23, సెప్టెంబర్ 2017, శనివారం

సమస్య - 2472 (నాగుల ముద్దాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్"

55 కామెంట్‌లు:

  1. సాగులు చేసి పొలములను
    రాగులు జొన్నలును సజ్జ రాయల సీమన్
    బాగౌ పంటకు బంగరు
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  2. రాగము తోడను కొలువగ
    నాగుల దయతో జనించె నందనుడిలలో
    నాగులనెడి పేరిడి తా
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్.

    రిప్లయితొలగించండి
  3. పోగులు కరగింప నపుడు
    నాగుల చవితి కగసాలె ననువుగ సేయన్
    వేగంబుగ నీయ “చెవుల
    నాగుల” ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  4. ఆగతి నశ్వము తోకను
    వేగమె నలుపుగ నొనర్చి వెనుకకు తనయుల్
    రాగా కద్రువ ముదమున
    నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్.

    రిప్లయితొలగించండి
  5. వేగమె బిడ్డఁడు పరుగున
    బాగుగ గీసిన పటమున ఫణులను జూపన్
    రేగిన పొంగున బొమ్మల
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  6. రాగము దీయుచు చిన్నది
    వేగమె పతివెంట బోయె ప్రేమగ ముదము
    న్నాగుము నాకొఱ కచటని
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  7. నాగుల నారాధించెడి
    సోగకనుల నెలత యొకతె సోయగ మొప్పన్
    నాగ శిలలపై చెక్కిన
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్.

    రిప్లయితొలగించండి
  8. రాగాలాపనములతో
    నూగుచు నటనల నులూచి యుద్వాహమునన్
    సాగిన బాలల సొగసరి
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి

  9. భోగము హెచ్చు, మజ, మహా
    యోగమహిమ గలదనుకొని యోచన జేసెన్,
    పాగెము బుద్ధియు లేకన్,
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!

    ఆ తరువాత ఏమయిందో నాకు తెలియదు

    జిలేబి

    రిప్లయితొలగించండి

  10. నేచురోపతి జిలేబీయం :)

    సోగకనులు మేల్మిగనన్
    వేగిర నిదురన్ విడచుచు వెజ్జరికమనన్
    కోగరి కప్పుకొనుచు మి
    న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. నాగారివాహుఁ కొలిచియు
    తాఁ గాకోదరపు పుట్టఁ దరిఁజను త్రోవన్
    రాగమున తోటలో పు
    న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    ఇక్కడ నాగారి అనగా మయూరము, గరుడుడు కాదు
    కాకోదరము = పాము

    రిప్లయితొలగించండి
  12. నాగాభరణుడె పతియౌ
    నాగశయనుడే యనుజుడు, నందనుడవ్వన్
    నాగస్వరూపు డెలమిని
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు నమస్సులు, ధన్యవాదములు! రెండవ పాదమున
      "నాగశయను డగ్రజుండు, నందనుడవ్వన్"
      యని చదువ ప్రార్ధన!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    2. తమ్ముడైనా అన్నయ్యైనా పూరణ బాగున్నదన్నారు సారు. అంతకంటే మరేమి కావలె!

      తొలగించండి
  13. ఊగె ను భక్తిని డెందము
    సాగెను నిష్ఠగను పూజ సర్వోన్నతమై
    పూగుత్తి లోనగల పు
    న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బాగుగ శరజుని పూజలు
    సాగించుచు తన్మయమున సందడి గొనుచున్
    నాగేంద్రుని మూరితిలో
    నాగులను ముద్దాడె లలన నాగులచవితిన్
    (శరజుడు, నాగేంద్రుడు= సుబ్రహ్మణ్యుడు)







    రిప్లయితొలగించండి
  15. నాగులు తన భార్య కొరకు
    నాగాభరణమ్మొకటియె నాణ్యత యొప్పన్
    తేగం గడు మురిసినదై
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్.

    రిప్లయితొలగించండి
  16. నాగుల పటమును దెచ్చెను
    నాగులకే పూజసేయ నయముగ పతియే
    బాగున్నదనుచు భకిని
    నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్

    రిప్లయితొలగించండి
  17. వేగమ రమ్మనె భర్తను
    దా గోముగఁ జూడ నద్భుత చలన చిత్రం
    బే గమకమ్మున నెందున
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈసారి మీరు మీ అన్నయ్య బాట పట్టినట్టున్నారు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. రక్త సంబంధ వాసనలుంటాయి కదండి.

      తొలగించండి
  18. నాగారి తోడ నొక్కటి
    నాగము తో నొకటి సెల్ఫి నగవుచు జూలో
    బాగుగ గైకొని యాగక
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్"


    జంతు ప్రదర్శన శాలలో సంరక్షకురాలు స్నేహితుల ఎదురగా సెల్ఫి దిగినదను భావన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నగవుచు.. అన్న ప్రయోగం లేదు. "నగుచును" అనండి.

      తొలగించండి


  19. తూగితిరో కవివర్యా
    యే గుడినగనిరి కథనటు యెచటన్ విన్నా
    రో గురువులు తెలుపుడు, యే
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.అభినందనలు.
      "కథనటు లెచటన్... తెలుపుం డే నాగుల..." అనండి.

      తొలగించండి
  20. . నాగన్నకూతురు లలన
    దోగాడుచు సాకినట్టి దొరికిన పాముల్
    వేగమె బట్టియు చిన్నది
    నాగుల ముద్దాడె లలన నాగులచవితిన్|{పాములు బట్టేవారియింటసాకినపాములు}

    రిప్లయితొలగించండి
  21. రేగగ నర్జునుని తలపు
    కాగల కార్యము నులూచి కన్నుల మెదలన్
    రాగము, మోహము పెరుగగ
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  22. గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    సింహబలుడను కీచకు సంహరించె
    భీమసేనుడు! తాటక పీచ మడచె
    దశరథ సుతుడు రాముడు ధర్మ మరసి
    గాధి తనయుని యాగము కాచె నంత!

    రిప్లయితొలగించండి
  23. సాగగ తండ్రీకొడుకులు
    నాగార్జున నాగచైతు నటనపు వృత్తిన్
    సోగకనుల నాయికయై
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి
  24. నాగుల చవితిని చిమ్మిలి
    బాగగు చలిమిడియు గ్రుడ్డు పాములకిడగా
    న్నూగుచు తమ సంతతియౌ
    నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

    రిప్లయితొలగించండి