8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2458 (జింకను గని తత్క్షణమ్మె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్"
(లేదా...)
"జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

70 కామెంట్‌లు:

  1. లంకాధీశుని కుట్రకు
    వంకలు చెల్లకనె మామ వంచన జేయన్
    శంకల తోడనె బంగరు
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    రిప్లయితొలగించండి


  2. బింకముగా యెదు రొడ్డిన
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారె
    న్నంకము కవి కైపదమౌ,
    "జంకును లేక చలనమ్ము జగడముగనినన్" !

    జిలేబి
    మరీ యింతగా జిలేబి
    చుట్టిన యెలా మరి :)

    రిప్లయితొలగించండి
  3. అంకము జేర్పగ నా హరి
    ణాంకుడు బ్రేమగ ప్రియసతి నంబిక జేరన్
    శంకను విడచుచు దుమికెడి
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్.

    రిప్లయితొలగించండి
  4. జంకదు కాననమున నే
    వంకను జూడగ, పిపాస పాయుట కరుగన్
    శంకితముగ తన మోమున్
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్.
    (మోమున్ + చింకను మోమున్ జింకను) ( చింక=చిన్న కాలువ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  5. ఇంకను చెప్పనేల నతిహేయము భారతరాజకీయముల్
    జంకదిలేక దుర్జనులు సజ్జనకోటిని ముట్టడింప నా
    తంకము కాంచనట్టి వసుధాధిపసింహము పాఱె వేగమై
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  6. జంకిన జీవిత మంతయు
    శంకించు చుగడచి పోవు సౌఖ్యము లేకన్
    కింకరుని వలె భీతిల్లక
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "కింకరు వలె భీతిల్లక" అనండి.

      తొలగించండి
    2. జంకిన జీవిత మంతయు
      శంకించు చుగడచి పోవు సౌఖ్యము లేకన్
      కింకరు వలె భీతిల్లక
      జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

      తొలగించండి

  7. బింకము లేక నివ్వెరగు భీతమృడీకము గాదు లేమలౌ
    వంకలు గాంచి మీదపడు వ్యాఘ్రపు బుద్ధుల నెల్ల బాదునౌ !
    జంకదు మిమ్ము గాంచి సుమ ! జాణతనమ్ముల గుబ్బతిల్లెడౌ
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. జంకక లం ఘి oచె వని ని
    జింక ను గని తక్షణమ్మసింహ ము ;పారేన్
    జంకు చు దూరెను పొద లో
    సంకట మది తొలగి పో యె సారంగ ము కు న్

    రిప్లయితొలగించండి
  9. పంకము మైనిండినచటి
    జింకను కనుగొని వినూత్న జీవిగ దలచెన్
    శంకయె నిండగ భయమున
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మైనిండు నచటి' అనండి.

      తొలగించండి
  10. శంకగలిగె రఘుపతికిన్
    జింకను గని తత్క్షణమ్మె, సింహము పారెన్
    మంకుతనపు సతి గోరగ
    జింకను పట్ట దలచి యతి శీఘ్రత తోడన్
    (రాముడిని రాజ సింహము అని తలచి సీతమ్మ మొండి పట్టుదల తీర్చన్ )

    రిప్లయితొలగించండి
  11. పంకంపు బావి దూకెడు
    నంకమ్మది హరికి గూర్చనలరెను శశమే!
    జంకేటికి మనకనియెడు
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్!

    రిప్లయితొలగించండి
  12. అంకకుఁ జన వేటరి తా
    జింకనుగని, తత్క్షణమ్మె సింహము పారెన్
    వంకకువచ్చు మనిషిఁ గని
    శంకించి తనకపనయము జరుగు నటంచున్

    రిప్లయితొలగించండి
  13. పంకపు బావిలో హరి నుపాయము వైచియు దూకునట్లుగా
    నంకము గూర్చదే శశము నార్తిని ప్రాణము నిల్పనెంచుచున్
    జంకడ మేటికిన్ బ్రతుక జాలమె బుద్ధి బలమ్ము తోడ నన్
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర "బలమ్ముతో ననన్" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  14. జంకుచు నేడ్చెను బాలుడు
    జింకను గని, తక్షణ మ్మె సింహము పారెన్
    డొంకల మాటున మృగమను
    శంకను దా బట్టు కొనగ సానువు నుండిన్

    రిప్లయితొలగించండి
  15. వంకయు లేక ధారుణిన భారము దీర్చెడి కృష్ణపాలనా
    నోంకృతు డైన కాలయవనుండహమున్ దురమందు నిల్చినన్
    కంకటమున్ ధరింపకనె కయ్యము కృష్ణుడు వీడి పోయెగా
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధారుణిని" అనండి. "పాలనా।నోంకృతుడు.." ఇక్కడ పదవిభావం?

      తొలగించండి
    2. కృష్ణపాలన + అనోంకృతుడు అంటే అంగీకరించని వాడు అని నా ఉద్దేశ్యం.

      తొలగించండి
    3. గురువుగారూ నమస్సులు. కృష్ణపాలనానోంకృతుడు అనే ప్రయోగం సరియైనదేనా. దయచేసి తెలియజేయండి.

      తొలగించండి
    4. ఇప్పుడే నిఘంటువును పరిశీలించాను. మీ ప్రయోగం సరైనదే.

      తొలగించండి
  16. పంకజుడు గురున కిట్లనె
    జంకక "జీ""సీ"లకుంచి సద్యతి మైత్రిన్
    శంకించక విను డార్యా!
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  17. సంకటమౌ స్థితి గానగ
    జంకుచు సంద్రము జొనియగ సరసిజనాభున్
    వంక జరాసంధుడవగ
    జింకనుగని తక్షణమ్ము సింహము బారెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      ఈ అంశంతో నేను పూరణ చేస్తే బాగుంటుందని ఇంతకు ముందే అనుకున్నాను. మీరు చేశారు.
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు! ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  18. డొంకల చాటున న్మిగుల డో గుచు నుండిన చిన్నదైన యా
    జింకను గాంచి తక్షణమె సింహము పారె నదేమి చిత్రమో
    జంకుచు దానితల్లి యట సాగిలు చుండను భావము న్మదిన్
    శంకను బొందుచు న్మృగము సానువు వీడుచు నత్తఱిన్సుమా

    రిప్లయితొలగించండి
  19. అంకిలి తీరగ నన నా
    వంకన శంక యొక యింత పడ కచ్చటఁ దా
    నింక దివిరి భక్షింపగ
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    [పారెన్ = పరుగెత్తెను]


    పంకజ నేత్ర భామలు సివంగులు సుమ్మి భయార్తు లింక బొ
    ద్దింకలఁ గాంచి చేరెదరు తెప్పఱి భర్తల యంక పీఠముల్
    జంకును గొంకెఱుంగనిది సామజ శత్రువు పూర్ణ వారిఁ దాఁ
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో

    [తాను +చింక = తాఁ జింక; చింక = చిన్న కాలువ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అంకించనెంచి నెగబడె
    జింకను గని తత్క్షణమ్మె సింహము; పారెన్
    జంకుచు వనిలో నేర్పుగ
    జింకయె మృగపతి కరముల చిక్కక నుండన్

    రిప్లయితొలగించండి
  21. జంకుచు చెంగున పరుగిడు
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారె
    న్నింకొక దారిన్ జని ని
    స్సంకటముగ పంజ విసరి సాధించుటకున్

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.

    శంకరుని పరీక్షించెడు

    వంకన తా వెంటపడగ భస్మాసురుడున్

    శంకరుడు పరుగు దీసెను

    జింకను గని తత్క్షణమ్మె సింహము
    పారెన్.

    రిప్లయితొలగించండి
  23. "శంకరాభరణం " వారిచ్చిన సమస్య :
    ********()()()*******
    "జింకను గని తక్షణమ్మె సింహము పాఱెన్."
    ===+++===
    నా పూరణ :
    కం. పంకజ ముఖి సీత మురిసె
    పంకజ నాభుడుడెపుడు తన భక్తుల గాచున్?
    జంకనిది;జలము దిగువన్
    జింకను గని; తక్షణమ్మె; సింహము; పాఱెన్.
    ***)()()()(***

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో '..నాభు డెపుడు' అని ఉండాలి.

      తొలగించండి
  24. కురుక్షేత్ర మహాసంగ్రామమునకు ముందు అర్జునిని మనోగతము........

    బింకమునంది తానునతి వీర్య పరాక్రమ ధైర్యతేజుఁడి
    ర్వంకల గాంచి సన్నిహితు బంధుల తాతల స్నేహితాళిఁ ని
    శ్శంకను జెప్పెనాహవము సాధ్యము కాదని తీరుజూడగాఁ
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో

    శిఖండిని నిల్పి యుద్ధము చేస్తున్న అర్జునుని మనోగతము ...........................

    సంకోచము చెందుచు నా
    వంక శిఖండిని నిలుపఁగ భండనమున తా
    నంకిలి గని జనె భీష్ముఁడు
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బింకముతో ఛగలమువలె
    బొంకుచు నీక్షణమె జంపి పురుహూతికి నిన్
    సుంకముగ నిచ్చెద ననెడి
    జింకనుగని తత్క్షణమ్మె సింహము పారెన్

    (ఛగలము = మేకపోతు; మేకపోతు గాంభీర్యము - కథననుసంధానిస్తూ....)

    రిప్లయితొలగించండి
  26. ఆర్యా!5-6-2017న2378నెంబరుసమస్య:
    హర్యక్షము జింకఁగాంచి యడలుచుఁబాఱెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే! ధన్యవాదాలు. ఈమధ్య మతిమరుపు మరీ ఎక్కువౌతున్నది. అది గుర్తుంటే ఈనాడు ఈ సమస్యను ఇచ్చేవాణ్ణి కాదు.

      తొలగించండి
  27. బింకముతో మృగరాజుకు
    జంకక కనకంపు జింక జక్కక దిరుగున్
    సంకట మేతెంచు ననుచు
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

    నిన్నటి సమస్యకు నాపూరణ

    మండపమున ధన ధాన్యము
    మెండుగ కానుకల గోరు మేధలు గలుగన్
    దండిగ నార్జించ దలచు
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  28. బింకపు పొంకముల్ గలిగి భీకర రూపపు రౌడిసింహమై
    జింకగ యవ్వనాన గలచేడియ చెంతన జేరి పట్టగా
    పంకజ లోచనాసరళి పట్టి కరాటియు దెబ్బలేయగా?
    జింకనుగాంచి తత్క్షణమెసింహము పారె నదేమిచిత్రమో|

    రిప్లయితొలగించండి
  29. సంకటమౌ నడవిని విడి {అడవులుగొట్టుటచే}
    జంకున నద్దాల మేడ సరిగా జేరన్?
    గొంకున దృశ్యము లంటగ
    జింకనుగనితత్ క్షణమ్మె సింహముపారెన్| {అద్దాల మేడలోబొమ్మజింక మరియుచేరినసింహాకృతులుజూచిభయమునపారినది}

    రిప్లయితొలగించండి
  30. పంకజ ముఖికోరగ తా
    జంకక రాముడు ముదమున సాగెను గనుమా
    బింకము సడలగ నచ్చో
    జింకను గనితక్షణమ్మె సింహము పారెన్.

    జంకక సింగము చంపెను
    జింకను గని తక్షణమ్మె:సింహము పారెన్
    జంకున కిరాతకుని గని
    వంకలు డొంకల నెగురుచు వడిగా తానున్.

    రిప్లయితొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    [దుర్గాదేవిని నబల యను తృణీకార భావనచే నని సేయ నుంకించిన మహిషుని నా మాత పాఱఁద్రోలిన ఘట్టము]

    జంకువిడి, దుర్గ, మహిషుని
    సంకటమునఁ ద్రోయ; వాఁడు శక్తి నశింపన్,
    గొంకుఁ గొని పాఱె! నాహా!

    జింకను గని తక్షణమ్మెసింహము పారెన్!!

    రిప్లయితొలగించండి
  32. వెంకయ వోలెడిన్ శఠుడ! విడ్డుర మొందగ నేమిటిందునన్:👇
    "జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో"?
    జంకక జింకకున్ జడిసి చప్పుడు చేయక వెన్క వెన్కగా
    పొంకము మీర పారుచును పోరును లేకయె దూకి చంపుటన్

    రిప్లయితొలగించండి