9, సెప్టెంబర్ 2017, శనివారం

సమస్య - 2459 (తండ్రులకు మ్రొక్కెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు"
(దూరదర్శన్ వారి సమస్య...బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

63 కామెంట్‌లు:

 1. చిన్నియభిమన్యు డేమియు జింతలేక
  మాయజూదాన విజితులై మరలుచున్న
  విశ్వవీరాధివీరులై వినుతిగన్న
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు.

  రిప్లయితొలగించండి
 2. మునుల సేవించి వనముల తనివి తీర
  కర్మకాండల ఫలముల మర్మ మెరిగి
  ధర్మరాజు గంగానది తటము జేరి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 3. శివుని ధనువును ఖండించి సీత కరము
  పట్టి శ్రీరఘు రాముడు వరుసగ తన
  జనకుడు జనకుడును, గురు జనుల నబడు
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
  (పంచ జనకులు – 1 జనకుడు (కన్న తండ్రి), 2. ఉపదేశం చేసిన గురువు (చదువు చెప్పిన అధ్యాపకుడు), 3. కన్యాదాత, 4. ఆపదలో ఉన్నప్పుడు కాపాడినవాడు, 5. అన్నం పెట్టి పోషించినవాడు.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 4. తండ్రి యాజ్ఞను తలదాల్చి తనరు మదిని
  చుట్టు దిరిగెను ముమ్మారు గిట్ట దనక
  కల్ప తరువని గ్రహియించి కన్న తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 5. తెలిసి తనతప్పు దుష్యంతధీవరుండు
  సంతసించె శకుంతల సాధ్వినిఁగని
  భరతవీరుడు సద్భక్తిమీర తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి


 6. తమ్మి మొగ్గరమ్మునట ఛేదనము జేయ
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండ
  గు యభిమన్యుడు బాలుడు ! కూల్చి రకట
  సూరుడసహాయుడాతని చుట్టు కొనుచు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సుతుడగు నభిమన్యుడు..." అనండి.

   తొలగించండి
 7. లవకుమారుడు వీరుండు వ్రాసి యున్న
  ఫలకమును జూచి యజ్ఞాశ్వ బంధనంబు
  ముందుగా జేసి నమ్రుడై ముజ్జగముల
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.


  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 8. శత్రు నివహంబు పరిమార్పఁజాలువాడ
  దండిమగడ ఘటోత్కచుండ నేను
  పాండు సుతులార జయమని పల్కుడనుచు
  తండ్రులకుమ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "దండి మగడ నగు ఘటోత్కచుండ నేను" అనండి.

   తొలగించండి
 9. పెండ్లి చూపులకనుచు తా వెడలు వేళ
  భక్తితో నిలవేల్పుకు ప్రణతు లిడుచు
  నచట గల విప్రునకు, పూజ్యులైన తల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

  రిప్లయితొలగించండి
 10. చదువు సంస్కార మున్నట్టి చదువరి యత
  గాడు, దూరదేశమ్మున కరుగు వేళ
  సాగనంపగ వచ్చిన సంగడీల
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 11. తల్లి దండ్రులు దైవము ల్ ధరణీ ననుచు
  భక్తి భావా న శ్రవణుడు శక్తి కొలది
  తాను సేవించి సతతము తన దు తల్లి
  తండ్రుల కుమ్రొక్కేను పతివ్రతా సుతుoడు

  రిప్లయితొలగించండి
 12. భారత సమరమున హిడింబ వివరించ
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
  ఘన ఘటోత్కచుండు కరము వినయముగను
  సమ్మతిని బడయ పాల్గొన జగడమందు

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. నందభూమిని వీడియా నందబాలు
   డంతమొందించె కంసుని పంతమునను
   చెఱను విడిపించి చిక్కుల జెరచి తల్లి
   దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు

  సాత్విక గుణసంపద తోడ సందడించు
  దక్షుడు, సతము నెఱినెంచు ధర్మమూర్తి
  తా నెలమిని ముఱియుచు నితవున తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 15. పద్మ వ్యుహమ్ము ఛేదన బరుప దలచి
  బాలు డభిమన్యుడయ్యెడ ప్రధమముగను
  తండ్రులకు మ్రొక్కెను ,పతివ్రతా సు తుండు
  మదిని కల్మష రహితుడై మసలుచుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పద్మవ్యూహ' మన్నపుడు ద్మ గురువై గణదోషం.

   తొలగించండి
 16. దత్తుడొక శుభదినమున దండ్రి జేఱి
  తపము సేయగ నానతి దానుగొనియు
  నంత నా త్రిమూర్తుల మది యందు నిలపి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఫణి కుమార్ నిన్నటి మీ సందేహము నాలస్యముగ గాంచితిని.
   కృష్ణపాలనానోంకృతుఁడు సమాసము దోషరహితమే.
   అయితే భావ భేదము గోచరించుచున్నది.
   మీరనుకున్న కృష్ణపాలన నంగీకరించని వాఁడని యర్థమునకు బదులు కృష్ణపాలన చే నంగీకరింపబడని వాఁడని స్ఫురించును.
   కృతము కర్మణి ప్రయోగమున నున్నది.
   వాస్తవమునకు కాలయవనుఁడు కృష్ణాధికారము నంగీకరించని వాఁడే కాని యంగీకరింపబడని వాఁడు కాదు గదా.
   కృష్ణపాలన కాలయవనుని చే నంగీకరింప బడనిది.
   ఇది సూక్ష్మ విషయ వివరణమునకే కాని దోష ప్రకటనకు కాదు.

   తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

   పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు.
   దోషము అవగతమైనది. మీరు దోష ప్రకటన చేయుట మా అభ్యున్నతికే. కావున మీరు దోష ప్రకటన చేసిననూ మాకు కడు ఆనంద హేతువే.

   కృష్ణపాలనానోంకృత చిత్త కాలయవనుండు అనిన సరిపోవునా. దయచేసి పరిశీలించ ప్రార్థన.

   తొలగించండి
  4. ఫణి కుమార్ గారు చిత్త యిక్కడ కాలయవనునకు విశేషణము గావున నదే యర్థము వచ్చును.
   “కాలయవనానోంకృత కృష్ణపాలనము” అని పూర్వ పదముగా వాడిన గాని కామితార్థము లభించదు. తదనుగుణముగా పాదములు మార్చ వలసి యుంటుంది.

   యీ సవరణను చూడండి. ఇక్కడ “భృశానోంకృత కృష్ణ” అధికముగా నంగీకరింపబడని కృష్ణుడు కలవాడు ( కాలయవనునకు విశేషణము) కాలయవను డని రూఢిపరచుట జరిగినది. కొన్ని వ్యాకరణ సవరణలు గూడ గమనించండి.

   వంకయు లేక ధారుణిని భారము దీర్చు విభుండునై భృశా
   నోంకృత కృష్ణ కాలయవనుండహమున్ దురమందు నిల్చినం
   గంకటమున్ ధరింపకయె కయ్యము కృష్ణుఁడు వీడి పోయెగా
   జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో!

   తొలగించండి
  5. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సవరణకి ధన్యవాదములు.

   తొలగించండి
 17. రిప్లయిలు
  1. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువ
   నియెడు తనయుఁ జండామార్కుల యెడకంపు
   వేళ, భక్తిఁ బాదమ్ముల వ్రాలి తల్లి
   దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

   తొలగించండి
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. జంకబోనయ్య ద్రోణుని పంకజంపు
  వ్యూహభేదన జేయగ బోదు నంచు
  నప్పు డభిమన్యు డడలుచు జూచు
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 19. పరమ నిష్ఠా గరిష్టుడు పరగ నతడు
  తల్లి దండ్రులు గురువులు దైవమనుచు
  దలచు చుండును నిత్యము తలపులందు
  విశ్వ విద్యాలయ పరీక్ష వేళ; తల్లి
  దండ్రులకు మ్రొక్కె పతివ్రతాసుతుండు.

  రిప్లయితొలగించండి
 20. ఉత్తరా దిశా గత గజాస్యోత్తమమ్ము
  ప్రీతి నతికించి బ్రతికించి శీత గిరి త
  నయకుఁ బ్రీతి జేయ హర తనయుఁడు తల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తండ్రి కిద్ద రన్నలు మరి తమ్ము డొక్క | డమ్మ..." అనండి.

   తొలగించండి
 22. యముని తడబడ జేయుచు నంది పతిని
  సుతుని బడసిన సావిత్రి నుతుల గొనియె
  విద్య నేర్వఁగ బోవుచు ప్రీతిఁ దల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

  రిప్లయితొలగించండి
 23. పద్మదళములవోలెనువలయముగను
  నుండునాశత్రుసేనపునుక్కడంచ
  బయలుదేరుచునభిమన్యబాలుడపుడు
  తండ్రులకుమ్రొక్కెను,పతివ్రతాసుతుండు
  మంచిమర్యాదసహితుడై మసలునెపుడు

  రిప్లయితొలగించండి
 24. వరలు నక్షత్ర శుభయోగ వారమరిగి
  తనయునకు నక్షరాభ్యాసమును ఘటించె
  పిదప వర్ధిల్లుమనుచు దీవించఁ తాత,
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 25. తండ్రికిద్దరన్నలు మరితమ్ముడొక్క
  డమ్మకిద్దరు చెల్లెళ్ళు అక్కయొకతె
  పుట్టిన దినమని సందడి బెట్టుకొనగ?
  చిన్నినాన్నాలు మువ్వురు జేరిరచట
  పెద్దనాన్నలుమువ్వురు వద్దజేర
  తండ్రులార్గురు లాసీస్సు తప్పకివ్వ?
  తండ్రులకు మ్రొక్కేను పతవ్రతా సుతుండు| {అమ్మ,అక్క,చెల్లెళ్ళువారిభర్తలు,నాన్నఅన్నలుతమ్ముళ్ళువరసచూడ}

  రిప్లయితొలగించండి
 26. క్రీడి లేనట్టి వేళను క్రీడగాను
  భయము నెరుగని రీతి సుభద్ర కొడుకు
  పంకజవ్యూహము జొనగ వర్ది గోరి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు!

  రిప్లయితొలగించండి

 27. .తే.గీ:కోరి రనసూయ నలనాడు కువలయాన
  కూర్మితో వివస్త్ర యగుచు కూడిడమని
  బాలలుగమార్చి యతివ తా పాలొసంగ
  సంతసాన త్రిమూర్తులు సంతు నిడగ
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

  తే.గీ:పోవ పద్మపు-వ్యూహాపోర డైన
  కవ్వడి సుతుడుత్సుకతన కరములెత్తి
  యనుమతివ్వమటంచును నర్తి తోడ
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

  .తే.గీ:తండ్రి కానలో మరణింప తనయులెల్ల
  తల్లితో హస్తినను చేర ధర్మజుండు
  ప్రేమతోడ నగపడిన పెద్ద తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.


  .తే.గీ:కొత్త కొలువున చేరంగ కూర్మి తోడ
  బయలు దేరుచు తాభక్తి భావమూని
  సదన మందుపెద్దలకును సఖుల తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.


  రిప్లయితొలగించండి
 28. జమునకు సరయువునకును,శతముఖునకు
  అమడ సురవఠరులకును యభిషవమును
  మొదలిడుతరి యమసుతుడు ముదముగలుగ
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
 29. పరగఁ భారతీభార్గవీపార్వతులను
  దాల్చి రసనాసువక్షస్స్వతనువులందు
  జగముఁ బుట్టించి, రక్షించి, చంపు జగతి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు

  రిప్లయితొలగించండి

 30. పిన్నక నాగేశ్వరరావు.

  పుష్కరాలకు నది స్నానములను చేసి

  పెద్దలకు నున్నత గతి ప్రాప్తించు కొఱకు

  శ్రాద్ధ కర్మలు చేయుచు శ్రద్ధగాను

  తరతరాల వారనుచు ముత్తాత,తాత,

  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా
  సుతుండు.

  రిప్లయితొలగించండి