29, జులై 2017, శనివారం

సమస్య - 2423 (దంష్ట్రలపై శంకరుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్"
నా పూరణ....
దంష్ట్రయనఁ గోరపల్లఁట
దంష్ట్రలు గలవార లన్న దనుజులె గాదా?
దంష్ట్రలతో పద్యమ? యే
దంష్త్రలపై శంకరుండు తాండవ మాడెన్?

60 కామెంట్‌లు:

  1. "దంష్ట్రి"యన పంది యడవిది;
    దంష్ట్రులమే మేమిచటను
    దంగల్ సేయన్ :(
    "దంష్ట్ర"ల ప్రాసలతో మా
    "దంష్ట్ర"లపై శంకరుండు తాండవ మాడెన్ :)

    చివరి పాదములో:
    దంష్ట్ర = కోర

    రిప్లయితొలగించండి
  2. దంష్ట్రిగ మారెను విష్ణువు
    దంష్ట్రలె స్వర్ణాంబకుడను దళితము సేసెన్
    దంష్ట్రి నిలిపె భూమిని తాన్
    దంష్ట్రలపై, శంకరుండు తాండవ మాడెన్!!

    రిప్లయితొలగించండి
  3. దం ష్ట్రలపై భువి నిలిపెను
    దం ష్ట్రలతో యసుర కోటి తాకొనె బలిమిన్
    దం ష్ట్రలు వాడిగ నుండిన
    దం ష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దంష్ట్రలతో నసురకోటి..." అనండి.

      తొలగించండి
  4. దంష్ట్రాయుధ సంహారుడు
    దంష్ట్రజినధరుండు దీర్ఘ దంష్ట్ర్యాభరణున్
    దంష్ట్రించు వికృత కాలుని
    దంష్ట్రలపై శంకరుండు తాండవమాడెన్

    దంష్ట్రాయుధము, దంష్ట్రి = కోరలు గలది= అడవి పంది , యేనుగు, పాము
    దంష్ట్రించు= కొరుకు

    దంష్ట్రి+ అజినము= దంష్ట్రజినము
    దంష్ట్రి+ ఆభరణము= దంష్ట్ర్యా భరణము

    గొప్ప ప్రయత్నము గురువుగారూ! తప్పులు మన్నించాలి!
    ముఖ్యంగా సంధులలో! 🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దంష్ట్రి+అజినము = దంష్ట్ర్యజినము' అవుతుంది. అయినా సంధుల విషయంలో మన్నించమన్నారు కదా! పాస్ మార్కులేస్తున్నాను. స్వస్తి!

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  5. దంష్ట్రియగు బావ హరిగని,
    దంష్ట్రల తళతళ గనుగొని,దనుజుని జీల్పన్
    దంష్ట్రల,దాల్పన్ ధరణిన్
    దంష్ట్రలపై,శంకరుండు తాండవమాడెన్.

    రిప్లయితొలగించండి
  6. దంష్ట్రయనసర్పముగదా,
    దంష్ట్రపురూపము ననెహరి ధరణిని కాచెన్,
    దంష్ట్రములుయణచి కాళీ
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

    శివుడు అన్న హరి అన్న ఒక్కరె గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దంష్ట్రి శబ్దానికి పంది అన్న అర్థమే ఉంది. పాము అన్న అర్థం నిఘంటువులో లభించలేదు. "దంష్ట్రి యన వరాహము గద" అనండి. అలాగే "దంష్ట్రిగా రూపొందిన హరి..." అనండి. 'దంష్ట్రముల నణచి' అనండి.

      తొలగించండి
    2. దంష్ట్రిన్‌ [permalink]

      దంష్ట్రిన్‌ : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report an error about this Word-Meaning
      పు.

      వరాహము, పంది; పాము.

      తొలగించండి


  7. దంష్ట్రియు దాల్చెను వసుధను
    దంష్ట్రలపై;శంకరుండు తాండవ మాడెన్
    దంష్ట్రలు గల గణపతి గన
    దంష్ట్రములాభరణములుగ దాల్చుచు సతితోన్.

    దంష్ట్రి=వరాహము,పాము,కోరలు,

    రిప్లయితొలగించండి
  8. “దంష్ట్రా” శబ్దము గైకొని
    “దంష్ట్రి”ని గ్రహియించకుండ తగ పద్యమునన్
    దంష్ట్రించక తెలుపగ నగు
    “దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్”.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి

  9. దంష్ట్రంబులు రమణికి యహి
    దంష్ట్రంబుల్గావు! వలయు ధరహాసంబుల్
    దంష్ట్రముల పైన, తెలుపన్
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్ :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రమణికి నహి..." అనండి

      తొలగించండి
  10. దంష్ట్రగ జగతిని మోసెను
    దంష్ట్రలపై, శంకరుండు తాండవ మాడెన్
    దంష్ట్రలు గలవారి నణచ
    దంష్ట్రగ శ్రీహరిని గనుచు త్ర్యక్షుడు తానే.

    రిప్లయితొలగించండి
  11. దంష్ట్రల సమస్య దెబ్బకు
    దంష్ట్రము లూడగ కవిగజతతులకు నపుడా
    దంష్ట్రముల బేర్చి బ్లాగున
    దంష్ట్రలపై శంకరుండు తాండవమాడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  12. దంష్ట్రములుండవు శిశువుకు
    దంష్ట్రంబులు నూడిపోవు తప్పక ముదిమిన్
    దంష్ట్రముల సమస్యనిడి యీ
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

    రిప్లయితొలగించండి
  13. దంష్ట్రల వలె దీపించిన
    దంష్ట్రాంకుశ ధవళగిరుల తన్మయు లగుచున్
    దంష్ట్రల గణములు జూడగ
    దంష్ట్రల పై శంకరుండు తాండవ మాడెన్








    రిప్లయితొలగించండి
  14. Dr.Pitta
    "Dhanshtra'ta kaadhadhi dhashtrara
    Danshtranagaa koara yanedu danthamu roaree!
    Danshtrala meetaga ravamulu
    Danshtrala pai shankarundu thaandava maadun
    (Guruvu sishyuni uchcharananu sari chestoo palikina maatalu)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      క్షమించాలి... మీ పద్యాన్ని చదివి అవగాహన చేసికొనలేకుపోతున్నాను.

      తొలగించండి
    2. దంష్ట్ర త కాదది దంష్ట్రర
      దంష్ట్రనగ కోఱ యనెడు దంతముర యొరే
      దంష్ట్రల మీటగ రవములు
      దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

      గురువు శిష్యుని ఉచ్చారణను సరి చేస్తూ పలికిన మాటలు.

      తొలగించండి
  15. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ద౦ష్ట్రలు గలట్టి పె౦డ్లము ,

    ద౦ష్ట్రల మగడు సిరిగట్టు ధవళశరీరున్

    ద౦ష్ట్రల నెత్తి నుతి౦చిరి |

    ద౦ష్ట్రల పై శ౦కరు౦డు తా౦డవ మాడన్ !


    { సిరిగట్టు = శ్రీ శైలము }

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. దనుజులతో శంభుఁడు యుద్ధము చేయు సందర్భము:

      దంష్ట్రి దనుజ గురు దత్తా
      దంష్ట్ర సదసిదంష్ట్ర తీక్ష్ణదంష్త్రాంకమ్ముల్
      దంష్ట్ర యుత మడఁచి నాగపు
      దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

      [దంష్ట్రి = శుక్రుని పుత్రుఁడు; అదంష్ట్రము= దంతములు లేని; అసిదంష్ట్రము= మొసలి; తీక్ష్ణదంష్ట్రము=పులి; నాగదంష్ట్రము= చూరు, నాగము = సత్తు, తగరము]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ఉదయం నుండి కరెంటు లేక ఇంటర్నెట్టుకు అంతరాయం... మధ్యాహ్నం నుండి తీవ్రమైన తలనొప్పి... ఇంతకు ముందే కరెంటు వచ్చింది.
      మీ పూరణను నాలుగైదు సార్లు చదివాను. మీరిచ్చిన అర్థాలను అన్వయించుకుంటూ చదివాను... అయినా మీ భావం అవగతం కాలేదు. అందుకు కారణం నా అజ్ఞానం కాని, అనారోగ్యం కాని కావచ్చు.. దయచేసి పద్యభావాన్ని వివరించండి.

      తొలగించండి
    3. మరో విధంగా తప్పుగా భావించవద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. భావ మవగతము కాక పోవుటకు నా యసమర్థతయే గాని మీ దోష మిసు మంతైన లేదు. మీరే నన్ను క్షమించాలి.

      ఇచట శంకర దానవ యుద్ధము కావున బాణ ప్రయోగము లూహ్యము లని తలచి చేసిన పూరణ.

      దనుజ గురువైన దంష్ట్రి నేర్పిన యస్త్రములు కొన్ని దంతములులేని వాటి (గరుడుఁడు ప్రభృతులు), మొసలి, పులి గుఱుతులతో గూడినవి (బాణములు) యసురులు ప్రయోగింప వాటి కోఱ లణచి ఆ కోఱల పొడి పై శంకరుడు నాట్యము చేసె నని నా భావము.

      తొలగించండి
    5. నాగదంష్ట్రము సిద్ధ సమాసమైతే నాగపు దంష్ట్ర మాచ్ఛిక సమాసముగా ప్రయోగించితిని.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      వివరణ ఇచ్చి సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
      'నాగపు దంష్ట్ర' లన్నది సాధువే.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  17. దంష్ట్రలు లేవిట నాకును
    దంష్ట్రలు లేకుండ తినగ తరమా నాకున్
    దంష్ట్రలు కట్టించండని
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి

  18. దంతాలు లేక పోవడం వల్ల భుజించ లేక
    పోతున్నాను కృత్రిమ దంతాలు కట్టించమని
    శంకర్ అనే వ్యక్తి
    పళ్ళ విషయంలో తాండవం చేసేడు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. దంష్ట్రి యన శుక్ర సుతు డసి
    దంష్ట్రి మొసలి తీక్ష్ణ దంష్ట్రి తగ పులి పందిన్
    దంష్ట్రిగ నందురు మరి యే
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్?

    రిప్లయితొలగించండి
  20. దంష్ట్రల సింహద్వారపు
    దంష్ట్రల నేపథ్యమునొగి దర్శకుడొకరున్
    దంష్ట్రీధరుఁ జిత్రించఁగ
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్!

    రిప్లయితొలగించండి
  21. దంష్ట్రలపై నంశము నహి
    దంష్ట్రవలెన్ గుట్టుచుండె దయగను శౌరీ!
    దంష్ట్రించ లేనె, యేలన్
    దంష్ట్రలపై శంకరుండు తాండవమాడెన్!!!

    అహిదంష్ట్ర = తేలుకొండి, దంష్రించు = కొరుకు

    రిప్లయితొలగించండి
  22. దంష్ట్రలచే యా దంతియె
    దంష్ట్రి వలెనె బాహుబలిని తానెత్తంగన్
    దంష్ట్రిగ శివునికి జే యన
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

    (శంకరుడు = శివుడు = మహేంద్ర బాహుబలి)

    రిప్లయితొలగించండి
  23. Dashtriga hari nilipe bhuvini
    Dashtralapai sankarundu tandava maaden
    Damshtrapu mahishudu chaavaga
    Damshtraasurulella migula dainyamunonden

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దంష్ట్రిగ భువినెత్తెను హరి
    దంష్ట్రలపై; శంకరుండు తాండవ మాడెన్
    దంష్ట్రముల నేచు రాక్షస
    దంష్ట్రుల నణగార్చు చుండి తన్మయుడౌచున్
    (ఏచు=బాధించు)

    రిప్లయితొలగించండి
  25. దంష్ట్రమునందు,మహోగ్రపు
    దంష్ట్రంబున.సూక్ష్మజీవితరగతులందున్
    దంష్ట్రల నరసింహునిలో
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్|




    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు మధ్యాహ్నం నుండి విపరీతమైన తలనొప్పి. ఏదో మొక్కుబడిగా మీ పూరణలను చూశాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి