13, సెప్టెంబర్ 2017, బుధవారం

దత్తపది - 123 (కన్ను-ముక్కు-చెవి-నోరు)

కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
నా పూరణ....

మిథిల రామున కన్నులమిన్న నిచ్చె
దేహ ముక్కైన గుహుడు నదిం దరించె
శబరి తినిపించె వివిధ వృక్షముల పండ్లు
సాయపడె నేలనో రుమాసతి మగండు.

74 కామెంట్‌లు:

  1. వీరరఘువంశతిలకుండు విరచె విల్లు;
    శివుడమరు డుముక్కని చెలగిమ్రోగె;
    సురలు వీకన్నుతుల తోడ విరులనిదిరి;
    చేతనోరు జానకికింక సిగ్గు కలిగె.

    రిప్లయితొలగించండి
  2. రాముడిచ్చిన అంగుళీయకముతో సీతాన్వేషణకై హనుమ లంకకు

    చేరి రామున*కన్ను*వ సీత కిచ్చి
    రాక్షస బల*ముక్కు*మడచి రయముఁ వచ్చి
    హనుమ వినిపిం*చె వి*నతుడై కనుల కద్ది
    చూపె *నోరు*క్మ చూడామ ణీపదమును.
    (అన్నువ=భార్య;రుక్మ =బంగారము; పదము=వస్తువు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. శర్మ గారు చక్కటి పూరణ:
      “చూడామణి పదము” సాధువు. అప్పుడు యతిభంగము.
      అంగుళీయకమని చెప్పి శిరోరత్నమును చూపారంటున్నారు!

      తొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    రాముడు వనవాసమునకు బయలుదేరిన సమయమున :

    01)
    _______________________

    పంక్తిరథుడంగలార్చుచు - వలదనినను
    పట్టమహిషదె మ్రాన్పడ - నిట్టనిలువు
    పురము పురమంత శోకంబు - పొంగు లెత్త
    పడతియును సోదరుని గూడి - నడక తోడ

    కన్నుకుట్టిన మంథర - పన్నుగడను
    నోరుగొట్టగ పినతల్లి, - నొవ్వకుండ
    ముక్కుటములను ధరియించి - పురము విడ*చె
    వి*పినమున కేగ రాముడు - వెరపు లేక !
    _______________________
    నిట్టనిలువు = నిలుచున్నది నిలుచున్నట్లే
    కూడు = జతపడు
    కన్నుకుట్టు = అసూయపడు
    పన్నుగడ = పన్నాగము
    నోరుగొట్టు = అన్యాయము చేయు
    ముక్కుటము = నారచీర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని 'కన్ను, నోరు' స్వార్థంలోనే ప్రయోగించబడ్డాయి.

      తొలగించండి

  4. రాముడు ధరించె విల్లును
    తా మును నడిచె తెఱనోరు తానై యగుచున్ !
    నీమముగన్నుతి జేయుము
    హా! ముక్కుటముల కదించి యడవికి చనిరే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నీమముగ న్నుతి.. అన్నపుడు గన్ను ఉన్నది, కన్ను లేదు.

      తొలగించండి
  5. హనుమ సీతజాడను కాంచె; వినిన ప్రభుడు
    తాను వీకన్ నురుమనాడె దానవులనొ
    ధారుణీక్షోభనో; రుధిరారుణితపు
    బాణముక్కుమొనలఁ బాపె పాపములను

    రిప్లయితొలగించండి
  6. ఒప్పు బోధించె వినలేదు చుప్పనాతి
    ఆగకన్నుల మిన్నపై కరిగె మ్రింగ
    ముక్కుటంపుల సౌమిత్రి ముందుకురికె
    రోషమొప్పగ దూకెనో రుద్రుడగుచు

    రిప్లయితొలగించండి
  7. పచ్చని పుడమి ముక్కారు పంట పండె
    జరయు రుజలు లేకన్నుర్వి జనులు మురిసె
    జార చోరులు జరియించు జాడ గనమె
    యన్ని భద్రము లేతోచె విన్నవించ
    రుద్రసఖు రాజ్యమననో రుచిర మయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ముక్కారు (మూడు+కారు)లో ముక్కు లేదు.

      తొలగించండి
    2. ఉన్నతమ్మై వరల దేహ ముక్కువలెను
      జరయు రుజలు లేకన్నుర్వి జనులు మురిసె
      జార చోరులు జరియించు జాడ గనమె
      యన్ని భద్రము లేతోచె విన్నవించ
      రుద్రసఖు రాజ్యమననో రుచిర మయ్యె!

      తొలగించండి
    3. గురువుగారూ! ధన్యవాదములు! సవరించిన పూరణ పరిశీలించ మనవి!🙏🙏🙏🙏

      తొలగించండి
  8. కన్ను మొఱకును జూపించి కఠిన మనము
    ముక్కుటము ధరించిన సీత మోము కంద
    దోచె విపినము రావణు దుష్ట బుద్ది
    యేలనో రుద్ర భక్తుని హేల లిటుల?

    రిప్లయితొలగించండి
  9. కన్ను మొఱకు=వంచన
    ముక్కుటము= నార దుస్తులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కన్నుమొఱకు అన్నపుడు కన్ను స్వార్థంలోనే ప్రయోగించబడింది.

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:
    తే.గీ.
    కన్నులవిలుకాని వలెను క్రాలుకొనగ
    దోచె విల్లుకు ముక్కులు దొలగ వైచు
    రాఘవుడు నోరుమెంగయై లజ్జతోడ
    జనకుని దరి నిలిచియున్న జానకికట
    ( కన్నులవిలుకాడు= మన్మధుడు; ముక్కులు= నూకలు; నోరుమెంగ= మూగ )





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కన్నుల విలుకాడు అన్నపుడు కన్ను స్వార్థంలోనే ఉంది.

      తొలగించండి
  11. మతిలే(క న్ను)తి యింతు వొప్పగునె? నామాటల్ వినన్ నీకగున్
    సత (ముక్కు)న్వలె దార్ఢ్యసంపద మహిన్ సర్వప్రధానత్వ మం
    చతి వాత్సల్యము కైకపై నుని(చె వి)ఖ్యాతిం గనన్ మంథరా
    సతి యా వేళ మ(నో రు)జన్ నిలుపగా సంతాపముం గూర్చుచున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. చాలా బాగుంది మూర్తి గారు మీ పూరణ.
      కానీ “కన్ను” పద న్యస్తము విచారింప దగును.
      లేకన్ నుతియింతు: లేకయే సాధువు. “లేక” కళ యే కాని ద్రుతప్రకృతికము కాదు.

      తొలగించండి
    3. ధన్యవాదాలండి.
      రాకన్ మానవు అనే పద్యంలో(ఏ గ్రంథమో గుర్తు లేదు) లేకన్ అని చదివిన గుర్తు. దాని కారణంగానే అలా వచ్చింది.
      నమస్కారములు.

      తొలగించండి
    4. "పోకన్మానదు కాయమే విధమునన్ పోషించి రక్షించినన్
      రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంఋలో డాగినన్
      కాకన్ మానవు పూర్వ జన్మ కృతముల్ కాగల్గు కార్యంబులున్
      లేకన్ మానవవెంత జాలిపడినన్ లేముల్ సిరుల్ భార్గవా"

      http://kandishankaraiah.blogspot.in/2017/08/2428.html?m=1

      తొలగించండి
  12. కాల్చె నోపక న్నురిమి లంకన్ హనుమయె
    ముక్కుచున్ మూల్గిరి దనుజుల్ దిక్కులేక
    రావణుఁడు చలించె వినుచు, ప్రథమమనఁగ
    సిరల నురికెనో రుధిరము చేటునెంచి?

    రిప్లయితొలగించండి
  13. కన్ను మొఱకు=వంచన
    ముక్కుటము= నార దుస్తులు

    రిప్లయితొలగించండి

  14. శీతకన్నువేయకుమమ్మ శీలవంతు
    డైన రాముడు చెవియొగ్గి యమ్మమాట
    వనికి కరముక్కుమదితోడ పయనమగును
    నియతితోడనోరుపుతోడ నిలుపు రాము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది.
      'శీతకన్ను' అన్నది సాధుశబ్దం కాదు. అయినా అందలి కన్ను స్వార్థ ప్రయోగమే. 'చెవియొగ్గి' అన్నపుడు చెవి స్వార్థంలో ప్రయోగించారు.

      తొలగించండి
  15. గురువుగారికి నమస్కారం, నా పూరణను పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.
    ధన్యవాదాలు, సుభద్ర

    పడెను కన్నులు పౌలస్థ్య పడతి వనగ
    యడిగె నోరువి డచిచేకొ యనుచు రఘుని
    తమ్ము డదిగని చెవికోసె తామ సమున
    ముక్కు చుచనగ లంకకు ముప్పు మొదలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుభద్ర గారూ,
      మీ ప్రయత్నం ప్రశసింపదగినదే.
      దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలి. మీరు స్వార్థంలో ప్రయోగించారు.
      'పౌలస్త్య పడతి' దుష్టసమాసం. '..వనగ। నడిగె..' అనాలి. చేకొ...? రఘు అంటే రాముడు కాదు. రాఘవుడు అనాలి. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
    2. సుభద్ర గారు చాలా రోజుల తర్వాత మీ పూరణను చూస్తున్నాము. సంతోషము.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. అయ్యో! తెలియక తప్పుగా పూరించాను గురువుగారు. ఇదిగో మరొక ప్రయ్త్నము. తప్పులు సూచించగలరు.

      ముక్కుటముదాల్చిచనగనుమురహరుండు
      జతగ నడిచెవిశాలాక్షి,జనకసూన
      యెరగవుగద, నీవెన్నడుయెండకన్ను1
      విడుమనిమనోరుడనగనువినకవెడలె

      తొలగించండి
    5. పెద్దలు కామేశ్వరరావుగారికి నమస్కారం. తగినంత సాధన చెయ్యలేకపోతున్న కారణాన పూరణకు సాహసించలేకపొతున్నాను. తప్పో, ఒప్పో చేతూ ఉంటేనే కదా తెలిసేది అని మళ్ళీ ప్రయత్నిచపూనుకొన్నాను. మీరు నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా సొంతోషం. గురువుగారితో పాటు మీలాంటి పెద్దలు కూడా తప్పులు చెప్తే దిద్దుకుని మంచి పద్యాలు రాయాల్ని ఆశ. ధన్యవాదాలు.

      తొలగించండి
    6. సుభద్ర గారు నమస్సులు. చక్కని యాలోచన. మనస్సున కాహ్లాద జనకము పద్య రచనా వ్యాసంగము. సాధన వలన సమకూరని పనులు లేవు. తప్పక హృద్యమ్ములైన పద్యముల నందించ గలరు.

      తొలగించండి

    7. వేదుల సుభద్ర అంటే నవలా రచయిత్రి గారేనాండీ ?

      జిలేబి

      తొలగించండి
    8. నవలలు రాయలేదు కానీ కథలు రాస్తానండీ! అగ్రహారంకథలు నా పుస్తకమే!

      తొలగించండి

    9. వావ్ ! గ్రేట్ !

      అగ్రహారం కథలు ;

      జిలేబి

      తొలగించండి
    10. నా రెండవపూరణ పైన ఇచ్చాను. పెద్దలెవరైనా పరిశీలించి తప్పులు చెప్తే సరిచేసుకుంటాను. ధన్యవాదాలు

      తొలగించండి
  16. ముక్కుటిల మా జనకునకుఁ
    జిక్క ధనోరుక్మము నడఁచె విశా లోరుం
    డెక్కిడి వీకన్ను కుజకు
    నక్కడ నుండంగఁ జూపె నవనీశుండే

    [మూఁడు + కుటిలము = ముక్కుటిలము; వీకు + అన్ను = వీ కన్ను; అన్ను = ఆఁడుది; వీకు = ఉన్నతి ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      1-11-2016 నాటి సమస్య: చిన్న సవరణతో
      కన్ను - ముక్కు - చెవి – నోరు పై పదాలను ఉపయోగిస్తూ దీపావళి సంబరాలను వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

      తెగువ మనో రుచిర రయ ప
      తగమున సద్ద్వారకన్నుత నివాసుఁ డిలం
      దగ నంబుముక్కు వర్ణుఁడు
      బిగి మగువ గన సమయించె విలయుని నరకున్

      [అంబుముక్కు = మేఘము]

      తొలగించండి


  17. కన్ను మరీ ప్రాబ్లమాయె !

    రాముడు ధరించె విల్లును
    తా మును నడిచె తెఱనోరు తానై యగుచు
    న్నామెలతుకన్ను, సీతయు
    హా! ముక్కుటముల కదించి యడవికి చనిరే !

    సరిపోతుందాండీ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. గాధిసుతుని రాక న్నుతి కరముసేయ
    మాన్య! తా ముక్కు వీరుని మ ఖ ము గావ
    పనుపు మన గ వీచేవిమల పరిమళం బు
    గేలువ వలయు నో రుద్రాక్ష సులువు గాను

    రిప్లయితొలగించండి
  19. అడవిలోచూచె విచిత్ర యజిత యోని
    నాడు ,ముక్కూరు తోనేను నాధు గోర
    వెడలె నార్యుడు అటవికి వేగిరమున,
    నాకు కన్నోటు గల్గెను నాధు కేక
    వినగ, లక్ష్మణా వినుమయ్య జనుము నీవు
    అన్నకేమయ్యెనో రుట్ట్టు నిన్ను దాల్చె
    యనుచు బంపిదప్పును చేసి ననుచు సీత
    దెల్పె దనగాధ బాధతో త్రిజటగోర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి మిత్రులు నా పద్యములో తప్పులున్న చూపించ వలెను సరిదిద్దుకుంటాను

      తొలగించండి
  20. 13-9-2017 (బుధవారము)
    *దత్తపది*
    *కన్ను - ముక్కు - చెవి - నోరు*
    పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
    రామాయణార్థంలో
    పూరణ....

    సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము

    చిక్ *కన్ను* గ్గుగ జేసెను
    *ముక్కు*చు ముడుచుకొన జేసె మున్నెదురొడ్డన్
    నక్కంగన్ జూ *చెవి*డిచె
    నక్కపి తా *నోరు*పుచెడి యసురుల జంపెన్

    సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము


    అశోక వనంలో హనుమంతుని రణభీభత్సం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ, మీకు గతంలోను ఒకసారి చెప్పాను. "నేనిచ్చిన సమస్యను ఉన్నదున్నట్టుగా కాపీ, పేస్ట్ చేయనవసరం లేదు, కేవలం మీ పూరణ ఇస్తే చాలు" అని. అయినా మీరు మానలేదు. దానివల్ల మీకు అదనపు శ్రమ కాదా? అందరూ ఈరోజు నేనిచ్చిన సమస్యకే పూరణలు ఇస్తున్నారు కదా! మళ్ళీ సమస్యను మీరు ఇవ్వడం ఎందుకు? మరొక్క మాట మీ పూరణకు ముందు, వెనుక రెండుసార్లు మీ బిరుదులను ప్రకటించుకుంటున్నారు. రెండు సారులు అవసరమా? మిగిలిన కవిమిత్రులు కూడా బిరుదులను, గురజాడ పురస్కారాలను పొందినవారే. వారు తమ బిరుదులను ప్రకటించుకుంటున్నారా? కేవలం సమస్యకు పూరణను పోస్ట్ చేస్తున్నారు. ఇకనుండి దయచేసి సమూహంలో కాని, బ్లాగులో కాని నేనిచ్చిన సమస్యను కాని, బిరుదులను కాని పేర్కొనకండి. కేవలం మీ పూరణను మాత్రమే పోస్ట్ చేయండి.
      నేను కూడా ఏవో బిరుదులను, పురస్కారాలను పొందాను. కాని ఎక్కడా ప్రకటించుకోను. గమనించండి!

      తొలగించండి
  21. ఆజోకన్నుతియింప శక్యమౌనె విధికి న్నారూప లావణ్యముల్?
    తేజోవంతము సీత ముక్కుటముననున్ తీరైన శీలమ్ముతో
    రాజీవాక్షుని దోచె విల్లు విరువన్ రంజిల్లె లోకమ్ములే
    రోజుల్వేల్భువి నోము నోచి కనెనో రుద్రుండు దీవించెనో !
    *****)()()(*****
    ముక్కుటము = నారచీర ; వల్కలము

    రిప్లయితొలగించండి


  22. జీపీయెస్ వారు

    దత్తపది చెయ్యలేదేందుకో ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా చాలా కష్టం నాకు దత్తపది, న్యస్తాక్షరి, వృత్త రచన మున్నగునవి. ఆట వెలది తేటగీతి కూడా కష్టమే. కందాలైతే ఏదో విధంగా కిట్టించగలను. పాత కంద పద్య పాద సమస్యలున్నాయిగా ఊసు పోవడానికి. పైగా నా కనిష్ఠ సోదరి సీతా దేవి విజృంభించి చాలా చక్కగా శంకరాభరణంలో పాల్గొనుచున్నది కదా. వెనక వచ్చిన కొమ్ములు :)

      తొలగించండి

    2. జీపీయెస్ వారు మీకోసం ఓ సమస్య

      హరియే యహ్మదు కుదురుగ హరుడౌ యేసూ !!

      జిలేబి

      తొలగించండి
    3. శాస్త్రి గారికే ఎందుకు? రేపు ఈ సమస్యనే అందరికోసం ఇస్తాను....
      'హరియే మహ్మదు కుదురుగ హరు డేసు కదా"

      తొలగించండి

    4. ప్రశ్నా పత్రం లీక్ అయిపోయిందండి :)
      పరీక్ష కేన్సిల్ చెయ్యాలేమో :)

      నెనర్లు !

      జిలేబి

      తొలగించండి
    5. అక్కర లేదు. లేటుగా శంకరాభరణం చూసే మనబోండ్లకు మజా!

      "The late bird catches the partying worm" :)

      తొలగించండి
  23. కన్నులవిలుకాడు చిన్నవోవడె వీని
    .....సౌందర్యమును గని సత్య మిదియ!
    ముక్కుటమును దాల్చి మునివోలె గన్పట్టు
    .....దాగునే వీని యందమ్ము దాన?
    చెవిచేసుకొననైతి చిత్ర మెందుండెనో
    .....యిన్నినాళ్ళును యిట్టి వన్నెకాడు?
    నోరుకాచగ నింక నోపలే నిపుడె నా
    .....వాంఛను ప్రకటించి వాలిపోదు

    నితని బాహువు లందున వెత యడంగు
    ననుచు రాముని గని శూర్పణఖ మది చెడి
    కన్ను చెవి ముక్కు నోరుగా కాయమెల్ల
    నందముగ మార్చుకొని వన్నెలాడి యాయె.

    రిప్లయితొలగించండి
  24. ముక్కుటము గట్టి మ్రొక్కుచు మునివరునకు
    రూపరి విరిచె విల్లు నో రుద్రు పగిది ,
    కన్ను కుట్టిన రాజులు మిన్న కుండ;
    దాశరధి గట్టె సీతకు తాళి నపుడు

    నిన్నటి సమస్యకు నా పూరణ

    1 ) గిద్దెడు భోజ్యంబిడకనె
    నిద్దుర పో '' నాన్న'' ! యనుచు , నిధులను పొంద
    న్నద్దిర యన బలికె ద్విజుడు
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ
    2 ) గద్దెల నెక్కి వేదములు , గ్రంథ విశేషము లంచు దెల్పుచున్
    మద్దెల వాద్య మట్లు పలు మారులు సూక్తులు బల్కు విప్రుడే
    మిద్దెల గట్టి, తండ్రి కయి మ్రింగఁగ నో కడి నైన నీయకన్
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై !

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శూర్పణఖ వేదనో రుతి స్ఫూర్తి తోడ
    నాగకన్నువయౌ సీత నపహరించి
    నేచి విఖుర లంకేశుడు నెల గలిసె
    ముక్కులు దొలఁగి తుదకు రాముని కరముల

    రిప్లయితొలగించండి
  26. వీకన్నుతించి రాముని
    తోకన్ బెంచె విపులముగ దూకెన్ లంకా
    రాకాసిన్ బలముక్కడ
    గా కాలిడెనో రుధిరునిగా కపి వెల్గెన్

    రిప్లయితొలగించండి
  27. చలించే ఊరువులు గలది అనే అర్థంలో చేతన+ఊరువు=చేతనోరువు/చేతనోరు అని అన్నానండి;రంభోరు అన్నట్టుగా.

    రిప్లయితొలగించండి
  28. రావణుండు ముక్కుటేల? రక్ష లేక ధనువుచే
    భావనుంచె విల్లువిరిచి భామసీత నవ్వగా
    నా వరించ సీతజూచి నందుకన్నువాద్యమే
    సేవజేయనో రుతి విన?చిత్రమాయె పందిటన్|{ముక్కుట=బాధబడుట}కన్ను=మద్దెల మొ;వాద్యాలువేసేకరణి}{రుతి=ధ్వని}

    రిప్లయితొలగించండి
  29. రాముమేనముక్కుటమదిరమ్యమలర
    విల్లునోరుద్రునిదియతా విరువనపుడు
    లక్ష్మణునిసోద రునకన్నువగనువేసె
    పుష్పమాలనురామునిభుజములందు

    రిప్లయితొలగించండి
  30. నా పద్యంలో సీసం మూడవ పాదం రెండవ భాగం లో :యిన్నినాళ్ళుగ నిట్టి వన్నెకాడు! ..అని చదువుకోవలసినదని మనవి.

    రిప్లయితొలగించండి
  31. 2 వపాదము చివర
    విరిచె విమల!
    గాచదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులకు నమస్కృతులు!
    మధ్యాహ్నం నుండి విపరీతమైన తలనొప్పి. డాక్టరు గారిని కలిసి మందులు వేసుకుంటున్నాను. ఈ పరిస్థితిలో మీ పద్యాలను సమీక్షించలేను. మన్నించండి. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    రేపు ఆరోగ్యం బాగుంటే వికారాబాద్ వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల రేపు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు!

    రిప్లయితొలగించండి
  33. వీఁకన్నుతింతును వివిధాస్త్ర శస్త్ర బ
    ..........లారి శ్రీరామచంద్రాఖ్యుఁ సతము
    రహిని ముక్కుంజర ప్రబలావలేపముల్
    ..........విగతి చేగల బాహు విక్రముండు
    కనిపెట్టి కాచె విఖ్యాత యజ్ఞంబును
    ..........ఋషివరానీక సంతృప్తి బెనుపఁ
    సురలోక సుమనో రుచిర సన్నిభాకారుఁ
    ..........డవనిజ ప్రాణేశుఁడనవరతము

    ధర్మమార్గానువర్తి యుదాత్త చరితుఁ
    డఖిలలోకైక పూజితుఁడరుగుదెంచె
    నదిని దాటించుమనికోరె నన్ను నేడు
    నాదు జన్మంబు ధన్యమైనది నిజముగఁ

    మూడు = కుంజరములు = ముక్కుంజరములు ( సరియైనదేన గురువుగారూ ?

    రిప్లయితొలగించండి


  34. వీరరాఘవుండు విరిచె విల్లలనాడు
    దాసికన్నుకుట్ట ధరను వీడె
    ముక్కురములు దాల్చి ముదిత,యనుజు తోడ
    నోరుదాటి చనియె నొవ్వకుండ.

    కన్నుకుట్ట=అసూయ
    ముక్కురము=నారచీర
    నోరు:ముఖద్వారము

    రిప్లయితొలగించండి