23, జులై 2017, ఆదివారం

సమస్య - 2418 (యమునకె తప్పదుగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్"
(లేదా...)
"యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా"

శ్రీరాం వీరబ్రహ్మ కవి గారి పూరణ....
విమలాంబర రత్నాభర
ణముల నలంకృతము గాంచి నవ షడ్రరసభో
జ్యములన్ బెఱిగిన యీ కా
యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథంనుండి)

90 కామెంట్‌లు:

  1. రమణునకు పరమహంసకు
    సమముగ నాగేశ్వరునకు సావిత్రి కిలన్
    తమతమ పోగాలపు సమ
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    రిప్లయితొలగించండి
  2. తిమిరమువలె నల్లనిదై
    యమరగ కుడ్యమున దట్ట నరచేయగుచున్
    సమముగ నెండిన ధేనుమ
    యమునకు తప్పదుగ భస్మమగుటెపుడైనన్

    రిప్లయితొలగించండి
  3. అమరము;నుజ్వలకీర్తుల
    విమలము; మనఘంటసాల వేంకన గాత్రం
    బమరిక గల; దైనను కా
    కాయమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    ఎవరికైనా తప్పదుగా :

    01)
    ___________________________

    సామరి, సాముద్రికు డగు
    సామగుడగు మరి సుకీర్తి, - సాధువె యైనన్
    సామియు, సుందరు డగు, కా
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    సామరి = సామునేర్చినవాడు

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    సుమములు సౌరభ యుతములు
    సమ సమ వషమంబు లెరుగు ఛందములుండన్
    కమలును వచన కవిత గే
    యమునకె తప్పదుగ భస్మ మగుటెపుడైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వషమంబు.. విషమంబుకు టైపాటా?

      తొలగించండి
  6. ఎవరికైనా తప్పదుగా :

    02)
    ___________________________

    కుమతియె యగు సుమతియె యగు
    ప్రముఖుడె డగు వితరణి యగు - పఠి యగు తుదకున్
    యమి యగు కమనుడె యగు, సమ
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________

    రిప్లయితొలగించండి
  7. నిముషము లో పాపిష్టి ధ
    నము అనిశా దాడిలోన నాశన మగు, నా
    యమెపుడు గెలుచును, అన్యా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్"

    అనిశా (అవినీతి నిరోధ శాఖ )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనము+అనిశా, గెలుచును+అన్యాయము' అని సంధి జరుగవలసిన చోట విసంధిగా వ్రాశారు. "ధనమె యనిశా...య మెపుడును గెలుచు నన్యా..." అనండి.

      తొలగించండి
  8. డా.పిట్టా
    ఇమిడెను కప్పలం దినగ నెప్పటి మాటయొ కల్మినిన్ గనన్
    బొమ ముడి వేసి చూచుటయె బుద్ధి విహీనత ;చెల్లబోదు చై
    నా! మును మట్టి గర్చితివి నాదగు(భారత)వీరుల చేత, దుష్ట వీ
    ర్యమునకె తప్పదెప్పుడెటులైనను భస్మముగాక జీవుడా!
    (చైనా దురాక్రమణ నీతిని నిరసిస్తూ)వీర్యము॥పరాక్రమము,శ.ర.

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    ఆర్యా,మొదటి పూరణలోటైపాటు'సమసమ విషమంబు లెరుగు'గా చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  10. మమతను నిరతము సంసా
    రముపైన నిలిపి మనుజులు లయమును కనరే
    యుమపెనిమిటి పంచిన సమ
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    రిప్లయితొలగించండి
  11. ఎంతటి లక్ష్యమైనా :

    03)
    ___________________________

    క్రమముగ శ్రమమే జేయగ
    క్షమ యందున నలవి కాని కార్యము గలదే
    గమకము, మొగితో నే ధ్యే
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    శ్రమము = అభ్యాసము :
    గమకము = నేర్పు
    మొగి = పట్టుదల
    ధ్యేయము = లక్ష్యము, గుఱి

    రిప్లయితొలగించండి
  12. ఎంతటి గాయమైనా :

    04)
    ___________________________

    సమమగు వైద్య పురోగతి
    సమయించును గాదె మేటి - జబ్బుల నైనన్ !
    సమమగు విఱుగుడు నే గా
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    విఱుగుడు = చికిత్స

    రిప్లయితొలగించండి
  13. ఏ ద్రవమైనా :

    05)
    ___________________________

    సమముగ కాలిన పెనమున
    తెమలును గద యే దినుసిడ - దృఢమది పోవన్ !
    కమలిన కందువు నే తో
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    తెమలు = నశించు
    కమలు = కాలు
    కందువు = పెనము
    తోయము నీరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ మూడవ, నాల్గవ, ఐదవ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. వసంత కిషోర్ గారూ ఈ రోజు బ్లాగును మీరు జప్తు జేసేశారు! చివరకు తోయమును కూడ భస్మీపటలం చేశారు! అభినందనలు!


      ఈ సందర్భంగా నాకో జోకు గుర్తువచ్చింది!
      వేడిజేయగా ఘనంగా మారే ఒకేఒక ద్రవపదార్ధమేది యన్న ప్రశ్నకు విద్యార్ధి సమాధానం 'దోసె'!
      అభినందనలు మరొక్కసారి!

      తొలగించండి
  14. సమయము నంత నిత్యమును సంపద లార్జనచేయ నెంచుచున్
    మమతలుపంచ కుండ నధమాధమమైన ప్రవృత్తి బోవు ఆ
    కుమతులెఱుంగ రీభువిని కూడును మృత్యువటంచు, పెంచు కా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా

    రిప్లయితొలగించండి
  15. ఎంతటి కయ్యమైనా :
    06)
    ___________________________

    అమరెను సత్యాహింసల
    సమరము జేయంగ గాంధి - స్వాతంత్ర్యమ్మే !
    సుమనము వహించ నే క
    య్యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________

    రిప్లయితొలగించండి
  16. అమరుల మిల కాము మనమ
    ని, మరణమది జీవికెపుడు నీడై యుండున్
    గమనింపు మిదియె, మనకా
    యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్

    రిప్లయితొలగించండి
  17. ఎంతటి నెయ్యమైనా :

    07)
    ___________________________

    అమలిన ప్రేమనె నిలుచును
    నమరత్వపు హాయి గలుగు - ననుగుదనమునన్ !
    కుమతుల గలసిన నే నె
    య్యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    అనుగుదనము = స్నేహము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రేమయె నిలబడు నమరత్వపు.." అనండి.

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :

      07)
      ___________________________

      అమలిన ప్రేమయె నిలబడు
      నమరత్వపు హాయి గలుగు - ననుగుదనమునన్ !
      కుమతుల గలసిన నే నె
      య్యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
      ___________________________

      తొలగించండి
  18. శ్రీ వసంత కిశోర్ మహోదయ యీ ఉదయం మంచి పుారణలతో బ్లాగు ప్రేమికులకు విందు జేసారు .
    -----------_-----_---
    రమణులతో దిరిగెడు ఓ
    రమణునకు తన బలగమని ప్రగ్గడ వలె సా
    యము జేసిన మరి యా సా
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వరప్రసాద్(శ్రీరామ్) గారూ, బహుకాల దర్శనం!
      ధన్యవాదములు !
      శ్రీరామ్ గారా ? ప్రసాదు గారా ?

      తొలగించండి
    3. గురుదేవులకు,వసంత కిశోర్ గారికి ధన్యవాదములు !
      నేను సెల్ ఫోనే లో టైపు జేసినపుడు నా కుమారుని పేరు వస్తున్నది.
      నాకు పని వత్తిడి మూడు నుంచి నాలుగు రేట్లు పెరిగినది. తల్లి దండ్రుల,తోబుట్టువుల ఆరోగ్య సమస్యలు......

      తొలగించండి
  19. ఎంతటి శత్రువైనా :

    08)
    ___________________________

    నమసము నొనర్చి గురిగా
    సుమనువు దీక్షగ జపించి - శూరత్వమునన్
    విమతునిపై వదలిన సా
    యమునకె; తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    నమసము = నమస్కారము
    మనువు = మంత్రము
    విమతుడు = శత్రువు
    సాయము = బాణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      ఆగ్నేయాస్త్రాన్నే వదిలారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  20. నిముసము నిలువదు తొలగును
    సమయపు విలువలను తెలియ జాగృతిఁగల్గున్
    విమలపు సాయంత్రం బుద.
    యమునకె తఫ్పదుగ భస్మమగుటెపుడైనన్

    రిప్లయితొలగించండి
  21. సముచితము కాని లోభము
    క్షమియించగ రాని మదము గర్వము క్రోధం
    బమరగ నీ శత్రు నికా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.

    అమితపు లోభ మెల్లెడల హర్షము గూల్చెడి క్రోధమూనుటల్
    క్షమతను గూల్చు మోహమును కామము మత్సరమున్ మదంబు లే
    క్రమమున దేహి నంటునవి కావున శాత్రవ మైనయీ నికా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      అంతశ్శత్రువులను గురించిన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. ఎటువంటి కలువలైనా :

    09)
    ___________________________
    కమలము మురియు న్నవి గని
    కమలును కలువలు తపనము - కారణ మేమో ?
    సుమనోరజ కల్వలు నుద
    యమునకె తప్పదుగ భస్మ - మగు టెపుడైనన్ !
    ___________________________
    అవి = సూర్యుడు
    సుమనోరజము = పుప్పొడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగుంది. కాని 'సుమనోరజ కల్వలు' ప్రయోగం...?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సుమనోరజ కల్వలు పుప్పొడి గలిగిన కలువలు
      పోనీ
      సుమనోహర కల్వలు
      అంటేనో

      తొలగించండి
  23. భ్రమపడకు! పాంచభౌతిక
    సమమగు బొమ్మఁగల యాత్మ సమయోచితమై
    యమరి చను బ్రహ్మ సాయు
    జ్యమునకె! తప్పదుగ భస్మమగు టెపుడైనన్!!

    రిప్లయితొలగించండి
  24. తిమిరము జేతఁ జీవులకు దేవుడ నేనని విఱ్ఱవీగి పా
    శము గొని శంభులింగ పరిచర్యల నున్న మృకండ పుత్ర దే
    హమునను వేయనాతనిని హంసుడుఁ శూలము జేతజంపెగా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా

    రిప్లయితొలగించండి
  25. రమణీయ భావ కవులకు
    కమనీయ మoదార కుసుమ కరుణాo బుదులన్
    కమలాక్షాశ్రేణులకా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడై నన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. రెండవ పాదంలో (యమందా) గణదోషం. కొంత అన్వయదోషం ఉంది.

      తొలగించండి
  26. ……………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    మమత దలిర్ప భార్యను కుమారుల బిడ్డల

    . . నెల్ల జీవితా౦

    తము పరిపోషణ౦ బిటు లొనర్చి తపి౦పగ ,

    . . కాటి కట్టె ల౦

    దమరిచి కాల్చు చు౦డిరి గదా నిను |

    . . న౦తయు మాయ సుమ్మి ! కా

    యమునకె తప్ప దెప్పు డెటు లైనను

    . . భస్మము గాక జీవుడా

    ి

    రిప్లయితొలగించండి
  27. అమలిన మాత్మ విలయ హీ
    నము పరమాత్మఁ గదియంగ నర్తించుఁ దమిన్
    సమయ సమాగతమునఁ గా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    [కాయము = శరీరము]


    తమ తమ భోగ భాగ్యముల దర్పము మీఱఁగ సంచరించుచున్
    సమద కళేబ రార్థము భృశమ్ము నలంకృతి సేయ నొప్పునే
    క్రమముగ వారి వారి తుది కాలము సూచుచుఁ జేయు కాలు గా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  28. సుమములఁ బూజకై యొసఁగు సూనృతమన్నది యెంచకెప్పుడున్
    సముచితమౌ ఫలమ్ముల ప్రసాదమటంచును వృక్షరాజముల్
    తము పునరంకితంబగుచు ధారుణిఁ బంచుచు నెండి కూడ సా
    యమునకె తప్ప! దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా!!

    రిప్లయితొలగించండి
  29. అమరగ ఫాలమునందున
    నమలంబౌత్రిపురకు, త్రిపురాంతకునకుదే
    హమునందెల్లను ధేనుమ
    యమునకెతప్పదుగ భస్మమగుటెపుడైనన్!

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. ప్రమదమెసంగ నీశ్వరుని ప్రార్థన జేయుచు దాన ధర్మముల్
    క్రమముగ జేయగా వలెను కాలము క్రమ్మరిరాదు ప్రాణికిన్
    భ్రమణమశాశ్వతమ్ము యెడబాయనిదొక్కటె పుణ్యమౌను కా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుడా
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  32. గురువు గారికి నమస్సులు.
    సవరిoచిన పూరణ ఈ క్రింది విధoగా గలదు.
    రమణీయ భావ కవికిన్
    కమనీయ మధుర సదమల కరుణే కరసా
    కమలాక్షా శ్రీధీకా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్
    తప్పుల ను సరిచేయవలయునని మనవి.
    మీ విధేయుడు
    వెoకట నారాయణ రావ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావు గారూ,
      కొంత వరకు సఫలమయారు. ఇంకా కొంత అన్వయదోషం ఉంది. 'కరుణే కరసా'...?

      తొలగించండి
  33. సమరముననాప్తులందరి
    ప్రమదమ్ముగజంపననుచు పార్థుడు బలుకన్
    నిమిరి హరి పల్కె నన్యా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  34. అమరులను నమ్మ గూడదు!
    క్రమముగ ననుకారమాడి కమ్మగ జేయన్
    భ్రమతో మోహినితో నా
    ట్యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'క్రమముగ ననుకారమాడి'...?

      తొలగించండి
    2. "dancing with stepwise imitation"

      😊👌🏻ననుకారమాడి... దీనికంటె....
      భంగిమలు నేర్ప... అంటే మరింత సొగసు గా ఉంటుందేమో.......

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  35. భ్రమ జెందకు మిది నాదని
    తమ తమ నెలవులను ప్రాణ తతి తప్పినచో
    సమయము తీరిన నీ కా
    యమునకె తప్పదుగ భస్మ మగుటెపుడైనన్

    రిప్లయితొలగించండి
  36. మా యగ్రజుఁడు పోచిరాజు సుబ్బారావు గారి పూరణ:

    అమలపు జరితుడు నగుచును
    మమతల వెల్లువలు గలిగి మాన్యతతోడన్
    మమకారమ్ములు గల కా
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    రిప్లయితొలగించండి
  37. సమయము మించిన దొరకదు ,
    సమయమునకుజదువుగొనక జరి యింపగ నా
    క్రమమున పరిక్ష గొనఁగ భ
    యమునకె తప్పదు గ భస్మమగుటె పుడైనన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  38. క్రొవ్విడి వెంకట రాజారావు:

    క్రమమగు పోషణ తోడను
    రమణీయముగా వపువును రక్ష బఱచిన
    న్నమతము మ్రింగెడి వడి కా
    యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్
    (వపువు=దేహము; అమతము=మృత్యువు)

    రిప్లయితొలగించండి
  39. శ్రమమున గూర్చిన తొడవులు
    విమలంబగు రూపు గలిగి విపణిని వెలుగన్
    క్రమముగ నా వస్తు వినిమ
    యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్

    రిప్లయితొలగించండి
  40. కరుణా వరదా
    అని వ్రాస్తే సరిపోతుoదా?
    గురువు గారూ అన్వయ దోష లోపాలను సరిచేయవలయునని మనవి.

    రిప్లయితొలగించండి



  41. భ్రమలో మునగకు మీ కా

    యమునకె తప్పదుగ భస్మ మగుటెపుడైనన్

    సమయమది యున్నపుడిలను

    సుమబాణపితుని కొలువుము సూక్తపు రీతిన్.


    కమనీయంబగు రూపము

    నమేయ మంబగు ధనమును నవనిన యున్నన్

    జమునానతైన నీ కా

    యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్.


    సుమశరుడే యైనను తా

    నుమాపతి కినుక బూని నుగ్రుండవగాన్

    కుములుచు నుండగ సతి కా

    యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్.


    అమరావతిలో సురనిచ

    యమునకు నుండదు మరణము నమరులు వారల్

    నిమిసంబాగదు మన కా

    యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్.

    రిప్లయితొలగించండి
  42. అమరెను జీవనమిట ధ్యే
    యమునకె; తప్పదుగ భస్మమగు టెపుడైనన్
    గమనంబు వీడి కాయము
    సమయగ నీ యాత్మ శివుని సన్నిధి జేరన్!


    రిప్లయితొలగించండి
  43. రమణిదియైన బాహుబలరాముని కృష్ణుని రామకృష్ణుదిన్
    రమణ మహర్షి శంకరుది రాజుది భోజుది రాజయోగిదిన్
    సమయము రాగ జీవునది చక్కని రూపునదైన స్థూలకా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా!

    రిప్లయితొలగించండి
  44. విమల మనస్కుడైననిట వీథులు దోచెడి దొంగయైననున్
    కమలపు పూజ జేసినను కమ్మని రమ్మును గ్రోలుచుండినన్
    సమయము రాగ మృత్యునకు చక్కగ దాగగ నెక్కడైన కా
    యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా :)

    రిప్లయితొలగించండి