30, జులై 2017, ఆదివారం

సమస్య - 2424 (భక్ష్యముల నాముదముతోడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును"

70 కామెంట్‌లు:

  1. మినుప గారెలు, జంతికల్, మేలు యరిసె
    లన్ని వండవచ్చును గదా లక్షణముగ
    వెన్న కరిగించి నేతితో మన్ని కగ, అ
    భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును"

    రిప్లయితొలగించండి
  2. లక్ష్యము గొనుట విద్యార్థి లక్షణ ముప
    లక్ష్యము నిడుటయు గృహస్థ లక్షణమగు
    వీక్ష్యమును కాదు వారికి విందొసంగు
    భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును

    ఒకానొక కథలో గురుపత్ని ఎల్లప్పుడూ ఆముదముతో చేసిన పదార్థములను వడ్డించుచుండెడిది. ఒకరోజు విద్యార్థి గుర్తు పట్టగా ఆనాటితో విద్యాభ్యాసం పూర్తి అయిందని గురువు చెప్పడం జరుగుతుంది. అందువలన విద్యార్థులకు ఆముదముతో వంట చేయుట సమంజసమేనని చెప్పడం నా అభిమతము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ నమస్సులు. నిన్నటి పూరణ.

      దంష్ట్రియె ధరణిని నిలిపెను
      దంష్ట్రలపై; శంకరుండు తాండవ మాడెన్
      దంష్ట్రిని ముందుగ జంపియు
      దంష్ట్రిని దునుమాడు నింద్ర తనయుని కంటెన్

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  3. ఏ ముదము తోడ గణపతి నెటుల తెచ్చి
    పత్రి పూవులు కొనితెచ్చి పాలవెల్లి
    కట్టి మంత్ర మరచెదమొ గట్టి గాను...
    భక్ష్యములనా ముదముతోడ వండఁ దగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
      మంత్రం అరవడ మెందుకు? "కట్టి మంత్రముల్ పఠియింత్రు గట్టిగాను" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  4. హృదయమంత పండుగ వేళ ముదము కలుగు
    పిల్ల పాపలు వచ్చిన పెరుగు ముదము
    నిష్టమైన వారి కొఱకు కష్టమనక
    భక్ష్యములనా ముదముతోడ వండఁ దగును!!

    భక్ష్యములన్ + ఆ + ముదము

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    పెండ్లి వేడుక నందు :

    01)
    _____________________

    పంచమీ తిథి నాడు - ప్రాభాత సమయాన
    వాటిలో తిన్నెపై - వాటముగను
    పగడాల వారింటి - బంగారు రెడ్డికీ
    వరహాల వారింటి - వనిత తోడ
    పంతుళ్ళ మంత్రాల - బాజాభజంత్రీల
    పచ్చని పందిరిన్ - పరిణయమ్ము
    పిల్లలూ పెద్దలూ - పేరున్న ప్రముఖులూ
    విపరీతముగ వచ్చు - వీలు హెచ్చు !

    పెండ్లి వేడుక బాల్గొన - ప్రియము తోడ
    బంధు మిత్రులు వచ్చినన్ - పండుగె కద
    విందు జేయగ వారికై - వివిధ రుచుల
    భక్ష్యముల నా, ముదముతోడ - వండఁ దగును !
    _____________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రెడ్డికీ, పిల్లలూ పెద్దలూ, ప్రముఖులూ' అని వ్యావహారికాలను ప్రయోగించారు. వాటిని హ్రస్వాంతాలుగా ప్రయోగించినా చందోభంగం కాదు.

      తొలగించండి
  6. నేతి గారెలు బూరెలు ప్రీతి గాను
    నూనె వంటలు తినుటకు నోచు కొనగ
    నీటి కూరలు నారలు పోటి పడిన
    బక్ష్యముల నాముదముతోడ వండ దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'నీటి కూరలు నారలు...' అర్థం కాలేదు.

      తొలగించండి
    2. నమస్కారములు
      " నీటి కూరలు , నారలు ," అంటే , ఆనపకాయ, బీరకాయ, మున్నగునవి .ఇక నారలు అంటే " నారదబ్బకాయ, మాంసము మొదలైనవి " అని అదన్నమాట నాఉద్దేస్యము .

      తొలగించండి
  7. వ స తి గృహ ము న వసియిoచుబాలు డొక డు
    వచ్చి తల్లి తో మెల్లగా వాంఛ దె లు ప
    కోర్కె దీర్ప న ని యె గ దా కూరి మి గ ను
    భక్ధ్మము ల నా ము ద ము తో వండగ ల ను

    రిప్లయితొలగించండి
  8. ఏమి చేయుచుంటివి లోన యింతి నీవు
    భక్ష్యములనా? ముదము తోడ వండ దగును
    మాటి మాటికి యలిగెడు మగువ లకది
    సాధ్య పడదంచు కలిగెనే శంక నాకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      ప్రశార్థకమైన విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా, మనోహరంగా ఉంది. అభినందనలు. "మాటికి నలిగెడు" అనండి.

      తొలగించండి
  9. ………………………………………
    గు రు మూ ర్తి అ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పాచకుని గా౦చి యజమాని పలికె నిటుల

    స్వామి ! నేటి మధ్యాహ్నము వ౦డు వ౦ట :-

    భక్య్షములనా ? ముదము తోడ వ౦డ వలయు

    నేతి తో గాల్చి | భుజియి౦త్రు ప్రీతి దనర


    { పా చ కు డు = వ౦టవాడు ,

    = వ౦టబ్రాహ్మణుడు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      ప్రశ్నార్థకమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. సంతసంబును గూర్చుచు సంతతంబు
    బంధు మిత్రుల సహవాస బంధనంబు
    పెంచు నట్టివి ధరలోన నంచిత మగు
    భక్ష్యములనా, ముదముతోడ వండఁ దగును.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  11. కన్నవారిని మరపించి కరుణతోడ
    మరచిపోలేని నిండైన మమతతోడ
    తన్వి గురుకులశిష్యసంతతికి సకల
    భక్ష్యములనా ముదముతోడ వండవలయు.

    రిప్లయితొలగించండి
  12. చేరవచ్చిన సతితోడ చెప్పె భర్త;
    "అమ్మనాన్నలు వచ్చెద రతివ!నేడు;
    చేతనైనంత బాగుగ చేయవలయు;
    భక్ష్యములనా -ముదముగ వండదగును.

    రిప్లయితొలగించండి
  13. పాడిపంటల నందించి పౌష్యలక్ష్మి
    యందఁ జేయఁ నాత్మానంద మన్నపూర్ణ
    తృప్తి సంక్రాంతి నాడు నైవేద్యమిడఁగ
    భక్ష్యముల నా ముదముతోడ వండఁ దగును

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు

    1. పనికిరానిది లేదు ప్రపంచమందు
      పొట్టునూనె, పొద్దుతిరుగు పూలవిత్తు
      నూనెతోను పాకమొనర్చ నూతనముగ
      భక్ష్యముల నాముదముతో వండదగును
      తిన్నవారిగతి తిరుపతి పతియెరుగు!!!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. భక్ష్యముల నాముదము తోడ వండ దగును
    బలుకు మీయది సత్యము, వండుదురట
    నారి కేళపు తైలాన నాణ్యముగను
    గొన్ని ప్రాంతాల యందున మిన్నగాను

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.

    పోషక పదార్థముల నన్ని పొందుపరచి

    శుచికి ప్రాధాన్యమిచ్చుచు రుచిగ జేయ

    పతియు పిల్లలు సంతోషపడుచు తినగ

    తాను సంతృప్తి చెందు విధమ్ము నింట

    భక్ష్యముల నా ముదము తోడ వండ
    దగును.
    ****************************

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:
    పెద్ద వైద్యుడాయుర్వేద విఱుగుడందు
    భక్ష్యముల నాముదముతోడ వండ దగును
    మీకనుచు పథ్యముంజెప్పి ధూక నణచు
    పొందు లన్నియు బల్కుచు ప్రోది బఱచె
    (ధూక=అనారోగ్యము/రోగము)

    రిప్లయితొలగించండి
  18. భక్శ్యముల నాముదముతో డ వండద గు ను
    కాని తిన్నట్టీవారికి కడు పునొప్పి
    వాంతులు వి రే చ న ము ల వి బాధ పెట్ట
    వైద్యు నొ ద్దకు వెళ్ళ గా వ ల యు న పుడు

    రిప్లయితొలగించండి
  19. అన్నపూర్ణ యంచుఁ దలతు రమ్మగువను
    బేర్మి తోడ పిలిచి యింటఁ బెట్ట బువ్వ
    స్వజనులు దినఁ దృప్తిగఁ గల్గు సంతసమ్ము
    భక్ష్యముల నా ముదము తోడ వండఁ దగును

    రిప్లయితొలగించండి
  20. పసిడి కాంతుల కాంతలా మిసిమిచేత
    మల్లెవాసననెయ్యిలా?మరులుగొల్ప|
    పెదవి కందెడి ముద్దులా మదికిదోచ?
    “భక్ష్యములనా-ముదము”తోడ వండ దగును
    తురుమువంకాయ,వడియాలు మరువబోని
    రుచుల నందించు” వడ్డించ రూపవతియు
    శోభ నంబగు మనసుకుసుఖము దినగ|
    మరువబోనట్టి మమతలపొందువిందు|


    రిప్లయితొలగించండి
  21. అకట కష్టాల కడలి నడవి నoదు
    దదియు క్షీరము ఘృతమున్ ధరలు హెచ్చ
    అతిథి రాగ నే ధారకున్ పాలు బోక
    భక్ష్యముల నాముదముతోడ వండ దగును.
    భవదీయుడు
    పంచరత్నం వెoకట నారాయణ రావు
    నమస్సులతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నారాయణ రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణదోషం. "...కడలియౌ నడవియందు... ఘృతముల ధరలు" అనండి.

      తొలగించండి
  22. లంచగొండియై పొంకించె లక్షలందు
    వంటవాడనై నేనాత డింట కోరి
    భక్ష్యములనా ముదముతోడ వండఁ? దగదు!
    భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును!

    రిప్లయితొలగించండి
  23. వలలు నట్టుల వంటలు వనిత లెపుడు
    భక్ష్యములు లడ్లు బూరెలు బహుముదమున
    చేయ, రుచ్యములకు సాటి చెప్పనేల ?
    భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును

    పై పద్యం కందంలో వ్రాయాలనే ఉత్సాహంతో

    భక్ష్యములు లడ్లు బూరెలు
    సాక్ష్యమ్మిడు రుచులు గలుగ, చక్కని వనుచున్
    లక్ష్యము గొన ముదమున నా
    భక్ష్యము లా ముదముతోడ వండంగదగున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    దంష్ట్రాయుధు రూపున మా
    దంష్ట్రల బీకంగ పండితాఢ్యుడు దలుపన్
    దంష్ట్రీ ! మముగావు మనగ
    దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. సమస్యను కందపాదంగా మార్చి చేసిన పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  24. గారెలు, పులిహోర, బూరెలు ,యుండ్రాళ్ళు, కాజాలు ,జాంగ్రీలు, కజ్జి కాయ,
    జంతికల్,లడ్డూలు,చక్రపొంగళ్ళును,యరిసెలు,యప్పాలు, అరటి కాయ
    బజ్జీలు, పూర్ణాలు,బాదము హల్వాయు, రవ్వకేసరి ,పకోడి ,రవ్వ లడ్లు
    పాలకోవా,బర్ఫి,పరమాన్నము,జిలేబి,నువ్వుల యుండలు, గవ్వలు, వడి
    యంబు, లప్పడముల్, పాయసంబు, మిర్చి
    బజ్జి, యప్పాలు, కుడుములు ,వడలు సత్తి
    పిండి ,మైసూరు పాకుయు, పెసర పునుగు
    .సజ్జ యప్పాలు, బొబ్బట్లు, బొజ్జ కోరు.



    జిహ్వ కురుచులు నిచ్చెడి జీడిపప్పు
    పాకము మొదలైనవి వెన్న, నేతి తోడ
    వండిన యెడల క్షేమంబు బడయు నట, అ
    భక్ష్యముల నాముదముతో డ వండఁ దగును"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ విస్తృతమైన పూరణ వివిధ భక్ష్యాలతో విందు చేసింది. బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. వండరెచటను రుచులూరు వంటకముల
    భక్ష్యముల నాముదము తోడ! వండ దగును
    వేరుశనగల నూనెనే విందు లందు!
    కొందరేమొ కొబ్బరి నూనె కోరు కొంద్రు!

    రిప్లయితొలగించండి
  26. ముదము కానట్టి ముదము యాముదమన౦గ
    భక్షణీయము కానిద భక్ష్యమవగ
    అనశనవ్రతము బూనిన జనులకొరక
    భక్ష్యముల నాముదము తోడ వండ దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముదము+ఆముదము' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "ముదమె యాముదమనంగ" అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. గురుదేవుల సూచన మేరకు సవరించినపద్యము
      ముదము కానట్టి ముదమె యాముదమన౦గ
      భక్షణీయము కానిద భక్ష్యమవగ
      అనశనము సేయ బూనిన జనులకొరక
      భక్ష్యముల నాముదము తోడ వండ దగును

      తొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  28. తక్షణమటుకుల వడ, సతతము జాంగ్రి,
    వలయు నన్న పదముల సువాసనల జి
    లేబి, గర్మా గరమ్ముగ లెస్స ! తెలుగు
    భక్ష్యముల నా? ముదము తోడ వండ దగును :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    (ఒక తిండిపోతు వంటవాఁడు తన యజమానితోఁ బలికిన మాటలు)

    "మదిని మురిపించు రుచులు సమ్మతినిఁ దెలుప,
    భక్షకుల యాఁకలినిఁ దీర్చి, పరవశింపఁ
    జేయునటువంటి హృదయ రంజితములైన
    భక్ష్యములనా, ముదముతో వండఁదగును?"

    రిప్లయితొలగించండి
  30. పర్వ దినములన్ గృహముల బంధు గణము
    చేరి విందుల నందగ కోరు కొనుచు
    సందడులు జేయు సరదా పసందు లలర
    భక్ష్యముల నా ముదముతోడ వండదగును!

    రిప్లయితొలగించండి
  31. అన్నదానము మిన్నగానెన్ని తానె
    'డొక్క సీతమ్మ' యతిథులు పెక్కురైన
    భక్ష్యముల నా ముదముతోడ వండఁ దగున
    టంచు చూపించి వండి వడ్డించె సతము!

    రిప్లయితొలగించండి