31, జులై 2017, సోమవారం

ఆహ్వానము (గ్రంథావిష్కరణము)


2 కామెంట్‌లు:

  1. చిత్రకవి యను పదమే చిత్రముగా నున్నది. చిత్రమైన కవి యనియా చిత్రకవిత్వమును చెప్పువాడనియా? ఎట్లైనను కావచ్చును.

    కవియే చిత్రమైన వాడనగా చిత్రకవియను పదము కవియొక్క వ్యక్తిత్వమును గూర్చి ప్రతిఫలించును. చిత్రమైన వ్యక్తిత్వము కల కవి కవిత్వమునందు మాత్రము వస్తు-భాషా-భావ-నిర్మాణముల విషయములో చిత్రమైన పోకడలు పోకుండునా? అది గొప్పసంగతి. అందరకును పట్టుబడు చిన్న విషయము కాదు. ఆ విధముగా చిత్రకవి యనగా నొక గొప్ప సంగతి యగుచున్నది.

    పక్షాంతరముగా చిత్రకవి యన మన రెండవ విధానపు టర్ధము మేరకు చిత్రకవిత్వమును చెప్పువా డనుకొన్నచో దానియందము దానిది. చిత్రకవిత్వమని యెక ప్రక్రియ యున్నది. అందు సామాన్యుడు చేసినప్పుడు కవిత్వము కన్న చిత్రమైన ఛందోబంధనాదుల ప్రాగల్భమే మిక్కుటముగా నుండును. అసామాన్యుడు చేసినప్పుడు విచిత్రఛందోబంధములెన్ని యున్నను కవిత్వమే ప్రస్ఫుటముగా నుండుట యను గొప్పవిశేషము కనబడును. సామాన్యుడనగా కవిత్వసాధకుడు మాత్రమే కాని కవి వాచ్యత పెద్దగ లేని వాడు. మరియు నట్టివారిలో పెక్కురు మున్నొకరు వాక్రుచ్చినట్లుగా నజాగళస్తనసగోత్రులు. కవిపదవాచ్యుడై చిత్రకవి యన్న సార్థకమైన బిరుదము కలవాడు చిత్రకవిత్వమునందును మిక్కిలిగా కవిత్వమునే ప్రదర్శించు ప్రజ్ఞ కలవాడు. మన రామకృష్ణారావుగారనగా నట్టివా రనుకొందును.

    వారికి నా అభినందనలు. సభ దిగ్విజయముగా జరుగునని ఆశింతును.

    రిప్లయితొలగించండి