22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2471 (భీమసేనుఁడు తాటకి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు: 1. కీచ కుడిపీచ మడచెను కింకపెట్ట
  భీమసేనుఁడు; తాటకి పీఁచ మడచె
  రామ లక్ష్మణులు; జిలేబి రాసు కొనవె
  తేటగీతిని పూరణ తెల్ల వారె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కర్తృపదం రామ లక్ష్మణులు బహువచనం. క్రియాపదం 'అడచె' ఏక వచనం. "రఘుకుల తిలకుడు జిలేబి వ్రాసుకొనవె" అంతే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 2. కీచకుని తో డ పోరాడి పీచ మడచె
  భీమసేనుఁడు, తాటకి పీఁచ మడచె
  రామ చంద్రుడు యాగపు రక్షణమ్ము
  కొరకు మునిపుంగవుడు నాడు కోరి నంత

  రిప్లయితొలగించండి
 3. భీమసేనుఁడు, తాటకి పీఁచ మడచె అని సరి దిద్దుకోవాలి

  రిప్లయితొలగించండి
 4. రేపటినుంచి మొదలు అగు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవముల సందర్భములో షోడశ దళ కమల బంధ సీసంలో శ్రీహరి ప్రార్ధన “ అవీ ఇవీ వర్గములో ఉంచబడినది. కవి మిత్రులు చూచి అముల్యమైన అభిప్రాయములు తెలుప ప్రార్ధన
  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

  సీ:రవినేత్ర, రక్షించరా, కరుణాoతరం
  గ, కమలనయన, రంగపతి, భరిమ,
  నీరజోదర, గట్టునేత, రమ్యముఖ, య
  జ్ఞాంగ, పురంధర, గంగ ధారి
  నారద గరుడ వానర రక్షితా, శ్రీహ
  రీ, యమర ప్రభు, మాయదేవ,
  వారణ పూజిత, శ్రీరామ, రక్షమాం
  ఆదిత్య,ఈశ్వర, యజపు రాజ,
  తే:అసుర రిపువు, నందసుత, రక్షి, పతిత వర
  ద, రసపతి, యతి, సుందర పురుష, శరణు,
  కమల నాభ, నాగ శయన, గరుడ వాహ
  నా, అనంత, ఆది వరాహ, నంద తనయ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గౌరవనీయులు పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారూ! అద్భుతమైన షోడశ దళ కమల బంధయుక్త సీస పద్యాన్ని అందించారు! కృతజ్ఞతాపూర్వక వందనాలండీ!

   తొలగించండి
  2. ఇలాంటి మహత్తరమైన కార్యంలో భాగస్వామ్యం వహించిన మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి కృతజ్ఞతలు!

   తొలగించండి
 5. దుష్టరాక్షసు లెవరైన దునుమవలయు;
  ధిక్కరించు హిడింబుని నుక్కడించె
  భీమసేనుడు; తాటకి పీచమడచె
  రఘుకులాంబుధిరత్నము రాము డిలను.

  రిప్లయితొలగించండి
 6. యాగ సంరక్షణార్థమై యనుజు గూడి
  గాధి పట్టితో వచ్చెను కాన నంబు
  విభుడగు రఘురాముడు, విలు విద్యనందు
  భీమ సేనుఁడు, తాటకి పీఁచ మడచె.
  (భీమసేనుడు=భయంకరమైనవాడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విద్యయందు" అనండి.

   తొలగించండి
 7. దశరథాత్మజుం డతులిత ధైర్యశాలి
  సవన రక్షణంబు తనదు పవనమవగ
  ననుజ సౌమిత్రి గూడుచు ననిని రామ
  భీమసేనుడు తాటకి పీచమడచె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పవన మవగ'...?

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారము! ముందే పాద సూచీ ఇద్దామనుకొన్నాను!
   పవనము= గాలి = ఊపిరి, శ్వాస =ధ్యేయము!
   సరియైన దేనా?

   తొలగించండి
 8. భీమసేనుడు తాటకి పీచమడచె !
  సురస పరుషముతోడ కంసుని వధించె!!
  ధార్తరాష్ట్రులు దశరథు తనయులయ్యె!!!
  చోద్యములు వీనిఁదెలియుడీ సుజనులార!!!!

  రిప్లయితొలగించండి
 9. బండ రాయిని తాకిన పిండి కాగ
  భీమ సేనుఁడు , తాటకి పీఁచ మడచె
  లక్ష్మణుడు ముకు జెవులను లక్ష ణముగ
  కోసి పంపెను రక్కసి వాసి గెక్కె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాటకి పీచ మడచె'కు అన్వయం?

   తొలగించండి
 10. అసురుడు బకాసురునిబట్టి యడచె నుగద
  భీమసేనుఁడు, తాటకి పీఁచ మడచె
  గాధిపట్టి యానతిగొని గరుణ లేక
  రామ చంద్రుడు యజ్ఞoపు రక్ష కోరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు
   మరియు ధన్యవాదములు బ్లాగులో నేను వ్రాసిన షోడశ దళ సీస శ్రీహరి ప్రార్ధన ఉంచినందుకు

   తొలగించండి
 11. రాజరాజు తమ్ములనెల్ల రణము నందు
  నుఱుము జేయుచు ప్రతినను నెఱపు కొనెను
  భీమసేనుడు, తాటకి పీచ మడచె
  యాగ రక్షణ జేయగ రాఘవుండు!!!

  రిప్లయితొలగించండి
 12. లక్ష్య సిద్దియె యాగము రక్షసేయ
  దక్షతను జూపి దనుజుల శిక్ష వేయ
  లక్ష్మనుడు, భీకరాగ్రహ లక్షణంబు
  భీమసేనుడు,తాటకి పీచమడచె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషం ఉంది. తాటకిని చంపింది రాముడు కదా!

   తొలగించండి
 13. పదుగు రెదుట సభలోన బ్రతిన బూని
  దుష్ట దుర్యోధనుని నాజి దునిమె నెవడు?
  రామ భద్రుండు జన్నము నేమి జేసె ?
  భీమ సేనుడు ; తాటకి పీచ మడచె !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జన్నము నేమి చేసె' అంటే యజ్ఞాన్ని ఏం చేశాడన్న అర్థం వస్తున్నది కదా! అక్కడ "వనమున నేమి చేసె" అంటే సరిపోతుంది కదా?

   తొలగించండి
  2. సవరణకు ధన్యవాదాలు !
   జన్నమున + ఏమిజేసె అనే అర్థం లో వ్రాసినాను. పొసగుతుందనే అనుకున్నాను.

   తొలగించండి
 14. అతివ వేషా న కీచకు నంతు జూసె
  భీమసేనుడు ;తాట కి పీచ మడచె
  కాననoబు న రాము డు గా ధి సుతుని
  యాజ్న పాలించే శిష్ టు ల నాదు కొన గ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని టైపు దోషాలున్నవి.

   తొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వనిని తమనెల్ల భుజియించ వచ్చి నట్టి
  యసురుడా హిడింబుని కట నుసురు దీసె
  భీమసేనుడు; తాటకి పీచ మడచె
  దాశరధి మునుల నరయ దవము నందు


  రిప్లయితొలగించండి
 16. ……………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  బకుని జ౦పివైచిన బాహుబలు డెవ౦డు ?

  గాధిసుతుని జన్న౦బును కాచుకొరకు ,

  రాము డెవరి గర్వమును ఖర్వమ్ము జేసె ?

  భీమసేనుడు | తాటకి పీచ మడచె |

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 17. 1. జనుల వేధించెడి బకుని సంహరించె

            భీమసేనుఁడు తాటకి పీఁచ మడచె

            జడుపు లేకశ్రీ రాముడు సమరమందు

         ముదము నందిరి యచ్చోట మునులు నెల్ల.


  2. అసుర వరుడైన బకుని నాహవమున

          సంహరించి మేలును కూర్చె జగతి యందు

          భీమసేనుఁడు తాటకి పీఁచ మడచె

         రాఘవుడు తాను విలుపూని రణము నందు.


  3. కీడు చేయ  దలచు కీచకు మదమణచె

              భీమసేనుఁడు తాటకి పీఁచ మడచె

            దాశరథియు తానలనాడు ధరణి యందు

           మోదమందిరెల్ల సురలు మునులు కూడ .


  4 :వాయు నందను డన్ననా భారతాన

            నెవరు,గాధిసుతు ని వెంట కాలినడక

           నేగి నెవరి నేమొనరించె నిలజ పతియు

           .భీమసేనుఁడు తాటకి పీఁచ మడచె.


  5: దుస్ససేనునెదను జీల్చె దురమునందు

      భీమసేనుఁడు ,తాటకి పీఁచ మడచె.

          రాఘవేశ్వరుండావనిన్ రణము చేసి

         మునులు మెచ్చి  దీవించిర ముదము తోడ.  దుష్టుడౌ కురు పతియొక్క తొడలు చీల్చె

               భీమసేనుఁడు తాటకి పీఁచ మడచె

            విక్రమమును జూపి రాముడు విశ్వమందు

             దుష్ట సంహార మొనరించి శిష్టు కాచె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
   రెండవ, ఐదవ పూరణల మొదటిపాదాలను ఆటవెలదిగా వ్రాశారు. సవరించండి.

   తొలగించండి
 18. నీల వర్ణుఁడు సీతావనీసుతాత్మ
  నాథుఁడు ప్రియదర్శనుఁడు జనగణమునకు
  రాముఁ డాజాను బాహుఁడు రక్కసులకు
  భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె

  [భీమసేనుఁడు = భయంకరమైన శరీరము కలవాఁడు; సేన = శరీరము]

  రిప్లయితొలగించండి
 19. కీచకుని పీచ మడచెను కింకు పెట్టి
  భీమసేనుడు ,తాటకి పీచ మడచె
  లక్ష్మణుండా మె ముకుచెవుల్లాగి కోసి
  రక్త సిక్తము గావించి రహిని చెడగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ తాటకి గురించి వ్రాయాలండి.

   తొలగించండి
  2. సుబ్బారావు గారూ,
   పద్యం బాగుంది. మీరు శూర్పణఖా వృత్తాంతాన్ని ప్రస్తావించారు. మనకు కావలసింది తాటకి.

   తొలగించండి
 20. దుష్టదుశ్శాసనుని జంపె దురమునందు
  భీమసేనుడు, తాటకిపీచమడచె
  రాముడు గరువుకోరనరణ్యమందు
  యజ్ఞ యాగాదులను కాచునర్థితోడ

  రిప్లయితొలగించండి
 21. క్రమాలంకారము
  22.9.17. రాజరాజును యుద్దా న రయము జేసె?
  రామచంద్రుడు యాగానరగిలి ద్రుంచె?
  బాలకృష్ణుడు పూతన పాలుగుడిచి?
  భీమసేనుడు;తాటకి;పీచమడచె|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఈశ్వరప్పగారు! పూరణ బాగున్నది. మూడు పాదాల చివరన ప్రశ్నార్థక చిహ్నాలు అనవసరమనుకుంటాను.

   తొలగించండి
 22. రామ చంద్రుడు యాగము రక్షజేయ
  జనియె మునివెంట నంతట చంపవచ్చు
  రక్కసినిగని బాహుపరాక్రముండు
  భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె

  రిప్లయితొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  ప్రజల రక్షించ నసురుని బారినుంచి

  తల్లి యాజ్ఞ తోడ బకుని తా వధించె

  భీమసేనుడు; తాటకి పీచ మడచె

  జన్నమున్ గావ శ్రీరామచంద్రు డవని

  మౌని యానతి తలదాల్చి మాటనిలుప.

  రిప్లయితొలగించండి
 24. ఆ.వె.
  వేయి యేనుగులను వ్రేటువేయగజాలు
  బాణ మొకటి సుజన త్రాణ మునకు
  జేకొనయ్యె భీమ సేనుఁడు;తాటకి
  పీఁచ మడచె రాముడాచమించి

  తాటకి వేయియేనుగుల బలముగలది.
  దానిని సంహరించునపుడు రాముడు భీముడాయెను.
  భీముడు ఒక్క పిడికిలి పోటుతో వేయియేనుగులను చంపగల బలముగలవాడు.

  రిప్లయితొలగించండి
 25. మన్నించండి అన్నయ్యగారు
  సరిగా వుందనుకొన్నాను తప్పెక్కడో తెలియలేదు.
  1.జనుల వేధించె డి బకుని సంహరించె

  5.దుస్స సేనునె దనుజీల్చె దురము నందు.

  రిప్లయితొలగించండి
 26. భీముడితఁడె నా యని దోచు వీరుడౌను
  పాత్ర యేదైన జీవించు పటిమ గలుఁగ
  మౌని పిలుపున రాముడై పూనుచు నట
  భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె

  రిప్లయితొలగించండి

 27. మల్లు నొకని విరటుకొల్వు మధ్యమందు
  బలము జూపివధించెను వాసిగాను
  భీమసేనుఁడు తాటకి పీఁచ మడంచె
  భువిని శిష్టుల కావగ పుత్రుడగుచు
  దశరథునకు శ్రీరాముడు ధరణి యందు.

  రిప్లయితొలగించండి