శ్రీహరి ప్రార్థన
రచన - పూసపాటి కృష్ణ సూర్యకుమార్
సీ.
రవినేత్ర రక్షించరా కరుణాంతరం
గ కమలనయన రంగపతి భరిమ
నీరజోదర గట్టునేత రమ్యముఖ య
జ్ఞాంగ పురంధర గంగధారి
నారద గరుడ వానర రక్షితా శ్రీహ
రీ యమరప్రభు మాయదేవ
వారణ పూజిత శ్రీరామ రక్షమాం
ఆదిత్య ఈశ్వర యజపు రాజ
తే.
అసురరిపువు నందసుత రక్షి పతిత వర
ద రసపతి యతి సుందరపురుష శరణు
కమలనాభ నాగశయన గరుడవాహ
నా అనంత ఆదివరాహ నందతనయ
పద్యము చదువు విధానము...
బాణము గుర్తు పెట్టిన (1) అన్న దళము కొసనుంచి 'ర'తో మొదలుపెట్టి 'రవినేత్ర' అని చదివి వృత్తములో ఉన్న (ర)తో కలుపుకొని 'రక్షించరా' తరువాత దళములోని (క)తో చదువుకుంటూ పోవాలి. చివరి దళములోని 'పురుష' చదివి తర్వాత దళము కొసల చివర 'శ'ను దళములోని 'ర'తో కలిపి వరుసగా 'శరణు కమలనాభ నాగశయన గరుడవాహన అనంత ఆదివరాహ నందతనయ' అని పూర్తి చేసుకోవాలి.
గౌరవనీయులు పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారూ నమస్సులు! అద్భుతమైన షోడశ దళ కమల బంధయుక్త సీస పద్యాన్ని అందించారు! కృతజ్ఞతాపూర్వక వందనాలండీ!
రిప్లయితొలగించండిధన్యవాదములు మధుసూదన్ గారు
తొలగించండికృష్ణ సూర్య కుమార్ గారు మనోహరమైన షోడశ దళ కమల బంధ సీసపద్యము నందించినారు. బంధ సీసములలో నందె వేసిన చేయి యయ్యారు. అభినందనలు. మీకృషి మహామోఘము.
రిప్లయితొలగించండికించిద్విసంధి సందర్భములు కనిపించు చున్నవి. పరిష్కరించిన బాగుంటుంది.
నమస్కారము
తొలగించండికామేశ్వర రావు గారు గురువు గారి ప్రోత్సాహము మరియు గురుతుల్యులు ఐన మీ ప్రోత్సాహము నన్ను ప్రేరేపించినవి . సర్వదా మీ యొక్క ప్రోత్సాహముతో ఇంకా ఎన్నో వ్రాయాలని కోరిక ధన్యవాదములు
రిప్లయితొలగించండిషోడశ దళ కమల సీస సుమము జదువ
నీదు దీశక్తి దెలిసెను నిజము సామి !
శ్రీహరియనిన్ను గాపాడు సిరుల నిచ్చి
పుణ్య పురుషుడ యోయన్న పూసపాటి !
సుబ్బా రావు గారు ధన్యవాదములు
తొలగించండిఅద్భుతం సూర్య కుమార్ గారూ.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు ధన్యవాదములు స్వామీ
తొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిగౌరవ నీయులు శ్రీ పూసపాటి వారు చక్కని పూరణను అందించి నందులకు . ధన్య వాదములు
అక్కయ్యగారికి ధన్యవాదములు
తొలగించండి