన్

       వానర సేనయు వార్ధి గట్ట


    లంక జేరి యచట రావణు వధియించి

    యావిభీషణునట నధిపు చేసి

    ‘జయము’ పొంది మరలి జానకితో బాటు

    మహిని ముదము గూర్చి మాన్యుడయ్యె.


    9.నయమున బంధించి రచట

    భయమును చూపక హయమును వసుధిజ సుతులున్

    జయము జయమనుచు రుషతో

    రయమున చూపిరి బలమును రామానుజుకున్.


    10.జయము జయము నీకు జానకీ వల్లభా

        భయము నుడిపి మాకు భద్ర మొసగు

          నయము తోడ నిన్ను నమ్మికొలిచెదము

        రయమున మము కావు రామచంద్ర.

    రిప్లయితొలగించండి