30, సెప్టెంబర్ 2017, శనివారం
29, సెప్టెంబర్ 2017, శుక్రవారం
సమస్య - 2478 (అన్నదమ్ములు రాముఁడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అన్న దమ్ములు రాముఁడు నంగదుండు"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
28, సెప్టెంబర్ 2017, గురువారం
27, సెప్టెంబర్ 2017, బుధవారం
హార బంధ తేట గీతి
ముగ్గురు అమ్మల ప్రార్థన
రచన - పూసపాటి కృష్ణ
సూర్య కుమార్
గౌరి, మారి,
గిరిజ, బాల,
కాల లలన,
మాత, అంతకాంతక సతి, శాంతి, జ్యోతి,
దాత, జయ, జలజ సదన, ధన కనక స
మస్త మహిమ దాత, రతి, రమ, రసన, సని
సత్య, సత్తి, లంభ, ప్రభ, శాంభవి, ఉమ
భీమ, రామ, నగజ, భంజ, బీజ, సత్రి,
చండి, చండ, చండిక, చర్చ, చల, చపల, స
తతము కాచంగ వలయును తల్లులార!
సమస్య - 2476 (రావణానుజుండు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రావణానుజుండు రాముఁడు కద"
(లేదా...)
“రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే”
ఈ సమస్యను సూచించిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.
26, సెప్టెంబర్ 2017, మంగళవారం
సమస్య - 2475 (మునికిఁ గోపమే...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు"
(లేదా...)
"మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.
25, సెప్టెంబర్ 2017, సోమవారం
సమస్య - 2474 (సవతి లేని యింట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సవతి లేని యింట సౌరు లేదు"
(లేదా...)
"సవతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.
24, సెప్టెంబర్ 2017, ఆదివారం
సమస్య - 2473 (తమ్మునిఁ బెండ్లాడె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్"
(లేదా...)
“తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై”
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.
23, సెప్టెంబర్ 2017, శనివారం
సమస్య - 2472 (నాగుల ముద్దాడె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్"
22, సెప్టెంబర్ 2017, శుక్రవారం
షోడశ దళ కమల సీసపద్యము
శ్రీహరి ప్రార్థన
రచన - పూసపాటి కృష్ణ సూర్యకుమార్
సీ.
రవినేత్ర రక్షించరా కరుణాంతరం
గ కమలనయన రంగపతి భరిమ
నీరజోదర గట్టునేత రమ్యముఖ య
జ్ఞాంగ పురంధర గంగధారి
నారద గరుడ వానర రక్షితా శ్రీహ
రీ యమరప్రభు మాయదేవ
వారణ పూజిత శ్రీరామ రక్షమాం
ఆదిత్య ఈశ్వర యజపు రాజ
తే.
అసురరిపువు నందసుత రక్షి పతిత వర
ద రసపతి యతి సుందరపురుష శరణు
కమలనాభ నాగశయన గరుడవాహ
నా అనంత ఆదివరాహ నందతనయ
పద్యము చదువు విధానము...
బాణము గుర్తు పెట్టిన (1) అన్న దళము కొసనుంచి 'ర'తో మొదలుపెట్టి 'రవినేత్ర' అని చదివి వృత్తములో ఉన్న (ర)తో కలుపుకొని 'రక్షించరా' తరువాత దళములోని (క)తో చదువుకుంటూ పోవాలి. చివరి దళములోని 'పురుష' చదివి తర్వాత దళము కొసల చివర 'శ'ను దళములోని 'ర'తో కలిపి వరుసగా 'శరణు కమలనాభ నాగశయన గరుడవాహన అనంత ఆదివరాహ నందతనయ' అని పూర్తి చేసుకోవాలి.
సమస్య - 2471 (భీమసేనుఁడు తాటకి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
21, సెప్టెంబర్ 2017, గురువారం
సమస్య - 2470 (హర్మ్యమ్మున వెదుక...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్"
20, సెప్టెంబర్ 2017, బుధవారం
సమస్య - 2469 (విజ్ఞత లేనట్టి నరుఁడె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
19, సెప్టెంబర్ 2017, మంగళవారం
సమస్య - 2468 (భారవియె రచించె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భారవియె రచించె భారతమును"
(లేదా...)
"భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్"
(డా. దేవరపల్లి ప్రభుదాస్ గారికి ధన్యవాదాలతో...)
18, సెప్టెంబర్ 2017, సోమవారం
సమస్య - 2467 (మల్లెలు గడు నల్లనయ్యె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్"
(లేదా...)
"మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే"
(డా. దేవరపల్లి ప్రభుదాస్ గారికి ధన్యవాదాలతో...)
17, సెప్టెంబర్ 2017, ఆదివారం
సమస్య - 2466 (కనుల రెప్ప లకట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కనుల రెప్ప లకట కత్తు లాయె"
(లేదా...)
"కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్"
(బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)
16, సెప్టెంబర్ 2017, శనివారం
సమస్య - 2465 (సత్కార్యమ్ములె మన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
సమస్య - 2464 (ధరలు తగ్గిన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధరలు తగ్గిన జగమెల్లఁ దల్లడిల్లె"
14, సెప్టెంబర్ 2017, గురువారం
సమస్య - 2463 (హరియే మహ్మదు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా"
ఈ సమస్యను పంపిన 'జిలేబీ' గారికి ధన్యవాదాలు.
13, సెప్టెంబర్ 2017, బుధవారం
ఒకరి ఆత్మకథలో నా ప్రస్తావన!
మా
మేనబావ మిట్టపల్లి సారయ్య ఆత్మకథ ‘స్మృతికణాలు”లో అక్కడక్కడ నా ప్రస్తావన ఉంది. అందులో
ఒకటి...
కంది
శంకరయ్య
..........................
నేను
ఆరో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది.
ఎవరో
ఒక పండితుడు, అష్టావధాని మా బడికి వచ్చాడు. అతడు మా ఉపాధ్యాయులు ఇచ్చిన సమస్యలను పూరించాడు.
చివరగా నేనొక సమస్యను ఇచ్చాను.
“రాధా!
యిటు రమ్మటంచు రాముడు పిలిచెన్”
ఇది
కందపద్యం నాలుగో పాదం. దీన్ని ఆ ఆశుకవి పూరించలేకపోయాడు. చివరికి నన్నే అడిగాడు.
నేను
రామాయణ సందర్భాన్ని చెప్పాను. “రాముడు వనవాసానికి వెళ్తున్నపుడు దారిలో విరాధుడు అనే
రాక్షసుడు సీతను అపహరించి పారిపోతూ వుంటాడు” అని.
కవిగారికి
ఆ సందర్భం స్ఫురించలేదు. చివరికి నేనే చెప్పాను “విరాధా! యిటు రమ్మటంచు రాముడు పిలిచెన్”
అని పూరిస్తే చక్కగా సరిపోతుందని.
మా
తెలుగు పండితులు లక్ష్మీనరసింహాచార్యుల వారు సంతోషించారు. కవిగారు అవమానం పొందారు.
ఆరో
తరగతిలో నాకు ఛందోజ్ఞానం ఎలా కలిగిందని మీరు అడగవచ్చు.
మా
పెదమామ కంది వీరస్వామి కొడుకు కంది శంకరయ్యతో నాకు బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ. నేను
ఆరో తరగతిలో వుండగానే అతను హెచ్.ఎస్.సి. పరీక్ష రాసి ఉన్నాడు. అతనికి చిన్నప్పటినుంచి సాహిత్య పరిజ్ఞానం ఉంది.
అప్పటికే తెలుగు ప్రాచీన కావ్యాలను తెగ చదివేవాడు. చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల శిష్యుడు.
ఆచార్యుల వారు మట్టెవాడ హైస్కూలులో తెలుగు పండితులు. వారు అప్పటికే కళ్యాణ రాఘవము,
గీతాంజలి వంటి కావ్యాలు వ్రాశారు. ఒక ఎండాకాలం సెలవుల్లో ఆచార్యులు తమ స్వగ్రామం జఫర్‍గఢ్
వెళ్ళారు. మా శంకరయ్యకు ఛందస్సు నేర్చుకోవాలని కోరిక. సెలవుల్లో కాలినడకన జఫర్‍గఢ్
వెళ్ళి గురువుగారి దగ్గర వారం రోజులుండి ఛందస్సు నేర్చుకొని వచ్చాడు. వచ్చీ రావటం మా
యింటికే వచ్చి నాకూ కొంచెం నేర్పాడు. వీలు చిక్కినప్పుడల్లా లఘువులు, గురువులు, గణాలు,
యతి ప్రాసలు, పద్యలక్షణాలు వివరంగా చెప్పేవాడు. పనిలో పనిగా వేటూరి ప్రభాకర శాస్త్రి
గారి చాటుపద్య మణిమంజరి కూడా ఇచ్చి తెలుగులో సమస్యలను ఇచ్చే పద్ధతిని కూడా చెప్పాడు.
ఆ సందర్భంలోనే నేను పైన ఇచ్చిన సమస్యను, దానికి తన పూరణను చెప్పాడు.
ఆ ప్రభావంతోనే
నేను అవధాని గారికి సమస్య నిచ్చి అవమానం మిగిల్చాను.
అప్పటినుండి
నన్ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు ప్రత్యేక దృష్టితో చూడడం మొదలుపెట్టారు.
దత్తపది - 123 (కన్ను-ముక్కు-చెవి-నోరు)
కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
నా పూరణ....
మిథిల రామున కన్నులమిన్న నిచ్చె
దేహ ముక్కైన గుహుడు నదిం దరించె
శబరి తినిపించె వివిధ వృక్షముల పండ్లు
సాయపడె నేలనో రుమాసతి మగండు.
12, సెప్టెంబర్ 2017, మంగళవారం
సమస్య - 2462 (తద్దినమే శుభమిడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ"
(లేదా...)
"తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు)
11, సెప్టెంబర్ 2017, సోమవారం
సమస్య - 2461 (రంగని ఛీ యనిరి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)
10, సెప్టెంబర్ 2017, ఆదివారం
సమస్య - 2460 (చక్కెర చేదనుట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా"
(బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)
9, సెప్టెంబర్ 2017, శనివారం
సమస్య - 2459 (తండ్రులకు మ్రొక్కెను...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు"
(దూరదర్శన్ వారి సమస్య...బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)
8, సెప్టెంబర్ 2017, శుక్రవారం
సమస్య - 2458 (జింకను గని తత్క్షణమ్మె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్"
(లేదా...)
"జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
7, సెప్టెంబర్ 2017, గురువారం
సమస్య - 2457 (పండితులు వసింపని...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పండితులు వసింపని ధర పావనము గదా"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
6, సెప్టెంబర్ 2017, బుధవారం
సమస్య - 2456 (దొంగలతో దొరలు గలిసి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా"
(లేదా...)
"దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
5, సెప్టెంబర్ 2017, మంగళవారం
న్యస్తాక్షరి - 47 (గు-రు-పూ-జ)
అంశము- ఉపాధ్యాయ దినోత్సవము
ఛందస్సు- తేటగీతి
స్యస్తాక్షరములు...
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "గు - రు - పూ - జ" ఉండవలెను.
4, సెప్టెంబర్ 2017, సోమవారం
దత్తపది - 122 (అవ్వ-తాత-అత్త-మామ)
అవ్వ - తాత - అత్త - మామ
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
3, సెప్టెంబర్ 2017, ఆదివారం
సమస్య - 2455 (రాతిరి సూర్యుండు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్"
(లేదా...)
"రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్"
2, సెప్టెంబర్ 2017, శనివారం
సమస్య - 2452 (విష్ణువె హాలాహలమను...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.
1, సెప్టెంబర్ 2017, శుక్రవారం
చతురంగ బంధ పార్వతీ ప్రార్ధన
చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన
నగజాత, యాదవి, నగనందిని, గిరిజ,
అంబిక, అద్రిజ ,యమున, నాగ
హారుని దేవేరి,ఆదిశక్తి, అనంత,
మలయ నివాసిని ,మాత ,సౌమ్య,
చేతన సఖి,గట్టుధీత, నగపు సూన,
శరవణ భవమాత, సర్వలోక
సేవితా ,శారదా, శివసత్తి, మాలినీ,
దక్ష తనూభవ, దాక్షి, సింహ
యాన, శ్రీ నీల లోహిత ,అగజ ,హిమజ
అజిత సాప్తపదీన జాయ, జితి
సహిత,
వాజస సహధర్మ చరిణీ, భవ్య, శ్రీ గ
జాన నోల్ల, ఘనంబుగా సంతు గోరి
(సింహ వాహినీ నీ సేవ చేసినాము)
రచన
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
సమస్య - 2453 (తరువులన్ రక్ష సేయుట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తరువులన్ రక్ష సేయుట తగని చర్య"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)