2, సెప్టెంబర్ 2017, శనివారం

సమస్య - 2452 (విష్ణువె హాలాహలమను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

 1. శంకరాభరణం కవి మిత్రులకు నమస్కారము . నేను వ్రాసిన చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన నిన్న మధ్యాన్నము గురువు గారు బ్లాగులో “అవీ ఇవీ” వర్గములో పెట్టారు. నేను ఇప్పుడే చూశాను. వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను. తోటి కవి మిత్రులు పరిశీలించి మీ అభిప్రాయములు తెలుప ప్రార్ధన .
  పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గుంటూరు

  రిప్లయితొలగించండి
 2. చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన

  నగజాత, యాదవి, నగనందిని, గిరిజ,
  అంబిక, అద్రిజ ,యమున, నాగ
  హారుని దేవేరి,ఆదిశక్తి, అనంత,
  మలయ నివాసిని ,మాత ,సౌమ్య,
  చేతన సఖి,గట్టుధీత, నగపు సూన,
  శరవణ భవమాత, సర్వలోక
  సేవితా ,శారదా, శివసత్తి, మాలినీ,
  దక్ష తనూభవ, దాక్షి, సింహ
  యాన, శ్రీ నీల లోహిత ,అగజ ,హిమజ
  అజిత సాప్తపదీన జాయ, జితి సహిత,
  వాజస సహధర్మ చరిణీ, భవ్య, శ్రీ గ
  జాన నోల్ల, ఘనంబుగా సంతు గోరి
  (సింహ వాహినీ నీ సేవ చేసినాము)

  రచన పూసపాటి కృష్ణ సూర్య కుమార్
  వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 9/01/2017 10:29:00 AM
  3 వ్యాఖ్యలు:

  sub

  రిప్లయితొలగించండి


 3. కృష్ణా ! శ్యామా ! యనగన్
  విష్ణువె! హాలాహలమను విషమును గ్రోలెన్
  జిష్ణువునకు బావమరిది
  తృష్ణాలువువలె జిలేబి తృప్తిగ తానౌ!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేదైన హాలాహలమను విషము తియ్యటి జిలేబిగ తృప్తిగ తానయినదా? భలే భలే!!!

   తొలగించండి

  2. అంతా శివోహం ! భూతరాట్టు !

   నడిరేయి భూతములిటన్
   పడిగాపులు గాచె సూవె పద్య సమస్యల్
   వడివడి గా పూర్తిగనన్
   బడి, శంకరునిది మరియు నెపంబున్నతడే !

   జిలేబి

   తొలగించండి
 4. కృష్ణుండవతారమనిన
  విష్ణువె; హాలాహలమను విషమును గ్రోలెన్
  తృష్ణయె తీర్చగ సురులది
  జిష్ణులు కావలె ననుచును శివునకు మ్రొక్కన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిష్ణుఁడు, జిష్ణువు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953

   n.
   2. one who is victorious or triumphant.

   తొలగించండి
 5. విష్ణువు పలు మారులు భువి
  జిష్ణువుగా నవతరించి జేజే లందెన్
  ఉష్ణుని తీరున వెలిగియు
  "విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్"

  రిప్లయితొలగించండి
 6. కృష్ణా యనగనె గాచును
  విష్ణువె; హాలాహలమను విషమును గ్రోలెన్
  కృష్ణగళుడగుచు శూలిస
  హిష్ణుత సతతము జగముల హితమును గూర్చన్

  రిప్లయితొలగించండి
 7. ధృష్ణువు సిరిని వరింపగ
  విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్
  కృష్ణపు కంఠము గాగ
  న్నుష్ణీషి జగముల బ్రోవ నుమయున్ మెచ్చన్.
  (ధృష్ణువు = దిట్టతనము గలవాడు)

  రిప్లయితొలగించండి
 8. జిష్ణుడు;దేవనికరవ
  ర్ధిష్ణుడు;భక్తుల దురితసహిష్ణుదు;విభ్రా
  జిష్ణుడు;శంభుడు;వందిత
  విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్.
  రిప్లయితొలగించండి
 9. కృష్ణుని యవతారములవి
  తృష్ణగ మొరలిడిన చాలు దోహద మనగన్
  జిష్ణువె శూలియె సర్వము
  విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్


  రిప్లయితొలగించండి
 10. విష్ణువు శివుడే ,శివుడే
  విష్ణువని వేదములు దెలుప వేల్పుల కొరకున్
  జిష్ణుని సోదరి నాధుడు
  విష్ణువె హాలా హలమను విషమును గ్రోలెన్
  (శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే అనెడు వేద ప్రమాణముగా)

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  ప్రజ - పద్యం వారి కవి సమ్మేళనం కోసం గుంటూరు వచ్చాను.
  దయచేసి ఈరోజు మీ పూరణల పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొరకబడని "ష్ణా" ప్రాసల్
   మరియాదగ మభ్యపెట్టి మనలందరికిన్
   గరువము తగ్గించుటకై
   గురువులు తాంబూల మిచ్చి గుంటూర్వెడలెన్

   తొలగించండి


  2. నిష్ణాతులైన శాస్త్రిన్
   జిష్ణువు గా తీర్చిదిద్ద చిత్రిక బట్టెన్
   తృష్ణల దీర్చు గురువులన
   ధిష్ణులు మరియున్ సహిష్ణు ధీశక్తిమతుల్ !

   జిలేబి

   తొలగించండి
 12. కృష్ణుం డనియెడి బాలుడు
  తృష్ణకు నజ్ఞాని యగుచు తెలిపెను వినుమా
  జిష్ణుడు, శర్వుడు, ధాతయు
  విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్.

  ఈ “ష్ణా” ప్రాసగ నొసగిన
  నిష్ణాతులె తెలుపవలయు నీలగళుండున్
  తృష్ణను మ్రింగగ నెప్పుడు
  విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్?

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 13. కృష్ణా వ తా ర మేత్తేను
  విష్ణు వె ;హాలా హ ల మ ను విష ము ను గ్రోలె న్
  విష్ణు వు శివులోక్క ట న స
  హిష్ణుoడైకా వ బూని హిత క రు డ గు చున్

  రిప్లయితొలగించండి
 14. కృష్ణుడు ,రాముడు ,శివులన
  విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్
  విష్ణుని రూపుడు శంభుడు
  తష్ణీభావంబు తోడ ధాత్రిని బ్రోవన్

  రిప్లయితొలగించండి
 15. కృష్ణుడు,రాముడు, తానుస
  హిష్ణత కాపాడి జనుల హేలను జూపున్
  జిష్ణుడు,తాశంకరుడై
  విష్ణువు హాలాహలమను విషమును గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 16. కృష్ణుడు,రాముడు, తానుస
  హిష్ణత కాపాడి జనుల హేలను జూపున్
  జిష్ణుడు,తాశంకరుడై
  విష్ణువు హాలాహలమను విషమును గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 17. రిప్లయిలు
  1. కృష్ణగ్రీ వాతత రో
   చిష్ణు జగత్రయ పతి సురుచిర కామ మన
   స్తృష్ణాతుర భృశ కామిత
   విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్

   తొలగించండి
 18. చతురంగబంధసీసము
  చతురతతోవ్రాసినట్టిసత్కవివర్యా!
  సతియగుశాంభవి మిమ్ముల
  సతతముగాపాడుగాక! సకలము నొసగీ

  రిప్లయితొలగించండి
 19. క్షీరసాగరాన్ని మధించే సమయంలో...

  కం.
  నిలుపఁ దరిగొండ, సుధకై
  వెలసెన్ కమఠముగ క్రింద * విష్ణువె! హాలా
  హలమను విషమును గ్రోలెన్ *
  లలితాంబయె మేలటన్న ప్రమథాధిపుడున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రాస భేదము నలవోకగా జేసి కృతకృత్యు లయ్యారు!

   తొలగించండి
  2. ఇలాకూడా పూరించవచ్చా?!!👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రులు, కామేశ్వరులు మరియు సీతాదేవి గారలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

   తొలగించండి
  4. ప్రభాకర శాస్త్రులు, కామేశ్వరులు మరియు సీతాదేవి గారలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

   తొలగించండి
 20. గురుదేవులకు వినమ్రవందనములు
  అందరి పుారణలు బ్లాగును అలరించుచున్నవి
  చాలా కాలము తరువాత మధ్యాక్కర లో పుారణ తప్పులున్న మన్నింప ప్రార్ధన
  ×*********************
  జిష్ణువు జిష్ణువు చేరి జిష్ణువులన్ గుాడి వేగ
  తృష్ణను నంభుది చిలుక తెరలెత్తె నుష్ణము నంత ,
  నిష్ణాతుడుష్ణమున్ గ్రోల నిలిపి శివునితోడ బలుక
  విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెను శివుడు

  జిష్ణువు=సుార్యుడు,ఇంద్రుడు,జయశీలుడు

  రిప్లయితొలగించండి
 21. తృష్ణగ సాంద్రము జిలుకగ
  విష్ణువె”|”హాలాహలమను విషమును గ్రోలెన్
  జిష్ణువు తీవ్రుడువెంటనె
  తృష్ణక్కుగ నెంచబూని తీవ్రత మాన్పెన్”| {తీవ్రుడు=రుద్రుడు}{తృష్ణక్కు=దప్పికగొన్నవాడు}జిష్ణువు=జయముపొందువాడు}

  రిప్లయితొలగించండి
 22. తృష్ణన్ దీర్చెన్ సురలకు
  విష్ణువె! హాలాహలమను విషమును గ్రోలెన్
  నిష్ణాతుండౌ హరుడు, స
  హిష్ణుడనుచు కొలిచి రంత హేరాళముగా!

  రిప్లయితొలగించండి
 23. సుకవి వర్యుడ! వేంకట సుబ్బరాయ!
  నీదు పూరణ పధ్ధతి నిజము గాను
  నధ్భు తంబయి యలరారి యదియ మాకు
  మార్గ దర్శక మగునను మాటనిజము

  రిప్లయితొలగించండి
 24. ఉష్ణముజిమ్ముచునుండగ
  విష్ణువుకోరవిషముగొనె విశ్వేశ్వరుడే
  తృష్ణను దీర్చెనురయమున
  విష్ణువెయమృతమునుబంచి వేల్పలతతికిన్

  రిప్లయితొలగించండి
 25. 02.09.2017.శంకరాభరణము
  సమస్య: విష్ణువె హాలాహలమను విషము
  ను గ్రోలెన్
  పూరణ:02.09.2017.శంకరాభరణము
  సమస్య: విష్ణువె హాలాహలమను విషము
  ను గ్రోలెన్
  పూరణ: జలమున మునుగగ శైలము
  కలయుచు ధరియించి రూపు కమఠమ్ముగ తా
  వెలసెను విష్నువె. హాలా
  హలమను విషమును,గ్రోలె నా శంకరుడే

  రిప్లయితొలగించండి 26. జిష్ణుని సారథి యెవరన

  విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్

  జిష్ణుకు వరమొసగిన హరు

  నిష్ణుండై సురల గావ నిలలో తానున్.
  జిష్ణుడు=అర్జునుడు
  నిష్ణుండు=నేర్పరి


  వృష్ణికులుండన భువిలో

  విష్ణువె,హాలాహలమను విషమును గ్రోలెన్

  కృష్ణంబైనను కంఠము

  నిష్ణుండై శాంతి గూర్చె నిటలాక్షుండున్.
  కృష్ణ=నలుపు

  రిప్లయితొలగించండి
 27. ఉష్ణోగ్రతఁ బెగడి వేడె
  విష్ణువె, హాలాహలమును విషమును గ్రోలెన్
  విష్ణుప్రియుండు రుద్రుడు
  నిష్ణాతంబైన కరుణ నిక్కము గాగన్

  రిప్లయితొలగించండి