16, సెప్టెంబర్ 2017, శనివారం

సమస్య - 2465 (సత్కార్యమ్ములె మన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్"
ఈ సమస్యను సూచించిన  గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

72 కామెంట్‌లు:

 1. చిత్కిన నీతుల తోడను
  బత్కుట కొరకై ప్రజలకు భారమ్మగుచున్
  గత్కుడు జేసిన కపటపు
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్ :)


  ఇంతకన్నా నాకు చేతకాదు...
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
   'చిత్కిన, బత్కుట' ప్రయోగాలు సాధువులు కావు. 'గత్కుడు' సరియైనదే.

   తొలగించండి
  2. శాస్త్రి గారు
   రాదు రాదని వేదనేల!
   రాదు రాదను కొన్న సమాప్తము!
   ఏల రాదను కొన్న నారంభము!

   తొలగించండి
  3. చితుకు..చిత్కు,బతుకు..బత్కు,గతుకు..గత్కు...పద్యాల్లో ఇలాంటి వ్యవహారికాలు సహజమైనవి....నేటి పద్య రచనలు ఎక్కువ మంది చదువరులను ఆకర్షించడానికి ,పద్యం వైపు మొగ్గు చూపడానికి వ్యవహారిక భాషా పదం ప్రయోగం అవసరమని నా అభిప్రాయం..పద్యం బాగుంది..

   .వెలిదె ప్రసాద శర్మ ...

   తొలగించండి
  4. అబ్బే అదేమీ లేదండీ. రాత్రి నిద్ర ముంచుకు వస్తుంటే ఎలాగో ఒకలా పద్యం వ్రాసేసి పడుకొందామని. పైగా నాకు గ్రాంధికమైన తెలుగు, సంస్కృతము రావు. సరదా మాత్రం బోలెడు.

   😊😊😊

   ప్రభాకర శాస్త్రి

   తొలగించండి
  5. అయ్యా కామేశ్వర రావు గారు:

   దేవదాసు పార్వతితో అన్నట్లు "అందరూ అన్నీ చేయలేరుగా"

   🙏🙏🙏

   తొలగించండి
 2. సత్కీర్తికేవి కతములు
  ఛీత్కారములకు వెరవని చెడు మార్గములున్
  తాత్కాలిక విభవములే
  సత్కార్యమ్ములె ; మన కపజయ కారణముల్!

  రిప్లయితొలగించండి
 3. సత్కీర్తిని గొని దెచ్చును
  సత్కార్యమ్ములె ; మన కపజయకారణముల్
  ఛీత్కారములకు వెరవని
  తాత్కాలిక వైభవములె తలపోయంగన్.

  రిప్లయితొలగించండి
 4. సత్కీర్తి కలుగునెట్లు వి
  పత్కాలము నోట్ల రద్దు వలన కలిగెనే
  సీత్కార కారకములీ
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్

  రిప్లయితొలగించండి
 5. సత్కవులను సేవించిన
  సత్కార్యమ్ములె , మన కపజయ కారణముల్
  సత్కారము మాని విబుధుల
  చీత్కారము జేయ తగదు చేజేతులతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "మాని బుధుల" అంటే సరి!

   తొలగించండి
  2. సత్కవులను సేవించిన
   సత్కార్యమ్ములె , మన కపజయ కారణముల్
   సత్కారము మాని బుధుల
   చీత్కారము జేయ తగదు చేజేతులతో

   తొలగించండి
 6. తాత్కాలికసుఖములకు బ
  లాత్కారమ్ముగ సిరులను లాగుచు భువి సం
  పత్కాముకదుశ్చరితల
  సత్కార్యమ్ములె మనకపజయకారణముల్

  రిప్లయితొలగించండి
 7. అత్కముయు,భరణము నిడుట
  సత్కార్యమ్ములె ,మన కపజయ కారణముల్
  యత్కులకు కబళము నిడక
  ఛీత్కారములు నిడి గీడు జేయుచునున్నన్

  రిప్లయితొలగించండి
 8. హృత్కమలము ముకుళింపగ
  చీత్కారముఁ జేసి దీన శిష్ట జనుల నా
  పత్కాలమ్మున విడుచుట
  సత్కార్యమ్ములె? మన కపజయ కారణముల్.

  రిప్లయితొలగించండి
 9. మత్కుణు డనియెడి దైత్యుడు
  హృత్కమలేశ్వరికి దెలిపె నీగతి దేవీ!
  యత్కించి ద్దయ జేసెడి
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 10. JJK బాపూజీ గారి పూరణ.....

  ఫూత్కారమ్ముల నెరుగక,
  ఛీత్కారమ్ముల ద్యజించి,చిత్రపుజగతిన్
  దత్కార్యమ్ముగ సలిపెడి
  సత్కార్యమ్ములె మన కపజయకారణముల్.

  రిప్లయితొలగించండి
 11. ఉత్కృష్టమైన జన్మను
  సత్కారములేవి లేక సభ్యత విడచిన్
  ఛీత్కారమొందు రీతిన
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్

  రిప్లయితొలగించండి


 12. అత్కుడ! పేరిమి దెచ్చును
  సత్కార్యమ్ములె ! మన కపజయ కారణముల్
  ఛీత్కారపు నిస్పృహలౌ
  సత్కుడి వై కూలిపోకు సత్యము గనుమా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలెబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని 'అత్కుడు, సత్కుడు'...?

   తొలగించండి

  2. కంది వారు

   అత్కుడు - బాటసారి - (జీవన బాటసారి అన్న అర్థం లో )
   సత్కుడు - చతికిల బడిన వాడు

   ఆంధ్ర భారతి ఉవాచ

   సరియే నా ?

   జిలేబి

   తొలగించండి
 13. సత్కీర్తినిచ్చు సలిపెడి
  సత్కార్యమ్ములె, మన కపజయ కారణముల్
  తాత్కాలిక సుఖములుగొన
  చీత్కారము చేయు సాని చేరు చెయివులే

  రిప్లయితొలగించండి
 14. సత్కవులను నిందించుచు
  చీత్కారమ్ములను జేసి ఛీ ఫో యనుచున్
  సత్కవితలు వెలయించని
  సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్!!!


  తత్కాలమ్మున ఘనమగు
  సత్కీర్తిని బొందదలచి సంరంభముతో
  చీత్కారమ్ముగ జేసెడు
  సత్కారమ్ములె మనకపజయ కారణముల్!!!


  రిప్లయితొలగించండి
 15. సత్కీర్తి న్ కలిగించును
  సత్కార్యమ్ములె ;మనకప జయ కారణ ము ల్
  సత్కార్మ్మమ్ములుచెరు పువి
  పత్కార ణ మగుట మనకు వలదది యెపుడు న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సత్కారమ్ములు.." టైపాటు!

   తొలగించండి
 16. సత్కీర్తిని గోరుచు సం
  పత్కాలమున న్విరివిగ బంచగ సొమ్ముల్
  తత్కార్యమొసగ దీనత
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్!

  రాజశేఖర చరిత్రలో రాజశేఖరుడు, బలిచక్రవర్తి మొదలైనవారు!

  రిప్లయితొలగించండి
 17. సత్కీర్తినిడును మనుజుల
  సత్కార్యమ్ములె, మనకపజయ కారణముల్
  ఛీత్కారము,పేదల నా
  పత్కాలమునాదుకొనకవంచన నిడుటల్

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఉత్కోచమున జరుగునవి
  సత్కార్యమ్ములె? మనకపజయ కారణముల్
  తాత్కాలిక ఫలములిడెడి
  తత్కాలపు కల్లపసిడి తత్త్వ విచేష్టల్
  (ఉత్కోచము=లంచము)
  రిప్లయితొలగించండి
 19. ఉత్కళ దేశపు ప్రభువగు
  నుత్కళ రాజేంద్రు తోడ నోరిమి లేమి
  న్నా త్కురికి సోము డనియెను
  సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్


  రిప్లయితొలగించండి
 20. ఓ మేధావి అంతర్మధనం :

  మత్కృత మౌనమున సహచ
  రోత్కోచపు పంకమందు నొరుని సృజనమౌ
  హృత్కమల సౌరభములన్
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   చక్కని పూరణ. పదసంపదపై అధికారాన్ని సాధిస్తున్నారు. సంతోషం! అభినందనలు.

   తొలగించండి
 21. ఫూత్కృతి జేసెడి ఫణులిడు
  సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్
  తత్కాల సుఖమిడినను వి
  పత్కారణమౌట యెరుగవా సామోక్తిన్

  రిప్లయితొలగించండి


 22. ఛీ త్కృతి జేయుట వృధ్ధుల
  సత్కార్యమ్ములె ,మనకపజయకారణముల్
  సత్కృతి జేయక పరులకు
  చీత్కారముతోడ నుండి చేయనపకృతిన్

  రిప్లయితొలగించండి
 23. ………………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  ఉత్కర్షముతో జేయుము

  సత్కార్యమ్ములె | మనకపజయ కారణముల్ :

  చిత్కాలుష్య , మహ౦కృతి ,

  యుత్కట ధనవా౦ఛ మరియు నుత్క్రోశ మిలన్


  ఉత్కట = అధిక మైన ఉత్క్రోశము = ఉద్రేకము

  రిప్లయితొలగించండి
 24. సత్కరుణా హీన ధన మ
  దోత్కట దుష్ట జన చయ ఘనోన్మత్త విచా
  రోత్కర సమాహిత కృతా
  సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్

  [కృత + అసత్కార్యమ్ములె = కృతాసత్కార్యమ్ములె]

  రిప్లయితొలగించండి
 25. రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   సర్వోత్తమమైన పూరణ మీది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
   కృష్ణ సూర్య కుమార్ గారు నమస్సులు.

   తొలగించండి
 26. సత్కీర్తినిడును మహిలో
  సత్కార్యమ్ములె! మనకపజయ కారణముల్
  తత్కాలపు నాగ్రహమున
  చీత్కారము కలుగు రీతి చేసెడి చేతల్!

  రిప్లయితొలగించండి
 27. సత్కళలను సాగించగ
  సత్కార్యమ్ములె”| “మనకపజయ కారణముల్
  తాత్కాలికములె”సాధన
  సత్కీర్తికి మూలమగచు సంపదనింపున్|

  రిప్లయితొలగించండి
 28. కం. సత్కవి బండితులనెఱిఁగి
  సత్కారము జేసినపుడు జయముల్ గలుగున్
  సత్కవుల నెరుగకనెరపు
  సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్
  కొరుప్రోలు రాధా కృష్ణా రా

  రిప్లయితొలగించండి
 29. గురువు గారు సవరించిన పూరణ
  అత్కమును,భరణము నిడుట
  సత్కార్యమ్ములె ,మన కపజయ కారణముల్
  య(అ)త్కులకు కబళము నిడక
  ఛీత్కారములునిడిగీడు జేయుచునున్నన్
  అత్కుడు = బాటసారి

  రిప్లయితొలగించండి
 30. హృత్కమల శుద్ది లేకను
  సత్కారము లెల్ల మన కపజయకారణముల్
  ఉత్కృష్ట క్షీరమున వి
  పత్కరమౌ విషము కలియ పాడగు రీతిన్

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా
  సత్కార్యము కటు నిటు నా
  పత్కాలమె వేచి కరచు పరువున్ దీయున్
  సత్కార్యమె జయలలితా
  పత్కాలమె రెడ్డి1 పడగ కళ2 కిరు నాల్కల్
  1.రాజశేఖర రెడ్డి 2వాచక కళకు రెండు నాల్కలుండును.Much can be said on both sides సామెత.

  రిప్లయితొలగించండి
 32. ఆర్యా
  సమస్యా పాదము తొందరపడి చేర్చలేదు. కలిపి చదువ మనవి.మీఆరవ తరగతి ఉదంతం బాగుంది.ఒకమిత్రుని జీవనగాథను అచ్చు వేసినాను.ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది.మీ జీవిత కథను పద్యములో వ్రాయగలరు.

  రిప్లయితొలగించండి
 33. ఆర్యా
  సమస్యా పాదము తొందరపడి చేర్చలేదు. కలిపి చదువ మనవి.మీఆరవ తరగతి ఉదంతం బాగుంది.ఒకమిత్రుని జీవనగాథను అచ్చు వేసినాను.ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది.మీ జీవిత కథను పద్యములో వ్రాయగలరు.

  రిప్లయితొలగించండి