24, జులై 2017, సోమవారం

సమస్య - 2419 (ప్రేమ పొంగిపొరలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రేమ పొంగిపొరలె వీథులందు"
(లేదా...)
"ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్"
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

101 కామెంట్‌లు:

  1. వేంకటేశ్వరుండు వేగమె బ్రోవగ
    వేడు కొనుచు సాగ వేల జనుల
    ప్రబల భక్తి తోడ బ్రహ్మోత్సవంబున
    ప్రేమ పొంగి పొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. "కృష్ణ! కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే కృష్ణ !"
    పాట పాడి పాడి పంకజాక్షి
    కృష్ణ జన్మ తిథిని క్రీడించి కంపించి
    ప్రేమ పొంగిపొరలె వీథులందు!

    '...Chant and be happy is the catchphrase of the "..International Society for Krishna Consciousness (ISKCON)". We often see the monks at ISKCON dancing to the Hare Krishna tunes every day in the temple. Sometimes, they do go out on the streets to encourage others also to chant and dance, in what is called sankirtan party..'

    https://www.iskconbangalore.org/hare-krishna-kirtan-flash-mob/

    రిప్లయితొలగించండి
  3. పశ్చిమంబుగాలి పగ్గాలులేకుండ
    విచ్చలవిడిగాను వీచుచుండ
    ప్రేమికులదినమున రేయింబవలులేక
    ప్రేమపొంగి పొరలె వీధులందు!

    రిప్లయితొలగించండి
  4. భాగ్యనగర మందు బంజార హిల్సులో
    చార్మినారు క్రింద కూర్మి తోడ
    మురికి నీరు పార మునిసిపాలిటి వారి
    ప్రేమ పొంగిపొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
  5. (రాజకవి-కవిరాజు)
    విజయనగరమందు గజరాజుపై నెక్కి
    కదలు కృష్ణరాయకవి ఎదురగు
    పెద్దనార్యు జూచి ప్రియమున గేల్సాచ
    ప్రేమ పొంగిపొరలె వీథులందు.

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    సక జనుల సమ్మె సాగించె కేసియార్
    నాడు రాష్ట్ర ప్రగతి నరయ బ్రజకు
    భూమి పుత్రులమన్న భూరి భావన తోడ
    ప్రేమ పొంగి పొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "భూమి పుత్రులమను..." అనండి.

      తొలగించండి
  7. సన్నుతించు రీతి చిన్నారి లవకుశుల్
    రామ కథను బాడ నీమ మూని
    యచట నావరించె హర్షంబు, వారిపై
    ప్రేమ పొంగిపొరలె వీథులందు.

    ఆమహనీయ డచ్యుతు డహర్నిశమున్ యదువంశ మందునన్
    క్షేమము గూర్చుచుండగను కేవల మాతని దర్శనంబె స
    న్మానముగా దలంచెదరు మాన్యవరేణ్యుని రాకచే నటన్
    బ్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. తనను మెచ్చు కొనెడు తరుణి యనిత పైన
    ప్రేమ పొంగి పొరలె, వీధు లందు
    తిరిగి వివిధ వంట దినుసుల నమ్మెడు
    మామ కొడుకు మధుకు మనసు నిండ.

    రిప్లయితొలగించండి
  9. కైక కోరినంత కానల కేగగన్
    లక్ష్మణుండు మరియు లలన సీత
    తనను వెంబడింప తరలిరి పురజనుల్
    ప్రేమ పొంగె పొరలె వీధులందు

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    నీమము నిష్ఠ భక్తియను నిర్మల భావ విచారధారలా
    రామము లందెగాక పుర రాజసువీథుల జెల్లె నాడు ను(యు)
    ద్దామ గురోర్వి భారత విధానమె కృష్ణుని గాంచనెంచె సు
    త్రాముడు "సూరదాసు "పద"ధ్యాయాసయె యేరయి పారనంతటన్
    ప్రేమయె పొంగిపొర్లె నడి వీథులలో జనులెల్ల జూడగన్
    (సూరదాసు కృష్ణ భక్తిని తన "భ్రమర గీత సారమను దోహాల ద్వార ప్రచారము చేసినాడు."పద"॥దోహే)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధ్యాసయె..' టైపాటు...

      తొలగించండి
    2. 'పద ధ్యాసయె' అన్నపుడు 'ద' గురువై గణదోషం. "సూరదాసుని పదంబుల ధ్యాసయె నిండనంతటన్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  11. శ్వేత జాతి జనుల స్వేచ్ఛలు మితిమీరి
    పశ్చిమాన బయట పట్ట పగలె
    సీమ శునక మోలె సిగ్గులజ్జలు లేక
    ప్రేమ పొంగిపొరలె వీథులందు..కోట శర్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఓలె' అనడం గ్రామ్యం. అక్కడ "శునకుము వలె" అనండి.

      తొలగించండి

    2. శ్వేత జాతి జనుల స్వేచ్ఛలు మితిమీరి
      పశ్చిమాన బయట పట్ట పగలె
      సీమ శునకము వలె సిగ్గులజ్జలు లేక
      ప్రేమ పొంగిపొరలె వీథులందు
      🙏🙏🙏🙏

      తొలగించండి
  12. శంకరయ్య గారూ
    నమస్కారములు. దోషములు తెలియజేయగలరు.
    🙏🙏
    కోట శర్మ

    రిప్లయితొలగించండి
  13. విజయకేతనముల సుజనులందరు మోయ
    మందు, విత్తమైదు వందలీయ
    దశదిశలదరంగ దరువులు మ్రోగగన్
    ప్రేమ పొంగి పొరలె వీధులందు !

    రిప్లయితొలగించండి
  14. ప్రేమ వీథుల్లో పొంగి పొర్లడ మన్నది
    నా జీవితంలో ఒక్కసారే చూసాను !
    అది 1983 లో
    ఆంధ్రమాతకు అనుంగు ముద్దుబిడ్డ
    సకలాంధ్రుల మది దోచిన అందగాడు
    అఖిలాంధ్రులకూ అన్నగారు
    విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు
    నందమూరి తారక రాముడు

    రాజకీయ రణరంగ ప్రవేశం చేసి
    విసుగు విశ్రాంతి లేకుండా
    అలసట బడలిక అనకుండా
    రాత్రి పగలూ మరచి
    సర్వ సౌఖ్యములూ త్యజించి
    భయమూ భీతీ వదలి
    నిశ్చింతగ నిస్వార్థంగా
    స్నానాధికములు,అన్నపానాదులూ
    రోడ్డు ప్రక్కనే చేస్తూ నిర్విరామంగా
    3 నెలలలో 35(?) వేల కిలోమీటర్లు
    చైతన్యరథముపై ప్రచారం చేసిన సమయం !

    అబ్బో ! ఏమి జనం ఏమి జనం
    రోడ్ల కిరువైపులా బారులు దీరి
    రాత్రనక పగలనక
    ఎండనక వాననక
    ఆకలి దప్పులు మరచి
    పిల్లా మేకా ముసలీ ముతకా మొత్తం
    ఊళ్ళన్నీ రోడ్లమీది కొచ్చి
    రోజుల తరబడి
    నిరంతర నిరీక్షణే నిరీక్షణ
    యెంటీవోడి దర్శనం కోసం !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    అపూర్వ స్వాగతం :

    01)
    ________________

    తామరతంపరై జనులు - తారను జూడగ బార్లు దీరుచున్
    తామస మెంత యైనను ని - దానము, నోర్పు వహించి శ్రద్ధగా
    తామదె సత్కరించి పలు - దండలు వేయగ హారతివ్వగన్
    తామదె నిల్చినారు తమ - దారలు, పిల్లల తోడ కూడియున్

    గాములఱేని తీవ్రతను - కాళ్ళదె కాలిన లెక్కసేయకన్
    కామన హెచ్చగా నిలువు - గాళ్ళనె భీకర వానలందునన్
    కౌముది లేకయున్న పెను - గాలులు వీచిన నంధకారమున్
    గ్రామము గ్రామ మంతయును - కన్నులు కాయలు కాయ వేసటన్ !

    రామలె మెచ్చు సుందరుడు - రమ్యశరీరుడె యంచు నెంచుచున్
    రాముని జూచి మ్రొక్క మది - రంజన మౌనని దల్చి యెందరో
    రాముడు కృష్ణుడున్ శివుడు - రక్షియు తారక రాముడంచు, మున్
    ప్రేమయె పొంగిపొర్లె నడి - వీథులలో జనులెల్లఁ జూడఁగన్ !
    ________________
    తామసము = ఆలస్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ, గద్య పద్యాలలో దాని నేపథ్యాన్ని వివరించడం బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ప్రేమికులు బిడియము వీడుచు , నుద్యాన

    వనము ల౦దు మరియు వాహనముల

    దొర్లు చు౦ద్రు , ముద్దిడుకొనుచు౦ద్రు

    ప్రేమ పొ౦గి పొరలె వీధు ల౦దు


    ఉద్యానవనముల౦దు = పార్కుల లో ;
    వాహనముల = బస్సులలో ;
    దొర్లు చు౦ద్రు = ఒకరిపై ఒకరు పడి దొర్లుచు౦ద్రు


    మూడవ పాదములో " డ " కు " ద " కు
    ………………………………………………………
    యతి చేయబడినది
    …………………………………
    ి

    రిప్లయితొలగించండి
  16. రాముడు నేలినట్టి విమలంబగు వైదిక పుణ్యభూమిలో
    కామము పెచ్చుమీఱినది కాలము లోపల దేశమందునన్
    సామము లేక నీచ విష సంస్కృతి హెచ్చె కలి ప్రభావమున్
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  17. కామమోహిత రాక్షసాధముఁ గారణంబున లంకయున్
    నామమాత్రము చేత కోతియు నగ్నికీలల గాల్చెగా
    రామరావణ యుద్ధమందున రామచంద్రుడు గెల్వగన్
    ప్రేమలే గద పొంగిపొర్లెను వీధులందున జూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      సమస్యపాదాన్ని మార్చి మత్తకోకిలలో మీ పూరణ మనోహరంగా ఉంది.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. గోకులమ్మునందు గోవిందుడేగుచు
    మురళినూదగాను ముదముతోడ
    గోపకాంతలెల్ల గుమిగూడి జనవెంట
    ప్రేమపొంగి పొరలె వీధులందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుమిగూడి చన..' అనండి.

      తొలగించండి
  19. చిట్టి పొట్టి చిన్ని చిరు లేత బాలలు
    చేరి యాడ నచట‌ చెలిమి పూచి
    కోరి చేయి వట్టి గుంపుగా పరుగిడన్
    ప్రేమ పొంగి పొరలె వీథులందు!

    రిప్లయితొలగించండి
  20. రైతుబాంధవుడని ఖ్యాతిని గొన్నట్టి
    నేత యరుగుదెంచి నీటుగాను
    గ్రామసీమలందు కలయఁదిరుగుచుండ
    ప్రేమ పొంగి పొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
  21. ఉత్స వి గ్ర హమ్ము లూరేగు చుండగ
    భక్తి రసము లచట రక్తి గొలుప
    ప్రేమ పొంగి పొరలె వీధులందు నిజము
    కనగ లేవు వేయి కన్ను లైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారు,
      మీ పూరణ బాగున్నది. కాని 'ఉత్సవ విగ్రహాన్ని' ఉత్స విగ్రహమన్నారు.

      తొలగించండి
  22. రాముని రాజ్య పాలనము శ్రామిక వర్గము పొందునంచు తా
    ప్రేముడి తోడుతన్ తెలిపి పిమ్మట చక్కగ నాచరించి సం
    క్షేమమొసంగ రైతులకుఁ జెన్నగు నేతను గాంచి యూరిలో
    బ్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  23. చిత్తమందు భక్తి చిందులు వేయంగ
    భక్త తుకారాము పాడి యాడె
    పాండురంగ విభుడు పరవశమొందంగ
    ప్రేమ పొంగి పొరలె వీధులందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని 'తుకారాము' అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. గళము విప్పె నా'తుకా'వినుతుడు.
      ఈ2వ పాదం సరిపోయిందా దయచేసిచూడండి

      తొలగించండి
  24. రావణాసుర కృత రణభూమి యందు నా
    రాక్షసవరు లంత రామ బాణ
    హతులు రక్త యుత భటాంబుధి సక్షుర
    ప్రేమ పొంగి పొరలె వీథు లందు

    [స క్షురప్ర + ఈమ = స క్షురప్రేమ; క్షురప్రము = అర్ధచంద్రబాణము; ఈమ = పుండు; అర్ధచంద్రబాణముల తో నేర్పడిన వ్రణములతో కూడి]


    ఏమని చెప్ప నేర్తు నిక నీ విష యోద్ధతి దేశ పౌరులే
    తామట మూడు రంగుల పతాకము నూపుచు సంతసింపగా
    నామని వోలె తోచె నట నాడగఁ బాడగ దేశ గీతముల్
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారు,
      మీ భాషావైదగ్ధ్యానికి నమోవాకాలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. 'క్షురప్రేమ' ప్రయోగం అనన్యసామాన్యం. అభినందనలు.

      తొలగించండి
    2. ఇటువంటి ప్రయోగములలో పూజ్యులు కామేశ్వరరావు గారికి సాటి రాగలవారు గరికపాటిగారి లాంటి వారు ఏ కొద్దిమందో ఉంటారేమో. నమశ్శతములు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
      శ్రీ వాల్మీకి ముని ప్రణీత రామాయ ణాకుంఠిత పఠన భాగ్య మహిమయని నా యనుమానము.
      ఇప్పుడు “శ్రీమదాంధ్ర సుందర కాండ” ఏకవింశతి సర్గమున కలను.
      తృతీయ పారాయణములో నరణ్య కాండ చతుర్వింశతి సర్గ.

      తొలగించండి
    4. ఫణి కుమార్ గారు ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
    5. నిశ్చయముగ! దైవోపాసన, దైవానుగ్రహము లేనిదే సత్కవులు కాలేరు!
      కవీశ్వరులు కామేశ్వరరావుగారికి శతకోటి ప్రణామాలు!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    6. డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
    7. రసనను నాట్యమాడును సరస్వతి నిత్యము రావుగారికిన్.....కామేశ్వరరూపవాగ్దేవికి కైమోడ్పులు.

      తొలగించండి
    8. మిస్సన్న గారు నమస్సులు మఱియు ధన్యవాదములు.

      తొలగించండి
  25. లవకుశులను చూడ లక్షణుని మనసు
    కేమి గలిగె, ఎచట కీర్తనలను
    వారు మొదట పాడి నారు నయోధ్యలో,
    "ప్రేమ పొంగిపొరలె, వీథులందు",

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పాడినా రా యయోధ్యలో" అనండి.

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆమిక తోడుతన్నరకుడాయెడ లోకము నందలి ప్రాణులెల్లరన్
    ప్రేమయె లేక డీల్పఱచ వెన్నుడు నాతని గూల్చి వచ్చునౌ
    నేమమునందు నెల్లరట నెయ్యము నొందుచు సంతసించగా
    ప్రేమయె పొంగిపొర్లె నడివీధులలో జనులెల్ల చూడగన్

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జనత నతకరించి సాగిన నరకుని
    సంహరించి వచ్చు శైలధరుని
    పథములోన నున్న ప్రజల మనములందు
    ప్రేమ పొంగి పొర్లె వీధులందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషాన్ని సవరించండి.

      తొలగించండి
  28. ఏమని చెప్పబోదునిటులెంత తెగించిరి కుర్రకారు శ్రీ
    రామ వచింపలేను పలు రంగుల స్వప్నములందు తేలుచున్
    కామము హద్దు మీరగను క్లబ్బుల యందును పబ్బులందునన్
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్ల జూడగన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  29. ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్
    గామము హెచ్చుగా గలుగ కామిని మానస మందునన్భళా
    రాముని మందిరంబు గని రాముని వేడిరి సామి ! మమ్ముల
    న్నేమిగ జేతురో యికను నిట్లుగ మేమిట కల్సుకొందుకై


    రిప్లయితొలగించండి
  30. అకట భారతమున నమెరికా కల్చరు
    పెరగ ముద్దులకును మరుగు లేదు
    కుర్రకారునకును వెర్రి పెంపొందంగ
    ప్రేమ పొంగిపొరలె వీధులందు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  31. శ్రీమతి జి సందిత బెంగుళూరు

    రాముడయోధ్యవీడి నగరంబునుదాటగసాగుచుండగా
    భామినిభూమిజాతయును ప్రక్కన లక్ష్మణుడుండతోడుగాన్
    గోముగనూరువారలటుగోలగనడ్డుపడన్గనుంగొనన్
    ప్రేమయె పొంగి పొర్లె నడివీధులలో జనులెల్ల చూడగన్ !!"

    🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

    రిప్లయితొలగించండి
  32. కామిని కోర రాఘవుడు కానల కేగెడు వేళయందునన్
    భామిని, భ్రాతలక్ష్మణుడు వచ్చిరి రాముని వీడలేక, నా
    గ్రామణి వెంటలోకులును రాజ్యమె శోకము తోడ సాగగన్
    ప్రేమయె పొంగిపొర్లె నడి వీధులలో జనులెల్ల జూడగన్

    రిప్లయితొలగించండి
  33. కామిని కోర రాఘవుడు కానల కేగెడు వేళయందునన్
    భామిని, భ్రాతలక్ష్మణుడు వచ్చిరి రాముని వీడలేక, నా
    గ్రామణి వెంటలోకులును రాజ్యమె శోకము తోడ సాగగన్
    ప్రేమయె పొంగిపొర్లె నడి వీధులలో జనులెల్ల జూడగన్

    రిప్లయితొలగించండి
  34. పేరు:శ్రీమతి జి సందిత బెంగుళూరు
    అంశం:
    క్రొత్త పెళ్ళికూతు రత్తవారింటికై
    బయలుదేరతల్లి సయట నిలిచె
    చెల్లితమ్ముడన్నచేరె కార్లుకదలె
    ప్రేమ పొంగిపొర్లె వీధులందు!

    పేరు:శ్రీమతి జి సందిత బెంగుళూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ అంపకాల పూరణ బాగున్నది. అభినందనలు.
      'బయట నిలిచె'..

      తొలగించండి
  35. రిప్లయిలు
    1. IIT Kharagpur (1965):

      హోలి రాత్రి పగలు డోలకుల్ వాయించి
      రంగు రంగులద్ది భంగు త్రాగి
      చందమామ తోడ చంద్ర భాసురమున
      ప్రేమ పొంగిపొరలె వీథులందు

      చంద్రభాసురము = moonshine liquor

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీరు శంకరాభరణం మీద రిసెర్చ్ చేస్తున్నారన్నమాట రూఢి అయింది.
      ఎప్పటి చంద్రశేఖర్ గారు పరిచయం చేసిన 'చంద్రభాసురం'! దాన్ని మళ్ళీ మూన్ లైట్ లోకి తీసుకొచ్చారు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. శంకరాభరణం నాకొక అద్భుత వ్యసనమైనది. ప్రస్తుతం సమస్యాపూరణం - 802 లో నున్నాను. రోజంతా అదే పని.

      త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.. August 22 వ తేదీన.

      నమస్సులు.

      తొలగించండి
  36. రాముఁడు మానసమ్మున పరాక్రమమీయఁగ తెల్లవారలన్
    హోమమునందు రాల్చెడు మహోన్నత సాధన స్వేచ్ఛలూదగన్
    గ్రామములాదిగా భరతఖండము జాతిపితా! యనంగనే
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్!!

    రిప్లయితొలగించండి
  37. ప్రేమికులదినమున వీరంగ మొనరించి
    హోలినాడు రంగ హేల లమర
    భరత మాత దాస్యబంధ విముక్తికై
    ప్రేమ పొంగి పొరలె వీథు లందు

    రిప్లయితొలగించండి
  38. అక్కినేని నటుని యాంధ్రులందరు గూడి
    రాయపూరు చూడ రమ్మని యట
    కోట్ల పూల వాన గుప్పించ రోడ్ల పై
    ప్రేమ పొంగిపొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
  39. ముచ్చటగను సాగె భోనాల పండుగ
    పల్లె పట్టణముల బ్రమద మొప్ప
    అమ్మవారిపైన ననుపమ భక్తియు
    ప్రేమ పొంగి పొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
  40. ముచ్చటగను సాగె భోనాల పండుగ
    పల్లె పట్టణముల బ్రమద మొప్ప
    అమ్మవారిపైన ననుపమ భక్తియు
    ప్రేమ పొంగి పొరలె వీథులందు

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  42. కదలి యాడు చుండ కాళీయు తలపైన
    చిన్న తనము నందె వెన్న దొంగ
    విస్మయముగ గనిన వ్రేపల్లె వాసుల
    ప్రేమ పొంగి పొరలె వీధులందు

    రిప్లయితొలగించండి
  43. శ్రీ వసంత కిషోర్ గారు చెప్పినట్లు అందరి పూరణలు అలరించు చున్నవి .గురుదేవులకు, కవీశ్వరులకు నా దన్యవాదములు

    రిప్లయితొలగించండి
  44. రాఖి పండుగ యిది రహియు కల్గె మదిలో
    తోడబుట్టువులకు తోషమయ్యె
    చెల్లి ప్రేమతోడ చేతికిడగ భ్రాతృ
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    రాఖి పండుగనగ రయమున తామేగి
    సోదరీమణులిల సోదరులకు
    చక్కగాను కట్టి సాటిలేని విధాన
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    అమ్మ దినమటంచు నవనిలో మేనెల
    నాది వారమందు నాచరించ
    అమ్మలమనమందు హర్షమొదవ మాతృ
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    ప్రేమికుల దినమని పెనుసంబరాలతో
    ప్రేమ పొంగిపొరలె వీధులందు
    నెంత వింతయునిది యిలలో నొక దినమె
    ప్రేమదినమటంచు ప్రీతి చూప.

    రామనవమి నాడు రామ విగ్రహమును
    వీధులందు దిప్ప వేల జనులు
    రామభజన తోడ రయమున సాగంగ
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    కపట జూదమాడి కానలకంపంగ
    పాండు సుతులు చనగ ,బాధ పడుచు
    వెంట నడచి రెల్ల వేవేగ పురజనుల్
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    స్వచ్చ భారతమని స్వచ్చపరచ నూరు
    నాయకులట రాగ నయము తోడ
    నేను సైత మనుచు నెల్ల రటకు రాగ
    ప్రేమ పొంగి పొరలె వీధులందు.

    రిప్లయితొలగించండి
  45. ఉమాదేవి గారూ,
    ఏడు వైవిధ్యమైన పూరణలతో సప్తవర్ణాల ఇంద్రధనుస్సును చూపించారు. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  46. భీమునిపట్నమందునను భీమవరమ్మున కాకినాడలో
    పాములపాళెమందునను బంజరహిల్సున చార్మినారులో
    దోమలగూడయందునను త్రోవల కాల్వల మున్సిపాలిటీ
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి


  47. మామనసున్ చెలీ సఖియ మార్చితివే‌ జవ రాల ! నీదుపై
    ప్రేమయె పొంగిపొర్లె; నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
    కాముకుడా జిలేబి కయిగట్టిగ బట్టుచు ముద్దు లిమ్మనన్
    లేమయు లెంపకాయనిడ లెక్కకు లెక్కయు దేలెబో భళీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  48. భామలు రైతుబిడ్డలును బారులు తీరుచు భాగ్యనగ్రినిన్
    దోమలు ముర్కి వాగులును తోడుగ నుండగ చెట్టపట్టగా
    గోముగ చంద్రశేఖరుడు కొట్టగ బాబును చీదరించుచున్
    ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్ :)

    రిప్లయితొలగించండి